గోల్డ్ ఫిష్
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో గోల్డ్ ఫిష్చూడండి. |
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి. |
Goldfish | |
---|---|
![]() | |
పరిరక్షణ స్థితి | |
పెంపుడు జంతువులు
| |
శాస్త్రీయ వర్గీకరణ | |
రాజ్యం: | Animalia |
విభాగం: | Chordata |
తరగతి: | Actinopterygii |
క్రమం: | Cypriniformes |
కుటుంబం: | Cyprinidae |
జాతి: | Carassius |
ప్రజాతి: | C. auratus[1] |
ఉప ప్రజాతి: | C. a. auratus |
Trinomial name | |
Carassius auratus auratus[2] (Linnaeus, 1758) |
గోల్డ్ ఫిష్ (కేరేస్సియస్ ఆరేటస్ ఆరేటస్) అనేది సైప్రినిడే కుటుంబానికి మరియు సైప్రినిఫోర్మెస్ అను తరగతికి చెందిన మంచినీటి చేప. ఇది ప్రాచీనంగా పెంచబడుతున్న చేపలలో ఒకటి, మరియు ఇది సర్వసాధారణంగా జలచరాల నుంచే ఒక గాజు పెట్టె (అక్వేరియం)లో ఉంచి పెంచుతారు. గోల్డ్ ఫిష్ అనేది కార్ప్ (ఒక రకమైన గండు చేప) కుటుంబంలో (కొఇ కార్ప్ మరియు క్రుసియన్ కార్ప్ లను కలిగినట్టి), ఒక చిన్న భాగమైనది మరియు తూర్పు ఆసియా జన్మస్థలమైనట్టి బూడిద/ఆలివ్/గోధుమ రంగు కార్ప్ చేప (కేరేసియస్ ఆరేటస్)లలో గోల్డ్ ఫిష్ ఒక గృహాలలో ఆసక్తిగా పెంచబడుతున్న చేప. చైనాలో వెయ్యేళ్ళ కంటే ముందరే ఈ చేపని మొట్టమొదటగా మచ్చిక చేసారు మరియు పలు ప్రత్యేక పెంపుడు జాతులు అప్పటి నుంచి వృద్ధి చేస్తున్నారు. గోల్డ్ ఫిష్ జాతులు, వాటి పరిమాణంలో, శరీర ఆకృతిలో, చేపరెక్క ఆకారంలో మరియు రంగు (తెలుపు, పసుపు, ఎరుపు, కాషాయం, గోధుమ, నలుపు రంగుల వివిధ రకాలయిన మేళవింపులలో ఉండి)లో మిక్కిలి భిన్నత్వం చూపిస్తాయి.
గోల్డ్ ఫిష్ యొక్క గరిష్ఠ పొడవు మరియు అరుదుగా వాటి గరిష్ఠ బరువు[ఆధారం కోరబడింది] ఉంటుంది. చాలా చేపలు ఈ కొలతలలో సగం పరిమాణమే ఉంటాయి. సమతులమయిన పరిస్థుతలలో గోల్డ్ ఫిష్ నలభయ్ ఏళ్ళకు పైగా జీవించగలవు.[2] అయినప్పటికీ, సాధారణంగా ఇళ్ళల్లో పెంచబడుతున్న చేపలు చాలా వరకు ఆరు నుంచి ఎనిమిది ఏళ్ళు జీవిస్తాయి.
విషయ సూచిక
- 1 చరిత్ర
- 2 ఆటవిక రూపం
- 3 పెంపుడు గోల్డ్ ఫిష్ రకాలు
- 4 కొలనులలో
- 5 జలచరాలనుంచు గాజు పెట్టెలో
- 6 మేత మేయుట
- 7 వన్య గోల్డ్ ఫిష్ మరియు ప్రస్ష్యన్ కార్ప్‌తో దాని సంబంధం
- 8 ప్రవర్తన
- 9 వివేకం
- 10 పరిధి మరియు సహజావరణం
- 11 ప్రత్యుత్పత్తి
- 12 దోమల నియంత్రణ
- 13 సరియైన విచారణ పై వివాదం
- 14 ఇవి కూడా చూడండి
- 15 గమనికలు మరియు సూచనలు
- 16 బాహ్య లింకులు
చరిత్ర[మార్చు]
ప్రాచీన చైనాలోని కార్ప్ చేప యొక్క వివిధ జాతులు (వీటిని ఆసియన్ కార్ప్స్ అని గుంపుగా పిలుస్తారు) మచ్చిక చేయబడినవి మరియు ఆహారపు చేపగా వేల ఏళ్ళ నుంచి పెంచబడుతున్నది. వీటిలో కొన్ని, సాధారణంగా బూడిద లేక వెండి రంగుల జాతులు పరావర్తనం చెంది ఎరుపు, కాషాయ లేక పసుపు రంగుల జాతులుగా మారాతాయని జిన్ వంశావళి (265–420) కాలంలో మొట్టమొదటిసారిగా నమోదు చేయబడింది.[3]
తాంగ్ వంశావళి (618–907) కాలంలో, ఇట్టి కార్ప్ చేపలను అందమైన కొలనులలోనూ మరియు నీటి ఉద్యానవనాలలోనూ పెంచుట ప్రసిద్ధమైనది. ఒక సహజమైన జన్యు పరివర్తనం, వెండి రంగు కంటే ఎక్కువ మేలుగా బంగారు రంగు చేప (కాషాయం కలిగిన పసుపు వర్ణం)ని ఉత్పన్నం చేసింది. ప్రజలు వెండి రకానికి బదులుగా బంగారు రంగు రకాన్ని, కొలనులలలోనూ మరియు ఇతర నీటి చలమలలలోనూ పెట్టి పెంచుట మొదలు పెట్టారు. అతిథులను ఆహ్వానించినట్టి ప్రత్యేక సందర్భాలలో, వీటిని ప్రదర్శన కొరకు చిన్న పాత్రలలోనికి తరలిస్తారు.[4][5]
1162లో సాంగ్ వంశావళి యొక్క సామ్రాజ్ఞి, ఎరుపు మరియు బంగారురంగు చేపల రకాలను సేకరించుటకు ఒక కొలను నిర్మించమని ఆజ్ఞాపించింది. అప్పటికి, పసుపు రాజ్య సంబంధిత రంగు అగుట చేత, సామాన్య ప్రజానీకం బంగారు (పసుపు) రకం యొక్క గోల్డ్ ఫిష్‌ని పెంచుకొనుట నిషిద్ధమైనది. పసుపు గోల్డ్ ఫిష్‌లను జన్యుపరంగా, తేలికగా వృద్ధి చేయగలిగినప్పటికీ, ఇవి కాషాయరంగు గోల్డ్ ఫిష్‌ల కంటే తక్కువగా ఉండుటకు, బహుశా ఇది కారణం అవ్వచ్చును.[6]
ఎరుపు మరియు బంగారు రంగులు కాకుండా ఇతర రంగుల యొక్క సంభవం ప్రథమంగా 1276లో నమోదు చేయబడింది. మింగ్ వంశావళి కాలంలో ఫాన్సీ టైల్డ్ గోల్డ్ ఫిష్ యొక్క మొదటి సంభవం నమోదు చేయబడింది. 1502లో గోల్డ్ ఫిష్‌ని జపాన్లో ప్రవేశపెట్టిన తరువాత ర్యుకిన్ (పొట్టి మరియు లోతైన ఆకారం కలిగిన ఆకర్షణీయమైన గోల్డ్ ఫిష్) మరియు టొసాకిన్ (విసనకర్ర వంటి తోకరెక్క కలిగిన గోల్డ్ ఫిష్) రకాలను వృద్ధి చేసారు. 1611లో గోల్డ్ ఫిష్ పోర్చ్‌గల్లో ప్రవేశపెట్టబడి, అక్కడి నుంచి యూరోపులోని ఇతర ప్రదేశాలకు ప్రవేశించింది.[4]
1620లో గోల్డ్ ఫిష్‌ని, వాటి యొక్క లోహపు ఛాయ గలిగిన పొలుసుల కారణంగా, దక్షిణపు యూరోపులో అదృష్టం మరియు భాగ్యానికి చిహ్నాలుగా పరిగణించేవారు. వివాహిత పురుషులు, మొదటి పెళ్ళి వార్షికోత్సవం రోజున, రానున్న భాగ్యవంతమైన ఏళ్ళకి గుర్తుగా, వారి భార్యలకు గోల్డ్ ఫిష్‌ని బహూకరించుట సంప్రదాయమైనది. గోల్డ్ ఫిష్‌లు విరివిగా లభించుట చేత వాటి ఉన్నతిని కోల్పోగా, ఈ ఆచారం త్వరగా అంతరించింది. గోల్డ్ ఫిష్‌ని 1850 సమీపంలో మొదట ఉత్తర అమెరికాలో ప్రవేశపెట్టబడి, త్వరలోనే అమెరికా సంయుక్త రాష్ట్రాలులో ఖ్యాతిగాంచింది.[7][8]
ఆటవిక రూపం[మార్చు]
ప్రష్యా యొక్క కార్ప్ చేప (కేరేసియస్ జిబెలియో) ఆటవీక రకం. దీనికి భిన్నంగా కొన్ని ఆధారాలు క్రుసియన్ కార్ప్ (కేరేసియస్ కేరేసియస్)ని మచ్చిక కాని రకంగా ప్రకటించాయి. అవి దగ్గరి సంబంధం కలిగి ఉన్నప్పటికీ, వాటి మధ్య వ్యత్యాసం ఈ క్రింది లక్షణాల ద్వారా కనిపెట్టవచ్చు.
