గోమేదికం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Garnet
GarnetCrystalUSGOV.jpg
సాధారణ సమాచారం
వర్గముnesosilicates
రసాయన ఫార్ములాThe general formula X3Y2(SiO4)3
ధృవీకరణ
రంగుvirtually all colors
స్ఫటిక ఆకృతిrhombic dodecahedra or cubic
స్ఫటిక వ్యవస్థCubic rhombic dodecahedron,icositetrahedron
చీలికIndistinct
ఫ్రాక్చర్conchoidal to uneven
మోహ్స్‌ స్కేల్‌ కఠినత్వం6.5 - 7.5
ద్యుతి గుణంvitreous to resinous
Polish lustervitreous to subadamantine [1]
వక్రీభవన గుణకం1.72 - 1.94
దృశా ధర్మములుSingle refractive, often anomalous double refractive [1]
బైర్‌ఫ్రింజెన్స్None
PleochroismNone
కాంతికిరణంWhite
విశిష్ట గురుత్వం3.1 - 4.3
ప్రధాన రకాలు
PyropeMg3Al2Si3O12
AlmandineFe3Al2Si3O12
SpessartineMn3Al2Si3O12
AndraditeCa3Fe2Si3O12
GrossularCa3Al2Si3O12
UvaroviteCa3Cr2Si3O12

గోమేదికం (గార్నెట్) విభాగం‌లో భాగమైన ఖనిజాలను కాంస్య యుగం నాటి నుంచి రత్నములు మరియు అబ్రాసివ్‌లు‌ (పదును పెట్టడానికి ఉపయోగపడే ఆకురాళ్లు)గాను ఉపయోగించడం జరుగుతోంది. "గార్నెట్" అనే పేరు మధ్యయుగకాలం నాటి ఆంగ్ల పదమైన గెర్నెట్ అంటే అర్థం 'ముదురు ఎరుపు' నుంచి గానీ లాటిన్ పదమైన గ్రానట్స్ ("గ్రైన్") నుంచి గానీ వచ్చివుండే అవకాశముంది, అలాగే రూపం, పరిమాణం, మరియు రంగులో అచ్చంగా కొన్ని రకాల గార్నెట్ స్ఫటికాలను పోలివుండే పునికా గ్రానటమ్ ("పొమేగ్రానటే") అనే మొక్క పేరు నుంచి కూడా ఈ పేరు వచ్చివుండే అవకాశముంది.

రసాయన సమ్మేళనాన్ని అనుసరించి మొత్తం ఆరు సాధారణ గోమేదికం జాతులను గుర్తించడం జరిగింది. పైరోప్, ఆల్మండిన్, స్పెస్సారిటిన్, గ్రోస్సులర్ (హెస్సోనైట్ లేదా సిన్నామోన్-స్టోన్ మరియు సావొర్టీ అనేవి ఇందులో రకాలు), వరోవిటి మరియు ఆండ్రాడిటి అనే పేర్లతో వాటిని పిలుస్తారు. గోమేదికాలు: 1. పైరోప్-అల్మండిన్-స్పెస్సరైట్ మరియు 2. వరోవైట్-గ్రోస్సులర్-ఆండ్రడైట్ అనే ఘన ద్రావణ రూపాంతరాల్లో లభిస్తుంటాయి.

భౌతిక లక్షణాలు[మార్చు]

లక్షణాలు[మార్చు]

గోమేదికం జాతులు ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలం, వంగపండు, గోధుమ, నలుపు, లేత ఎరుపుతో ఎలాంటి రంగూ లేకుండా కూడా లభిస్తుంటాయి. ఇందులో బాగా అరుదైనది నీలి రంగు గోమేదికం, 1990ల చివర్లో మడగాస్కర్‌లోని బెక్లీలో ఇది కనుగొనబడింది. యునైటెడ్ స్టేట్స్, రష్యా మరియు టర్కీలలోని కొన్ని ప్రాంతాల్లోనూ దీన్ని గుర్తించారు. పగటి వెలుగులో నీలి-పచ్చగా కన్పించే గోమేదికం, ప్రకాశవంతమైన కాంతిలో వంగపండు రంగుకు మారుతుంది, ఎక్కువ మొత్తంలో వెనాడియం (1 wt.% V2O3) కలిగి ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఇతర రకాల రంగు-మార్పు గోమేదికాలు కూడా ఉనికిలో ఉన్నాయి. పగటి వెలుగులో వాటి రంగుల శ్రేణి పచ్చ, లేత గోధుమ రంగు, ముదురు గోధుమ, బూడిద రంగు, మరియు నీలంగా ఉన్నప్పటికీ, ప్రకాశవంతమైన కాంతిలో అవి చిక్కటి ఎరుపు లేదా వంగపండు/ఉదా రంగును సంతరించుకుంటాయి. వాటి రంగు మార్పు నాణ్యత కారణంగా ఈ రకమైన గోమేదికాలు తరచూ అలెగ్జాండ్రిట్‌గా పొరపడేలా చేస్తుంటాయి.

హెలెనా మొంటానా సమీపంలోని స్పోకన్ సఫ్పైర్ గని వద్ద కనుగొనబడిన ఒక గోమేదికం

గోమేదికం జాతుల కాంతి ప్రసార లక్షణాలను అనుసరించి అవి రత్నాలు స్థాయి పారదర్శక నమూనాలు మొదలుకుని పారిశ్రామిక ఉపయోగాల కోసం ఉపయోగించే అబ్రాసివ్‌లు వంటి అపారదర్శక రకాల వరకు ఉంటాయి. ఈ ఖనిజాల మెరుపును విట్రియస్ (అద్దం-లాంటి) లేదా రెసినస్ (జేగురు రంగు స్ఫటికం-లాంటి) రకాలుగా విభజించవచ్చు.

