గోపాల్ కుమార్ అగర్వాల్
| గోపాల్ కుమార్ అగర్వాల్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2025 నవంబర్ 14 | |||
| ముందు | సౌద్ ఆలం | ||
|---|---|---|---|
| పదవీ కాలం 2005 – 2010 | |||
| ముందు | మహ్మద్ జావేద్ | ||
| తరువాత | నౌషాద్ ఆలం | ||
| నియోజకవర్గం | ఠాకూర్‌గంజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| ఇతర రాజకీయ పార్టీలు | ఎల్‌జేపీ, స్వతంత్ర | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
గోపాల్ కుమార్ అగర్వాల్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు ఠాకూర్‌గంజ్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]గోపాల్ కుమార్ అగర్వాల్ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి డాక్టర్ మొహమ్మద్ పై 6109 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 38592 ఓట్లతో విజేతగా నిలవగా, డాక్టర్ మొహమ్మద్ 32483 రెండోస్థానంలో నిలిచాడు.
గోపాల్ కుమార్ అగర్వాల్ 2010 శాసనసభ ఎన్నికలలో జేడీ (యు) అభ్యర్థిగా, 2015 ఎన్నికలలో ఎల్‌జేపీ అభ్యర్థిగా, 2015 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2025 శాసనసభ ఎన్నికలలో జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి గులాం హస్నైన్ పై 8,822 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Thakurganj". Election Commission of India. 14 November 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.
- ↑ "Thakurganj Constituency Election Results 2015 -2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.