Jump to content

గోధుమ

వికీపీడియా నుండి
(గోదుమ నుండి దారిమార్పు చెందింది)

గోధుమ
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Triticum

జాతులు

T. aestivum
T. aethiopicum
T. araraticum
T. boeoticum
T. carthlicum
T. compactum
T. dicoccoides
T. dicoccon
T. durum
T. ispahanicum
T. karamyschevii
T. macha
T. militinae
T. monococcum
T. polonicum
T. spelta
T. sphaerococcum
T. timopheevii
T. turanicum
T. turgidum
T. urartu
T. vavilovii
T. zhukovskyi
References:
  ITIS 42236 2002-09-22

గోధుమ ఒక ప్రధానమైన ధాన్యము. గోధుమ భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోధుమ పిండిని ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండించడమే కాకుండా, గోధుమ పిండితో చేసిన రొట్టెలు (చపాతీలు) వారి ప్రధాన ఆహారం. గోధుమలను పులియబెట్టడం ద్వారా బీరు, వోడ్కా, ఆల్కహాలు మొదలైన వాటిని తయారు చేయవచ్చు. అలాగే గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడవచ్చు. ఆవాసాలకు పైకప్పుగా ఉపయోగించవచ్చు. గోధుమ ఒక ప్రధానమైన ధాన్యము. గోధుమ భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోధుమ పిండిని ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండించడమే కాకుండా, గోధుమ పిండితో చేసిన రొట్టెలు (చపాతీలు) వారి ప్రధాన ఆహారం. గోధుమలను పులియబెట్టడం ద్వారా బీరు, వోడ్కా, ఆల్కహాలు మొదలైన వాటిని తయారు చేయవచ్చు. అలాగే గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడవచ్చు. ఆవాసాలకు పైకప్పుగా ఉపయోగించవచ్చు.

ఆహారధాన్యంగా గోధుమ

[మార్చు]

ప్రపంచ ఆహార విపణిలో గోధుమది అగ్రస్ధానం. ప్రపంచంలో వరి తరువాత ఎక్కువగా వాడబడుతున్న ఆహారధాన్యం గోధుమలే. 550 మి.టన్నుల పై చిలుకు గోధుమలు సాలీన వాడకం ఉంది. ఇందులో 2/3 వంతు ఆహారానికి, 1/6 వంతు పశువుల దాణాగాను మిగిలినవి విత్తనాలు తదితరాలకి వాడబడుతున్నాయి. 1949-1978 మధ్య కాలంలో ప్రపంచ గోధుమ సాగు 3.3% పెరిగింది. 1960 కాలం నాటి హరిత విప్లవం, పెరిగిన సాగు విస్తీర్ణం, కొత్త అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, పురుగుమందుల వాడకం అధికమవడం దీనికి దోహదబడ్డాయి. గోధుమ నేడు 80 దేశాలలో 232 మి.హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సరాసరి ఉత్పత్తి 1664 కి.గ్రా / హె. సాధించగలిగాము. ఉష్టమండలాలలోని మధ్య అక్షాంశ గడ్డి మైదానాలలో ముఖ్యంగా పండిస్తారు. ముఖ్యంగా పండించే ప్రాంతాలు--పూర్వ సోవియట్ రష్యా, అమెరికా, కెనడా, చైనా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఐరోపా .


గోధుమ రకాలు

[మార్చు]
  • గోధుమలో ముఖ్య రకాలు వసంతకాల గరుకు ఎరుపు గోధుమ (Hard Red Spring Wheat)
  • శీతాకాల గరుకు ఎరుపు గోధుమ (Hard Red winter Wheat)
  • శీతాకాల మృదువైన ఎరుపు గోధుమ (Soft Wheat)
  • మృదువైన తెల్లని గోధుమ (White Wheat)
  • దూరమ్ (డ్యూరమ్) గోధుమ (Durum Wheat)

