గొల్లప్రోలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొల్లప్రోలు
—  రెవిన్యూ గ్రామం  —
గొల్లప్రోలు is located in Andhra Pradesh
గొల్లప్రోలు
గొల్లప్రోలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°10′02″N 82°17′05″E / 17.1672222°N 82.2847222°E / 17.1672222; 82.2847222
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం గొల్లప్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 23,605
 - పురుషులు 11,941
 - స్త్రీలు 11,664
 - గృహాల సంఖ్య 5,937
పిన్ కోడ్ 533 445
ఎస్.టి.డి కోడ్

గొల్లప్రోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం.[1]. అదేపేరు గల మండలానికి కేంద్రము.

ఇది మండల కేంద్రమైన గొల్లప్రోలు నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పిఠాపురం నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇది పిఠాపురానికి ఈశాన్య దిశలో ఉంది. విశాఖపట్నానికి 130 కి.మీ. దూరంలో, మద్రాసు - కొలకత్తా రైలు మార్గంలో ఉంది. 25 కి.మీ. దూరంలో ఉన్న కాకినాడ ఈ గ్రామానికి దగ్గరి పట్టణం.[2]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 23,605.[3] ఇందులో పురుషుల సంఖ్య 11,941, మహిళల సంఖ్య 11,664, గ్రామంలో నివాస గృహాలు 5,937 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6783 ఇళ్లతో, 23882 జనాభాతో 1572 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12071, ఆడవారి సంఖ్య 11811. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3106 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 70. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587337[4].పిన్ కోడ్: 533445.

మండలం గురించి[మార్చు]

1987లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మండల వ్యవస్థను ఏర్పరచినపుడు గొల్లప్రోలు మండలంగా ఏర్పరచబడింది.. కొప్పుల హేమనాధరావు మొదటి మండల ప్రెసిడెంట్ 1987 - 1992 కాలంలో పదవిలో ఉన్నాడు. 2005 వరకు ఇక్కడ మండలం కేంద్ర కార్యాలయం నిర్మించబడలేదు. మొగలి సుబ్రహ్మణ్యం (చిట్టిబాబు) ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు మండల కార్యాలయం ప్రారంభమైందిఈ ప్రాంతం తుఫాను తాకిళ్ళకు తరచు గురవుతుంటుంది.గొల్లప్రొలు చరితా అమురుతం పుస్తకము 2017 మార్చిలో విదుదల అయ్యింది. రచయిత బొజ్జ ప్రసాదు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామం పాఠశాల 1954లో మొదలయ్యింది. శ్రీమతి గవరసాన సుభద్ర,. గవరసాన సత్యనారాయణ భార్య) ఇందుకు భూమి విరాళంగా ఇచ్చింది. ఆమె తండ్రి జ్ఞాపకంగా ఈ పాఠశాలకు "డా. మలిరెడ్డి వెంకటరాజు మెమోరియల్ ప్రాథమిక పాఠశాల" అని పేరు పెట్టారు.[2] ఇందులో సుమారు 400 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో చదువుకొంటున్నారు.[5]. శ్రీమతి మలిరెడ్డి ఉమాంబ ప్రాథమిక పాఠశాల అనేది 2007 లో మొదలు పెట్టేరు. ఇది కూడా గవరసాన దంపతుల పూనికతో జరిగినదే. ఇటీవల కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇంగ్లీషు మీడియంలో విద్యాసదుపాయం కలిగించారు.గొల్లప్రోలులో రెండు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి: Z.P.P. ఉన్నత పాఠశాల 1950 దశకంలో సేఠ్ పెరాజీ లుంబాజీచే నిర్మించబడింది. మరొకటి బాలికల ఉన్నత పాఠశాల. ఇంకా మాధురి విద్యాలయం అనే ప్రైవేటు స్కూలు ఇంగ్లీషు మీడియం చదువును అందిస్తుంది. ఇది సమీప గ్రామాలలో మంచి పేరు కలిగి ఉంది.

వ్యవసాయం, పంటలు, నీటి వనరులు[మార్చు]

ముఖ్యమైన పంటలు: మిరప, ప్రత్తి, వరి, ఉల్లి, మిరపకాయలు

పరిశ్రమలు[మార్చు]

ధాన్యం మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, వేరుశనగ నూనె మిల్లులు, RICE MILLS ఉన్నాయి.