స్ఫటిక నిర్మాణం[మార్చు]

గోమేదికం యొక్క పరమాణు నమూనా.

గోమేదికాలనేవి నెసోసిలికేట్లు, వీటి సాధారణ రసాయన సంకేత నామం X 3Y 2 (SiO4)3గా ఉంటుంది. ఇందులో X అనేది సాధారణంగా ద్విబంధక కాటయాన్లు (Ca2+, Mg2+, Fe2+)తో ఉంటుంది, అలాగే Y అనేది త్రిబంధక కాటయాన్లు (Al3+, Fe3+, Cr3+)తో అష్టఫలక/చతుర్ముఖ నిర్మాణాన్ని కలిగి ఉండగా, [SiO4]4− అనేది టెట్రాహెడ్రాతో నిండి ఉంటుంది.[2] గార్నెట్లు అనేవి తరచుగా డోడెకాహెడ్రల్ స్ఫటిక రూపంలో ఉన్నప్పటికీ, సాధారణంగా ట్రాపెజోహెడ్రేన్ రూపంలో కూడా ఉంటుంటాయి. (గమనిక: ఆకారం గురించి చెప్పేందుకు ఇక్కడ మరియు ఇతర అనేక ఖనిజాల విషయంలో ఉపయోగించే "ట్రాపెజోహెడ్రోన్" అనే పదాన్ని క్షేత్రగణితంలో డెల్టాడియల్ ఐకోసిటెట్రాహెడ్రోన్‌గా పిలుస్తుంటారు.) ఘనం వ్యవస్థలో స్ఫటికీకరణ చెంది ఉండే ఈ ఖనిజం, ముడూ భుజాలను కలిగి ఉండడంతో పాటు అవి సమానమైన పొడవుతో ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. గోమేదికంలో పగులు (చీలిక) అనేది ఏర్పడదు, కాబట్టి ఒత్తిడి కారణంగా అది పగిలినప్పుడు పదునైన అపక్రమాకార ముక్కలుగా విడిపోతుంది.

కఠినత్వం[మార్చు]

గోమేదికం రూపాల్లోని రసాయన సమ్మేళనం కారణంగా, కొన్ని జాతుల్లోని అణు బంధాలు మిగిలిన వాటిల్లో కంటే దృఢంగా ఉంటాయి. ఫలితంగా, ఈ ఖనిజానికి సంబంధించిన కఠినత్వం అనేది మోహ్స్ స్కేల్‌పై 6.5 నుంచి 7.5 వరకు కనిపిస్తుంది. ఆల్మండిన్ లాంటి కఠినత్వం కలిగిన గోమేదికం జాతులను తరచూ ఆకురాయి తరహా ఉపయోగాల కోసం వినియోగిస్తుంటారు.

గార్నెట్ వర్గానికి చెందిన ఎండ్‌మెంబర్ జాతులు[మార్చు]

పైరల్‌స్పైట్ గోమేదికాలు - Y ప్రదేశంలోని అల్యూమినియం[మార్చు]

 • ఆల్మండిన్: Fe3Al2 (SiO4)3
 • పైరోప్: Mg3Al2 (SiO4)3
 • స్పెస్సార్టిన్: Mn3Al2 (SiO4)3

ఆల్మండిన్[మార్చు]

మెటామార్ఫిక్ శిలలోని ఆల్మండైన్

ఆల్మండిన్‌ను కొన్నిసార్లు ఆల్మండిట్ అని తప్పుగా సంభోదిస్తుంటారు, అదేసమయంలో కర్బంకల్ అనే పేరుతో ఈ ఆధునిక రత్నం (నిజానికి దాదాపు ఎలాంటి ఎర్ర రత్నమైనా ఇదే పేరుతో చలామణి అవుతుంటుంది) సుపరిచితం. "కర్బంకల్" అనే పదం లాటిన్ అర్థమైన "సజీవ బొగ్గు" లేదా జ్వలిస్తున్న బొగ్గు అనే పదం నుంచి జనించింది. ఆల్మండిన్ అనే పేరు ఆసియా మైనర్‌లోని ఒక ప్రాంతమైన అలబంద నుంచి వచ్చింది, ఈ ప్రాంతంలో పురాతన కాలం నుంచి ఈ రాళ్లను సానబెడుతున్నారు. రసాయనికంగా, అల్మండిన్ అనేది Fe3Al2 (SiO4)3 అనే సంకేతం కలిగిన ఒక ఇనుము-అల్యూమినియం గార్నెట్; గాఢ ఎరుపు రంగులో ఉండే ఈ పారదర్శక రాళ్లను సాధారణంగా విలువైన గోమేదికాలుగా పిలవడంతో పాటు రత్నాలు (రత్నాల రూపంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే గార్నెట్లు)గా ఉపయోగిస్తుంటారు. ఆల్మండిన్ అనేది మికా సిస్ట్‌లు లాంటి రూపవిక్రియ శిలల్లో లభిస్తుంది, స్టౌరోలైట్, కైనైట్, అండలుసైట్, మరియు ఇతర రకాల ఖనిజాలతో పాటు ఇది కలిసి ఉంటుంది. ఆల్మండిన్‌కు ఓరియంటల్ గోమేదికం, ఆల్మండిన్ రుబీ, మరియు కర్బంకల్ లాంటి ముద్దుపేర్లు కూడా ఉన్నాయి.

