గోల్‌మాల్ గోవిందం
గోల్‌మాల్ గోవిందం | |
---|---|
![]() గోల్‌మాల్ గోవిందం విసిడి కవర్ | |
దర్శకత్వం | తాతినేని రామారావు |
నిర్మాత | ఎ.వి. సుబ్బారావు |
రచన | చిలుకోటి కాశీ విశ్వనాథ్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | తాతినేని రామారావు |
కథ | మల్లాది వెంకట కృష్ణమూర్తి |
ఆధారం | గౌరి గణేష (1990) |
నటులు | రాజేంద్ర ప్రసాద్ అనూష |
సంగీతం | కె. చక్రవర్తి |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | జె. కృష్ణస్వామి బాలు |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్[1] |
విడుదల | 8 ఫిభ్రవరి 1992 |
నిడివి | 128 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గోల్‌మాల్ గోవిందం 1992, ఫిబ్రవరి 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్[2] పతాకంపై ఎ.వి. సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో తాతినేని రామారావు[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, అనూష జంటగా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[4] బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పొందింది.[5] మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన వెడ్డింగ్ బెల్ నవల ఆధారంగా రూపొందించబడిన గౌరి గణేష (1990) అనే కన్నడ సినిమాకి రిమేక్ ఇది.
కథా నేపథ్యం[మార్చు]
గోల్‌మాల్ గోవిందం (రాజేంద్ర ప్రసాద్) చిన్నచిన్న మోసాలు చేస్తూ బతుకుతుంటాడు. ఒక రోజు, అతను ఉచిత వసతి, భోజనం కోసం ఆసుపత్రిగా వెలుతాడు. అక్కడ కుమారి (శ్రీ భాను) అనే అమ్మాయి గుండెపోటుతో మరణిస్తుంది. గోవిందం ఆమె వస్తువులను తీసుకొని వాటినుండి కొంత డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఆ వస్తువులలో కుమారి డైరీని దొరుకుతుంది. తన జీవితాన్ని మార్చిన ముగ్గురు వ్యక్తుల గురించి కుమారి అందులో రాసింది. మొదటి వ్యక్తి ఆమె మాజీ బాస్ మన్మధరావు (గిరి బాబు), ఆమెను తనతో ఒకరోజు గడుపమన్నాడు. రెండవ వ్యక్తి రాజశేఖర్ (దిలీప్), తన తల్లిదండ్రులకు చూపించడానికి తన భార్యగా నటించాలని అందుకు బదులుగా ఆమెకు గుండె చికిత్స కోసం డబ్బులు ఇస్తానంటాడు. మూడవవ్యక్తి సుధాకర్ (సుధాకర్) రాజశేఖర్ స్నేహితుడు. తాగిన మైకంలో కుమారిని అనుభవించానని అనుకుంటాడు. నిజం ఏమిటంటే ఈ ముగ్గురిలో ఎవరికీ ఆమెతో శారీరక సంబంధం లేదు. ఈ ముగ్గురి నుండి డబ్బును తీపుకునేందుకు గోవిందం ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. కుమారి ఒక కొడుకుకు జన్మనిచ్చిందని, అతనికి గోపాల్ అని పేరు పెట్టారని గోవిందం వారికి ఉత్తరాలు రాస్తాడు. ఆ ముగ్గురూ ఒకే రోజు గోవిందంను కలవడానికి వస్తారు. దాంతో అనాథాశ్రమం నుండి గణపతి (మాస్టర్ ఆనంద్) అనే పిల్లవాడిని తీసుకువచ్చి గోల్‌మాల్ డ్రామా ఆడటం ప్రారంభిస్తాడు.
నటవర్గం[మార్చు]
- రాజేంద్ర ప్రసాద్ ( గోల్‌మాల్ గోవిందం)
- అనూష (విజయ)
- గొల్లపూడి మారుతీరావు (గోపాల కృష్ణయ్య)
- బేతా సుధాకర్ (సుధాకర్)
- గిరిబాబు (మన్మధరావు)
- దిలీప్ (రాజశేఖర్)
- చిలుకోటి కాశీ విశ్వనాథ్ (అనాథాశ్రమ వార్డెన్)
- కె.కె. శర్మ (శెట్టి)
- కృష్ణ చైతన్య (ఇంటి యజమాని)
- గాదిరాజు సుబ్బారావు (రౌడీ జగ్గడు)
- కళ్ళు చిదంబరం (గుండమ్మ భర్త)
- చిడతల అప్పారావు
- శ్రీభాను (కుమారి)
- శ్రీదేవి (సుకన్య)
- విజయదుర్గ (పార్వతమ్మ)
- కల్పనా రాయ్
- వై. విజయ (గుండమ్మ)
- మాస్టర్ ఆనంద్ (గణపతి/గోపాల్/రాజశేఖర్)
సాంకేతికవర్గం[మార్చు]
- చిత్రానువాదం, దర్శకత్వం: తాతినేని రామారావు
- నిర్మాత: ఎ.వి. సుబ్బారావు
- మాటలు: చిలుకోటి కాశీ విశ్వనాథ్
- కథ: మల్లాది వెంకట కృష్ణమూర్తి
- ఆధారం: గౌరి గణేష (1990)
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: హరి అనుమోలు
- కూర్పు: జె. కృష్ణస్వామి, బాలు
- నిర్మాణ సంస్థ: ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్
పాటలు[మార్చు]
Untitled | |
---|---|
ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు. లియో ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[6]
సంఖ్య. | పాట | గాయకులు | నిడివి | |
---|---|---|---|---|
1. | "గోల్‌మాల్ గోవిందం" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:29 | |
2. | "ఏం తాపమో" | మనో, ఎస్.పి. శైలజ | 4:29 | |
3. | "అందంలో చందురుడు" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:35 | |
4. | "డాడీ డాడీ" | ఎస్.పి. శైలజ | 4:46 | |
మొత్తం నిడివి: |
18:19 |
మూలాలు[మార్చు]
- ↑ "Golmaal Govindam (Overview)". IMDb.
- ↑ "Golmaal Govindam (Banner)". Chitr.com.
- ↑ "Golmaal Govindam (Direction)". Telugu Cinema Profile.
- ↑ "Golmaal Govindam (Cast & Crew)". gomolo.com.
- ↑ "Golmaal Govindam (Review)". The Cine Bay.
- ↑ "Golmaal Govindam (Songs)". Cineradham.[permanent dead link]
ఇతర లంకెలు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2021
- Articles with permanently dead external links
- 1992 తెలుగు సినిమాలు
- Articles which use infobox templates with no data rows
- నవల ఆధారంగా తీసిన సినిమాలు
- తెలుగు హాస్యచిత్రాలు
- రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
- చక్రవర్తి సంగీతం కూర్చిన పాటలు
- గొల్లపూడి మారుతీరావు చిత్రాలు
- సుధాకర్ నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన చిత్రాలు
- కల్పనా రాయ్ నటించిన సినిమాలు
- మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు