గేదెల శ్రీనుబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గేదెల శ్రీనుబాబు
Dr-gedela-srinubabu-wikipedia.jpg
2019 లో గేదెల శ్రీనుబాబు
జననం(1982-06-15)1982 జూన్ 15 [1]
India అల్లెన , శ్రీకాకుళం, భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాదు,విశాఖపట్నం
వృత్తిశాస్త్రవేత్త , పారిశ్రామికవేత్త

గేదెల శ్రీనుబాబు పల్సస్ గ్రూపు అనే సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారి. [2][3] ఓమిక్స్ పబ్లిషింగ్ గ్రూపు అనే వైజ్ఞానిక పత్రికల ప్రచురణ సంస్థను స్థాపించాడు.[4][5][6][7] అనుక్షణం మారి పోతున్న వైజ్ఞానిక ఫలితాలను ప్రపంచ వ్యాప్తముగా విద్యార్థులు, పరిశోధకులందరికి అందించడం, వైద్యశాస్త్ర పరిశోధనలో భాషాపరమైన అడ్డంకులను తొలగించడం, ప్రజలు ఇష్టపడే వారి భాషలో ప్రపంచం నలుమూలల నుండి ఆరోగ్య శాస్త్ర సమాచారాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచడం ఈ సంస్థల ప్రధాన లక్ష్యం.[8] 2015 సంవత్సరం నుండి ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, పల్సస్‌తో కలిసి సంయుక్తంగా హెల్త్ టెక్, హెల్త్ ఇన్ఫోర్మాటిక్స్, బయో ఇన్ఫోర్మాటిక్స్, మెడికల్ పబ్లిషింగ్ రంగాలకు సంబంధించి పలు వస్తువులు, సేవలను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది.[9][10]

జీవిత విశేషాలు

గేదెల శ్రీనుబాబు శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలం లోని అల్లెన గ్రామంలో జన్మించాడు. అతను తన 25 సంవత్సరాల వయసు వచ్చేనాటికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పీ,హెచ్ డీ, ప్రపంచ ప్రసిద్ది గాంచిన స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ డాక్టోరల్ సాధించాడు. 2007 సంవత్సరములో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో హ్యూమన్ ప్రొటెయోమి సంస్థ నుండి యువ శాస్త్రవేత్త అవార్డును అందుకున్నాడు.[11]

జాతీయ, అంతర్జాతీయ పరిశోధన జర్నళ్ళలో పరిశోధనా వ్యాసాలు

శ్రీనుబాబు స్వయంగా పరిశోధనా వ్యాసాలను పలు ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ పరిశోధన జర్నళ్ళ లో ప్రచురించాడు. ఆయన పరిశోధనలు జీవశాస్త్ర సంబందిత అంశాలను సంఖ్యాపరమైన పద్ధతులలో ఎలా అధ్యనం చేయాలి, ఇంకా ప్రారంభ దశ లోనే కాన్సరు లేదా మధుమేహ వ్యాధిని ఎలా గురించాలి అనే అంశాలపై కేంద్రీకృతమై ఉన్నాయి. దాదాపు 23 వ్యాసాలను వివిధ శాస్త్రవేత్తలతో కలిసి ప్రచురించాడు. గూగుల్ స్కాలర్ ప్రకారం డా. శ్రీనుబాబు శాస్త్రీయ h- ఇండెక్స్ 14, i10- ఇండెక్స్ 10.[12]

 • ఆలీజ్హీమేర్స్ వ్యాధి తీసుకోవాలిసిన తగిన జాగర్తలు: సమాచార సాంకేతిక వ్యవస్థ యొక్క పాత్ర Thota H, Rao AA, Reddi KK, Akula S, Changalasetty SB, Srinubabu Gedela Alzheimer's disease care and management: role of information technology Bioinformation. 2007 Nov 3;2(3):91-5[13]
 • ప్రయోగాత్మక రూపకల్పన పద్ధతి Gedela Srinubabu, Ratnam BV, Rao AA, Rao MN Development and validation of LC-MS/MS method for the quantification of oxcarbazepine in human plasma using an experimental design. Chem Pharm Bull (Tokyo). 2008 Jan;56(1):28-33.[14]
 • మధుమేహ వ్యాధి ని ముందుగా గుర్తించటానికి జీవ సూచికలు Srinubabu Gedela, Allam Appa rao, Narasimha Rao Medicherla, Identification of Biomarkers for Early Stage Identification of Type 2 Diabetes Int J Biomed Sci Dec 2007, Volume 3, Issue 4 pp 284-286[15]

