Jump to content

గైక్వాడ్ రాజవంశం

వికీపీడియా నుండి
గైక్వాడ్ రాజవంశం
జెండా (1936–1949)
Countryబరోడా రాష్ట్రం
Place of originమహారాష్ట్ర, భారతదేశం
Founded1721
Founderపిలాజీ రావు గైక్వాడ్
Current headసమర్‌జిత్‌సింహ్ గైక్వాడ్
Final rulerప్రతాప్ సింగ్ రావు గైక్వాడ్ (బరోడా)
ఫతేసింహరావు గైక్వాడ్ (రాజ్‌ప్రముఖ్)
Titles
Deposition1949
Websitehttps://gaekwadsofbaroda.in/
బరోడా మహారాణి గైక్వాడ్ (1907)

గైక్వాడ్‌ (గైక్వార్ అని కూడా పిలుస్తారు) పూర్వ మరాఠా సామ్రాజ్యం నేపథ్యం ఉన్న హిందూ మరాఠా రాజవంశం. వీరు తరువాత పేష్వా బాజీరావు I క్రింద ప్రముఖ మరాఠా సైనికాధికారి, సైన్యాధిపతిగా ఎదిగారు. 18వ శతాబ్దం ప్రారంభం నుండి 1947 వరకు పశ్చిమ భారతదేశంలో వీరి (పూర్వపు) రాచరిక రాష్ట్రం బరోడా కొనసాగింది.[1][2] పాలించే యువరాజును బరోడా మహారాజా గైక్వాడ్ అని పిలిచేవారు. బరోడా (వడోదర) నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. బ్రిటీష్ రాజ్ సమయంలో ఆంగ్లేయులతో వీరి సంబంధాలను బరోడా రెసిడెన్సీ నిర్వహించేది. ఇది బ్రిటిష్ భారతదేశంలో అతిపెద్ద, సంపన్న రాచరిక రాష్ట్రాలలో ఒకటి. వీరి సంపద లాభదాయకమైన పత్తి వ్యాపారం, వరి, గోధుమ, చక్కెర ఉత్పత్తి నుండి వచ్చేది.[3]

గైక్వాడ్ రాజవంశానికి చెందిన లక్ష్మీ విలాస్ ప్యాలెస్.

తొలి చరిత్ర

[మార్చు]
మహారాజా సాయాజీరావు గైక్వాడ్ చిత్రం
సాయాజీరావు బొంబాయి గవర్నర్ రిచర్డ్ టెంపుల్, కోర్టులోని ఇతర సభ్యులతో. సుమారు 1880

1721లో మరాఠా సైన్యాధిపతి పిలాజీ రావు గైక్వాడ్ మొఘల్ సామ్రాజ్యం నుండి ఈ నగరాన్ని జయించినప్పుడు బరోడాపై గైక్వాడ్ పాలన ప్రారంభమైంది. మరాఠా సామ్రాజ్య చక్రవర్తి ఛత్రపతి సాహు I గైక్వాడ్‌లకు ఈ నగరాన్ని జాగీరుగా ఇచ్చారు. బరోడాలో పిలాజీ రావు గైక్వాడ్ తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో, తన పాలనను స్థాపించడంలో పేష్వా బాజీరావు I ముఖ్యమైన పాత్ర పోషించారు.[4]

వారి ప్రారంభ సంవత్సరాల్లో, గైక్వాడ్‌లు గుజరాత్ మరాఠా అధిపతులు, సేనాపతి (కమాండర్-ఇన్-చీఫ్) బిరుదు కలిగిన దాభాడే కుటుంబానికి అధీనులుగా పనిచేశారు. బాలాజీ బాజీ రావుకు వ్యతిరేకంగా ఉమాబాయి దాభాడే తారాబాయి పక్షాన చేరినప్పుడు, పిలాజీ కుమారుడు దామాజీ రావు గైక్వాడ్ దాభాడే దళానికి నాయకత్వం వహించారు. అతడు ఓడిపోయి మే 1751 నుండి మార్చి 1752 వరకు పేష్వా అదుపులో ఉన్నాడు. దాభాడేలను విడిచిపెట్టి పేష్వా ఆధిపత్యాన్ని అంగీకరించడానికి సమ్మతించిన తర్వాత 1752లో అతడు విడుదలయ్యాడు. ఇందుకు ప్రతిగా దామాజీ గుజరాత్‌ మరాఠా అధిపతి అయ్యాడు, గుజరాత్ నుండి మొఘలులను తరిమికొట్టడంలో పేష్వా అతనికి సహాయం చేశాడు.[5]

దామాజీ తరువాత సదాశివ్ రావు, విశ్వాస్ రావు, మల్హర్ రావు హోల్కర్, జాంకోజీ సింధియా, సిధోజీ ఘార్గే-దేశాయ్ (దేశ్‌ముఖ్), మహాద్జీ షిండేలతో కలిసి మూడవ పానిపట్టు యుద్ధంలో (1761) పోరాడారు. పానిపట్ వద్ద మరాఠా ఓటమి తర్వాత పేష్వాల కేంద్ర పాలన బలహీనపడింది. ఫలితంగా పేష్వాల నామమాత్రపు అధికారాన్ని, సతారా భోంస్లే మహారాజు ఆధిపత్యాన్ని గుర్తిస్తూనే గైక్వాడ్‌లు, అనేక ఇతర శక్తివంతమైన మరాఠా వంశాలతో పాటుగా తమను తాము స్వతంత్ర పాలకులుగా స్థిరపరచుకున్నారు.

