గోపాల్ ఇటాలియా
గోపాల్ ఇటాలియా | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2025 జూన్ 23 | |||
ముందు | భూపేంద్రభాయ్ భయానీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | విశ్వదర్ | ||
ఆమ్ ఆద్మీ పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 జనవరి 4 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బొటాడ్, గుజరాత్, భారతదేశం | 1989 జూలై 21 ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
నివాసం | అహ్మదాబాద్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | గుజరాత్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
గోపాల్ ఇటాలియా (జననం 21 జూలై 1989) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2025లో విశ్వదర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]గోపాల్ ఇటాలియా 1989 జూలై 21న భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని బోటాడ్‌లో జన్మించాడు. ఆయన భావ్‌నగర్ జిల్లాలోని ఉమ్రాలా తాలూకాలోని టింబి గ్రామంలో ప్రాథమిక విద్యను, ధోలా గ్రామంలో మాధ్యమిక విద్యను పూర్తి చేసి అహ్మదాబాద్‌లోని గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందాడు.
రాజకీయ జీవితం
[మార్చు]గోపాల్ ఇటాలియా జూన్ 2020లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి, గుజరాత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడై, 2020 డిసెంబర్ 12న రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. ఆయన 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో కతర్గాం శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వినోద్ భాయ్ అమర్షిభాయ్ మొరాదియా చేతిలో 17,554 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
గోపాల్ ఇటాలియా 2025లో విశ్వదర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కిరిత్ పటేల్‌పై 17554 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Patidars to hold Kayda Katha on law & rights in Surat from December 27". Indian Express. December 23, 2018. Archived from the original on July 4, 2020.
- ↑ "Visavadar election result: AAP's Gopal Italia crushes BJP's Kirti Patel on a seat where the saffron party hasn't won since 2007". The Economic Times. 23 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌కు చెరో సీటు, కేరళలో కాంగ్రెస్ గెలుపు". Andhrajyothy. 23 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "2022 Gujarat Legislative Assembly election Result - Katargam". Election Commission of India. 8 December 2022. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "Visavadar Bypoll Election Result 2025" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "Poll Boost AAP: Bypoll Victories in Punjab, Gujarat Offer Breather After Delhi Defeat" (in ఇంగ్లీష్). Deccan Herald. 23 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "Gujarat Assembly bypolls: AAP wins Visavadar, BJP retains Kadi seat" (in Indian English). The Hindu. 23 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.