గెల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దాదాపుగా ఏక కాండం చెట్లకు కాసే కాయలతో పాటు ఉన్న పన్నెలు పన్నెలతో పాటు ఉన్న కాడ ఈ మొత్తాన్ని కలిపి గెల అని అంటారు.

అరటిచెట్టు గెల తో

కొన్ని ఏక కాండం చెట్లకు కాసే గెలలకు పన్నెలు లేకపోయినప్పటికి దానిని గెల గానే పరిగణిస్తారు. ఉదాహరణకు తాటి చెట్టుకు కాసే గెలకు పన్నెలు లేక పోయినప్పటికి దానిని గెల అనే పిలుస్తారు.

తాటిముంజల కాయల గెలలు. కొత్తపేట రైతు బజారు వద్ద తీసిన చిత్రము

గెలకు ఉన్న కాడ గట్టిగా ఉంటుంది. దీనిని చెట్టు నుంచి వేరు చేయడానికి పదునైన కత్తితో బలంగా కోయవలసి ఉంటుంది.

గెల ఎక్కువ కాయలతో లేక బరువైన కాయలతో ఉండుట వలన గెల బరువుగా ఉంటుంది.

అరటి చెట్టుకు కాసే గెలను అరటి గెల అని ఆంటారు.

ఈతచెట్టుకు కాసే గెలను ఈతగెల అని అంటారు.

జాగ్రత్తలు[మార్చు]

అరటి గెల బరువుగా ఉంటుంది కింద పడితే కాయలు చెడిపోతాయి కనుక పైనుంచి కింద పడకుండా జాగ్రత్తగా కోయవలసి ఉంటుంది.

టెంకాయ చెట్టు, తాటిచెట్టు గెలలను కోసేటప్పుడు కాయలు లేదా గెలలు పైన పడితే చాలా ప్రమాదం అందువలన అవి పైన పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

"https://te.wikipedia.org/w/index.php?title=గెల&oldid=2880354" నుండి వెలికితీశారు