గరుకు ఎరుపు గోధుమ రకాలు మేలు రకం పిండి తయారీకి వాడతారు. ఇది బ్రెడ్, బన్ను తయారీకి అనుకూలమైనది. ఈ గోధుమలలో ప్రోటీన్ శాతం ఎక్కువ. శీతాకాల గరుకు ఎరుపు గోధుమ రకం అతి శీతల ప్రదేశాలలో ఎక్కువగా పండిస్తారు. మృదువైన ఎరుపు గోధుమతో వచ్చే పిండి కేకులు, ఇతర బేకరీ పదార్ధాల తయారీకి వినియోగిస్తారు. ఈ రకం గోధుమ అత్యధికంగా పండించబడుతోంది. ఇందులో ప్రోటీన్ శాతం తక్కువ. తెల్ల గోధుమలు ఆసియా దేశాలలో, అమెరికా రాష్ట్రాలలో పండిస్తున్నారు. ఈ గోధుమల పిండి కేకులు, సిరియల్స (breakfast cereals - అటుకులు) తయారీకి వాడతారు. దురమ్ (డ్యూరమ్) గోధుమలు అన్నిటికన్నా అత్యధిక ప్రోటీన్ శాతం కలిగి ఉన్నాయి. వీటి నుండి బంగారు వన్నె కల సేమెలీన్ తయారు చేయబడుతుంది. దీని నుంచే పాస్తాలు, సేమ్యా నూడిల్సు తయారు చేస్తారు. అత్యధికంగా ఉత్పత్తి గల దేశాలు ----పూర్వ సోవియట్ రష్యా, అమెరికా, చైనా, అత్యధిక ఉత్పాదకత గల దేశాలు ---బెల్జియం, హాలెండ్, ఇటలీ, అమెరికా, ఇండియా.

భారతదేశంలో గోధుమ--

[మార్చు]

గోధుమ గడ్డి రసంలో ప్రొటీన్లు, ఎంజైమ్స్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉన్న కారణాన ఈ రసాన్ని సేవించిన వారికి శక్తిని చేకూరుస్తుంది. గోధుమ గడ్డిలో క్లోరోఫిల్‌ ఉండటం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనో త్తేజం కలిగిస్తుంది. గోధుమ గడ్డిని మనం ఇంట్లోనే పెంచు కుని దానినుండి రసం తీసుకోవచ్చును.గోధుమ లను ఓ గిన్నెలో 8 నుండి 10 గంటలవరకు నానబెట్టాలి. ప్రతి నాలుగు గంటలకూ నీ రు మార్చాలి.రెండు అం గుళాల రం ధ్రాలు గలిగిన ఓ ట్రేను తీసు కోవాలి. దానిలో మూడిం తలు మట్టిని వేయాలి. ఆ మట్టిపై నీటిని పోయాలి.గోధుమలను సమానంగా ఆ మట్టిలో వేయాలి. కిటీకీ సమీపాన గాలి తగిలేటట్లు మొక్కలకు పేపర్‌ టవల్‌ను ఉంచాలి. సరాసరి సూర్య రశ్మి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ ఉ దయాన్నే నీరు పోయాలి. సాయంకాలం కొంచెం నీరు చిమ్మితే సరి పోతుంది. ఐదో రోజుకి మొక్కలు ఒక అంగు ళం ఎదుగు తాయి. ఇపðడు కొంచెం నీరు రోజుకు ఒక సారి పెడితే సరిపోతుంది. పదోరోజుకి గోధుమ గడ్డి 6, 7 అంగుళాల ఎత్తుకి పెరుగుతుది. ఈ సమయంలో గడ్డిని కోసి రసాన్ని తీసుకోవచ్చు. --------------------- భారతదేశంలోని వ్యవసాయ భూమిలో 14% విస్తీర్ణంలో గోధుమ సాగు చేయబడుతుంది. 70% గోధుమ, సాగునీటి ఆధారంగా పండిస్తున్నారు. పండించే ప్రాంతాలు-- సాధారణ గోధుమ గంగా సింధు నది మైదానాలలో, దురమ్ (డ్యురమ్) గోధుమ వాయవ్య భారతదేశంలో, భారత ద్వీపకల్పంలో (Peninsular India) ఎమర్ గోధుమలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో పండిస్తున్నారు. అధిక విస్తీర్ణం సాగులో వున్న రాష్ట్రాలు 1. ఉత్తరప్రదేశ్ 2. మధ్యప్రదేశ్ 3. పంజాబ్ 4. రాజస్తాన్ 5. బీహార్ 6. హర్యానా అధిక ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలు 1. ఉత్తరప్రదేశ్ 2. పంజాబ్ 3. హర్యానా 4. బీహార్ అత్యధిక ఉత్పాదకత ఉన్న రాష్ట్రాలు 1. పంజాబ్ 2. పశ్చిమబెంగాల్ 3. రాజస్తాన్ 4. ఉత్తరప్రదేశ్ గోధుమ కావాలిసిన వాతావరణం, భూమి విత్తు సమయంలో కోత సమయంలో ఉష్ణోగ్రత 15 -20 సెం.గ్రే 25-28 సెం.గ్రే వర్షపాతం 50-100 సెం.మీ. పొడిగా (అనార్ధ్ర) భూమి: ఒండ్రుమట్టి, లోయ్ వృత్తికలు, సిల్టు నేలలు, బ్లాక్ చెర్నొజెమ్.