- కే. ఆరేటస్ సూదంటి ముచ్చిక కలిగి ఉండగా కే. కేరసియస్ ముచ్చిక గుండ్రంగా ఉంటుంది.
- కే. జిబేలియో ఎక్కువగా బూడిద/ఆకుపచ్చ రంగులో ఉండగా, క్రుసియన్ కార్ప్ చేపలు ఎప్పుడూ బంగారు మడ్డిపచ్చ రంగులో ఉంటాయి.
- బాల్య దశలోనున్న క్రుసియన్ కార్ప్ చేపకి తోక అడుగున ఉన్న నల్లటి మచ్చ వయసుతో పాటు కనుమరుగవుతుంది. కే. ఆరేటస్‌లో ఈ తోక మీది మచ్చ ఎప్పుడూ ఉండదు.
- కే. ఆరేటస్ యొక్క ప్రక్కగీత వెంబడి 31 కంటే తక్కువ పొలుసులు ఉండగా క్రూసియన్ కార్ప్ కి 33 కంటే ఎక్కువ పొలుసులు ఉంటాయి.
గోల్డ్ ఫిష్ ప్రకృతి సహజంగా లేత పసుపు ఛాయగల ఆకుపచ్చ (ఆలివ్ గ్రీన్) రంగులో ఉండగా, స్వేచ్ఛగా వదిలిన పెంపుడు చేపల యొక్క సంతతి ఈ రంగుకి తిరిగి వచ్చునట్లు కనపడుతుంది.[ఆధారం కోరబడింది] గోల్డ్ ఫిష్ రూపాంతరం చెందుటకు కారణమయిన పరివర్తనం ఇతర సైప్రినిడ్ జాతులైన కామన్ కార్ప్ మరియు టెన్చ్‌ల నుంచి కూడా చెందవచ్చు. గోల్డ్ ఫిష్ యొక్క పెంపుడు జాతులలో పలు రకాలు ఉన్నాయి.
పెంపుడు గోల్డ్ ఫిష్ రకాలు[మార్చు]
శతాబ్దాలుగా ఎంపిక చేసిన జాతుల ప్రజననం ద్వారా పలు రంగు భిన్నత్వాలు ఉత్పత్తి చేయగా, కొన్నిటికి అసలు మూలమైన "బంగారు(గోల్డ్)" వన్నె చాలా వరకు తీసివేయబడింది. విభిన్న శరీర ఆకృతులు, రెక్క మరియు కన్ను ఆకారాలు కూడా ఏర్పడ్డాయి. గోల్డ్ ఫిష్ యొక్క కొన్ని అత్యంత అసాధారణ రూపాలు జలచరాలను ఉంచే గాజు పెట్టె (ఆక్వేరియం)లో మాత్రమే బ్రతకగలవు. వన్య జాతులకి దగ్గరగా ఉన్న రకాలతో పోలిస్తే ఇవి బహు స్వల్ప దృఢత్వం కలిగి ఉంటాయి. అయినప్పటికీ, కొన్ని భిన్నత్వాలు, షుబుకిన్ వంటివి, కొంత దృఢమైనవి. వాటిలో ప్రధాన మైన రకాలు ఇవి:
కామన్ గోల్డ్ ఫిష్ | బ్లాక్ మూర్ | బబుల్ ఐ | |||
---|---|---|---|---|---|
కామన్ గోల్డ్ ఫిష్ దాని వంశానుగతమైన ప్రష్యన్ కార్ప్‌తో పోలిస్తే కేవలం రంగులో మాత్రమే తేడా చూపెడుతుంది. కామన్ గోల్డ్ ఫిష్, ఎరుపు, కాషాయ/బంగారు,తెలుపు, నలుపు మరియు పసుపు లేక నిమ్మపండు వంటి విభిన్న రంగులలో ఉంటుంది. | బ్లాక్ మూర్ అనేది ఫాన్సీ గోల్డ్ ఫిష్ యొక్క దుర్బిను కన్ను (టెలిస్కోప్ వంటి కన్ను)లు మరియు చొచ్చుకు వచ్చిన కళ్ళు వంటి విలక్షణత కల రకం. జపాన్లో దీన్ని పోపేయ్, దూర దర్శిని, క్యురో డెమకిన్ అని పిలవగా చైనాలో దీన్ని డ్రాగన్-ఐ అని పిలుస్తారు. | ![]() |
చిన్న ఫాన్సీ బబుల్ ఐ రకానికి పైకి పొడుచుకు వచ్చిన కన్నులతో పాటు రెండు పెద్ద ద్రవంతో నిండిన తిత్తులు ఉంటాయి. | ![]() | |
సెలెస్టియల్ ఐ | కామెట్ (గోల్డ్ ఫిష్) | ఫాన్‌టైల్ (గోల్డ్ ఫిష్) | |||
ఫాన్సీ సెలెస్టియల్ ఐ గోల్డ్ ఫిష్ లేక చోటేన్ గన్ రకానికి రెండు తోకలు ఉండి, వంగడ-నిర్దేశితమైన దూరదర్శిని కళ్ళు ఉండి, కంటి పాపలు ఆకాశం వంక చూస్తున్నట్లు ఉండును. | కామెట్ లేక కామెట్ -టైల్డ్ గోల్డ్ ఫిష్ అనేది సంయుక్త రాష్ట్రాలులో సామాన్యంగా కనిపించే ఫాన్సీ రకం. ఇది కామన్ గోల్డ్ ఫిష్ ని పోలి ఉంటుంది. కొంచెం చిన్నగా మరియు సన్నగా ఉండటం వినాయించి, ప్రధానంగా పొడవైన, లోతైన పంగలు గల తోక కలిగి ఉండుటతో వీటి మధ్య తేడా గుర్తించవచ్చు. | ![]() |
ఫాన్టైల్ గోల్డ్ ఫిష్ అనేది ర్యుకిన్ యొక్క పాశ్చ్యాత్య రూపం మరియు దీనికి కోడి గుడ్డు వంటి ఆకారం ఉండి, ఎత్తైన వెన్నురెక్క, పొడవైన, నాలుగింత లైన పుచ్చక రెక్క ఉండి, భుజ మూపురం ఉండదు. | 120x150px | |
లయన్‌హెడ్ (గోల్డ్ ఫిష్) | ఓరాండ] | పెరల్‌స్కేల్ | |||
ఫాన్సీ లయన్ హెడ్కి టోపీ వంటిది ఉంటుంది. ఈ చేప రాంచుకి {1 }అగ్రగామి. | ![]() |
