గోలి శేషయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోలి శేషయ్య

గోలి శేషయ్య ప్రఖ్యాతి గాంచిన చిత్రకళాకారుడు. గుంటూరు జిల్లా వినుకొండలో 1911 లో జన్మించాడు[1].

వినుకొండ నుండి ఢిల్లీ వరకు, ఆపైన అంతర్జాతీయ చిత్రకళాసీమ వరకు ఎగిసిన గొప్ప చిత్రకారుడు. స్థానిక పాఠశాలలో విద్య ప్రారంభించాడు. సహజ సిద్ధమైన తపనతో పలకపై చిత్రవిన్యాసాలు చేయడం ప్రారంభించాడు. అది చూసిన గురువులు ప్రోత్సహించారు.విద్యాభ్యాసం పూర్తయ్యాక చిత్రకళలో ఉన్నత పరీక్షకు కూర్చొని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. 1935లో ఉపాధ్యాయ వృత్తిలో కుదురుకొని సంతృప్తి చెందక, ఉద్యోగం వదిలి గుంటూరు చేరుకున్నాడు. అచట పేరుపొందిన చిత్రకారుల వద్ద శిష్యరికం చేశాడు. వివిధ చిత్ర కళారీతుల్లో ప్రావీణ్యం సంపాదించాడు.

కొంత కాలానికి తనంతట తానే చిత్రకళ పెద్ద ఎత్తున చేపట్టాడు. రేఖాచిత్రాలు, వర్ణచిత్రాలు, దృశ్యచిత్రాలు వగైరా అతి తక్కువ వ్యవధిలో చిత్రించేవాడు. ఎవరైనా ప్రసంగిస్తుంటే వారి చిత్రం గోటితో లేక పెన్సిల్ తో క్షణాల్లో గీసి బహూకరించేవాడు. రాజకీయ నాయకులు, కళాకారులు, సాహితీవేత్తలు మొదలగు వారికి చిత్రాలు వేసి ఇచ్చేవాడు. గోపాలరెడ్డికి ఇచ్చిన బుద్ధుడు, పట్టాభిరామారావుకిచ్చిన సుజాత చిత్రాలు కమనీయ కళాఖండాలు.

కొన్ని వందల పుస్తకాలకు, పాఠ్యపుస్తకాలకు బొమ్మలు వేశాడు. అన్ని పత్రికలలో శేషయ్య బొమ్మలు వచ్చేవి. 1958లో మచిలీపట్నం లోని చిత్రకళాసంపదలో జరిగిన గొప్పసభకు విశ్వనాథ సత్యనారాయణ అధ్యక్షత వహించి శేషయ్యకు "చిత్రకళా విశారద" బిరుదునిచ్చి సత్కరించాడు. తెలుగు చిత్రకళా రంగములో ఐదు శతాబ్దాలు విశేష కృషి చేసి, తన కుటుంబములోని వారిని, ఇతరులనూ చిత్రకళారంగములో ప్రవేశపెట్టాడు.

1978లో తెనాలిలోని స్వగృహములో తుది శ్వాస విడిచాడు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 78