గూనూరు ఎర్రునాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూనూరు ఎర్రునాయుడు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 - 1989
1994 - 1999
ముందు గంటా శ్రీనివాసరావు
తరువాత కరణం ధర్మశ్రీ
నియోజకవర్గం చోడవరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1936
చోడవరం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
నివాసం విశాఖపట్నం జిల్లా

గూనూరు ఎర్రునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చోడవరం నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం[మార్చు]

గూనూరు ఎర్రునాయుడు 1981లో సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో టీడీపీలో చేరి 1983 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్నం నాయుడు గొర్లె పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1985లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఎర్రునాయుడు 1989 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలిరెడ్డి సత్యారావు చేతిలో ఓడిపోయాడు.

గూనూరు ఎర్రునాయుడు 1994 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలిరెడ్డి సత్యారావు పై గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఆయన 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలిరెడ్డి సత్యారావు చేతిలో ఓడిపోయాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (24 May 2019). "కరణం ధర్మశ్రీ కల నెరవేరింది..." Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
  2. Andhrajyothy (8 February 2021). "నలుగురు ఎమ్మెల్యేలను అందించిన చోడవరం". Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.