గొర్లెవానిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గొర్లెవానిపాలెం, విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలానికి చెందిన గ్రామం.[1]

ఈ గ్రామంలో ఇంచుమించు 150 కుటుంబాలు ఉంటాయి. ఈ ఊరిలో ఒక శివాలయం, ఒక పాల సేకరణ కేంద్రం ఉన్నాయి. ఈ గ్రామం వైజాగ్ నుంచి 28 కి.మీ., సబ్బవరం నుంచి 1 కి.మీ. దూరం ఉంటుంది. దీనికి ప్రత్యేక పంచాయతీ లేదు. ఈ గ్రామం సబ్బవరం మేజర్ పంచాయతీకి శివారు గ్రామం.

ఈ ఊరికి ఒక కొండ ఉంది, దీనికి ఒక విశిష్టత ఉంది. ఈ కొండ పేరు సూదికొండ. ఈ కొండకి పూర్వీకులు చెప్పే కథ ఏమిటంటే, సింహాచలం కొండ పైన నెలకొనడానికి ముందు నరసింహ స్వామి ఈ రెండు కొండలలో ఏ కొండ పైన కొలువుదీరాలా అని సందిగ్ధావస్థలో పడ్డాడు. అప్పుడు రెండు కొండల పైన చెరొక పాదం మోపాడు.దురదృష్టావశాత్తూ సూదికొండ కొంచెం కిందకు అణిగిపోయింది. ఈ కారణం చేత నరసింహస్వామి సింహాచల కొండ పైన వెలిసి సింహాద్రి అప్పన్నగా పేరుగాంచాడని కథనం ఒకటి ఉంది.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-12.