శాస్త్ర విషయాల ప్రచురణ రంగం లోకి

Dr-srinubabu-gedela-ceo-pulsus-make-in-india--144.jpg

వివిధ రంగాల్లో శాస్త్ర పరిశోధన విషయాలను ప్రచురించే పత్రికలు సాంప్రదాయికంగా, పత్రికలకు చందా రూపంలో ఆదాయం సంపాదిస్తాయి. శాస్త్రవేత్తలు రచయితల నుండి వ్యాసాలను ఉచితంగా పొంది, వాటిని సాటివారి చేత సమీక్షింపజేసి ప్రచురించేవారు. ఆ విధంగా తమ పత్రికల చందాదారుల నుండి ఆదాయం పొందేవారు. గేదెల శ్రీనుబాబు దీనికి సరిగ్గా వ్యతిరేక పద్ధతిలో ప్రచురణలు చేపట్టాడు. [16] వ్యాసరచయితల నుండి ఫీజు తీసుకుని వారి వ్యాసాలను ప్రచురించి పాఠకులకు ఉచితంగా ఇచ్చే పద్ధతిని అనుసరించాడు. దీన్ని ఓపెన్-యాక్సెస్ పబ్లిషింగు అంటారు.[17] ఈవిధంగా తక్కువ కాలం లోనే అనేకానేక శాస్త్ర విషయాలపై జర్నళ్ళను ప్రచురించడం మొదలుపెట్టాడు. సాంప్రదాయిక పత్రికల్లో వ్యాసాల సమీక్ష, దిద్దుబాట్లు వగైరాల తరువాత ప్రచురణ అయ్యేటప్పటికి నెలలు పట్టేది. ఈ కొత్త పద్ధతిలో కొన్ని వారాల్లోనే ప్రచురణ జరుగుతుంది. పరిశోధకులు కొంత డబ్బును చెల్లిస్తే త్వరితగతిన సమీక్ష నిర్వహించి తమ ప్రచురణను త్వరగా ప్రచురించుకోవచ్చు.

సాలీనా, పల్సస్ గ్రూప్ 50,000 కు పైగా పరిశోధనా వ్యాసాలు ప్రచురిస్తూ[18], ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 3,000 కు పైగా సమావేశాలు నిర్వహిస్తూ, శాస్త్రవేత్తలను తమ సమావేశాల ద్వారా ఒకే వేదికపై తెస్తూ, శాస్త్ర, సాంకేతిక పరిశోధనా ఫలితాలను చర్చిస్తూ, సమాచార మార్పిడికి దోహదం చేస్తున్నది.[19] ప్రస్తుతం పల్సస్ గ్రూప్ ఆరు స్పెషల్ ఎకనామిక్ జోన్ల నుండి 5000 కి పైగా ఉద్యోగులతో, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ కేంద్రముగా పనిచేస్తున్నది. వీరిలో 75% మంది మహిళలు.[20]

అమెరికాలో వినియోగదారుల కోర్టుకేసు

అమెరికన్ ఫెడరల్ కమిషన్ ఆ దేశ జాతీయ వినియోగదారుల పరిరక్షణ సంస్థ. ఓమిక్స్ సంస్థ మోసపూరితమైన పద్ధతిలో తమ సమావేశాలను, ప్రచురణలను నిర్వహించిందని, ప్రచురణకు వసూలు చేసిన ఫీజులను దాచిపెట్టిందనీ, రచయితల వ్యాసాలను సాటివారి సమీక్షలు చేయిస్తున్నట్లు మోసగించిందనీ 2016 లో ఫెడరల్ ట్రేడ్ కమిషను శ్రీనుబాబు సంస్థలపై ఒక కేసు వేసింది. 2019 ఏప్రిల్‌లో తీర్పునిస్తూ కోర్టు, శ్రీనుబాబుకూ, అతని సంస్థలకూ 5 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. [21][22][23] ఇది ఒక అన్యాయమైన ఆరోపణ అని ఒమిక్స్ సంస్థల న్యాయవాది, దీనివలన ఆదాయం, కీర్తీ కోల్పోయామని చెబుతూ నష్టపరిహారం కోసం ఒమిక్స్ సంస్థ 311 కోట్ల డాలర్లకు అమెరికన్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పై కేసు వేశామని చెప్పాడు. [22][24]

2020 సెప్టెంబరు 11 న శ్రీనుబాబుపై డిస్ట్రిక్ట్ కోర్టు విధించిన జరిమానాను అప్పీలు కోర్టు ధ్రువీకరించింది. [25] ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పెట్టిన కేసుపై 2018 లో శ్రీనుబాబు స్పందిస్తూ ఇలా వ్యాఖ్యానించాడు. “ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆరోపణ పూర్తిగా తప్పు… వాళ్ళకు జర్నల్ అంటే ఏంటో తెలియదు. సాటివారి సమీక్ష అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఈ విషయములో నిరక్షరాస్యులు. కానీ, శాస్త్రవేత్తలు నిరక్షరాస్యులు కాదు, ఏ వ్యాసాన్ని ఏ పత్రికలో ప్రచురించుకోవాలో వాళ్ళకు తెలుసు.” [24]