ఆరోగ్యానికి గోధుమ గడ్డి రసం

[మార్చు]
ఇంటిలో పెంచిన 4-5 రోజులగోధుమ గడ్డి
ఇంటిలో పెంచిన 8-10 రోజుల గోధుమ గడ్డి.
ఇంటిలో పెంచిన 8-10 రోజుల గోధుమ గడ్డి
గోధుమ గడ్డి రసం తీయు పరికరం
గోధుమ గడ్డి రసం
గోధుమ గడ్డి రసం

—నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు గోధుమ గడ్డి రసాన్ని సేవిస్తుండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాళ్ళు, పచ్చ కామెర్లు, మధుమేహం, కీళ్ళవాతం వున్నవారు తాజా గోధుమ రసాన్ని సేవిస్తే ఈ జబ్బులు మటుమాయమౌతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గోధుమ గడ్డి రసం ప్రయోజనాలు

[మార్చు]
  1. ఎర్ర రక్త కణాల అభివృద్ధి: గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక ఆసిడ్‌, ఐరన్‌ పుష్కలంగా ఉండి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహ దం చేస్తాయి.
  2. అధిక రక్తపోటు నివారిణి: గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను ఇది కడిగేస్తుంది.
  3. తాల్‌సేమియా రోగులకు మంచిది: ఈ మధ్య జరిగిన శాస్త్ర పరిశోధనలో 'తాల్‌ సేమియా' రోగులు క్రమం తప్పక గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే వారి రోగ నివారణకు ఎంతో ఉపకరిస్తుంది. ఈ రసాన్ని తీసుకోక పోతే వాళ్ళు ప్రతివారం రక్తం మార్పిడి చేసుకోవ లసి వస్తుంది. చంఢఘీడ్‌ లోని పెడియాట్రిక డిపార్ట్‌మెంట్‌, ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది.
  4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు గోధుమ గడ్డి రసం తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుటపడుతుంది. 5. శక్తి ప్రదాయిని:
  5. నూతనోత్తేజం కలిగిస్తుంది:
  6. బరువును పెంచుతుంది: గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు. బరువు పెరిగినవారికి ఇది శరీరంలోని మెటబాలిజాన్ని సరిచేస్తుంది.
  7. క్యాన్సర్‌ నివారిణి: గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, బేటా కరోటిన్‌, బయో ఫ్లావో నాయిడ్‌, బి, సి, ఇ విటమిన్ల కారణాన క్యా న్సర్‌ కణాలను నశింపచేస్తుంది. రోగ నివారణా శక్తిని పెంచి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
  8. చర్మ రక్షణ: ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. కన్నుల కింద నల్లటి వల యాలూ, మచ్చలూ రాకుండా నిరోధిస్తుంది. నేడు కాస్మటిక పరిశ్రమ గోధుమగడ్డి రసాన్ని వారిఉత్పత్తులలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి టానికగాే పనిచేస్తుంది. రోజూ ఆహారంలో గోధుమ గడ్డి రసాన్ని ఒక పోషక పదార్థంగా ఉపయోగించవచ్చు: ఈ రసాన్ని ఆరెంజ్‌, యాపిల్‌, ఫైనాఫిల్‌, లెమన్‌ తది తర జ్యూస్‌లతో కలిపి తాగవచ్చు. గోధుమ గడ్డి పొడిని కూడా పోషక పదార్థంగా వాడవచ్చును. నేడు గోధుమ గడ్డి టాబ్‌లెట్లు ఆహారానికి ప్రత్యా మ్నాయాంగా మార్కెట్‌లో విక్రయం చేస్తున్నారు.