ఫాన్సీ ఓరండకి విలక్షణ మైన, కోరింద కాయ వంటి టోపీ (వెన్ లేక తల పెరుగుడు అని కూడా పిలవబడిన) మొత్తం తలను కప్పి, కళ్ళు మరియు నోరుని వినాయిస్తుంది. | జపనీస్ యొక్క ఫాన్సీ పెర్ల్ స్కేల్ లేక చిన్ షురిన్కి గుండ్రటి శరీరం ఉండి, రెక్కల అమరిక ఫాన్టైల్‌ని పోలి ఉంటుంది. | ![]() | |
పాంపాం (గోల్డ్ ఫిష్) | ర్యుకిన్ | షుబున్కిన్ | |||
ఫాన్సీ పాం పోమ్స్ లేక పాంపాన్ లేక హాన ఫూసకి గుత్తులు గానున్న వదులైన మాంసపు పెరుగుదలలు, తలకి ఇరు ప్రక్కలా, ముక్కు రంధ్రాల మధ్యన ఉంటాయి. | ఫాన్సీ ర్యుకిన్కి పొట్టి, లోతయిన శరీరం ఉండి, విలక్షణ మైన భుజ మూపురం ఉంటుంది. | ![]() |
ఫాన్సీ మరియు దృఢమైన జపనీయులShubunkins (朱文金 ) ("ఎర్రటి జరీ పట్టె గల వస్త్రం"అని పిలవబడిన) రకానికి ముత్యపు పొలుసులు, కాలికో నమూనా ఉన్న ఒకే తోక ఉంటుంది. | ![]() | |
టెలిస్కోప్ ఐ | రాంచు | పాండ మూర్ | |||
ఫాన్సీ టెలిస్కోప్ ఐ లేక డెమకిన్కి విలక్షణమైన పొడుచుకు వచ్చిన కళ్ళు ఉంటాయి. దీన్ని గ్లోబ్ ఐ లేక డ్రాగన్ ఐ గోల్డ్ ఫిష్ అని కూడా పిలుస్తారు. | ![]() |
జపనీయుల ఫాన్సీ రకపు రాంచుకి టోపీ వంటిది కప్పి ఉంటుంది. జపనీయులు దీన్ని "గోల్డ్ ఫిష్‌లలో రాజు" అని అంటారు. | ![]() |
ఫాన్సీ పాండా మూర్కి విలక్షణమైన నలుపు-మరియు-తెలుపు రంగుల మాదిరి మరియు పొడుచుకు వచ్చిన కళ్ళు కలిగి ఉంటుంది. | ![]() |
వీల్టైల్ | బట్టర్‌ఫ్లయ్ టైల్ (గోల్డ్ ఫిష్) | ||||
ఫాన్సీ 'వీల్టేయిల్కి అతి- పొడవైన, తేలుతున్న, రెండుగా ఉన్న తోక ప్రత్యేకత. ఆధునిక వీల్టేయిల్ ప్రమాణాల ప్రకారం పుచ్చక రెక్కలకి అంచుననుండు గంట్లు లేక నొక్కులు (పెళ్లి కూతురికి పెళ్ళిలో ముఖానికి వేసికొను తెరకి ఉండేటి నొక్కుల మాదిరి) ఉండరాదు. | బటర్ ఫ్లయ్ టైల్ మూర్ లేక బటర్ ఫ్లయ్ టెలిస్కోప్ అనేది టెలిస్కోప్-ఐ చేప వంశంలోనిది మరియు పై నుంచి చూసిన జత తోకలు స్పష్టంగా కనపడును. పుచ్చక రెక్కల విస్తరణ నీటిలోని బటర్ ఫ్లయ్‌లను అనుకరిస్తుంది. | ![]() |
చైనీయుల గోల్డ్ ఫిష్ వర్గీకరణం[మార్చు]
చైనీయుల సంప్రదాయం గోల్డ్ ఫిష్‌ని నాలుగు ప్రధాన రకాలుగా వర్గీకరిస్తుంది. పాశ్చాత్యులు ఈ వర్గీకరణాలని సాధారణంగా ఉపయోగించరు.
- సి ("గడ్డి" అని కూడా అనవచ్చు)-వింతయిన అంగచ్హేద సంబంధమైన ముఖ వైఖరులు ఈ వర్గంలోని గోల్డ్ ఫిష్‌కి ఉండవు. కామన్ గోల్డ్ ఫిష్, కామెట్ గోల్డ్ ఫిష్ మరియు షుబ్ కిన్ ఈ వర్గానికి చెందినవి.
- వెన్-ఇందులోని గోల్డ్ ఫిష్‌కి వింతైన తోక ఉంటుంది. ఉదాహరణకు, ఫ్యాన్టేల్స్ మరియు వీల్టేల్స్ ("వెన్" అనేది ఒరామ్డా మరియు లయన్ హెడ్ రకాలలోని తలకి ఉన్న పెరుగుదలకి పెట్టిన పేరు.)
- డ్రాగన్ ఐ-విస్తరించిన కన్నులు గల గోల్డ్ ఫిష్, ఉదాహరణకు బ్లాకు మూర్, బబుల్ ఐ, మరియు టెలిస్కోప్ ఐ
- ఎగ్-ఈ వర్గంలోని గోల్డ్ ఫిష్‌కి వెన్ను వీపుతో చేరిన రెక్క ఉండదు మరియు కోడి గుడ్డు ఆకారం వంటి శరీరం ఉంటుంది. ఉదాహరణకు లయన్ హెడ్ (వెన్ను వీపు రెక్క లేని బాబుల్ ఐ చేప ఈ వర్గానికి చెందుతుందని గమనించాలి.)
కొలనులలో[మార్చు]
గోల్డ్ ఫిష్ చిన్నవిగా, చవకగా, ఆకర్షణీయమైన రంగులలో, దృఢంగా ఉండుటచేత ప్రసిద్ధి చెందినవి. బహిరంగ కొలనులలో లేక నీటి ఉద్యానవనాలలో నీటి ఉపరితలం మీద మంచు పేరుకున్నప్పటికీ సరిపడు సహజ వాయువు ఆక్సిజెన్ నీటిలో ఉండి, కొలను మొత్తం గడ్డ కట్టుకు పోనంత వరకూ ఇవి మరికొంత కాలం జీవించగలవు. సమశీతోష్ణ మరియు మితమైన ఎండలు ఉన్న వాతావరణాలలో, ఏడాది పొడుగూతా, కామన్ గోల్డ్ ఫిష్, లండన్ మరియు బ్రిస్టల్ షుబ్కిన్స్, జికిన్, వాకిన్, కామెట్ మరియు ఇతర దృఢమైన ఫ్యాన్టెయిల్ గోల్డ్ ఫిష్‌లను కొలనులలో ఉంచవచ్చు. మూర్, వీల్టేయిల్, ఒరామ్డా మరియు లయన్ హెడ్‌లను ఎండాకాలం మరియు అధిక ఉష్ణ వాతావరణాలలో మాత్రమే బహిరంగ కొలనులలో భద్రపరచవచ్చు.