పైరోప్[మార్చు]

పైరోప్ (గ్రీకు పదం పైరోపోస్ నుంచి వచ్చింది, దీని అర్థం "అగ్ని-కళ్లు") అనేది రంగులో ఎర్రగానూ రసాయనికంగా Mg3Al2 (SiO4)3 అనే సంకేతంతో మెగ్నీషియం అల్యూమినియం సిలికేట్‌గానూ ఉంటుంది, అయితే ఇందులో కాల్షియం మరియు ఫెర్రస్ ఐరన్ ద్వారా మెగ్నీషియంలోని కొంతభాగం మార్పిడి చెందగలదు. పైరోప్ రంగు అనేది ముదురు ఎరుపు మొదలు దాదాపు నలుపు రంగు వరకు వివిధ రకాలుగా ఉంటుంది. పారదర్శక పైరోప్‌లను రత్నాలుగా ఉపయోగిస్తారు.

మేకన్ కంట్రీ, ఉత్తర కరోలినా ప్రాంతం నుంచి లభించే విభిన్నమైన పైరోప్ చూసేందుకు ఊదా-ఎరుపు ఛాయలో ఉండడంతోపాటు హొడోలైట్ అనే పేరుతో పిలవబడుతుంది, గ్రీకులో ఈ పదానికి "రోజా" అని అర్థం. రెండు వంతుల పైరోప్, ఒక వంతు ఆల్మండిన్‌లను సమపాళ్లలో కలిగి ఉండడం వల్ల రసాయన సమ్మేళనం పరంగా దీన్ని తప్పనిసరిగా పైరోప్ మరియు ఆల్మండిన్‌ల కలయికతో కూడిన ఒక ఐసోమార్పస్‌గా భావించవచ్చు. పైరోప్‌కు వాణిజ్యపరమైన పేర్లు ఉన్నప్పటికి అందులో కొన్ని అపప్రయోగంతో నిండినవి; కేప్ రూబీ, ఆరిజోనా రూబీ, కాలిఫోర్నియా రూబీ, రాకీ మౌంటైన్ రూబీ, మరియు చెక్ రిపబ్లిక్ నుంచి వచ్చిన బొహెమైన్ గార్నెట్ లాంటివి ఈ కోవలోకే వస్తాయి. మడగాస్కర్ నుంచి వచ్చిన నీలి రంగు-మార్పు గోమేదికాలనేవి మరో చమత్కారవంతమైన గుర్తింపుగా చెప్పవచ్చు, ఇవి పైరోప్ స్పెస్సార్‌టైన్ సమ్మేళనంగా ఉంటాయి. ఈ నీలిరంగు గోమేదికాల రంగు అనేది, మృదువైన పగటికాంతిలో నీలి రత్నం లాంటి నీలం రంగులో ఉండకుండా బూడిదరంగు నీలం రంగులోను మరియు పచ్చరంగు ఛాయ కలిగిన నీలం రంగుల్లో ఉండడంతో పాటు కొన్నిసార్లు స్పైనెల్ లోనూ కనిపిస్తుంది. అయినప్పటికీ, తెల్లటి LED లైట్ కాంతిలో దీని రంగు మంచి కార్న్‌ప్లవర్ లాంటి నీలం రంగు నీలిరత్నం, లేదా D బ్లాక్ టాంజనైట్‌లాగా ఉంటుంది; ఉద్గారమైన కాంతిలోంచి పసుపు భాగాన్ని స్వీకరించే సామర్థ్యం నీలిరంగు గార్నెట్లకు ఉండడమే ఇందుకు కారణం.

అత్యధిక-ఒత్తిడి రాళ్లకు పైరోప్ ఒక సూచీ ఖనిజం లాంటిది. గోమేదికాలు మాంటిల్ నుంచి బయటపడిన రాళ్లలో,పెరిడోటిట్‌లు మరియు ఎకోలోజైట్‌లలో ఉండడంతో పాటు సాధారణంగా ఇవి పైరోప్ రకాలను కలిగి ఉంటాయి.

స్పెస్సార్‌టిన్[మార్చు]

స్పెస్సార్టైన్ (ఎరుపు ఖనిజం)

స్పెస్సార్‌టిన్ లేదా స్పెస్సార్‌టైట్ అనేది మాంగనీస్ అల్యూమినియం గోమేదికం, Mn3Al2 (SiO4)3 అనే సంకేతంతో దీన్ని సూచిస్తుంటారు. బవారియాలోని స్పెస్సార్ట్ నుంచి దీని పేరు జనించింది. ఇది చాలా తరచుగా గ్రానైట్ పెగ్మాటైట్ మరియు దాని సహచర రాళ్ల రకాలు మరియు కొన్ని ప్రత్యేక తక్కువ స్థాయిలో రూపాంతరత చెందినఫైలైట్‌లలో కనిపిస్తుంది. నారింజ-పసుపు స్పెస్సార్‌టిన్‌ను మడగాస్కర్‌లో కనుగొనడం జరిగింది. ఊదా-ఎరుపు స్పెస్సార్‌టిన్‌ను కొలరాడోలోని హయోలైట్‌లు మరియు మైన్‌లో కనుగొనడం జరిగింది.

