గొడ్డేటి మాధవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొడ్డేటి మాధవి
గొడ్డేటి మాధవి


భారత పార్లమెంటు సభ్యులు
అరకు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
17 జూన్ 2019
ముందు కొత్తపల్లి గీత
నియోజకవర్గం అరకు

వ్యక్తిగత వివరాలు

జననం 1992
విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెం
రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు గొట్టేటి దేముడు, చెల్లయమ్మ[1]
జీవిత భాగస్వామి శివప్రసాద్‌
నివాసం కొయ్యూరు
వృత్తి ఉపాధ్యాయిని

గొడ్డేటి మాథవి రాజకీయ నాయకురాలు, భారతదేశ 17వ లోక్‌సభలో లోక్‌సభ సభ్యురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పిన్నవయసు గల పార్లమెంటు సభ్యురాలు. ఆమె 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున అరకు లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలుపొందింది.[2]

జీవిత విశేషాలు[మార్చు]

1992లో విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో గొడ్డేటి దేముడు, చెల్లయమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి కమ్యూనిస్టు నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. తల్లి చెల్లయమ్మ సెకండరీ గ్రేడు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నది.[3] మాధవి అవివాహితురాలు. బీఎస్సీ బీఈడీ చదివిన ఆమె వివిధ పాఠశాలలలో పి.ఇ.టి గా పనిచేసింది. ఆమె కొండదొర సామాజిక వర్గానికి చెందినది. తన తండ్రిలాగా తాను ఒక ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉంటుందని భావించి రాజకీయాల్లోకి రావాలని తాను నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. [4]

లోక్‌సభ సభ్యురాలిగా[మార్చు]

కేవలం 25 ఏళ్ల 3 నెలల వయసుకే ఎంపీగా ఎన్నికై లోక్‌సభ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన ప్రతినిధిగా రికార్డుకెక్కింది[5].

మూలాలు[మార్చు]

  1. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  2. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2019". Election Commission of India. 2019-05-23. Archived from the original on 2019-05-26. Retrieved 2019-07-10.
  3. https://www.deccanchronicle.com/nation/politics/260519/goddeti-madhavi-is-youngest-mp-in-andhra-pradesh.html
  4. "అరకు కొత్త ఎంపీ గిరిజన బిడ్డ గొడ్డేటి మాధవి సరికొత్త రికార్డు ఇదే..!".
  5. "గొడ్డేటి మాధవి అరుదైన రికార్డు...లోక్‌సభ చరిత్రలోనే..." Archived from the original on 2019-07-10. Retrieved 2019-07-10.