గోల్డ్(I,III)క్లోరైడ్
పేర్లు | |
---|---|
Systematic IUPAC name
tetra-μ-chlorotetrachlorotetragold | |
ఇతర పేర్లు
Mixed gold chloride, Tetragold octachloride
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [62792-24-9] |
SMILES | Cl[Au]1(Cl)[Cl][Au][Cl][Au](Cl)(Cl)[Cl][Au][Cl]1 |
ధర్మములు | |
Au 4Cl 8 | |
మోలార్ ద్రవ్యరాశి | 1071.490 g mol−1 |
స్వరూపం | black crystals |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
గోల్డ్(I,III)క్లోరైడ్ ఒక రసాయన సమ్మేళనం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనం.బంగారం, క్లోరిన్ మూలకాల పరమాణువు ల సంయోగం వలన గోల్డ్ (I,III)క్లోరైడ్ ఏర్పడినది. గోల్డ్ (I,III) క్లోరైడ్ సంయోగ పదార్థం యొక్క రసాయనిక సంకేత పదం Au4Cl8. గోల్డ్ (I,III)క్లోరైడ్ ఒక మిశ్రమ సంయోగపదార్థానికి ఉదాహరణ.ఎందుకనగా గోల్డ్ (I,III)క్లోరైడ్ అణువులోని బంగారం రెండు ఆక్సీకరణస్థితులలో బంధాన్ని కల్గిఉన్నది. ఒకటి స్క్వేర్ ప్లానర్ గోల్డ్(III), ఇంకోటి ఇంచుముంచు లీనియర్ గోల్డ్(I).గోల్డ్ (I,III) క్లోరైడ్ కాంతి సంవేదక/ గ్రాహకం (photosensitive)కావున, దీనిని చాలా జాగ్రత్తగా ఉపయోగించ వలసిఉన్నది. అంతే కాకుండా గాలి, తేమతో కూడా చాలా సున్నితంగా స్పందించే (సెన్సిటివ్ గా ప్రవర్తించు)గుణం కలిగి ఉంది.
భౌతిక లక్షణాలు
[మార్చు]గోల్డ్ (I,III)క్లోరైడ్ నల్లని స్పటికరూప ఘనపదార్థం. గోల్డ్ (I,III)క్లోరైడ్ అణుభారం 1071.490 గ్రాములు/మోల్.2
సంశ్లేషణ
[మార్చు]గోల్డ్ (III)క్లోరైడ్ తో గోల్డ్ కార్బోనైల్ ను చర్య జరిపించి గోల్డ్ (I,III)క్లోరైడ్ సంయోగ పదార్థాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును[1].లేదా గదిఉష్ణోగ్రత వద్ద థైనోల్ క్లోరైడ్‌లో గోల్డ్(III)క్లోరైడ్, కార్బన్ మొనాక్సైడ్ చర్య వలన గోల్డ్ (I,III)క్లోరైడ్ సంయోగ పదార్థాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును [2] .
- Au2(CO)Cl4 + Au2Cl6 → COCl2 + Au4Cl8
- 2 Au2Cl6 + 2 CO → Au4Cl8 + 2 COCl2
సంయోగ పదార్థా నిర్మాణం-గుణాలు
[మార్చు]క్లోరిన్–గోల్డ్-క్లోరిన్(Cl-Au-Cl)ల బంధ కోణం 175.0°(ఆదర్శ బంధ కోణానికి దగ్గరగా విలువ కల్గి ఉన్నది).సరాసరి బంధ పొడవు/దూరం 2.30 Å..
ఇవికూడాచూడండి
[మార్చు]మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ Dell'Amico, Daniela Belli; Calderazzo, Fausto; Marchetti, Fabio; Merlino, Stefano; Perego, Giovanni (1977). "X-Ray crystal and molecular structure of Au4Cl8, the product of the reduction of Au2Cl6 by Au(CO)Cl". Journal of the Chemical Society, Chemical Communications (1): 31. doi:10.1039/C39770000031.
- ↑ Dell'Amico, Daniela Belli; Calderazzo, Fausto; Marchetti, Fabio; Merlino, Stefano (1982). "Synthesis and molecular structure of [Au4Cl8], and the isolation of [Pt(CO)Cl5]- in thionyl chloride". Journal of the Chemical Society, Dalton Transactions (11): 2257. doi:10.1039/DT9820002257.