యుగ్రాన్‌డైట్ వర్గం - X ప్రదేశంలోని కాల్షియం[మార్చు]

 • ఆండ్రడైట్: Ca3Fe2 (SiO4)3
 • గ్రోస్సులర్: Ca3Al2 (SiO4)3
 • యువరోవైట్: Ca3Cr2 (SiO4)3

ఆండ్రడైడ్[మార్చు]

ఆండ్రడైట్ అనేది కాల్షియం-ఇనుము గోమేదికం, Ca3Fe2 (SiO4)3 అనే సంకేత నామం కలిగిన ఈ ఖనిజం వివిధ సమ్మేళనాలతో పాటు ఎరుపు, పసుపు, గోధుమ, పచ్చ లేదా నలుపు రంగుల్లో ఉండవచ్చు. టోపజోలైట్ (పసుపు లేదా పచ్చ), డెమంటాయిడ్ (పచ్చ) మరియు మెలానిట్ (నలుపు) లాంటివి ఇందులో గుర్తింపుకలిగిన రకాలుగా ఉన్నాయి. ఆండ్రడైట్ అనేది సైనైట్ లాంటి అగ్నిపర్వత శిలలుతో పాటుగా సెర్పెంటైన్‌లు, షిస్ట్‌లు, మరియు స్పటికం లాంటి సున్నపురాయి లాంటి వాటిల్లో కనిపిస్తుంది. లభ్యతను బట్టి డెమాంటాయిడ్ అనేది "ఎమరాల్డ్ ఆఫ్ ది యురల్స్"గా పిలవబడడంతో పాటు, గార్నెట్ రకాల్లో అత్యధిక ధర కలిగిన వాటిల్లో ఒకటిగా ఉంటోంది. టోపజోలైట్ అనేది బంగారు రంగు పసుపు రకం కాగా, మెలనైట్ అనేది నలుపు రకంగా ఉంటుంది.

గ్రోస్సులర్[మార్చు]

US నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ల్ హిస్టరీలో ప్రదర్శనకు ఉంచిన గ్రోస్సులర్ కుడివైపున ఉన్న పచ్చని వజ్రం అనేది సవోరైట్‌గా సుపరిచితమైన ఒక రకమైన గ్రోస్సులర్.

గ్రోస్సులర్ అనేది ఒక కాల్షియం-అల్యూమినియం గోమేదికం, Ca3Al2 (SiO4)3 అనే సంకేతంతో ఇది వ్యవహరించబడుతుంది, అయితే, ఇందులో కాల్షియంలో కొంతభాగం ఫెరస్స్ ఇనుము ద్వారా మరియు అల్యూమినియంలో కొంతభాగం ఫెర్రిక్ ఇనుము ద్వారా రూపాంతరం చెందుతుంది. గ్రాస్సులర్ అనే పేరు వృక్షశాస్త్ర నామమైన గూస్‌బెర్రీ, గ్రోస్సులారియా నుంచి వచ్చింది, ఈ సమ్మేళనాలలోని పచ్చ గోమేదికం రూపాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ పేరు వాడుకలోకి వచ్చింది, ఈ రకమైన గార్నెట్ అనేది సైబీరియాలో కనుగొనబడింది. దాల్చినచెక్క వర్ణం (సిన్నామోన్ రకం), ఎరుపు, మరియు పసుపు లాంటి ఇతర ఛాయలు కూడా ఇందులో ఉన్నాయి. జిర్కోన్‌కు ఉన్న తక్కువ దృఢత్వం కారణంగా, పసుపు రంగు స్ఫటిక రూపాలను హెస్సోనైట్ అనే పేరుతో పిలుస్తారు, గ్రీకు అర్థమైన తక్కువ దృఢత్వం నుంచి ఈ పేరు వచ్చింది. గ్రోస్సులర్ అనేది వెసువినైట్, డయాప్సైడ్, వోల్లస్టోనైట్ మరియు వెర్నరైట్‌లతో జతకూడిన రూపాంతరత చెందిన సున్నపురాయిలో కనుగొనబడింది.

కెన్యా మరియు టాంజానియాల నుంచి వచ్చే గ్లోస్సులర్ గోమేదికా‌లను సావోరైట్ అంటారు. కెన్యాలోని సావో ప్రాంతంలో 1960లో తొలిసారిగా సావోరైట్‌ను కనుగొనడం వల్ల ఈ రత్నానికి ఆ ప్రాంతం పేరు స్థిరపడిపోయింది.[ఉల్లేఖన అవసరం]

యువారోవైట్[మార్చు]

యువారోవైట్ అనేది కాల్షియం క్రోమియం గార్నెట్, Ca3Cr2 (SiO4)3 అనే సంకేతంతో ఇది వ్యవహరించబడుతుంది. ఇది కొంచెం అరుదైన గోమేదికం, ప్రకాశవంతమైన పచ్చటి రంగులో ఉంటుంది, ఇది సాధారణంగా చిన్నపాటి స్ఫటికాల రూపంలో క్రోమైట్‌తో కలిసి పెరిడోటైట్, సెర్పెన్టినైట్, మరియు కింబెర్‌లైట్స్‌లలో లభిస్తుంది. ఇది రష్యాలోని యురల్ పర్వతాల్లో మరియు ఫిన్‌ల్యాండ్‌లోని ఓటోకుంపులలో లభించే స్ఫటికాకర చలువరాళ్లు మరియు షిస్ట్‌లలో కనుగొనబడింది.

అసాధారణ జాతులు[మార్చు]

 • X ప్రదేశంలో కాల్షియం
  • గోల్డ్‌మానైట్: Ca3V2 (SiO4)3
  • కింజైట్‌: Ca3 (Zr,Ti)2[ (Si,Al,Fe3+)O4]3
  • మోరిమోటాయిట్‌: Ca3Ti4+Fe2+ (SiO4)3
  • స్కూర్లోమైట్: Ca3 (Ti4+,Fe3+)2[ (Si,Ti)O4]3
 • హైడ్రాక్సైడ్ సంబంధిత - X ప్రదేశంలోని కాల్షియం
  • హైడ్రోగ్రోస్సులర్: Ca3Al2 (SiO4)3-x (OH)4x
   • హిబ్‌షైట్: Ca3Al2 (SiO4)3-x (OH)4x (ఇక్కడ x అనేది 0.2 నుండి 1.5 మధ్య ఉంటుంది)
   • కటాయిట్: Ca3Al2 (SiO4)3-x (OH)4x (ఇక్కడ x అనేది 1.5 కంటే ఎక్కువ)
 • X ప్రదేశంలో మెగ్నీషియం లేదా మాంగనీస్
  • నోరింజైట్: Mg3Cr2 (SiO4)3
  • మజోరైట్: Mg3 (Fe,Al,Si)2 (SiO4)3
  • కల్డెరైట్: Mn3Fe3+2 (SiO4)3

