గౌరీ జోగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌరీ జోగ్
కథక్ నృత్యం చేస్తున్న గౌరీ జోగ్
జననం
గౌరీ కాలే

1970
వృత్తికథక్ డాన్సర్, టీచర్, కొరియోగ్రాఫర్
వెబ్‌సైటుhttp://www.gaurijog.com

గౌరీ జోగ్ (జననం 1970) చికాగోకు చెందిన కథక్ నర్తకి, కొరియోగ్రాఫర్, రీసెర్చ్ స్కాలర్. ఆమె లక్నో, జైపూర్ ఘరానా శైలిలో ప్రసిద్ధి చెందింది. ఆమె క్రియేషన్స్‌లో కృష్ణ లీల,[1] శకుంతల, ఝాన్సీ కి రాణి, కథక్ యాత్ర,[2] ఈస్ట్ మీట్స్ వెస్ట్, ఫైర్ - ది ఫైరీ టేల్[3] వంటివి ఉన్నాయి.

ఆమె కథక్‌లోని సాంకేతిక అంశాల ద్వారా సాంప్రదాయ ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ కు ప్రాణం పోసింది. సాంప్రదాయం సరిహద్దులను దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే కొన్ని బాలీవుడ్ స్టెప్పులు, యోగాను కథక్‌లో చేర్చింది. దీంతో ఆమె ముఖ్యంగా యువ తరంలో బాగా ప్రాచుర్యం పొందింది. కథక్‌ని ఫ్లేమెన్‌కో, భరతనాట్యం, ఒడిస్సీ, మెక్సికన్, అమెరికన్ బ్యాలెట్‌లతో కలిపి ఆమె చేసిన ప్రయోగాలు ఎన్నో ప్రశంసలు పొందాయి. 1999 నుండి గౌరీ జోగ్, ఆమె బృందం ఉత్తర అమెరికా, భారతదేశంలో 325 కంటే ఎక్కువ నృత్య ప్రదర్శనలను ఇచ్చింది.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

గౌరీ జోగ్ 1970లో నాగపూర్‌లో జన్మించింది. ఆమె 5 సంవత్సరాల వయస్సులో నృత్య శిక్షణ ప్రారంభించింది. ఆమె 7 సంవత్సరాల వయస్సులో తన మొదటి ప్రదర్శన ఇచ్చింది. నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో మాస్టర్స్ పట్టా పుచ్చుకుంది.

లక్నో ఘరానాకు చెందిన గురు మదన్ పాండే నుండి ఆమె క్రమశిక్షణతో కూడిన శిక్షణను కథక్ లో పొందింది. ఆమె అభినయ కళకు ప్రసిద్ధి చెందిన జైపూర్ ఘరానాకు చెందిన లలితా హర్దాస్ వద్ద కూడా కథక్ నృత్యాన్ని అభ్యసించింది. అలాగే ఆమె ముంబైకి చెందిన మధురితా సారంగ్ కి కూడా శిష్యురాలు. ఆమె పండిట్ బిర్జు మహారాజ్‌తో సహా భారతదేశంలోని ప్రముఖ కథక్ గురువులచే అనేక వర్క్‌షాప్‌లను నిర్వహించింది. ఆమె కథక్‌లోని లక్నో, జైపూర్ ఘరానా కలయికను అభ్యసించింది.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Asian Media USA, Krishna Leela – an artistic portrayal of Lord Krishna's life story, 14 April 2014". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 12 మార్చి 2023.
  2. Jog/articleshow/12452430.cms Times Of India, Journey of Indian dance by Gauri Jog, 29 March 2012
  3. Narthaki, Fire – the Fiery Tale - Gauri Jog and her group captivate the audience, 17 March 2007
"https://te.wikipedia.org/w/index.php?title=గౌరీ_జోగ్&oldid=3882704" నుండి వెలికితీశారు