కొలనులు చిన్నవైనా, పెద్దవైనా కొలను యొక్క లోతు, కనీసం నీరు గడ్డ కట్టుటను అడ్డుకొనునట్లుగా ఉండాలి. చలికాలంలో గోల్డ్ ఫిష్ బద్ధకంగా, తిండి తినకుండా, మరియు తరుచుగా కొలను అట్టడుగున ఉంటాయి. ఇది సర్వసాధారణమైనది. అవి మళ్ళీ వసంత కాలంలో చురుకుగా మారతాయి. కొలనులోని నీటిని శుభ్రంగా ఉంచుటకు, వ్యర్ధాలను తీసివేయుటకు నీటిని వడకట్టు సాధనం అవసరం. మొక్కలు వడకట్టు వ్యవస్థలో భాగమైనవే కాక చేపలకు ఆహారంగా కూడా అత్యవసరమైనవి. మొక్కలు నీటిలోని సహజవాయువు (ఆక్సిజెన్) స్థాయిని వృద్ధి చేస్తాయి కనుక అవి మరింత ప్రయోజనకరమయినవి.
రద్, తెన్చ్, ఓర్ఫే మరియు కొఇ వంటివి అనువైన చేపలు అయినప్పటికీ కొఇ చేపలకి ప్రత్యేక శ్రద్ధ అవసరం. రామ్శోర్న్ నత్తలు కొలనులో పెరుగునట్టి నాచు లేక శైవాలాలు తినుట వలన సహాయకారిగా ఉండును. జంతు సంతతి నియంత్రణ పద్ధతులు లేని యెడల గోల్డ్ ఫిష్ కొలను తేలికగా హద్దు మీరిన సంతతి కల స్థలంగా తయారవుతాయి. ఓర్ఫే చేపలు గోల్డ్ ఫిష్ యొక్క గుడ్లను తింటాయి.
కొఇ చేపను, గోల్డ్ ఫిష్‌ని కలపగా ఒక సంకర గొడ్డుపోయిన చేప యొక్క ప్రజననం సాధ్యపడింది.
జలచరాలనుంచు గాజు పెట్టెలో[మార్చు]
కార్ప్ చేపలకు వలె, గోల్డ్ ఫిష్ అధిక మొత్తంలో వ్యర్ధాలను, మలం ద్వారా మరియు మొప్పలు (చేపల శ్వాసేంద్రియాలు) ద్వారా ఉత్పన్నం చేసి, హానికర రసాయనాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఇట్టి వ్యర్ధాలు పేరుకొనుట చేత విష పూరిత మగు స్థాయికి అతి తక్కువ వ్యవధిలో చేరుకొనుట వలన, గోల్డ్ ఫిష్ యొక్క మృతికి కారణమవుతాయి. కామన్ మరియు కామెట్ రకాలకి, ప్రతి గోల్డ్ ఫిష్‌కి నీరు ఉండవలెను. ఫాన్సీ గోల్డ్ ఫిష్ (చిన్నవిగా ఉన్నట్టి) ఒక్కోదానికి నీరు ఉండాలి. నీటి ఉపరితలం యొక్క విస్తీర్ణత ఎంత ఆక్సిజెన్ నీటిలో వ్యాపించియున్నదో మరియు ఎంత కరిగియున్నదో నిర్ధారిస్తుంది. ఒక సామాన్య సూత్రంలో చురుకైన గాలి నింపు ప్రక్రియ కొరకు నీటి గొట్టం, వడకట్టు యంత్రం, లేక కారింజాలను ఉపయోగించుట చేత కనిష్ఠ ఉపరితల విస్తీర్ణతని తగ్గించవచ్చు.
గోల్డ్ ఫిష్, మానవులకు అనుకూలమైన ఉష్నోగ్రతలలో అనగా వేడిచేయని జలచరాలనుంచు గాజుపెట్టెలో జీవించగలుగుటచేత, గోల్డ్ ఫిష్‌ని చల్లటినీటి చేపగా వర్గీకరించారు. అయినప్పటికీ, ఉష్ణోగ్రతలలోని వేగవంతమైన మార్పులు (ఉదాహరణకు, ఒక కార్యాలయంలో, చలికాలంలో, రాత్రివేళ వేడిని ఆపివేసినపుడు) గోల్డ్ ఫిష్‌ని చంపగలవు, ముఖ్యంగా అవి ఉన్న తొట్టి చిన్నదైనపుడు. నీటిని కలుపునపుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఎందుకనగా కొత్త నీరు వేరే ఉష్ణోగ్రతలో ఉండి ఉండవచ్చు. కామన్ మరియు కామెట్ రకాలు కొంత తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగినా, ఫాన్సీ రకాలకి దీని కంటే తక్కువ ఉష్ణోగ్రతలు అపాయకరం. అత్యంత అధిక ఉష్ణోగ్రతలుకి పైగా ఉన్న ఉష్ణోగ్రతలు గోల్డ్ ఫిష్‌కి హానికరమైనవి. అయిననూ, అధిక ఉష్ణోగ్రతలు ప్రోటోజోవా వంటి ఏకకణ జీవుల యొక్క చేపశరీర ఉపరితలం మీద స్థావరాన్ని ఏర్పరుచుకోకుండా పోరాడుటలో సహాయపడతాయి. ఇట్టి పోరాటంలో పరాన్నజీవుల కాలచక్రాన్ని వేగవంతం చేసి వాటిని త్వరగా నిష్క్రమించునట్లు చేయుటకు అధిక ఉష్ణోగ్రతలు సహాయ పడతాయి. గోల్డ్ ఫిష్‌కి సమతులమైన ఉష్ణోగ్రత మరియు మధ్య ఉంటుంది.[9]
ఇతర చేపలకు వలె, గోల్డ్ ఫిష్ మచ్చిక చేయబడుటకు ఇష్టపడదు. గోల్డ్ ఫిష్‌ని తాకినపుడు దాని మీదనున్న రక్షిత జిగురు పొర తీసివేయబడుట చేత, చేప యొక్క చర్మం, బాక్టీరియా లేక ఇతర పరాన్నజీవుల అన్యకణావేశానికి విశదమవుటచేత, గోల్డ్ ఫిష్‌ని తాకుట దాని ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, గోల్డ్ ఫిష్ ఆహారం ఇచ్చు సమయంలో నీటి పైకి వచ్చి జవాబు ఇస్తాయి మరియు వాటికి మనుషుల చేతి వేళ్ళ నుంచి గుళికలను లేక తునకలను తీసుకొను విధంగా శిక్షణ ఇవ్వవచ్చు. అజాగ్రత్త వలననే గోల్డ్ ఫిష్ త్వరగా మరణిస్తుంది అని ఖ్యాతి కలిగి ఉంది.[10] చరలో ఉంచబడిన గోల్డ్ ఫిష్ యొక్క ఆయుష్షును 10 ఏళ్ళ కంటే ఎక్కువ పెంచవచ్చు.
గోల్డ్ ఫిష్‌ను కొంత కాలం చీకటిలో వదిలినచొ, దాని రంగు క్రమంగా బూడిద రంగు వచ్చు వరకు మారుతుంది. గోల్డ్ ఫిష్ కాంతికి ప్రత్యుత్తరంగా వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేయుట, మానవుల చర్మం ఎండ వేడికి కములుటతో పోల్చవచ్చును. చేపలలోని హరితకం అను కణాలు కాంతిని ప్రతిబింబించు వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేసి, చేపలకు రంగును ఇస్తాయి. గోల్ ఫిష్ యొక్క రంగును నిర్ధరించేవి, దాని కణాలలోని వర్నద్రవ్యాలు, ఎన్ని వర్ణద్రవ్య పరమాణువులు వున్నాయో, మరియు వర్ణద్రవ్యం కణం లోపల ఉన్నదో లేక కణసారం మొత్తంలో వ్యాపించి ఉన్నదో అను అంశాలు.