నొరింజైట్[మార్చు]

నొరింజైట్ అనేది ఒక మెగ్నీషియం క్రోమియం గోమేదికం జాతికి చెందినది, Mg3Cr2 (SiO4)3 అనే సంకేత నామంతో వాడుకలో ఉంది. స్వచ్ఛమైన ఎండ్‌మెంబర్ నొరింజైట్ ప్రకృతిలో లభించదు. నొరింజైట్ అనేది కేవలం అధిక ఒత్తిడి వల్ల మాత్రమే ఏర్పడుతుంది, అలాగే తరచుగా ఇది కింబర్‌లైట్‌లలో లభిస్తుంటుంది. వజ్రాల అన్వేషనలో దీన్ని ఒక సూచీ ఖనిజంగా ఉపయోగిస్తుంటారు.

కృత్రిమ గోమేదికాలు[మార్చు]

గోమేదికాల యొక్క క్రిస్టలోగ్రాఫిక్ నిర్మాణం ప్రాథమిక రూపం నుంచి A 3B 2 (C O4)3 లాంటి సంకేతం కలిగిన రసాయనాలతో కలిసి విస్తరించడం ద్వారా కృత్రిమ గోమేదికాలు రూపొందుతాయి. సిలికాన్‌ను మినహాయిస్తే, పెద్ద సంఖ్యలో ఉండే అంశాలు మూస:Germanium, మూస:Gallium, మూస:Aluminum, మూస:Vanadium మరియు మూస:Ironతో సహా C ప్రదేశంలో చోటు చేసుకుంటాయి.[3]

యుట్రిమ్ అల్యూమినియం గార్నెట్ (YAG), Y3Al2 (AlO4)3 అనేది కృత్రిమ రత్నాల కోసం ఉపయోగించబడుతుంది. పూర్తిస్థాయి వక్రీభవన గుణకం కారణంగా, YAGను 1970లలో వజ్రంలాగా ఉపయోగించేవారు, క్యూబిక్ జిర్కోనియాను వాణిజ్య స్థాయి మొత్తాల్లో ఉత్పత్తిచేసే పద్ధతులను కనుగొనేంతవరకు ఇలా జరిగింది. వీటిని నియోడైమియమ్‌ (Nd3+)తో జోడించడం ద్వారా ఈ YAl-గోమేదికాలనేవి లేజర్లలో లేజింగ్ మీడియంగా ఉపయోగపడుతాయి.

అవసరమైన అంశాలను ఉపయోగించిన సమయంలో ఆసక్తికరమైన మేగ్నటిక్ లక్షణాలు వెలువడుతాయి. యుట్రియమ్ ఐరన్ గార్నెట్ (YIG) మూస:Yttrium3మూస:Iron2 (Feమూస:Oxygen4)3లో, యుట్రియమ్ (III) ఆయాన్లు ఎనిమిది ఆక్సిజన్ ఆయాన్ల ద్వారా ఒక అపక్రమాకార ఘనంలో సమన్వయం చెందడంతో పాటు, ఐదు ఇనుము (III) ఆయాన్లు రెండు అష్టఫలక మరియు మూడు చతుర్ముఖ ప్రదేశాలను ఆక్రమించుకుంటాయి. అదేసమయంలో వాటి అయస్కాంత ప్రవర్తన ఫలితంగా రెండు సమన్వయ ప్రాంతాల్లోని ఇనుము ఆయాన్లు విభిన్నమైన ఆత్మభ్రమణాలును ప్రదర్శిస్తాయి. YIG అనేది ఒక ఫెర్రీమేగ్నటిక్ పదార్థం, ఇది 550 K క్యూరీ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.

ఇందుకు మరో ఉదాహరణ డోలీనియమ్ గల్లియమ్ గార్నెట్, మూస:Gadolinium3మూస:Gallium2 (GaO4)3 అనే రసాయన సంకేతం కలిగిన దీన్ని బబుల్ మెమోరీ మరియు మేగ్నటో-ఆప్టికల్ ఉపయోగాల కోసం మేగ్నటిక్ గార్నెట్ ఫిల్ముల యొక్క ద్రవ్య స్థితిని పెంచడం కోసం ఒక పొరలాగా ఉపయోగిస్తారు

గోమేదికం యొక్క భౌగౌళిక ప్రాముఖ్యత[మార్చు]

గార్నెట్ వర్. స్పెస్సార్టైన్, పుటియన్ సిటీ, పుటియన్ ప్రీఫెక్చర్, ఫుజియాన్ ప్రావిన్స్, చైనా

జియోథెర్మోబారోమెట్రీ ద్వారా అనేక అగ్నిపర్వత సంబంధ మరియు రూపవిక్రియ శిలల యొక్క పుట్టుకకు గోమేదికం వర్గానికి చెందిన మూలకాలు అత్యంత కీలకమైనవి. ఇతర మూలకాలతో పోల్చితే గోమేదికంలో మూలకాల విసరణ బాగా తక్కువ, అలాగే మార్పుకు సైతం నిరోధకాలుగా ఉంటాయి. స్వతంత్ర గోమేదికాలు సాధారణంగా సమ్మేళనాలుగానే నిక్షిప్తమై ఉంటాయి, తద్వారా శిలల ఉష్ణోగ్రత-కాలం చరిత్రలను తెలుసుకోవడానికి గోమేదికాలు చక్కగా ఉపయోగపడుతాయి. గోమేదికం అణువులు క్షేత్రాలుగా అమరి ఉండకపోవడం వల్ల సాధారణంగా అవి విసరణ ద్వారా సజాతీయంగా మారుతాయి, అలాగే ఈ సజాతీయత వల్ల గోమేదికానికి అతిధిగా ఉన్న శిల యొక్క ఉష్ణోగ్రత-కాల చరిత్రను కూడా తెలుసుకోవచ్చు.

