గోదావరిఖని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

| type = టౌన్ |latd = 18.751892| longd = 79.513311 |native_name = గోదావరిఖని |other_name = గోదావరిఖని, జిడికె |district = పెద్దపల్లి |state_name = తెలంగాణ |nearest_city = కరీంనగర్ |parliament_const = పెద్దపల్లి |assembly_cons = రామగుండం |area_telephone = 08728 |postal_code = 505209 ,505208 |vehicle_code_range = TS-- |coastline = |climate = |precip = |temp_summer = 42-50 |temp_winter = |website= }}

గోదావరిఖని
—  రెవెన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి
మండలం రామగుండము
ప్రభుత్వము
 - కార్పోరేటర్
పిన్ కోడ్ 505209,505214,505208
ఎస్.టి.డి కోడ్ 08728

గోదావరిఖని, పెద్దపల్లి, రామగుండము మండలానికి చెందిన పట్టణము. గోదావరిఖని అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది బొగ్గు గనులు. దీనిని మాంచెష్టర్ సిటి ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. గోదావరి నది మరియు బొగ్గు గనుల సమూహము వున్నది (ఖని అనగా గని. గోదావరి+ఖని ) కనుక దీనికి గోదావరిఖని అని పేరు వచ్చింది. దీనిని కోల్ సిటి అని కూడా అ౦టారు. ప్రస్తుతము (2014) జనాభా లెక్కల ప్రకారము గోదావరిఖని (రామగుండం పురపాలక సంఘం) జనాభా 5, 50, 365. రామగుండం పురపాలక సంఘ పరిధి 94.8 చ.కి.మీ. ఈ ప్రాంత పరిధిలో సింగరేణి బొగ్గు గనులు, ఎన్.టి.పి.సి (2600MW) ., ఎఫ్.సి.ఐ., ఎ.పి. జెన్ కో మరియు బస౦త్ నగర్ సిమె౦ట్ పరిశ్రమ మొదలైన పరిశ్రమలు ఉన్నాయి. ఎఫ్.సి.ఐ. నష్టాలతో మూతపడిపోయింది. దీనిని తిరిగి పునరుద్ధరించడం జరిగింది .ఇక్కడ 10MW సౌర విద్యుత్ కే౦ద్ర౦ కూడా ఉ౦ది. SCCLలో అతి పెద్ద డివిజన్ రామగుండ౦ డివిజన్.ఇది రామగుండము కమిషనరేట్ కింద వస్తుంది ఈ డివిజన్ RG-1, RG-2, RG-3 అను మూడు ఏరియాలను కలిగి ఉ౦ది.ఇక్కడ NTPCలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను తెలంగాణాతో పాటు ఆ౦ధ్రప్రదేశ ,తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.త్వరలో తెలంగాణా ప్రభుత్వం సింగరేణి ఆధ్వరంలో నిమ్స్ తరహ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజి ఏర్పాటు చేయనుంది. ప్రముఖ సినీ విమర్సకుడు చల్లా శ్రీనివాస్ ఈ ప్రాంతానికి చెందినవాడే. భారత స్థల సమాచారపెట్టె‎ మరియు మొగళిరేకులు డైలి సీరియల్ ఫెం సాగర్, తాగుబోతు రమేష్ కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే

గ్రామ భౌగోళిక స్వరూపం[మార్చు]

ఇది భౌగోళికంగా ఎత్తెన ప్రా౦తం.జిల్లా కే౦ద్రం ను౦డి 65 కి.మీ. దూరాన ఉంది.ఇక్కడ వేసవి ఉష్ణోగ్రతలు 40-50C ఉంటాయి.ఇది గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ నది పై గల వ౦తెన కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతు౦ది.

సమీప గ్రామాలు[మార్చు]

సు౦దిల్ల, పెద్ద౦పేట్, గు౦జపడుగు, ముత్యాల, లక్ష్మీపురం, వీర్లపల్లి, కమాన్ పూర్, మంగల్ పల్లి

సమీప మండలాలు[మార్చు]

కమాన్ పూర్‌, పెద్దపల్లి

విద్య సౌకర్యాలు[మార్చు]

ఇక్కడ అన్ని రకాల ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి.ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ మరియు శాతవాహన విశ్వవిద్యాలయ పి.జి.కాలేజి ఇతర జూనియర్ కాలేజిలు ఇ౦ఙనీరి౦గ్ కాలేజిలు, polytechnic కాలేజి, M.B.A కాలేజిలు ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు[మార్చు]

గోదావరిఖని పట్టణానికి రోడ్డు, రామగుండం నుండి రైలు మార్గం ఉంది.రామగుండం రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంది. ఈ స్టేషను ఢిల్లీ-చెన్నై-సికింద్రాబాద్ మార్గంలో ఉంది.ఢిల్లీ నుండి వచ్చేమార్గంలో తెలంగాణలో మొదట ఎదురయ్యే పెద్ద స్టేషను.హైదరాబాదు నుండి గోదావరిఖని పట్టణానికి 4 లైన్ల రాజీవ్ రహదారి ఉంది.గోదావరిఖని పట్టణ౦ నుండి తెలంగాణలోని అన్ని జిల్లాలకు మరియు తెలంగాణ రాష్ట్రానికి బస్సుల సౌకర్యం ఉంది.రామగుండములో విమానాశ్రయం ఉంది.

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

సింగరేణి సంస్థ కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం హాస్పిటల్ కట్టించెను. అంతేకాక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ మరియు వివిధ రకాల ప్రయివేటు హాస్పిటల్స్ ఉన్నాయి.

మంచినీటి వసతి[మార్చు]

మంచినీటి వసతి కోసం రామగుండం నగర పాలక సంస్థ సింగరేణి సహాయంతో గోదావరి నది నుండి నీటిని సరఫరా చేస్తున్నారు.

రోడ్దు వసతి[మార్చు]

పట్టణం చుట్టు మరియు పట్టణంలో రామగుండం నగర పాలక సంస్థ మరియు సింగరేణి ఆధ్వరంలో రోడ్లను నిర్మించారు.

ఈ ఫోర్ వే రోడ్డు వ్యవస్థ అనేది హైదరాబాదును కలుపుతుంది.

పట్టణంలొని ప్రధాన వృత్తులు[మార్చు]

సింగరేణి కార్మికులు అధికంగా ఉంటారు.

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03

వెలుపలి లింకులు[మార్చు]