మేత మేయుట[మార్చు]
స్థూలంగా, వాటి ఆహారం క్రస్తేషియన్ (పీతల వంటి జలచరాలు), కీటకములు మరియు వివిధ రకాల మొక్కలు. అవి సర్వభక్షకమైనవి మరియు గుళికల ఆహారంలోని లోపాలను భర్తీ చేసేవి, తాజా కూరలు మరియు పండ్లు.[ఆధారం కోరబడింది]
ఇతర చేపలకు వలె, గోల్డ్ ఫిష్ మేతమేయడంలో అవకాశ వాదులు మరియు తనంతట తాను తినటం ఆపదు. అధిక ఆహారం లభించినప్పుడు మరియు అసంపూర్తి మాంసకృత్తుల అరుగుదల వలన, అవి ఎక్కువ వ్యర్ధాలను మరియు మలమును ఉత్పత్తి చేస్తాయి. కొన్నిసార్లు అధికంగా మేయుటను, చేప యొక్క మలద్వారం నుంచి కష్టంగా వచ్చునట్టి మలాన్ని పరిశోధించుట ద్వారా గుర్తించవచ్చు.
గోల్డ్ ఫిష్‌నకు అవి ఎంత తీసుకొనగలవో, అంత మేతని మూడు నుంచి నాలుగు నిమిషాలలో, రోజుకి రెండు సార్లు కంటే ఎక్కువ కాకుండా ఇవ్వాలి. అధికంగా మేయుట వలన ప్రేగులలో అవరోధములు యేర్పడుట లేక పగులుట చేత అపాయకరమగును. శ్రేష్టమైన ప్రజనిత గోల్డ్ ఫిష్‌లలో మెలితిరిగిన ప్రేగుల ఏర్పాటు ఉండుట చేత తరచుగా ఇది జరుగును. కొత్త ర్యుకిన్, ఫాన్తెయిల్, ఒరామ్డా, లయన్ హెడ్ లేక ఇతర ఫాన్సీ గోల్డ్ ఫిష్‌లకి ఎంత అవసరమో ఈ చేపలని పెంచువారు జాగ్రత్తగా నిర్ధారించాలి.
గోల్డ్ ఫిష్ యొక్క ప్రత్యేక ఆహారంలో సాధారణమైన చేప ఆహారం కంటే తక్కువ మాంసకృత్తులు మరియు ఎక్కువ పిండి పదార్ధాలు ఉంటాయి. రెండు రకాలుగా చేప ఆహారాన్ని అమ్ముతారు. తేలేటట్టి తునకలు మరియు మునిగిపోవు గుళికలు. ఉత్సాహపరులు, వాటి ఆహారంలోని లోపాలను, పైన తొక్కు తీసేసిన బఠాణీలు, తెల్లగా మార్చిన ఆకు కూరలు మరియు జలగలతో భర్తీ చేయవచ్చు. చిన్న గోల్డ్ ఫిష్‌ల ఆహారంలో ఉప్పునీటిలో ఊరేసిన రొయ్యలను ఇవ్వటం ప్రయోజనకరంగా ఉంటుంది. గోల్డ్ ఫిష్‌కి తీసుకోవలసిన ప్రాముఖ్యతలు ఇతర జంతువులకి భిన్నంగా ఉంటాయి.
వన్య గోల్డ్ ఫిష్ మరియు ప్రస్ష్యన్ కార్ప్‌తో దాని సంబంధం[మార్చు]
ఫాన్సీ గోల్డ్ ఫిష్‌లు, వాటి యొక్క ప్రకాశవంతమైన రెక్కల రంగుల కారణంగా ఆటవికంగా జీవించుటకు అనుకూలం కావు. అయినప్పటికీ, షుబున్కిన్ వంటి దృఢమైన రకాలు, వాటి జ్ఞాతులతో కలిసి ప్రజననం చేయుటకు ఎక్కువ కాలం జీవిస్తాయి. కొలనులో ఎట్టి వాతావరణం ఉన్ననూ, కామన్ మరియు కామెట్ గోల్డ్ ఫిష్‌లు జీవించగలవు మరియు వృద్ధి చెందగలవు.
ఆటవికమైన గోల్డ్ ఫిష్‌లను ప్రవేశ పెట్టుట స్వయంగా పుట్టిన జాతులకి సమస్యలు సృష్టించగలవు. గోల్డ్ ఫిష్ యొక్క జాతులు, మూడు ప్రజననించు తరాలలోపు, వాటి సహజ సిద్ధమైన పసుపు ఛాయగల ఆకు పచ్చరంగు (ఆలివ్ రంగు)కి తిరిగి వస్తాయి. గోల్డ్ ఫిష్ కొన్ని ఇతర కార్ప్ జాతులతో సంకరణం చెందగలవు. పర్షియన్ కార్ప్‌కు గోల్డ్ ఫిష్‌తో వంశానుగతమైన సంబంధం ఉన్నప్పటికీ, ఇవి రెండూ పరస్పరం దూరమయి విముఖీకరణం చెంది రెండు వేరే జాతులుగా పరిగణించ బడ్డాయి అని చెప్పుటకు చక్కని తారతమ్యాలు చూపవచ్చు.[11]
ప్రవర్తన[మార్చు]
గోల్డ్ ఫిష్ భిన్నమైన పర్యావరణాలలో జీవించుట చేత మరియు వాటి యజమానులు వాటి యొక్క ప్రవర్తనను నిర్బంధించుట చేత, గోల్డ్ ఫిష్ యొక్క ప్రవర్తన విస్తారమైన భిన్నత్వం చూపిస్తుంది.
గోల్డ్ ఫిష్‌కి గాఢమైన స్నేహము చేసుకొను సామర్ధ్యం మరియు సామాజిక అన్యోన్యతను కలిగి ఉండు నైపుణ్య లక్షణాలు ఉన్నాయి. దీనికి తోడుగా, వాటి యొక్క సునిశిత దృష్టి వలన మనుషుల మధ్య తేడాలను గుర్తించగలవు. యజమానులు వారి యొక్క చేపలు వారికి అనుకూలంగా ప్రతిస్పందించుట (గాజు పలకకి ముందు వైపుకి ఈదుట, తొట్టిలో వేగంగా ఈదుట, మరియు ఆహారం కొరకు ఉపరితలానికి వచ్చుట) మరియు ఇతరులు దగ్గరకి వచ్చినపుడు అవి దాగుటకు చేయు ప్రయత్నాన్ని గమనించగలరు. కొంత కాలం తరువాత, గోల్డ్ ఫిష్‌లు యజమానులతో మరియు ఇతరులతో ఆహారం కొరకు సహవాసం చేయుటను నేర్చుకుంటాయి. తరచుగా వాటి యజమానులు దగ్గరకి వచ్చినపుడు ఆహారం కోసం అర్ధిస్తాయి.[ఆధారం కోరబడింది]
ఒక అంధ గోల్డ్ ఫిష్ నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, అది కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరిని మరియు ఒక స్నేహి తుడిని వారి గొంతు ద్వారా లేక ధ్వని యొక్క కంపనం ద్వారా గుర్తిస్తుందని రుజువు చేయడమైనది.[ఆధారం కోరబడింది] ఈ ప్రవర్తన, అనగా ధ్వని యొక్క కంపనం ద్వారా ఇంటిలోని ఏడుగురిలో ప్రత్యేకంగా ఇద్దరు మనుషుల గొంతుని గుర్తుపట్టుట విశేషమైనది.
గోల్డ్ ఫిష్‌లు గుంపులుగా జీవిస్తూ, గుంపుగా ఒకే దిశలో సమానంగా ఈదు లక్షణాన్ని ప్రదర్శించుటయే కాక ఒకే విధంగా ఆహారాన్ని తీసుకొనే లక్షణాన్ని చూపిస్తాయి. అద్దంలోని వాటి ప్రతిబింబాలకు ప్రతిస్పందించేటపుడు గోల్డ్ ఫిష్‌లు ఒకే విధమైన ప్రవర్తనలు ప్రదర్శిస్తాయి.[ఆధారం కోరబడింది]
మనుషులతో నిలకడగా దృశ్యపరమైన సన్నిహితత్వం కలిగిన గోల్డ్ ఫిష్‌లు, వారు దాన్ని బెదిరిస్తున్నట్లుగా పరిగణించదు. పలు వారాలుగా, కొన్ని సార్లు నెలలుగా, తొట్టిలో ఉంచబడిన తరువాత, గోల్డ్ ఫిష్‌కి మేత వేయునపుడు అది సిగ్గుపడి పోకుండా వేయుట సాధ్యపడుతుంది.