రాజకీయాల్లో

2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా గేదెల శ్రీనుబాబును ఆ పార్టీ ప్రకటించింది. [26] అయితే ఆ తరువాత రెండు మూడు రోజులకే శ్రీనుబాబు ఆ పార్టీని వదిలి వైయస్‌ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరాడు.[27] ఉత్తరాంధ్ర‌ జిల్లాలలో వ్య‌వ‌సాయం, ఉద్యాన‌వ‌న పంట‌లు, తోట‌ల‌ పెంప‌కం, అడ‌వుల‌లో పెరిగే ఔష‌ధ మొక్క‌లు పెంప‌కం, జల వనరుల లభ్యత, వాటి వినియోగం గురించి శ్రీనుబాబు వ్యాసం రాసాడు.[28]

సామాజిక సేవలు

శ్రీనుబాబు సామాజికసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వంతో కలిసి శ్రీనుబాబు ఉపాధి, పారిశ్రామిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ, కొత్త ఉఫాధి అవకాశాలు కలిపిస్తున్నాడు. [29] ఇండస్ ఫౌండేషన్, ఆంధ్రవిశ్వవిద్యాలయం, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మొదలైన సంస్థలతో కలిసి డా. శ్రీనుబాబు, ఆయన సంస్థలు సైన్స్ సమావేశాలు నిర్వహిస్తున్నాడు. [30][31]

తిత్లీ తుపాను బాధిత లక్ష కుటుంబాలకు శ్రీనుబాబు చేయూత నిచ్చారు, తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి, ఒక్కో కుటుంబానికి పది కేజీల బియ్యం, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశాడు. [32][33][34]. శ్రీనుబాబు తమ సంస్థ ద్వారా, కరోనా వైరస్ సహాయార్థం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒక కోటి రూపాయల విరాళాన్ని, తెలంగాణ కు ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళాన్నీ, వివిధ జిల్లాలలో లక్షల మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేసాడు. [35][36][37]

శ్రీనుబాబు వ్రాసిన మేక్ ఇన్ ఇండియా పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించాడు. పల్సస్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపైన్ ద్వారా వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ నిర్వహించాడు. [38] [39]

అవార్డులు

Dr-srinubabu-Gedela-award-chamionsofchnage.jpg

శ్రీనుబాబు ఎంట్రప్రెన్యూర్ గా, శాస్త్రవేత్తగా, సేవారంగంలో చేసిన సేవలకి ఎన్నో అవార్డులు వరించాయి. యువ శాస్త్రవేత్త అవార్డు, ఉత్తమ యువ పారిశ్రామికవేత్త అవార్డు, యునిక్ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు 2018, ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అవార్డ్ 2019[20] ప్రతిష్టాత్మక భారత ప్రభుత్వ ఛాంపియన్స్ అఫ్ చేంజ్ 2018 పురస్కారాన్నీ అందుకున్నాడు.[40]