రాజవంశ స్థాపకుడు పిలాజీ రావు

బ్రిటిష్ ఆధిపత్యం

[మార్చు]

అనేకమంది మరాఠా నాయకులతో పాటు గైక్వాడ్‌లు మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో బ్రిటిష్ వారితో పోరాడారు.

ఇటీవల సింహాసనాన్ని అధిష్టించిన గైక్వాడ్ మహారాజు ఆనంద్ రావ్ గైక్వాడ్ను ప్రత్యర్థి హక్కుదారుల నుండి రక్షించడానికి 1802 మార్చి 15న బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారు. గైక్వాడ్‌లు బ్రిటిష్ వారితో కాంబే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది మరాఠా సమాఖ్య నుండి వారి స్వాతంత్ర్యాన్ని గుర్తించింది. బ్రిటిష్ ఆధిపత్యాన్ని అంగీకరించినందుకు ప్రతిగా బరోడా మహారాజులకు స్థానిక స్వయంప్రతిపత్తిని హామీ ఇచ్చింది, అయితే ఇది వారిని లొంగదీసుకోలేని అసమర్థత ఫలితమే.

1875లో సింహాసనాన్ని అధిష్టించిన మహారాజా శాయాజీ రావు III, బరోడాను ఆధునీకరించడానికి ఎంతో కృషి చేశారు. నిర్బంధ ప్రాథమిక విద్య, గ్రంథాలయ వ్యవస్థ, మహారాజా సాయాజీరావు బరోడా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. వస్త్ర కర్మాగారాల ఏర్పాటును కూడా ప్రోత్సహించాడు, ఇది బరోడా వస్త్ర పరిశ్రమ సృష్టికి దోహదపడింది. కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి బి. ఆర్. అంబేద్కర్‌కు ఉపకార వేతనం అందించినందుకు అతడు ప్రసిద్ధి చెందాడు.

1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత బరోడా చివరి పాలక మహారాజు ప్రతాప్‌సింహరావు భారతదేశంలో చేరాడు. బరోడా చివరకు బొంబాయి రాష్ట్రంలో విలీనం చేయబడింది, తరువాత ఇది భాషా ప్రాతిపదికన 1960లో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలుగా విభజించబడింది.

గైక్వాడ్ లేదా గాయక్వాడ్ అనేది ప్రధానంగా భారతదేశంలోని మహారాష్ట్రలో ఒక ఇంటిపేరులా కూడా కనిపిస్తుంది.

కుటుంబ వృక్షం

[మార్చు]
గైక్వాడ్ రాజవంశం, బరోడా మహారాజుల కుటుంబ వృక్షం
పిలాజీ రావు
(1)
పా. 1721-1732
దామాజీ రావు
(2)
పా. 1732-1768
ప్రతాప్ రావు
సాయాజీ
రావు I

(3)
పా. 1768-1778
ఫతే
సింగ్ రావు

(4)
పా. 1778-1789
గోవింద్ రావు
(6)
పా. 1793-1800
మానాజీ రావు
(5)
పా. 1789-1793
కాలోజీ రావు
ఆనంద్ రావు
(7)
పా. 1800-1819
సాయాజీ
రావు II

(8)
పా. 1819-1847
గబాజీ రావు
గణపత్ రావు
(9)
పా. 1847-1856
ఖాండేరావు
(10)
పా. 1856-1870
మల్హర్ రావు
(11)
పా. 1870-1875
భికాజీ రావు
కాశీ రావు
సాయాజీ
రావు III

(12)
పా. 1875-1939
ఫతే సింగ్
రావు
ప్రతాప్
సింగ్ రావు

(13)
పా. 1939-1949
– నామమాత్రం –
పా. 1949-1951
ఫతే
సింగ్
రావు II

(14)
– నామమాత్రం –
పా. 1951-1971
కుటుంబ
పెద్ద
1971-1988
రంజిత్
సింగ్ రావు

(15)
కుటుంబ
పెద్ద
1988-2012
సమర్‌జిత్
సింహ్

(16)
కుటుంబ
పెద్ద
2012-ప్రస్తుతం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Ramusack, Barbara N. (2004). The Indian Princes and their States. The New Cambridge History of India. Cambridge University Press. p. 35&36. ISBN 9781139449083.
  2. Streefkerk, Hein (1985). Industrial Transition in Rural India: Artisans, Traders, and Tribals in South Gujarat. Popular Prakashan. p. 111. ISBN 9780861320677.
  3. "India Has Rich State in Baroda". Hartford Courant. 16 August 1927. Archived from the original on 4 November 2012. Retrieved 6 July 2017.
  4. "Sayajirao Gaekwad III: Baroda's Adopted Ruler and a Connoisseur of Arts". INDIAN CULTURE (in ఇంగ్లీష్). Archived from the original on 2025-04-03. Retrieved 2025-12-19.
  5. Charles Augustus Kincaid; Dattatray Balwant Parasnis (1918). A History of the Maratha People Volume 3. Oxford University Press. pp. 2–10.

బయటి లింకులు

[మార్చు]