గోల్డ్ ఫిష్‌లకు నేర్చుకొను ప్రవర్తనలు, గుంపులుగా ఉన్ననూ మరియు వేరే వేరేగా ఉన్ననూ, స్వకీయమైన కార్ప్ ప్రవర్తన నుంచి వంశానుగతంగా అలవడింది. ఈ జాతులు భిన్నమైన ఆహారపు అలవాట్లు, సంకరణలతో మరియు వేటాడి చంపు జాతుల నుంచి తప్పించుకొను ప్రవర్తనలతో విభిన్నపర్యావరణాలలో వృద్ధి చెందగల జాతులు. వీటిని పరస్పర "స్నేహపూర్వకమైన" చేపలుగా వర్ణించవచ్చు. చాలా అరుదుగా ఒక గోల్డ్ ఫిష్ మరియొక గోల్డ్ ఫిష్‌కి హాని తలపెడుతుంది. అలానే సంకరించునపుడు మగ చేప, ఆడ చేపకి ఎట్టి హానీ తలపెట్టదు. ఆహారం కొరకు పోటీ పడునపుడు మాత్రమే గోల్డ్ ఫిష్‌లలో పరస్పర విభేదాలు ఏర్పడతాయి. కామన్ రకం చేపలు, కామెట్ రకం చేపలు మరియు వేగవంతమైన రకాలు, ఫాన్సీ రకాలు ఆహారాన్ని అందుకొనే లోపే తేలికగా మొత్తం మేతని తినేయగలవు. దీని వలన, ఒకే కొలనులో ఫాన్సీ రకాలని మరియు ఒక తోక కలిగిన వాటి సోదరులని కలిపి ఉంచినపుడు, ఫాన్సీ రకం చేపలలో కుంటుపడిన పెరుగుదల లేక అవి పస్తులుండు సందర్భాలకు దారి తీస్తాయి. ఫలితంగా, ఒకే రకమైన శరీర ఆకృతి మరియు ఈత లక్షణాలు కలిగిన జాతులను కలిపి ఉంచు జాగ్రత్త తీసుకొనవలెను.
వివేకం[మార్చు]
గోల్డ్ ఫిష్లలో ప్రేరణకి దారి తీయు ప్రవర్తనని కనిపెట్టు సాంకేతికతని ఉపయోగించి, వివిధ రంగులను గుర్తించుట మరియు ప్రతిస్పందించుటలలో శిక్షణని ఇవ్వవచ్చు.[12] గోల్డ్ ఫిష్ యొక్క జ్ఞాపక-ఆయుర్దాయం కనీసం మూడు నెలలు మరియు అవి వివిధ ఆకారాలు, రంగులు మరియు ధ్వనుల మధ్య తారతమ్యాలను గుర్తించగలవు.[13] మరియొక ప్రయోగం, అవి ఒక నెల కంటే ఎక్కువ జ్ఞాపకం ఉంచుకోగలవని ప్రదర్శించింది.[14] ఇవి మేతకి సంబంధించిన కొన్ని రంగులకి స్పష్టమైన ప్రతిస్పందన చూపిస్తాయి.[15] ప్రతిరోజూ ఒకే సమయంలో మేత వేయడం జరిగితే, ఆ సమయానికి అవి మేత కోసం ఎదురు చూడడం నేర్చుకుంటాయి. గోల్డ్ ఫిష్లలో ప్రేరణకి దారి తీయు శిక్షణా సాంకేతికతలను ఉపయోగించి లిమ్బో (నరకపు అంచు), స్లలోం (అవరోధాల మధ్య ఎగుడుదిగుడుగా పోవుట), తెచ్చుకొనుట మరియు సాకర్ (రెండు జట్లు బంతితో ఆడే క్రీడ), వంటి కిటుకులు నేర్పవచ్చు.[16]
పరిధి మరియు సహజావరణం[మార్చు]
గోల్డ్ ఫిష్‌లు 20 మీటర్లు (65.6 అడుగులు) లోతు కలిగిన కొలనులు మరియు ఇతర నెమ్మదిగా లేక నిలకడగా కదులు నీటి ప్రవాహాలలో నివసిస్తాయి. వాటి యొక్క సహజ వాతావరణం మితమైన ఎండలున్న ప్రదేశాలు నుంచి అధిక ఎండలు ఉన్న ఉష్నప్రదేశాలు వరకు ఉండవచ్చు. అవి జీవించు మంచినీటి యొక్క pH 6.0-8.0, మరియు జలకాఠిన్యత 5.0–19.0 dGH.[ఆధారం కోరబడింది]
అవి జీవించగల ఉష్ణోగ్రతల పరిధి 40–106 °F (4–41 °C) అయిననూ అవి అధిక ఉష్నోగ్రతలలో కొంత కాలమే జీవించగలవు. వేడిగానున్న ఉష్ణ స్థితికలిగిన చేపల తొట్టిలో జీవించుట వీటికి ప్రతికూలం మరియు వేడిగా లేని తొట్టిలో సహజ వాయువు యొక్క గాఢత ఎక్కువ ఉండుట వలన అనుకూలం. వేడిమి వాటిని కాల్చేస్తుందని కొందరి నమ్మకం. అయినప్పటికీ, గోల్డ్ ఫిష్ బాహ్య కొలనులలో ఎక్కడైతే తరచుగా 86 °F (30 °C) దీని కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగిపోవునో అక్కడ జీవించ గలవు.[ఆధారం కోరబడింది]
నీటి ఉష్ణోగ్రతలలోని ఆకస్మిక మార్పులు గోల్డ్ ఫిష్‌కి కూడా అపాయకరం. దుకాణంలో కొన్న గోల్డ్ ఫిష్‌ని కొలను లేక తొట్టిలోకి మారుస్తున్నప్పుడు, రవాణా చేయు పాత్రలోని ఉష్ణోగ్రతని, చేర్చ వలసిన పాత్ర యొక్క ఉష్ణోగ్రతతో సమానం చేయుటకు దాన్ని చేర్చవలసిన పాత్రలో కనీసం 20 నిమిషాలు ఉంచిన తరువాత చేపని అందులోకి వదలాలి. ఉష్ణోగ్రత తేడా ఎక్కువ ఉన్నచో, అనగా గది ఉష్ణోగ్రత 21 °C (70 °F) నుంచి చల్లటి ఉద్యానవనంలోని కొలను యొక్క ఉష్ణోగ్రత 4 °C (39 °F) వరకు ఉన్నప్పుడు, ఈ మార్చి ఉంచు సమయం రోజులు లేక వారాలు సాగును.[ఆధారం కోరబడింది]
గోల్డ్ ఫిష్ బతికి ఉన్న మొక్కలను తిను కారణంగా, మొక్కలు కలిగిన జలచారాల నుంచు పెట్టె (ఆక్వేరియం)లో మొక్కల ఉనికి సమస్యాత్మకమగును. కేవలం కొన్ని అక్వేరియం మొక్క జాతులు, ఉదాహరణకు క్రిప్తోకోరిన్ మరియు అనుబియాస్, గోల్డ్ ఫిష్‌తో పాటు జీవించగలవు కానీ వాటిని వేళ్ళతో పెళ్ళగించబడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్లాస్టిక్‌తో చేయబడిన మొక్కలు ఎక్కువ నాణ్యత కలిగి ఉన్ననూ, వాటి కొమ్మలు చేపలు వాటిని తాకినపుడు నొప్పి రేపవచ్చు లేక హాని కలిగించవచ్చు.[ఆధారం కోరబడింది]
ప్రత్యుత్పత్తి[మార్చు]
గోల్డ్ ఫిష్ తగినంత నీరు మరియు సరైన ఆహారం ఉన్నప్పుడే లైంగిక పరిపక్వత కలిగి ఉంటాయి. గోల్డ్ ఫిష్ ఎక్కువగా నిర్బంధించినప్పుడు, ప్రత్యేకంగా కొలను ఏర్పాటులో ప్రత్యుత్పత్తిని చేస్తాయి. చక్కగా పెంచితే, అవి ఇంటి లోపల కూడా ప్రత్యుత్పత్తి చేస్తాయి కానీ చిన్న పాత్రలో మాత్రం కనవు. సాధారణంగా ప్రజననం ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులు సంభవించినపుడు, తరుచుగా వసంతంలో జరుగుతుంది. మగవి ఆడ వాటిని తరుముతూ, గుడ్లని వదలమని, దబాలున కొట్టుట ద్వారా మరియు మెల్లగా కొట్టి సంజ్ఞ చేయుట ద్వారా ప్రోత్సహిస్తాయి.
