Coordinates: 30°55′36″N 79°4′51″E / 30.92667°N 79.08083°E / 30.92667; 79.08083

గోముఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోముఖ్
'గౌముఖ్' లేదా 'గోముఖి'
ఆవు ముఖం లాగ ఉన్న హిమానీనదం
Locationఉత్తరకాశి జిల్లా, ఉత్తరాఖండ్, భారతదేశం
Coordinates30°55′36″N 79°4′51″E / 30.92667°N 79.08083°E / 30.92667; 79.08083
Statusతిరోగమనం
పటం

గోముఖ్ ని గౌముఖ్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. గౌముఖ్ 30 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పుతో భారతదేశంలో రెండవ అతిపెద్ద హిమానీనదం అయిన గంగోత్రి హిమానీనదం ముగింపు, ఇక్కడ నుండి భాగీరథి నది ప్రారంభమవుతుంది. ఇది గర్హ్వాల్ హిమాలయాలలో సుమారు 13,200 అడుగులు (4,023 మీటర్లు) ఎత్తులో ఉంది. "గోముఖ్" అనే పేరుకు హిందీలో "ఆవు నోరు" అని అర్థం, ఎందుకంటే హిమానీనదం నుండి నీరు బయటికి వచ్చే ప్రదేశం ఆవు నోటి ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ హిమానీనాదాన్ని హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు, గంగానది ఉద్భవించిన ప్రదేశంగా నమ్ముతారు. ఇది గంగోత్రి నుండి 20 కి.మీ దూరంలో ఉంది, ఇక్కడికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు.[1]

చరిత్ర[మార్చు]

తప్పిపోయిన గొర్రెను వెతుకుతూ, ఒక బాలుడు గంగోత్రిలోని హిమానీనదం దగ్గరకు చేరుకున్నాడని, నీరు బయటికి వచ్చే ప్రదేశం సరిగ్గా ఆవు ముఖంలా ఉందని, అందుకే దానికి 'గోముఖ్' అని పేరు వచ్చిందని చెబుతారు.[2] అప్పటి నుండి అనేక మంది పవిత్ర సాధువులు, ఋషులు, సాధువులు, సన్యాసులు, యాత్రికులు ఆ ప్రదేశానికి వెళ్తుంటారు. ఎవరైనా దుష్ట ఉద్దేశ్యంతో లేదా కలుషితమైన శరీరం లేదా మనస్సుతో గోముఖ్ ను సందర్శిస్తే, అతని పూర్వీకులు నరకంలో పడతారని, ఆ వ్యక్తి తీవ్ర భయాందోళనలకు గురవుతారని భక్తుల నమ్మకం.

గంగా తలాబ్[మార్చు]

1972లో అప్పటి మారిషస్ ప్రధాని సర్ సీవూసగుర్ రాంగూలం గోముఖ్ నుంచి పవిత్ర గంగాజలాన్ని తీసుకువెళ్ళి మారిషస్ లోని గ్రాండ్ బేసిన్ నీటిలో కలిపి మారిషస్ హిందువుల కోసం దాని పేరును గంగా తలాబ్ గా మార్చాడు.[3]

ట్రెక్[మార్చు]

మే నుండి అక్టోబర్ వరకు పర్వతాల అధిరోహికుల కోసం, యాత్రికుల కోసం గౌముఖ్ మార్గం తెరిచి ఉంటుంది. గంగోత్రి జాతీయ ఉద్యానవన ప్రాంతంలో శీతాకాలంలో భారీ మంచు కురిసే అవకాశం ఉన్నందున అది మూసివేయబడుతుంది. గోముఖ్ వెళ్లాలనుకుంటే ఉత్తరకాశీ అటవీ అధికారి నుండి అనుమతిని కలిగి ఉండాలి. ఇక్కడ రోజుకు 150 అనుమతులు మాత్రమే జారీ చేయబడతాయి, ఫ్యాక్స్ ద్వారా కూడా అనుమతి తీసుకోవచ్చు. 2013లో ఉత్తరాఖండ్ లో సంభవించిన మేఘ విస్ఫోటనం వల్ల హిమానీనదంపై పెద్ద పగుళ్లు ఏర్పడి వరదల వల్ల రహదారులు పాడవడం వలన ఈ ట్రెక్ చాల కష్టంతో కూడినది. 2016 జూలై 26 న, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల తరువాత, హిమానీనదం అధిక భాగం కొట్టుకుపోవడంతో గోముఖ్ ముందు భాగం బాగా దెబ్బతింది.[4] గోముఖ్ వెళ్ళేవాళ్ళు ఉత్తరకాశీ - గంగోత్రి - భోజ్వాస మీదుగా గోముఖ్ చేరుకుంటారు. హిమానీనదం తిరోగమనం వలన ఉత్తరాఖండ్ ప్రభుత్వం రోజుకు 100 మందికి మాత్రమే ట్రెక్కింగ్ కు అనుమతిస్తుంది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Gaumukh Trekking Guide - Gaumukh Glacier Trek Route Gaumukh Travel Tips". www.euttaranchal.com. Retrieved 2023-06-01.
  2. travelworldplanet (2019-01-16). "Gomukh Tourism - History, Significance, Gaumukh Glacier Trekking Route". Travel World Planet. Retrieved 2023-06-01.
  3. "Gomukh Latest News, Updates in Hindi | गोमुख के समाचार और अपडेट - AajTak". आज तक. Retrieved 2023-06-01.
  4. "ध्यान दें ट्रैकर, गोमुख में पड़ी गहरी दरार". Amar Ujala. Retrieved 2023-06-01.
"https://te.wikipedia.org/w/index.php?title=గోముఖ్&oldid=3944802" నుండి వెలికితీశారు