Jump to content

గేదెల రాజు

వికీపీడియా నుండి
గేదెల రాజు
దర్శకత్వంచైతన్య మోటూరి
స్క్రీన్ ప్లేచైతన్య మోటూరి
కథచైతన్య మోటూరి
నిర్మాత
  • వాణి రవి కుమార్‌ మోటూరి
సహ నిర్మాతలురవిఆనంద్‌ చిన్నిబిల్లి, తాడాల వీరభద్రరావు, గీతార్థ్‌ కుంచె
తారాగణం
కూర్పుసుధీర్‌ ఎడ్ల
సంగీతంరఘు కుంచే
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు– కిరణ్‌ తాతపూడి, దివ్య మోటూరి
నిర్మాణ
సంస్థ
మోటూరి టాకీస్‌
విడుదల తేదీ
2026 ఏప్రిల్ 24 (2026-04-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

గేదెల రాజు కాకినాడ తాలూకా 2026లో విడుదలైన పొలిటికల్‌ డ్రామా సినిమా. మోటూరి టాకీస్‌ బ్యానర్‌పై వాణి రవి కుమార్‌ మోటూరి నిర్మించిన ఈ సినిమాకు చైతన్య మోటూరి దర్శకత్వం వహించాడు. రఘు కుంచే, శ్రీకాంత్ అయ్యంగర్, వికాస్, టీనా శ్రావ్య, మౌనిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 15న, ట్రైలర్‌ను 2026 ఏప్రిల్ 19న విడుదల చేసి,[1] సినిమాను ఏప్రిల్ 24న విడుదల చేశారు.

కాకినాడలో పెద్ద రౌడీ షీటర్ గేదెల రాజు (రఘు కుంచె) రాజకీయాల్లోకి రావాలని ఆశపడతాడు. స్థానిక ఎమ్మెల్యే అండతో కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతాడు. అయితే అదే టికెట్‌ను ఆశించిన మరో నేత దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్)తో రాజుకు విభేదాలు తలెత్తి ఎమ్మెల్యే సమక్షంలోనే ఇద్దరూ వాగ్వాదానికి దిగుతారు. అదే రోజు రాత్రి గేదెల రాజు దారుణ హత్యకు గురవుతాడు. అసలు గేదెల రాజును చంపింది ఎవరు? ఆ రాజకీయ వైర్యమే కారణమా? లేక ఈ హత్య వెనుక వేరే కారణాలు ఉన్నాయా? చివరకు పోలీసులు ఈ మిస్టరీని ఎలా ఛేదించారు అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "'గేదెల రాజు' ట్రైలర్ లాంచ్: రఘు కుంచె హీరోగా క్రైమ్ థ్రిల్లర్ విడుదలకు సిద్ధం". V6 Velugu. 5 April 2026. Archived from the original on 27 April 2026. Retrieved 27 April 2026.
  2. "'గేదెల రాజు కాకినాడ తాలూకా' రివ్యూ.. విలన్ సెంట్రిక్ సినిమా.. ఎలా ఉందంటే..?". 10TV Telugu. 24 April 2026. Archived from the original on 27 April 2026. Retrieved 27 April 2026.
  3. "'గేదెల రాజు' మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌". Sakshi. 24 April 2026. Archived from the original on 27 April 2026. Retrieved 27 April 2026.
  4. "'గేదెల రాజు'గా రఘు కుంచే... కాకినాడ తాలూకా కహానీలో ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్". ABP Desam. 13 June 2025. Archived from the original on 27 April 2026. Retrieved 27 April 2026.

బయటి లింకులు

[మార్చు]