గోల్డ్ ఫిష్, అన్ని ఇతర సైప్రినిడ్ చేపలలాగా గుడ్లను పెడతాయి. వాటి గుడ్లు జిగురుగా ఉండి జలచర సంబంధమైన మొక్కలకి అతుక్కుంటాయి. ఉదాహరణకి, కాబోంబ లేక ఎలోడియ వంటి దట్టమైన మొక్కకి గుడ్లు అతుక్కుంటాయి. చేపలను నిర్బంధించినపుడు, పెద్ద చేపలు చిన్నవాటిని తినే అవకాశం ఉండుట చేత గుడ్లను వేరే తొట్టిలోకి తరలించాలి. గుడ్లు 48 నుంచి 72 గంటలలో పొదుగుతాయి.
అప్పుడే పొదిగిన గుడ్డు లోంచి వచ్చిన పిల్లలు (చిన్నచేపల గుంపు (ఫ్రై)) "రెండు కనుగుడ్లతో ఉన్న కనురెప్ప వెంట్రుక" వలె ఉన్నాయని వర్ణిస్తారు. ఒక వారంలోపు, ఈ పిల్లలు వాటి యొక్క పూర్తి ఆకారాన్ని సంతరించుకున్నా, అవి పరిపక్వమైన గోల్డ్ ఫిష్ రంగుని తెచ్చుకొనుటకు ఒక సంవత్సర కాలం పట్టవచ్చు. అపుడు అవి తమ ఆటవిక పూర్వీకుల వలె లోహపు గోధుమరంగులో ఉంటాయి. అవి వాటి జీవితంలోని మొదటి వారాలలోనే, వేగంగా పెరగడం అనేది, వాటి పర్యావరణంలోని పెద్ద గోల్డ్ ఫిష్ చేపలు (లేక ఇతర చేపలు మరియు క్రిములు) వాటిని మింగేయకుండా ఒక ఉపయోజనం.
కొన్ని అధికంగా కను గోల్డ్ ఫిష్‌లు వాటి యొక్క మారిన ఆకారం కారణంగా ఎంత మాత్రమూ సహజంగా కనలేవు. కృత్రిమ ప్రజనన విధానమైన "హాండ్ స్ట్రిప్పింగ్" (చేతితో తొలగించుట) సహజసిద్ధంగా జరుగు క్రియకు తోడ్పడవచ్చును కానీ ఇది కచ్చితంగా చేయకపోతే చేపలకి హాని కలగవచ్చు.
దోమల నియంత్రణ[మార్చు]
ఇతర ప్రసిద్ధమైన ఆక్వేరియం చేపలకు, ఉదాహరణకు, గుప్పి, వలె గోల్డ్ ఫిష్ మరియు ఇతర కార్ప్ చేపలను తరుచుగా, కదలిక లేకుండా స్థిరంగా ఉండు నీటి క్షేత్రాలలోకి దోమల సంతతిని తగ్గించుటకు, కలుపుతారు. వలస పోవుటకు దోమల మీద ఆధారపడు వెస్ట్ నైల్ వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధించుటకు వీటిని ఉపయోగిస్తారు. అయినప్పటికీ, గోల్డ్ ఫిష్‌ల ప్రవేశం స్థానిక జీవ్యావరణ వ్యవస్థలలో తరచుగా వ్యతిరేక పర్యవసానాలు ఏర్పడతాయి.[17]
సరియైన విచారణ పై వివాదం[మార్చు]
కొన్ని దేశాలలో చేపలను పెంచుటకు వాడు పాత్రల అమ్మకాన్ని జంతు శ్రేయస్సు చట్టం కింద నిషేధించారు. దీనికి కారణం, అట్టి చిన్న పర్యావరణాలలో, ఎదుగుదల లేకపోవడం, ఆక్సిజెన్ తరిగిపోవటం మరియు అమ్మోనియా/నైట్రైట్ వలన విషపూరితమవ్వడం వంటి ముప్పులు ఉంటాయి. అధికమైన ఆక్సిజెన్ అవసరం మరియు అధికమైన వ్యర్ధాల బహిర్యానం కారణంగా, అట్టి పాత్రలు గోల్డ్ ఫిష్‌లకు ఇక ముందు ఎంత మాత్రమూ నివాసయోగ్యం కావని పరిగణించడమైనది.[18]
చాలా దేశాలలో, ఉత్సవం మరియు సంతలను యంత్రించువారు సాధారణంగా గోల్డ్ ఫిష్‌లను ప్లాస్టిక్‌తో చేసిన సంచులలో ఉంచి బహుమానాలుగా ఇస్తారు. 2005 చివరలో ఇటలీలోని రోమ్ నగరంలో గోల్డ్ ఫిష్‌లను ఉత్సవాల్లో బహుమానాలుగా ఉపయోగించుటను నిషేధించారు. రోమ్లో "గోల్డ్ ఫిష్ పాత్రల"ను కూడా, జంతువులను హింసిస్తున్న కారణంతో నిషేధించారు.[19] యునైటెడ్ కింగ్డంలోని ప్రభుత్వం జంతు సంక్షేమం చట్టం,[20][21]లో భాగంగా ఈ ఆచారాన్ని నిషేధించాలనే ప్రతిపాదన, అప్పటికి గోల్డ్ ఫిష్‌ను ఒంటరి అయిన చిన్న పిల్లలకు బహుమతిగా ఇచ్చుటను నివారించుటకు చట్టం సవరించబడినా, ఈ ప్రతిపాదన చేసింది.[22]
జపాన్లో వేసవి పండుగలలో మరియు మతపరమైన సెలవ (ఎన్నిచి)లలో, సాంప్రదాయకమైన గోల్డ్ ఫిష్ స్కూపింగ్ ఆటలో, క్రీడాకారులు గోల్డ్ ఫిష్‌ను పాత్రలో నుంచి ప్రత్యేకమైన చెంచాతో తీస్తారు. కొన్నిసార్లు ఎగిరి పడే బంతిని గోల్డ్ ఫిష్‌కి బదులుగా వాడతారు.
గోల్డ్ ఫిష్‌లను తినగలిగినప్పటికి, వాటిని అరుదుగా తింటారు. చాలా ఏళ్ళ పాటు అమెరికా కళాశాల విద్యార్థులలో గోల్డ్ ఫిష్‌ను మింగుట సాహస చర్యగాను మరియు సోదర భావమును పెంపొందించుననే వేలం వెర్రి వుండేది. 1939లో హార్వర్డ్ యునివేర్సిటిలో మొదటిసారిగా ఈ సంఘటన నమోదు అయినది .[23] చాలా దశాబ్దాలలో ఈ ఆచారం క్రమంగా జనాదరణను కోల్పోయినది మరియు ఈ రోజులలో అతి తక్కువగా కనబడుతున్నది.
