Jump to content

గోపిక పూర్ణిమ

వికీపీడియా నుండి
Gopika Poornima Mallikarjun
Background information
Born
Madhurapantula Gopika Purnima

2 January 1982
Age (42)
OriginHyderabad, Telangana
Chennai, Tamil Nadu
GenresPlayback singing
OccupationSinger
InstrumentVocals
Years active1997–present

గోపిక పూర్ణిమ ఒక తెలుగు సినీ నేపథ్య గాయని. 1996లో ఈటీవీలో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా పరిచయమై తరువాత సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంది.[1] ఎ. ఆర్. రెహమాన్, ఇళయరాజా లాంటి దిగ్గజ సంగీత దర్శకత్వంలో పాడింది. ఫిబ్రవరి 2008న, పాడుతా తీయగా కార్యక్రమంలో తన సహగాయకుడైన మల్లికార్జున్ ను ప్రేమ వివాహం చేసుకుంది.[2] వారికి ఓ పాప ఉంది.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె విజయనగరంలో జన్మించింది. హైదరాబాదులో పెరిగింది. తండ్రి ఈసీఐఎల్ లో పనిచేసే వాడు. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం.[1] పదో తరగతి చదివేటపుడు ఈటీవీలో పాడుతా తీయగా మొదటి ఎపిసోడ్ లో పాల్గొనింది. తరువాత సంగీతంలో శిక్షణ కోసం, సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై వెళ్ళింది. పాడుతా తీయగా లో పరిచయమైన మల్లికార్జున్ తరువాత చెన్నైలో తరచు కలుస్తుండటంతో పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్ళకు పెళ్ళి చేసుకున్నారు. పాడుతా తీయగా ద్వారా వీరిరువురికీ బాగా పరిచయం, అభిమానం ఉన్న ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అమెరికా పర్యటనలో ఉండటం వలన ఈ వివాహానికి హాజరు కాలేకపోయాడు. బాలు సోదరి, గాయని ఎస్. పి. శైలజ, గీత రచయిత భువనచంద్ర, నటుడు చంద్రమోహన్ తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు.[2] వీరు చెన్నైలోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ ఉండటం వల్ల వీరికి తెలుగులోనే కాక తమిళం, కన్నడ సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇవే కాకుండా కచేరీలు, ఆధ్యాత్మిక ఆల్బమ్స్ కూడా చేస్తున్నారు.

కెరీర్

[మార్చు]

గోపిక పూర్ణిమ, మల్లికార్జున్ ఇద్దరూ సింగన్న అనే సినిమాలో అన్న వెనకే నేను ఉంటా పాటతో పరిచయం అయ్యారు. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కూడా ఇదే స్టూడియో లో మొదటి పాట పాడటం విశేషం.[1]

ప్రాణం సినిమాలో నిండు నూరేళ్ళ సావాసం, బొమ్మరిల్లు సినిమాలో బొమ్మను గీస్తే నీలా ఉంది, జల్సా సినిమాలో గాల్లో తేలినట్టుందే లాంటి పాటలు మంచి ప్రజాదరణ పొందాయి.

పురస్కారాలు, సన్మానాలు

[మార్చు]

జనవరి 31, 2016 న ఆత్రేయ స్మారక కళాపీఠం వారు గోపిక పూర్ణిమ, మల్లికార్జున్ దంపతులకు వేటూరి స్మారక పురస్కారాన్ని అందజేశారు.[3]

పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 వేమూరి, రాధాకృష్ణ. "ఓపెన్‌ హార్ట్‌లో గాయకులు గోపికా పూర్ణిమ, మల్లికార్జున్‌". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 5 నవంబరు 2016. Retrieved 18 November 2016.
  2. 2.0 2.1 "Singers get married in the month of lovers". indiaglitz.com. indiaglitz.com. Archived from the original on 24 మే 2018. Retrieved 19 November 2016.
  3. "Veturi Memorial award to Mallikarjun, Gopika Poornima". thehansindia.com. The Hans India. Retrieved 19 November 2016.