దేవాలయాలు, మసీదులు, చర్చిలు[మార్చు]

శివాలయం, విష్ణ్వాలయం, షిర్డీ సాయిబాబా గుడి ఉన్నాయి.

శ్రీ అపర్ణ అమ్మవారి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి అను గ్రామంలో ఉంది. ఈ గ్రామం అన్నవరం పుణ్యక్షేత్రానికి 20 కి.మీ దూరంలో, సామర్లకోటకు 25 కి.మీ దూరంలో, కాకినాడకు 30 కి.మీ దూరంలో ఉంది.

శ్రీ అపర్ణ దేవిని శుక్రవారము పూజించినచో విద్యార్థులకు విద్యాలాభము, వ్యాపారులకు ధనలాభము, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును.

ప్రముఖులు[మార్చు]

రచయిత : కొప్పుల వారి కతలు .. కబుర్లు - 1&2; విీరిీ విీరిీ గుమ్మడిపండు..(Know Your Trees) మొదలైనవి.

వీధులు[మార్చు]

 • పెద్ద వీధిలో అధికంగా సంపన్నుల ఇళ్ళున్నాయి.
 • కరణంగారి తోటలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ వీధి అన్నింటికంటే పెద్దది.[6]
 • పల్లపు వీధి
 • కొత్తపేట వీధి
 • నందిరాయి వీధి
 • మంత్రాలవారి వీధి
 • గుడివీధి
 • పర్లా వారి వీధి.
 • మామిడాల వారి వీధి

వైద్య శాలలు[మార్చు]

 • భాస్కరరావు హాస్పిటల్ చుట్టుప్రక్కల బాగా పేరు కలిగింది.
 • కోకిలవాణి హాస్పిటల్
 • ఉమాదేవి హాస్పిటల్
 • ప్రభుత్వ హాస్పిటల్
 • రెడ్ల పద్మరాజు హాస్పిటల్
 • మోహనరావు హాస్పిటల్

రవాణా[మార్చు]

గొల్లప్రోలు రైల్వేస్టేషను (స్టేషను కోడ్ GLP) చెన్నై - హౌరా రైలు మార్గంలో, సామర్లకోట, తుని స్టేషనుల మధ్య ఉంది. [7] ఇక్కడ సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-రాజమండ్రి పాసెంజర్, విజయవాడ-విశాఖపట్నం పాసెంజర్, రాయగడ పాసెంజర్, బొకారో-అలెప్పీ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-వైజాగ్ పాసెంజర్, మచిలీపట్నం-వైజాగ్ పాసెంజర్ ఆగుతాయి. ఈ స్టేషను నుండి పిఠాపురం స్టేషనుకు 4 కి.మీ., అన్నవరం స్టేషనుకు 19 కి.మీ. దూరం. గొల్లప్రోలు రైల్వేస్టేషను చుట్టుప్రక్కల 27 గ్రామాలలో సుమారు 1,50,000 జనాభాకు ప్రయాణ వసతి కలిపిస్తుంది.[8]

ఉత్పత్తి[మార్చు]

ఎక్కువ మంది జనాభా వ్యవసాయ కార్మికులు.[5] ఈ గ్రామప్రాంతంలో పండే మిరపకాయలకు మంచి గిరాకీ ఉంది.[2]. ఇంకా ఉల్లి, వేరుశనగ, ప్రత్తి, వరి పంటలు కూడా ఇక్కడ బాగా పండిస్తారు.

మూలాలు[మార్చు]

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-11-28.
 2. 2.0 2.1 2.2 Radhika Malpani. "School In Gollaprolu". ILP Projects. Archived from the original on 2005-03-25. Retrieved 2007-01-24.
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-11-28.
 4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 5. 5.0 5.1 "Dr. MVR Prathamika Patasala, Gollaprolu". Asha for Education. 2004. Retrieved 2007-01-24.
 6. "MPPS - KARANAM GARI THOTA - GOLLAPROLU M". Sarva Shiksha Abhiyan. 2004–2005. Archived from the original on 2007-09-28. Retrieved 2007-06-21.{{cite web}}: CS1 maint: date format (link)
 7. Online Highways LLC (2004). "Gollaprolu Railway Station". www.india9.com. Retrieved 2007-02-06.
 8. G. Satyanarayana (2004). "Andhra Pradesh - Readers' Mail - Train halt". The Hindu. Retrieved 2007-02-05.[permanent dead link]

బయటి లింకులు[మార్చు]