గోల్ గుంబద్

గోల్ గుంబద్ లేదా గోల్ గుంబజ్ : (Gol Gumbaz) or Gol Gumbadh, కన్నడ: ಗೋಲ ಗುಮ್ಮಟ, Urdu: گول گمبد, పర్షియన్ భాషలో گل گنبذ గుల్ గొంబాద్ అనగా గులాబీ గుమ్మటం, (గుమ్మటం చుట్టూ అడుగుభాగాన గులాబీ లేదా తామర రేకుల వంటి నిర్మాణం వుంటుంది, ఈ రేకుల మధ్యనుండి ఈ గుంబద్ మొగ్గలా వుంటుంది కావున దీనికా పేరు), ఇది బిజాపూరు సల్తనత్ కు చెందిన సుల్తాన్ ముహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. ఇది బీజాపూరు (కర్ణాటక) లో ఉంది. దబూల్ కు చెందినా యాకూబ్ అనే ఆర్కిటెక్ట్ దీనిని 1656 లో నిర్మించాడు. ఇది దక్కను సుల్తానుల నిర్మాణశైలికి ఒక మంచి ఉదాహరణ.[1]
నిర్మాణం
[మార్చు]ఈ నిర్మాణం ఘనాకారంలో వున్నది, 47.5 metres (156 ft) ప్రతి మూలా ఒక గుమ్మటం 44 m (144 ft) ఉండేలా నిర్మింపబడింది. ఇందోలో గల ఆర్చీలు షడ్ముఖ ఆకారంలో డిజైన్ చేయబడి ఉంది. నలువైపులా గల మీనార్లు (టవర్లు) ఏడు అంతస్తులు గలవి. వీటి లోపల ఎక్కడానికి మెట్ల నిర్మాణం ఉంది.[1] పై భాగంలో గుంబద్ చుట్టూ విశాలభాగం ఉంది. సమాధి గల హాలులోని మధ్య భాగంలో చతురస్రాకారంలో ఒక అరుగు వున్నది, సరిగా ఈ అరుగు క్రింది భాగానగల హాలులో అసలు సమాధి ఉంది.[1] With an area of 1,700 m2 (18,000 sq ft), [2] ఈ గుంబద్ భారతదేశంలోనే అతి పెద్ద గుంబద్.
ఈ గుంబద్ లోపలి భాగంలో చేసే చిన్న శబ్దం సైతం సమాధి అవతలి భాగంలో వినబడుతుంది.[2]
చిత్రమాలిక
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Michell, George; Zebrowski, Mark (1999). Architecture and Art of the Deccan Sultanates. The New Cambridge History of India. Vol. I.8. Cambridge, UK: Cambridge University Press. pp. 92–4. ISBN 0-521-56321-6. Retrieved 14 September 2011.
- ↑ 2.0 2.1 Archaeological Survey of India (2011). "Gol Gumbaz, Bijapur". Archaeological Survey of India. Archaeological Survey of India. Retrieved 14 September 2011.
బయటి లింకులు
[మార్చు]- Pages using gadget WikiMiniAtlas
- Articles containing Kannada-language text
- Articles containing Urdu-language text
- Pages using Lang-xx templates
- Articles containing Persian-language text
- Commons category link is the pagename
- 1659 కట్టడాలు
- కర్ణాటక పర్యాటక ప్రదేశాలు
- ఆదిల్ షాహి వంశం
- భారత్ లోని సమాధులు
- గుంబద్ లు
- కర్ణాటక





