గోపి గౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపి గౌడ్
గోపి చిత్రకారుడు
జననంలూసగాని గోపాల్ గౌడ్
1952
ఎనమెట్ల గ్రామం, కొల్లాపూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా , తెలంగాణ [1]
మరణం21 మే 2021
హైదరాబాద్
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
వృత్తిచిత్రకారుడు
ప్రసిద్ధిచిత్రకారుడు

గోపి గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు.ఆయన అసలు పేరు లూసగాని గోపాల్ గౌడ్.

జననం,విద్యాభాస్యం

[మార్చు]

లూసగాని గోపాల్ గౌడ్ మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ లో 1952లో జన్మించాడు.ఆయన 1975లో జేఎన్‌టీయూ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.[2]

వృత్తి జీవితం

[మార్చు]

గోపి గౌడ్ తెలుగు వార,మాస పత్రికల్లో అనేక కథలు, నవలలకు బొమ్మలు గీశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార, ప్రజాసంబంధాల విభాగంలో ఫ్రీలాన్స్‌ ఆర్టిస్టుగా 10 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆయన పలు తెలుగు దినపత్రికలకు లోగోలను రూపొందించాడు. గోపి గౌడ్ తెలుగు సినిమాల్లో సినీ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలకు తన కళాత్మకతను అద్దాడు. మా భూమి, రంగుల కల, దొంగల దోపిడి వంటి చిత్రాలకు పోస్టర్లు, టైటిల్స్‌ రూపకల్పన చేశాడు.[3]

మరణం

[మార్చు]

గోపి కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలతో పాటు మధుమేహంతో బాధపడుతున్న ఆయన కోవిడ్‌ బారిన పడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 మే 21న మరణించాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (22 May 2021). "ప్రముఖ చిత్రకారుడు గోపి మృతి". Namasthe Telangana. Archived from the original on 23 మే 2021. Retrieved 24 May 2021.
  2. Sakshi (22 May 2021). "కోవిడ్‌తో చిత్రకారుడు గోపి కన్నుమూత". Sakshi. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
  3. Eenadu (22 May 2021). "L.Gopi:బాపు మెచ్చిన కుంచె ఆగింది". m.eenadu.net. Archived from the original on 24 మే 2021. Retrieved 24 May 2021.
  4. Namasthe Telangana (22 May 2021). "తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది: సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
  5. TV9 Telugu (22 May 2021). "CM KCR condolences : తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని, గాయకుడ్ని కోల్పోయింది : ముఖ్యమంత్రి కేసీఆర్ - CM KCR offers condolences to Illustrator Palamuru Gopi and Singer J srinivas family". TV9 Telugu. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=గోపి_గౌడ్&oldid=3848962" నుండి వెలికితీశారు