శిలల మెటామార్ఫిక్ ఫేసియస్‌ను మరింత ఎక్కువ చేసేందుకు కూడా గోమేదికాలు ఉపయోగపడుతాయి. ఉదాహరణకు, ఎక్లోజైట్ అనేది బసాల్ట్ సమ్మేళనం శిలగా పేర్కొనబడినప్పటికీ, ప్రధానంగా అది గోమేదికం మరియు ఓమ్ఫాసైట్‌లను కలిగి ఉంటుంది. పైరోఫ్‌తో నిండిన గోమేదికం అనేది అధిక-ఒత్తిడి రూపవిక్రియ శిలలుగా ఉండకుండా నిరోధించబడుతుంది, కింది క్రస్ట్‌లోను మరియు భూగర్భంలోనూ ఉంటాయి. పెరిడోటైట్ అనేది ప్లాజియోక్లేస్‌, లేదా అల్యూమినియం-సహిత స్పైనల్, లేదా పైరోప్-సహిత గార్నెట్‌లను కలిగి ఉండవచ్చు, అలాగే ఉనికిలో ఉండే ప్రతి మూడు ఖనిజాలు అవి కలిసి ఉండే ఒలివిన్ మరియు పైరాక్సిన్‌లోని ఒత్తిడి-ఉష్ణోగ్రత తీవ్రతను నిర్వచించగలవు: పెరిడోటైడ్ ఖనిజం కూర్పు యొక్క స్థిరత్వం కోసం ఒత్తిడిని పెంచే క్రమంలో ఈ మూడు ఖనిజాలు ఏర్పడుతాయి. ఈ కారణంగానే గార్నెట్ పెరిడోటైట్ అనేది భూమిలోని అత్యంత లోతుల్లో ఏర్పడుతాయి. గార్నెట్ పెరిడోటైట్ యొక్క జెనోలిత్‌లు 100 km లోతుల నుండి వెలికితీయబడుతాయి, ఇవి కింబర్‌లైట్ కంటే కూడా గొప్పవి, అలాగే ఈ రకమైన అసంఘటిత జెనోలిత్‌లనేవి వజ్రాల అన్వేషణలో కింబర్‌లైట్ సూచీ ఖనిజాలుగా ఉపయోగించబడుతాయి. గోమేదికం‌లోని అష్టభుజి (Y) ప్రదేశంలోని 2Al కోసం (Mg,Fe) మరియు Siల ప్రత్యామ్నాయం ద్వారా 300 నుంచి 400 km వరకు మరియు అంతుకు మించిన లోతుల్లో పైరోజెన్ అనేది గోమేదికంలో కరిగిపోతుంది, తద్వారా అసాధారణమైన సిలికా-సంయుక్త గార్నెట్‌ ఏర్పడడంతో పాటు ఆ ఘన ద్రావణం మెజోరైట్ ఏర్పడేందుకు కారణమవుతుంది. ఆ విధమైన సిలికా-సంయుక్త గోమేదికాలనేవి వజ్రాల్లో భాగంగా సంయుక్తమై గుర్తించబడుతాయి.

అతిపెద్దదిగా గుర్తించబడిన గోమేదికం ఏక స్ఫటికమనేది ఒక ఐసోమెట్రిక్ బ్లాక్, ఇది ~2.3 m పరిమాణంతో పాటు ~37.5 టన్నుల బరువుతో ఉంటుంది.[4] అలాగే ఆస్ట్రేలియాలోని ఉత్తర భూభాగంలోని అలిసే స్ప్రింగ్స్‌ సమీపంలో అతిపెద్ద గోమేదికం స్ఫటికాలు కనుగొనబడినట్టు వార్తలు ఉన్నప్పటికీ అవి నిర్థారించబడలేదు.

గోమేదికాల ఉపయోగాలు[మార్చు]

8వ (?)శతాబ్దపు ఆంగ్లో-సాక్షన్ ఖడ్గం పిడి అమరిక, ఇది లోపలి భాగంలో గార్నెట్ క్లొయిసనే లోపలి భాగంతో బంగారం వజ్రంతో తయారైంది.స్టాఫోర్డ్‌షైర్ నుంచి 2009లో కనుగొనబడిన ఇది పూర్తిగా శుభ్రంగా లేదు.
యువారోవైలో పెండెంట్, ఒక అరుదైన ప్రకాశవంత-పచ్చని గోమేదికం.

పురాతన కాలం చివర్లో రోమన్ ప్రపంచంలో ఎర్ర గోమేదికాలను రత్నాల రూపంలో అత్యంత సాధారణంగా ఉపయోగించేవారు, అలాగే పశ్చిమ సామ్రాజ్య భూభాగాన్ని ఆక్రమించిన "బార్బరైన్‌" ప్రజల మైగ్రేషన్ పీరియడ్ ఆర్ట్‌లోను వీటిని విరివిగా ఉపయోగించేవారు. క్లోయిసొనే సాంకేతికతతో వారు వీటిని ప్రత్యేకించి బంగారుతో చేసిన చిప్పల్లాంటి ఆకారాల్లో బిగించడం ద్వారా ఉపయోగించేవారు, ఈ రకమైన శైలిని గార్నెట్ క్లోయిసొనే అని పిలిచేవారు, సుట్టోన్ హూ పేరుతో ఆంగ్లో-శాక్సన్ ఇంగ్లాండ్ మొదలుకుని నల్ల సముద్రం వరకు ఈ విషయాన్ని కనుగొనడం జరిగింది.

