గోనె రాజేంద్ర ప్ర‌సాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోనె రాజేంద్ర ప్ర‌సాద్

గోనె రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ముఖ మోటివేష‌న్ కౌన్సెల‌ర్. హ్యాపీ ఆర్.పి.గా ప్ర‌సిద్ధులు. ఆనందంగా జీవించ‌డం, మాన‌సిక ఒత్తిడి, కుంగుబాటును అధిగ‌మించ‌డానికి ప్ర‌భావ‌వంతంగా కౌన్సెలింగ్ చేయ‌డంలో నిపుణులు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల‌తో పాటు అన్ని రంగాల వారికి కౌన్సెలింగ్ సేవ‌లు అందిస్తారు. సామాజిక సేవా కార్య‌క్ర‌మంగా వ‌ర్క్ షాపులు నిర్వ‌హిస్తుంటారు. జ‌ర్న‌లిస్టుగా 26 ఏళ్ల అనుభ‌వం ఉంది. ఈనాడుతో పాటు ప‌లు ప్ర‌ముఖ వార్తా సంస్థ‌ల్లో ప‌నిచేశారు.

విశేషాలు[మార్చు]

రాజేంద్రప్రసాద్ 1963, జూన్ 14వ తేదీన కోరుట్లలో సుశీల, వెంకటేశ్వర్ దంపతులకు జన్మించారు. ఇతని భార్యపేరు స్వర్ణ, ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తూ జర్నలిస్టుగా, మోటివేషన్ కౌన్సిలర్‌గా వృత్తిని కొనసాగిస్తున్నారు. పుట్టిన ప్ర‌దేశం కోరుట్ల‌, తెలంగాణ‌


ర‌చ‌నా శైలి[మార్చు]

వీరు సృజ‌నాత్మ‌క జీవ‌నం, ఆర్.పి. దిల్ సే అనే పుస్తకాలను ప్రచురించారు. ఆనంద జీవ‌న సందేశాన్ని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా పుస్త‌కాల్లో వివ‌రించ‌డం హ్యాపీ ఆర్ పి ప్ర‌త్యేక‌త‌. చిరున‌వ్వు మ‌హ‌త్తు నుంచి ఒత్తిడిని త‌ట్టుకునే మార్గాల వ‌ర‌కూ అనేక అంశాల‌పై మ‌న‌సుకు హ‌త్తుకునేలా ర‌చ‌న‌లుచేయ‌డం ఆయ‌న శైలి. అలాగేచిన్న చిన్న క‌విత‌ల రూపంలో భావాన్ని ప్ర‌భావవంతంగా చెప్ప‌డం అరుదైన విష‌యం. ఇత‌రుల‌తో పోల్చుకోకు, హృద‌యాన్ని కాల్చుకోకు, పొగ‌రు షుగ‌రు రానివ్వ‌కు బ్ర‌ద‌రూ అంటూ పాజిటివ్ దృక్ప‌థం గురించి వివ‌రించే తీరు అంద‌రినీ అక‌ట్టుకుంటుంది. అందం పెంచుకోవ‌డం అనే పేరుతో యువ‌త‌పై వ‌ల విసిరే వ్యాపారుల మాయాజాలం పైనా క‌వితాస్త్రాల‌ను సంధించారు. వ్యంగ్య బాణాల‌ను ప్ర‌యోగించారు. మేని ఛాయ... మేక‌ప్ మాయ వంటి పంచ్ క‌విత‌లు ఆయ‌న ప్ర‌తిభా పాట‌వానికి మ‌చ్చుతున‌క‌లు. దేనికీ ఆందోళ‌న చెంద‌కుండా, ముఖాన చిరున‌వ్వు చెర‌గ‌కుండా ఆత్మ విశ్వాసంతో జీవిస్తే ఆనందానికి ఆనందం. ఆరోగ్యానికి ఆరోగ్యం అనేది హ్యాపీ ఆర్ పి ర‌చ‌న‌ల సారాంశం. నీ ప‌నిని నువ్వు చెయ్యి. ఫ‌లితం గురించి ఆందోళ‌న చెంద‌కు అనే గీతా సార‌మే జీవ‌న వేదం అంటారు

అధికారిక వెబ్‍సైటు: www.happyrp.com Archived 2018-08-17 at the Wayback Machine