ఇవి కూడా చూడండి[మార్చు]
- జలచర ప్రదర్శనశాల - వివిధ రకాలైన అక్వేరియాలు
- కార్ప్ చేప
- సైప్రినిడ్ - కార్ప్ కుటుంబంలోని ఇతర జాతులు
- గోల్డ్ ఫిష్‌కి అనువైన మొక్కల జాతుల కోసం మంచినీటి అక్వేరియం మొక్కల జాతుల జాబితా
గమనికలు మరియు సూచనలు[మార్చు]
- ↑ Gulf States Marine Fisheries Commission: Fact Sheet. Carassius auratus (Linnaeus, 1758)
- ↑ 2.0 2.1 Fishbase: Carassius auratus (Linnaeus, 1758)
- ↑ "Goldfish". Ocean Park. Retrieved 2009-11-16.
- ↑ 4.0 4.1 "Background information about goldfish". Retrieved 2006-07-28.
- ↑ నుత్రఫిన్ అక్వేటిక్ న్యూస్, ఇష్యూ #4, 2004, రోల్ఫ్ సి. హగెన్, ఇ ఎన్ సి. (యు ఎస్ ఎ) అండ్ రోల్ఫ్ సి. హగెన్ కార్ప్. (మోంట్ రియల్, కెనడా)
- ↑ "goldfish". Retrieved 2006-07-21.
- ↑ Brunner, Bernd (2003). The Ocean at Home. New York: Princeton Architectural Press. ISBN 1-56898-502-9.
- ↑ Mulertt, Hugo (1883). The Goldfish And Its Systematic Culture With A View To Profit. Retrieved 2009-07-07.
- ↑ గోల్డ్ ఫిష్
- ↑ గోల్డ్ ఫిష్
- ↑ Les Pearce. ""Common Gold Fish"". Aquarticles. Retrieved 20 June 2006.
- ↑ పాలిస్ డి లా కోవెర్టే సామాన్య విజ్ఞాన వస్తు ప్రదర్శనశాలలో 1994లో ఒక బహిరంగ ప్రయోగంలో ప్రదర్శించబడినది. ప్రయోగ వివరాల మరియు ఫలితాల యొక్క వివరణ: "Poissons rouges: la mémoire dans l'eau". Revue du Palais de la découverte. 217. April 1994.
- ↑ 2003లో, ప్లైమౌత్ యూనివర్శిటీలోని మనస్తత్వశాస్త్ర విభాగం వారి ఇటీవలి పరిశోధన. వాటికి మీటని లాగి ఆహారాన్ని పొందే శిక్షణని ఇచ్చారు. మీటని రోజుకి ఒక గంట పని చేయునట్లుగా బిగించినపుడు, చేపలు సరైన సమయానికి మీటని లాగుట నేర్చుకున్నాయి.
- ↑ డిస్కవరీ చానెల్ వారి మైత్ బస్టర్స్ కార్యక్రమంలో, గోల్డ్ ఫిష్ యొక్క జ్ఞాపక ఆయుర్దాయం కేవలం 3 సెకన్లు అనే సమకాలీన విషయాన్ని పరీక్షించి, గోల్డ్ ఫిష్‌కి సాధారణంగా నమ్మినదాని కంటే ఎక్కువ జ్ఞాపక ఆయుర్దాయం ఉన్నదని రుజువు చేయగలిగారు. ప్రయోగంలో చేపకి వ్యూహాన్ని ఛేదించుటకు శిక్షణ ఇస్తారు. అవి వ్యూహంలోని సరైన దారిని నెల కంటే ఎక్కువ కాలం తరువాత కూడా గుర్తు పెట్టుకున్నాయి అని స్పష్ట మయింది. [1]మైత్బస్టర్ ఫలితాలు: గోల్డ్ ఫిష్ యొక్క జ్ఞాపకం కేవలం మూడు సెకన్లు మాత్రమే నిలుస్తుంది.
- ↑ 2000ల మొదట్లో చేసిన అధ్యయనం ప్రకారం
- ↑ మీ చేపని విద్యాలయానికి పంపండి. ఎ బి సి వార్తలు: శుభోదయం అమెరికా.పోస్ట్ చేసిన: మే 7, 2008.
- ↑ http://www.mosquitoes.org/fpconst.html
- ↑ "5 reasons not to use goldfish bowls". Goldfish Care Guide. 2008-03-05. Retrieved 2009-02-01.
- ↑ Knight, Sam (2005-10-26). "Rome bans goldfish bowls, orders dog owners on walks - World - Times Online". The Times. London. Retrieved 2006-07-21.
- ↑ "Defra, UK - Animal Health and Welfare - Animal Welfare - Animal Welfare Bill". Retrieved 2006-07-21.
- ↑ ఆన్లయిన్ బిబిసి వార్తలు - గోల్డ్ ఫిష్‌ని బహుమానాలుగా ఇవ్వరాదు
- ↑ ఆన్లయిన్ బిబిసి వార్తలు - గోల్డ్ ఫిష్ బహుమానాల మీది నిషేధం ఎత్తేశారు'
- ↑ "Swallowing Goldfish". Retrieved 2006-07-21.
బాహ్య లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Carassius auratus. |
- "Carassius auratus". Integrated Taxonomic Information System.
- మూస:FishBase species alt
- లెస్ పియర్స్ యొక్క ది కామన్ గోల్డ్ ఫిష్
- గోల్డ్ ఫిష్ గురించి పూర్వ సమాచారం
- కేరేసియాస్ ఆరేటస్
- అతి ప్రాచీన గోల్డ్ ఫిష్, గొల్డి మీద వ్యాసం.
- రకాలు
- గోల్డ్ ఫిష్ పేజీలు - గోల్డ్ ఫిష్ ప్రమాణాలు, గోల్డ్ ఫిష్ రకాలు మరియు గోల్డ్ ఫిష్ సంరక్షణ గురించిన సమాచారాన్ని ఇచ్చు అభిరుచి గలిగిన వారి వెబ్ సైట్ .
- గోల్డ్ ఫిష్ రకాలు: పేజి 1 పేజి 2
- బ్రిస్టల్ అక్వేరిస్త్స్ ల సంఘం - వివిధ రకాల గోల్డ్ ఫిష్ ల ఛాయా చిత్రాలు మరియు వర్ణనలు
- గోల్డ్ ఫిష్ జన్యు శాస్త్రం- గోల్డ్ ఫిష్ యొక్క జన్యుశాస్త్ర మూలంలో, కారణభూతమైన క్రుసియన్ కార్ప్ మరియు ఆధునిక గోల్డ్ ఫిష్ జాతులను సృష్టించుటకు, జన్యుశాస్త్రానికి సంబంధించిన కంప్యూటర్లో వ్రాయబడిన సూత్రాలు ఏ విధంగా ఉపయోగించారో, మొదలగు అంశాల మీద కేంద్రీకృతమైనది.
- సంరక్షణ
- కోకోస్ గోల్డ్ ఫిష్ ప్రపంచం - గోల్డ్ ఫిష్ సంరక్షణకు అంకితం చేసిన వెబ్ సైట్‌లోని చిత్రాలు, సమాచారం మరియు స్నేహపూర్వక సమాజం.
- గోల్డ్ ఫిష్ సమాచారం గోల్డ్ ఫిష్ సంరక్షణ గురించిన గొప్ప సమాచారం
- గోల్డ్ ఫిష్ సంరక్షణ గురించి వికీ పుస్తకం
- గోల్డ్ ఫిష్ వ్యాధి
- చేప మొక్కలు
- మీ గోల్డ్ ఫిష్ యొక్క ప్రజననం
- ఇతరాలు
- గూగుల్ అనువాద వ్యాసాలు
- 'జాతి' మైక్రో తీరులు గల వ్యాసాలు
- All articles with unsourced statements
- Articles with unsourced statements from June 2010
- Articles with unsourced statements from March 2010
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Articles containing Japanese language text
- Articles with unsourced statements from December 2009
- గోల్డ్ ఫిష్
- చల్లని నీటి అక్వేరియం చేప
- చేపల పెంపకం
- పెంపుడు జంతువులు