గృహస్థాశ్రమం
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
గృహస్థాశ్రమం అంటే "ఇల్లు, కుటుంబంలో ఉంటూ ఆ ధర్మాలను నిర్వర్తించడం".[1] ఇది హిందూ ఆశ్రమ వ్యవస్థలో వ్యక్తి జీవితంలోని రెండవ దశ.[2] ఇది బ్రహ్మచర్యం తరువాతి దశ. ఇంటిని నిర్వహించడం, కుటుంబాన్ని పోషించడం, పిల్లలను చదివించడం, కుటుంబ, ధార్మిక సామాజిక జీవితాన్ని గడపడం వంటి విధులతో వైవాహిక జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.[3][4][5]
హిందూమతం లోని ప్రాచీన, మధ్యయుగ గ్రంథాలు గృహస్థ దశను సామాజిక శాస్త్ర సందర్భంలో అన్ని దశలలోకీ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తాయి. ఈ దశలో మానవులు ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించడమే కాకుండా, మానవజాతిని కొనసాగించే సంతానాన్ని, జీవితంలోని ఇతర దశలలో ఉన్న ప్రజల కోసం ఆహారాన్ని, సంపదనూ ఉత్పత్తి చేస్తారు.[3][6] భారతీయ తత్వశాస్త్రంలో గృహస్థ దశ, మానవుని జీవితంలో అత్యంత తీవ్రమైన శారీరక, లైంగిక, భావోద్వేగ, వృత్తిపరమైన, సామాజిక, భౌతిక అనుబంధాలున్న దశగా పరిగణించబడుతుంది.[7]
భారతీయ సంప్రదాయాలలో, గృహస్థ జీవిత దశ అభిలషణీయమే గానీ, ఆవశ్యకం కాదు. ఏ బ్రహ్మచారి అయినా, గృహస్థ, వానప్రస్థ దశలను దాటవేసి, నేరుగా సన్యాస దశకు వెళ్లవచ్చు. తద్వారా ప్రాపంచిక, భౌతిక ప్రయోజనాలను త్యజించి, ఆధ్యాత్మిక సాధనలకు తమ జీవితాలను అంకితం చేయవచ్చు.[8]
చర్చ
[మార్చు]భారతీయ ఇతిహాసాలలో గృహస్థ జీవిత దశపై విస్తృతమైన చర్చ ఉంది. దాని యోగ్యత, స్వభావంపై భిన్నమైన అభిప్రాయాలను అందిస్తాయి.[9] గృహస్థుల జీవితంలో ప్రవర్తన కోసం ఒక సచిత్ర సిఫార్సు మార్గదర్శకాలు మహాభారతం యొక్క ఆది పర్వంలో ఈ క్రింది విధంగా పేర్కొనబడ్డాయి, [10]
అత్యంత పురాతనమైన ఉపనిషత్తులో గృహస్థ ధర్మం గురించి ఇలా చెప్పబడీంది - నీతిగా ధనసంపాదన చెయ్యడమంటే యజ్ఞ యాగాదులు చెయ్యాలి; దాన ధర్మాలు చెయ్యాలి, తన గృహానికి వచ్చే అతిథులకు సకల సత్కారాలు చెయ్యాలి, తనకున్నదానిలో కొంతభాగాన్ని ఇతరులకు పంచకుండా పూర్తిగా తానే అనుభవించరాదు. దుష్ప్రవర్తనకు దూరంగా ఉండాలి, ఏ జీవికీ హాని తలపెట్టకూడదు. అప్పుడే ఆ గృహస్థు జీవిత సాఫల్యం పొందుతాడు.
మూలాలు
[మార్చు]- ↑ gRhastha Sanskrit English Dictionary, Koeln University
- ↑ S Radhakrishnan (1922), The Hindu Dharma, International Journal of Ethics, 33(1): 1-22
- ↑ 3.0 3.1 RK Sharma (1999), Indian Society, Institutions and Change, ISBN 978-8171566655, page 28
- ↑ Sahebrao Genu Nigal (1986). Axiological approach to the Vedas. Northern Book Centre. pp. 110–114. ISBN 81-85119-18-X.
- ↑ Manilal Bose (1998). Social and cultural history of ancient India. Concept Publishing Company. ISBN 81-7022-598-1.
- ↑ Alban Widgery (1930), The Principles of Hindu Ethics, International Journal of Ethics, 40(2): 232-245
- ↑ Mazumdar and Mazumdar (2005), Home in the Context of Religion, in Home and Identity in Late Life: International Perspectives (Editor: Graham D. Rowles et al.), Springer, ISBN 978-0826127150, pages 81-103
- ↑ What is Hinduism? (Editors of Hinduism Today), Two noble paths of Dharma గూగుల్ బుక్స్ వద్ద, Family Life and Monastic Life, Chapter 10 with page 101 in particular
- ↑ See, for example, Adi Sankara's commentary on The Bhagavad Gita of the Mahabharata, AM Sastri (Translator), at pages 83-95 and 179-182;
For another example, see Chapter 63, Book 13 of the Mahabharata, KM Ganguli (Translator) - ↑ J. A. B Van Buitenen (1974), The Book of the Beginning, University of Chicago Press, ISBN 978-0226846484
- ↑ KM Ganguli (Translator), The Mahabharata - First Book Adi Parva Section XCI
- ↑ MN Dutt (Translator), Sambhava Parva - Adi Parva The Mahabharata, verse 3, page 132