గోదావరి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోదావరి
(2006 తెలుగు సినిమా)
Godavari poster.jpg
దర్శకత్వం శేఖర్ కమ్ముల
నిర్మాణం జి.వి.జి.రాజు
తారాగణం సుమంత్,
కమలినీ ముఖర్జీ,
తనికెళ్ళ భరణి,
నీతూ చంద్ర
సంగీతం కె. ఎం. రాధాకృష్ణన్
నేపథ్య గానం కె. ఎస్. చిత్ర,
శంకర్ మహదేవన్,
గాయత్రి,
శ్రేయ ఘోషాల్,
కె. ఎం. రాధాకృష్ణన్,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
సునీత ఉపద్రష్ట,
ఉన్ని కృష్ణన్
ఛాయాగ్రహణం విజయ్ సి. కుమార్
కూర్పు మార్తాండ్ వెంకటేష్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

గోదావరి 2006 సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఈ సినిమాలో చాలా భాగం గోదావరి నది, పాపికొండల ప్రాంతంలో చిత్రీకరించారు. ఇంతకు మునుపు అక్కినేని నాగేశ్వరావు నటించిన అందాల రాముడులో కూడా చాలాభాగం గోదావరి నది మీద చిత్రీకరించారు.

కథ[మార్చు]

సీతా మహాలక్ష్మి ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల. సొంతంగా తన కాళ్ళమీద నిలబడాలని వ్యాపారం చేస్తుంటుంది కానీ అతి కష్టమ్మీద నెట్టుకొస్తుంటుంది. ఒక వైపు తల్లిదండ్రులు చూస్తున్న పెళ్ళి సంబంధాలు కూడా ఏదో ఒక కారణంతో తిరగ్గొడుతూ ఉంటుంది. రామ్ అమెరికాలో చదివి వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ అంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని అతనికి పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు.

నటీనటులు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2006 నంది పురస్కారాలు[1] ద్వితీయ ఉత్తమ చిత్రం జి.వి.జ్.రాజు Won
2006 నంది పురస్కారాలు ఉత్తమ దర్శకులు శేఖర్ కమ్ముల Won
2006 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం విజయ్ సి. కుమార్ Won
2006 నంది పురస్కారాలు ఉత్తమ సంగీత దర్శకుడు కె. ఎం. రాధాకృష్ణన్ Won
2006 నంది పురస్కారాలు ఉత్తమ నేపథ్య గాయని ఉపద్రష్ట సునీత Won

మూలాలు[మార్చు]

  1. "Nandi Awards 2006 Winners List". Archived from the original on 2018-02-04. Retrieved 2018-01-20.

బయటి లింకులు[మార్చు]