గోధుమ గడ్డి రసం , తీసుకోవలసిన జాగ్రత్తలు:

[మార్చు]

గోధుమ గడ్డి రసం నిర్ణీత పరిణామంలోనే (30ml) తీసుకోవాలి. అధి కంగా తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స ఉంటాయి. తల నొప్పి, జీర్ణకోశ వ్యాధులు, పళ్లరంగు మారడం, మగతగా ఉండడం జరుగుతుంది. గోధుమ రసాన్ని తాజాగానే, వెంటనే వాడాలి. నిలువ వుంచి తీసు కోరాదు. ఈ రసం ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. అయితే, ఆహారంలో భాగంగా దీనిని తీసుకోవచ్చు. ఎవరికైతే గోధుమ రసం పడదో, వారు మానివేయడం మంచిది. డాక్టర్‌ లేదా న్యూట్రిషియన్‌ ఎక్సపర్ట్‌ లేదా పౌష్టికాహార నిపు ణుని సలహా మేరకు ఈ రసాన్ని తాగాలి.

ఇంట్లో గోధుమ గడ్డి పెంపకం

[మార్చు]

గోధుమ రసాన్ని తయారు చేసే విధానం: తొలుత పాత చెక్క పెట్టెల్లో మట్టిని నింపుకోండి. ఇందులో గోధుమ విత్తనాలను వెదజల్లండి. కాసింత నీటిని చిలకరించండి. వీలైనంత మేరకు వాటిని నీడలోనే ఉంచేందుకు ప్రయత్నించండి. పది రోజుల తర్వాత గోధుమ మొక్కలు 7-8 ఇంచీల మేరకు మొలకెత్తుతాయి. అప్పుడు వాటిని వేళ్ళతో సహా పెకిలించండి. వేర్లను వేరు చేసుకోండి. మిగిలిన మొక్క భాగాలను, ఆకులను రుబ్బుకోండి. రుబ్బుకున్న పదార్థాన్ని వడకట్టుకోండి. వడకట్టగా వచ్చిన రసాన్ని వెంటనే సేవించండి. కాస్త ఆలస్యమైతే ఇందులోని శక్తి తగ్గిపోతుంది. వారానికి ఓ సారి ఈ రసాన్ని [1] సేవిస్తుంటే ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినా బలాదూర్ . గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో 'ఎ' విటమిన్‌, బి కాంప్లెక్స, సి, ఇ, కే విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సెలీనియమ్‌, సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒకగ్లాసులోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది. దీనిని కేవలం గడ్డి రసం అని తీసిపారేయలేము. గోధుమ మొలకలను న్యూట్రిషనల్‌ రిజర్వాయర్‌గా పౌష్టికాహార నిపుణులు గుర్తిం చారు.

మూలాలు

[మార్చు]
  1. గోధుమల నూనె
"https://te.wikipedia.org/w/index.php?title=గోధుమ&oldid=4339453" నుండి వెలికితీశారు