స్వచ్ఛమైన గోమేదికం స్ఫటికాలను నేటికీ రత్నాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ రకమైన రత్నాలు పచ్చ, ఎరుపు, పసుపు, నారింజ ఛాయల్లో ఉంటాయి.[5] USAలో దీనికి జనవరికి బర్త్‌స్టోన్‌‌గా గుర్తింపు ఉంది.[1] కనెక్టికట్‌కు ఇది ప్రభుత్వ ఖనిజం,[6] అలాగే న్యూయార్క్‌ యొక్క రత్నం,[7] అలాగే నక్షత్ర గోమేదికం (రూటిల్ సమూహాన్ని కలిగిన గోమేదికం) అనేది ఇదాహో యొక్క ప్రభుత్వ రత్నంగా ఉంటోంది[ఉల్లేఖన అవసరం].

పారిశ్రామిక ఉపయోగాలు[మార్చు]

గోమేదికం రేణువులకు చక్కని ఆకురాయి లక్షణాలు కలవు, అలాగే శాండ్ బ్లాస్టింగ్‌లో సాధారణంగా సిలికాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు. అల్లూవియల్ గోమేదికం రేణువులనేవి గుండ్రంగా ఉండడంతో పాటు ఈ రకమైన బ్లాస్టింగ్ చర్యలకు అనువుగా ఉంటాయి. వాటర్ జెట్స్‌లో అత్యంత ఎక్కువ ఒత్తిడితో కూడిన నీటితో కలపడం ద్వారా గోమేదికాలనేవి స్టీలు మరియు ఇతర లోహాలను కోయడానికి ఉపయోగపడుతాయి. వాటర్ జెట్ కోత కోసం, కఠిన శిల నుంచి సేకరించిన గోమేదికం చక్కగా సరిపోతుంది, రూపంలో ఇది ఎక్కువ కోణీయంగా ఉండడం వల్ల కోతకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది.

కేబినెట్‌మేకర్స్‌తో రూపొందించిన గోమేదికం కాగితాన్ని ముతక చెక్కలను నునుపు చేసేందుకు ఉపయోగిస్తారు.[8]

గోమేదికం ఇసుక‌ను నీటి వడపోత మాధ్యమంలో కూడా ఉపయోగిస్తారు.

అబ్రాసివ్ గార్నెట్ అనేది బ్లాస్టింగ్ గ్రేడ్ మరియు వాటర్ జెట్ గ్రేడ్‌గా విడిపోగలదు. గోమేదికం‌ను తవ్వితీసిన తర్వాత వాటిని సేకరించి పొడిచేయడం ద్వారా చక్కని అణువులను సేకరిస్తారు; ఇలా సేకరించిన ముక్కలన్నీ 60 మెష్ (250 మైక్రోమీటర్ల) కంటే పెద్దవిగా ఉండడంతో పాటు శాండ్ బ్లాస్టింగ్ కోసం ఉపయోగిస్తారు. 60 మెష్ (250 మైక్రోమీటర్లు) మరియు 200 మెష్ (74 మైక్రోమీటర్లు) మధ్య ఉన్న ముక్కలను సాధారణంగా వాటర్ జెట్ కటింగ్ కోసం ఉపయోగిస్తారు. 200 మెష్ (74 మైక్రోమీటర్లు) కంటే చిన్నవైన గార్నెట్ పొడిని గ్లాస్ పాలిషింగ్ మరియు ల్యాప్పింగ్ కోసం ఉపయోగిస్తారు. ఇటువంటి ఉపయోగాలతో సంబంధం లేకుండా, పెద్ద పరిమాణంలోని గోమేదికం ముక్కలను వేగవంతమైన పనికోసం, అలాగే చిన్నపాటి ముక్కలను అంతిమ నునుపు కోసం ఉపయోగిస్తారు.

వివిధ రకాలైన అబ్రాసివ్ గోమేదికాలు ఉన్నప్పటికీ, వాటి ఉత్పత్తిని అనుసరించి వాటిని విభజించడం జరిగింది. గోమేదికాల‌తో సంవృద్ధమైన సముద్ర తీర ఇసుక అనేది భారతదేశ మరియు ఆస్ట్రేలియాల్లోని తీర ప్రాంతాల్లో విస్తారంగా లభిస్తుంది, ఈ విషయంలో నేడు ఆస్ట్రేలియా మరియు భారతదేశాలే ప్రధాన ఉత్పత్తిదారులుగా నిలుస్తున్నాయి.[9]

ఎల్లవేళలా సరఫరా జరుగుతుండడం, అత్యధిక స్థాయిల్లో లభించడం మరియు శుభ్రమైన ఖనిజంగా ఉండడం వల్ల ప్రత్యేకించి ఈ ఖనిజం బాగా ఆదరణ సాధించింది. ఇల్మెనైట్ మరియు క్లోరైడ్ మిశ్రమంగా లభించడమనేది ఈ ఖనిజం విషయంలో చోటు చేసుకునే అత్యంత సాధారణ సమస్యగా ఉంటోంది. ఈ ఖనిజం ప్రకృతి సిద్ధంగానే పొడి రూపంలో ఉండడం మరియు శతాబ్దాల తరబడి నదీ తీరాల్లో లభించడం వల్ల ఈ ఖనిజం ఎల్లప్పుడూ సూక్ష్మ పరిమాణంలోనే లభిస్తుంటుంది. టూటికోరిన్ తీరంలో లభించే గోమేదికం పరిమాణం చాలావరకు 80 మెష్‌గా ఉండడంతో పాటు 56 మెష్ నుంచి 100 మెష్ పరిమాణం మధ్యన లభిస్తుంటుంది.[ఉల్లేఖన అవసరం]