మూలాలు

 1. "Srinubabu Gedela Research Scientist". prabook.com - The World Biographical Encyclopaedia. {{cite web}}: line feed character in |title= at position 18 (help)
 2. Basu, Arpit M. (January 1, 2021). "Smaller tech firms homing in on Visakhapatnam". The Times of India.
 3. "Pulsus opens healthcare informatics, pharmacovigilance facility in Chennai". The Times of India. March 9, 2018.
 4. Roberts, William Clifford (2018-02-01). "Facts and ideas from anywhere". Baylor University. Vol. 31, no. 1. p. 141. doi:10.1080/08998280.2017.1401850. Retrieved 2022-03-18.
 5. Patnaik, Santosh (2012-09-26). "Chanting success mantra, scientific way". The Hindu. Archived from the original on 12 ఏప్రిల్ 2021. Retrieved 30 October 2019.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
 6. "Scientific publisher Omics scripts major expansion; plans ₹1,000-cr investment". The Hindu. 2018-01-16. Retrieved 2022-03-18.
 7. Deprez, Esmé E.; Chen, Caroline (2017-08-29). "Medical Journals Have a Fake News Problem". Bloomberg News. Archived from the original on 2019-01-25.
 8. "E-education firm PULSUS to invest Rs 500 cr in UP". The Economic Times. February 25, 2018.
 9. "Visakhapatnam: జాబ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా వైజాగ్.. సిద్ధమవుతున్న భారీ క్యాంపస్." News 18. February 15, 2022.
 10. "ఎస్‌టీపీఐ సహకారంతో విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం: పల్సస్‌". Sakshi. March 7, 2020.
 11. "Selected for award". The Hindu. October 4, 2007.
 12. "Srinubabu Gedela Stanford University". Google Scholar. March 25, 2022.
 13. "Alzheimer's disease care and management: role of information technology". Bioinformation. 2 (3): 91. 3 November 2007. doi:10.6026/97320630002091. PMC 2248444. PMID 18288330.
 14. "Development and validation of LC-MS/MS method for the quantification of oxcarbazepine in human plasma using an experimental design". Chemical and Pharmaceutical Bulletin. 56 (1): 28. 1 January 2008. doi:10.1248/cpb.56.28. PMID 18175970.
 15. "Identification of Biomarkers for Type 2 Diabetes and Its Complications: A Bioinformatic Approach". International Journal of Biomedical Science. 3 (4): 229. 1 January 2008. PMC 3614656. PMID 23675048.
 16. "Bloomberg - Are you a robot?". www.bloomberg.com. Archived from the original on 2022-03-23. Retrieved 2022-03-23. {{cite web}}: Cite uses generic title (help)
 17. Suber, Peter. "Open Access Overview". Archived from the original on 19 May 2007. Retrieved 29 November 2014.
 18. "Omics & Pulses CEO gets award". The Hans India. December 27, 2018.
 19. "Now, healthcare information in Telugu just a click away". The New Indian Express. March 15, 2018.
 20. 20.0 20.1 "Pulsus CEO, Dr. Srinubabu Gedela received Pride of the Nation Award". The Hans India. July 22, 2019.
 21. "OMICS Group Inc". ఫెడరల్ ట్రేడ్ కమిషను (in ఇంగ్లీష్). 2016-08-26. Archived from the original on 2022-03-23. Retrieved 2022-03-23.
 22. 22.0 22.1 Prasad, R. (2019-04-03). "Hyderabad-based OMICS fined $50 million for 'unfair, deceptive business practices'". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Archived from the original on 2022-03-23. Retrieved 2022-03-23.
 23. "BRIEF OF THE FEDERAL TRADE COMMISSION" (PDF). www.ftc.gov. 2011-10-11. Archived from the original (PDF) on 2021-11-04. Retrieved 2021-11-04.
 24. 24.0 24.1 Yadav, Shamlal (2018-07-20). "OMICS chief Srinubabu Gedela: 'Our revenue from India is almost zero". The Indian Express.
 25. "Split Ninth Circuit Upholds $50M FTC Victory Against Online Publisher". JD Supra (in ఇంగ్లీష్). Archived from the original on 2022-03-24. Retrieved 2022-03-24.
 26. "32 మంది అభ్యర్థులతో జనసేన తొలి జాబితా!". andhrapradesh.suryaa.com. Archived from the original on 2022-03-23. Retrieved 2022-03-23.
 27. "జనసేనకు మరో షాక్". ఆంధ్రజ్యోతి. 2019-03-16. Archived from the original on 2022-03-23. Retrieved 2022-03-23.
 28. "Why Should UttaraAndhra Shed Tears when they have plenty of Water Sources at their Disposal?". www.thehansindia.com. Retrieved 2022-04-12.
 29. ""Committed to promoting startups"". The Hindu. March 6, 2016.
 30. "medical cost skyrocketing, says Governor". The Hans India. July 24, 2015.
 31. "Integration, warehousing, and analysis strategies of Omics data". NIH.GOV. June 24, 2011.
 32. "Dr. Srinubabu Gedela receives 'Champions of Change' Award from Vice President of India". December 27, 2018.
 33. "శ్రీకాకుళం జిల్లా టైటిలి తుఫాన్ బాధిత కుటుంబాలకు పల్సస్ అధినేత గెడలా శ్రీనుబాబు". November 19, 2018.
 34. "Hyderabad scientist receives 'Champions of Change' Award". December 31, 2018.
 35. "సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ". May 19, 2020.
 36. "Coronavirus: Donations continue to pour in to Telangana CM relief fund, citizens hand over cheques to CM K Chandrashekhar Rao". April 14, 2020.
 37. "Rs 10 lakh donated to Ayodhya Ram temple". February 15, 2021.
 38. "PAN INDIA OUTREACH PROGRAM TO 5,00,000 STUDENTS". February 3, 2014.
 39. "Healthtech 2020 DIGITAL MARKETING". February 3, 2020.
 40. "పల్సస్‌ ఎండీ శ్రీనుబాబుకు అవార్డు". Sakshi. December 27, 2018.

బాహ్య లంకెలు