గెటప్ శ్రీను
గెటప్ శ్రీను | |
---|---|
జననం | బోడుపల్లి శ్రీను 1984 డిసెంబర్ 12 కాళింగపేట, చినమిల్లిపాడు గ్రామం, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం |
జాతీయత | భారతదేశం |
ఇతర పేర్లు | జబర్దస్త్ శ్రీను |
వృత్తి | నటుడు, వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 2010-ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ |
జీవిత భాగస్వామి | సుజాత |
పిల్లలు | 1 |
గెటప్ శ్రీను తెలుగు భాషా నటుడు, స్టాండ్-అప్ కమెడియన్, ఆయన తెలుగు ఈ టివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో హాస్యకరమైన పాత్రలలో నటనకుగాను, తన గెటప్ లతో మంచి గుర్తింపునందుకున్నాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]గెటప్ శ్రీను 1984 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలం, చినమిల్లిపాడు గ్రామ శివారులోని కాళింగపేటలో జన్మించాడు.[1] ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.
సినీ జీవితం
[మార్చు]గెటప్ శ్రీను ఉన్నత చదువులకోసం హైదరాబాద్ వచ్చి సినిమాలపై ఆసక్తితో సినీరంగం వైపు అడుగుపెట్టాడు. ఆయన ఈ టీవీలో ప్రసార మయ్యే 'జబర్‌దస్త్' షో లో వేణు టీంలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని సుడిగాలి సుదీర్ తో జత కట్టిన తర్వాత శ్రీను గెటప్ శ్రీనుగా తన నటనతో తన గెటప్ లతో మంచి గుర్తింపునందుకున్నాడు. గెటప్ శ్రీను 2014లో విడుదలైన దిక్కులు చూడకు రామయ్య సినిమాతో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.
నటించిన చిత్రాలు
[మార్చు]వెబ్ సిరీస్
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (14 December 2015). "'మెగాస్టార్ చిరంజీవి నాకు ఆదర్శం'". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
- ↑ HMTV (21 November 2020). "గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్' సినిమా ప్రారంభం". Archived from the original on 13 September 2021. Retrieved 13 September 2021.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గెటప్ శ్రీను పేజీ