నదీ గార్నెట్ అనేది ప్రత్యేకించి ఆస్ట్రేలియాలో సంవృద్ధిగా లభిస్తుంటుంది. నదీ ఇసుక గోమేదికం అనేది ప్లేసర్ డిపాజిట్‌గా ఏర్పడుతుంది.[ఉల్లేఖన అవసరం]

రాతి గోమేదికం అనేది దీర్ఘకాలం పాటు జరిగిన మార్పులతో ఏర్పడినది కావచ్చు. ఈ రకమైన గోమేదికాన్ని అమెరికా, చైనా మరియు పశ్చిమ భారతదేశాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రకమైన స్ఫటికాలను మిల్లుల్లో పొడి చేసి, అటుపై విండ్ బ్లోయింగ్, మేగ్నటిక్ సెపరేషన్, సీవింగ్ లాంటి చర్యలతో పాటు అవసరమైన పక్షంలో వాషింగ్ కూడా చేయడం ద్వారా శుభ్రపరుస్తారు. తాజాగా పొడిచేసినదైతే, ఈ రకమైన గోమేదికం అనేది పదునైన అంచులను కలిగి ఉండడంతో పాటు ఆ కారణంగా ఇతర రకాల గోమేదికాల కంటే మరింత మెరుగ్గా పనిచేస్తుంది. నదీ మరియు సముద్ర తీర గోమేదికాలు రెండూ కూడా వందల వేల సంవత్సరాలుగా చిన్న పలుకుల రూపంలో ఉండడం వల్ల వాటి అంచులు గుండ్రంగా తయారయ్యాయి.

గోమేదికం అనేది పశ్చిమ రాజస్థాన్‌లో గత 200 ఎళ్లుగా తవ్వి తీయబడుతున్నప్పటికీ, ప్రధానంగా రత్నం స్థాయి రాళ్ల కోసమే ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. అబ్రాసివ్ గోమేదికం తవ్వకాలనేవి ప్రధానంగా రత్నాలుగా ఉపయోగపడే గార్నెట్ల కోసం తవ్వకాలు జరిపే సమయంలో ద్వితియ ఉత్పత్తిగా తవ్వి తీయడం జరుగుతుంటుంది, ఈ అబ్రాసివ్ గార్నెట్‌ను గ్లాస్ పరిశ్రమలో ల్యాపింగ్ మరియు పాలిషింగ్‌ల కోసం ఉపయోగిస్తుంటారు. గోమేదికాన్ని కలిగి ఉండే అతిథి శిల అనేది గార్నెటిఫెర్రస్ మైకా షిస్ట్‌లో ఉంటుంది, అలాగే ఇందులో మొత్తం గార్నెట్ శాతం 7% నుంచి 10% కంటే మించి ఉండదు,[ఉల్లేఖన అవసరం] ఈ కారణంగానే ఈ ఖనిజం అత్యంత ధర కలిగినదిగా ఉండడంతో పాటు రత్నాల కోసం కాకుండా ఇతర ఉపయోగాల కోసం తవ్వి తీయడమనేది వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉండదు.

వీటిని కూడా చదవండి[మార్చు]

 • కాంప్‌బెల్ R. బ్రిడ్జెస్
 • అబ్రాసివ్ బ్లాస్టింగ్

సూచికలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 జెమోలాజికల్ ఇనిస్టిట్యూట్ అఫ్ అమెరికా, GIA జెం రెఫరెన్స్ గైడ్ 1995, ISBN 0-87311-019-6
 2. Smyth, Joe. "Mineral Structure Data". Garnet. University of Colorado. Retrieved 2007-01-12.
 3. S. గెల్లెర్ క్రిస్టల్ కెమిస్ట్రీ అఫ్ ది గార్నెట్స్ జెయిట్‌స్క్రిప్ట్ ఫర్ క్రిస్టల్లోగ్రఫీ, 125 , S. 1-47 (1967)
 4. P. C. Rickwood (1981). "The largest crystals" (PDF). American Mineralogist. 66: 885–907.
 5. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లోని జియోలాజికల్ సైన్సెస్, ఆస్టిన్
 6. స్టేట్ అఫ్ కనెక్టికట్, సైట్స్ º సీల్స్ º సింబల్స్ Archived 2008-07-31 at the Wayback Machine.; కనెక్టికట్ స్టేట్ రిజిస్టర్ & మ్యాన్యువల్ ; డిసెంబర్ 20, 2008న పొందబడినది.
 7. న్యూయార్క్ స్టేట్ జెమ్ Archived 2007-12-08 at the Wayback Machine.; స్టేట్ సింబల్స్ USA ; అక్టోబర్ 12, 2007న పొందబడినది
 8. Joyce, Ernest (1987) [1970]. Peters, Alan (సంపాదకుడు.). The Technique of Furniture Making (4th సంపాదకులు.). London: Batsford. ISBN 0 7134 4407 Check |isbn= value: length (help).
 9. Briggs, J. (2007). The Abrasives Industry in Europe and North America. Materials Technology Publications. ISBN 1-871677-52-1.

మరింత చదవటానికి[మార్చు]

 • హర్ల్‌బట్, కర్నిలియస్ S.; క్లెయిన్, కార్నేలిస్, 1985, మాన్యుయేల్ అఫ్ మినరాలజీ, 20th ed., విలీ, ISBN 0-471-80580-7
 • జెమ్ స్టోన్స్ యొక్క కలర్ ఎన్‌సైక్లోపీడియా ISBN 0-442-20333-0

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=గోమేదికం&oldid=2802302" నుండి వెలికితీశారు