Jump to content

గ్యాల్‌షింగ్ జిల్లా

వికీపీడియా నుండి
పశ్చిమ సిక్కిం జిల్లా
సిక్కిం రాష్ట్ర జిల్లా
Ruins
రాబ్డెంట్సే ప్యాలెస్
సిక్కింలోని ప్రాంతం ఉనికి
సిక్కింలోని ప్రాంతం ఉనికి
రాష్ట్రంసిక్కిం
దేశంభారతదేశం
ముఖ్య పట్టణంగెయ్‌జింగ్
విస్తీర్ణం
 • Total1,166 కి.మీ2 (450 చ. మై)
జనాభా
 (2011)
 • Total1,36,299
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitehttp://wsikkim.gov.in

పశ్చిమ సిక్కిం భారతీయ రాష్ట్రాలలో ఒకటైన సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో ఒకటి. జిల్లా కేంద్రం గెయ్‌జింగ్ నగరం.

చరిత్ర

[మార్చు]

పశ్చిమ సిక్కిం పురాతన యుక్సం రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. 1642 నుండి 50 సంవత్సరాలకాలం రాజధానిగా ఉంటూ వచ్చింది. తతువాత రాజధాని రాబ్టెంస్‌కు తరలించబడింది. ఈ జిల్లా 18-19 వశతాబ్దంలో 30 సంవత్సరాల కాలం నేపాలీయుల ఆక్రమణలో ఉంది. గోర్కాయుద్ధానంతరం ఈ జిల్లా సిక్కింలో విలీనం చెయ్యబడింది.

భౌగోళికం

[మార్చు]

పశ్చిమ సిక్కిం వైశాల్యం 1166 చ.కి.మీ. ఇక్కడి ఖెచియీపేరి సరసు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మొట్టమొదటి మొనాస్ట్జ్రీ డుబ్ది, ఖెచియీపేరి సరసుల ప్రదేశంలో ఒక్క ఆకు కూడా రాలడానికి వీలులేకుండా చూసుకుంటుంటారు.

జాతీయ అభ్యారణ్యం

[మార్చు]
  • కాంచన జంగా నేషనల్ పార్క్

ప్రయాణవసతి

[మార్చు]

తరచుగా భూఊచకోత కాతణంగా రోడ్లపరిస్థితి దీనావస్థలో ఉంది. పలు విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉన్న కారణంగా విద్యుత్తు సరఫరా నిరంతరాయంగా లభిస్థుంది.

ఆర్ధికం

[మార్చు]

జిల్లా ప్రజల ఆదాయవనరు వ్యవసాయం. పర్వతసానువులలో అధికభాగం రాళ్ళురప్పలతో నిండి ఉన్నప్పటికీ ప్రజలు వర్షాధారవ్యవసాయాన్ని ప్రధాన ఆదాయంగా ఎనుచుకుని జీవిస్తున్నారు.

గణాంకాలు

[మార్చు]

జిల్లాలో అత్యధికంగా నేపాలీ వారసత్వం కలిగిన వారు కనుక జిల్లా ప్రజలలో అత్యధికులు నేపాలీ భాషను మాట్లాడుతుంటారు. లెప్చా, భుటియా ప్రజలు తరువాత స్థానంలో ఉన్నారు.

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 136,299, [1]
ఇది దాదాపు గ్రనేడ్ దేశజనసంఖ్యకు సమం [2]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 608 వ స్థానంలో ఉంది. .[1]
1చ.కి.మీ జనసాంద్రత 107 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 10.58%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 941:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 78.69%.[1]
జాతియ సరాసరి (72%) కంటే

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

జిల్లాలో అత్యధికంగా విభిన్న జంతుజాలం, వృక్షజ్జాలం ఉన్నాయి. జిల్లా అంతా పర్వతాలు నిండి ఉన్నందున అహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.సముద్రమట్టానికి 3,800 అడుగుల ఎత్తులో ఉన్న కొండచరియలు రోడోడెండ్రాన్ అరణ్యాలు నిండి ఉన్నాయి. 1977లో పశ్చిమ సిక్కిం జిల్లాలో " కాంచన్ జంగ్ నేషనల్ పార్క్ " లోని కొంతభాగం (1784చ.కి.మీ) ఉంది.[3] ఈ పార్కులో కొంతభాగం ఉత్తర సిక్కిం జిల్లాలో ఉంది.[3]

పాలనా విభాగాలు

[మార్చు]

పశ్చిమ సిక్కిం పాలనా పరంగా 2 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది :[4]

పేరు ప్రధానకార్యాలయం గ్రామాల సంఖ్య[5] ప్రాంతం
గ్యాల్షింగ్ గ్యాల్షింగ్
సొర్రెంగ్ సొర్రెంగ్

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Grenada 108,419 July 2011 est.
  3. 3.0 3.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: Sikkim". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
  4. Sikkim Administrative Divisions (PDF) (Map) (in English). The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 2011-09-29.{{cite map}}: CS1 maint: unrecognized language (link)
  5. "MDDS e-Governance Code (Sikkim Rural)" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. 2011. Retrieved 2011-10-15.

వెలుపలి లింకులు

[మార్చు]