Jump to content

గ్రంథాలయ ఉద్యమం

వికీపీడియా నుండి
(గ్రంథాలయ ఉద్యమము నుండి దారిమార్పు చెందింది)
గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య

ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతులను చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం ఉపయోగపడింది. గ్రంథాలయోద్యమ పితామహునిగా పేరొందిన అయ్యంకి వెంకటరమణయ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయోద్యమం ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా భారత స్వాతంత్ర్య, తెలంగాణా సాయుధ పోరాటం ఉద్యమాలలో భాగం వహించింది.

ఉద్యమ పూర్వస్థితి

[మార్చు]

ఆధునిక పద్ధతుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటైన తొలి గ్రంథాలయం విశాఖపట్టణంలో ఏర్పాటుచేశారని పరిశోధకులు భావిస్తున్నారు. 1886లో విశాఖపట్టణంలో మంతిన సూర్యనారాయణమూర్తి ఈ పౌరగ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఆంగ్లభాషా సంస్కృతుల ప్రభావం, ఇతర దేశాల్లోని గ్రంథాలయాల గురించిన సమాచారం ప్రజలకు లేకపోయినా స్వంత ప్రేరణపై ఆయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇలా ఆసక్తి ఉత్సాహంతో ఆంధ్రదేశమంతటా (బళ్ళారితో కలుపుకుని) 1905 నాటికి 20 గ్రంథాలయాలు స్థాపించబడినట్టు లెక్కకువచ్చాయి. పలు ఉద్యమాలు, సాహిత్య సృష్టి వంటి కారణాలతో 1913 నాటికి వీటి సంఖ్య 123కు పెరిగింది. ఆపైన గ్రంథాలయోద్యమం ప్రారంభమై ఇతర ఉద్యమాలకు చేయూతనివ్వడమే కాక పలు రంగాల్లో తెలుగువారి చైతన్యానికి చేయూతనిచ్చింది.[1]

ఉద్యమ క్రమం

[మార్చు]

1911లో రామమోహన గ్రంథాలయాన్ని అయ్యంకి వెంకటరమణయ్య స్థాపించారు. ఆయన 1914లో విజయవాడ ఆంధ్రదేశ గ్రంథ భాండాగార ప్రతినిధులతో గ్రంథాలయ మహాసభలు నిర్వహించారు. 1915లో భారతదేశంలోని తొలి గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం తరఫున ఇండియన్ లైబ్రరీ జర్నల్ను ప్రారంభించారు. ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటుచేయడం, ప్రజలకు అక్షరజ్ఞానం కల్పించడం వంటివి ఇందులో భాగం. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రంథాలయ సంఘాల కార్యదర్శులు 1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త గ్రంథాలయాలను ప్రారంచించారు. మూసివేయబడిన గ్రంథాలయాలు ఎన్నో పునరుద్ధరించారు. 1920, 1934ల్లో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఉద్యమనిర్వహణలో భాగంగా గ్రంథాలయ సంఘాల ప్రతినిధులు ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామంలోనూ పర్యటించారు.

గ్రంథాలయ మహాసభలు

[మార్చు]

1914లో ప్రారంభమైన గ్రంథాలయ మహాసభలు రాష్ట్రంలోని గ్రంథాలయాల అభివృద్ధికి, గ్రంథాలయోద్యమ రూపకల్పనకూ చేయూతనిచ్చాయి. మొదటి గ్రంథాలయ మహాసభలు 1914 ఏప్రిల్ 10న విజయవాడలో రామమోహన ధర్మపుస్తకభాండాగారం ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మహాసభలకు ప్రముఖ కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం అధ్యక్షత వహించారు. అప్పటికే రాష్ట్రంలోని గంజాం, విశాఖపట్టణం, గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, నెల్లూరు ప్రాంతం, కడప, కర్నూలు మొదలుకొని బళ్ళారి వరకూ ఏర్పాటైన 60 గ్రంథాలయాల నుంచి 200 మంది ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేశారు. మొదటి గ్రంథాలయ మహాసభల సందర్భంగా ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘం ఏర్పాటుచేశారు.

నైజాం రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ

[మార్చు]

1928లో సూర్యాపేటలో మహావైభవంగా జరిగిన ఆంధ్రసభలలో గ్రంథాలయ మహాసభకు దేశభక్త వామన నాయకు గారు అధ్యక్షత వహించిరి.[2] వామన నాయకుగారు మిక్కిలి సమర్థతతోడను, ఉత్సాహముతోడను ఆంధ్రభాషయందే సభా కార్యక్రమమును జరిపిరి. గ్రంథాలయోద్యమమును నైజాము రాష్ట్రములోని ఆంధ్ర జిల్లాలయందు వ్యాపింపజేయుటకుగాను ఒక ప్రచారకుని వేతనమునకై రు. 300 లు విరాళము నిచ్చెదమని అధ్యక్షులు వాగ్దానము జేసిరి. కేంద్రసంఘ యాజమాన్యమున నొక గ్రంథాలయ ఉపసంఘము ఏర్పరుప బడింది. ఈయుపసంఘమునకు శ్రీదేశభక్త నాయకగారు అధ్యక్షులుగ నుండ నంగీకరించిరి.

బరోడా గ్రంథాలయ పద్ధతిని ప్రవేశపెట్టుటకును గ్రంథాలయములకు విద్యాశాఖ నుండియు లోకలుఫండునుండియు సహాద్రవ్యమిప్పించుటకును, లోకల్ఫండు ఆదాయంలో పండ్రెండవభాగమును గ్రంథాలయోద్యమమునకై ప్రత్రేకించుటకును, ఈయుధ్యమమున కాటంకముగా నున్న ప్రభుత్వమువారి సర్కులరులను వెంటనే రద్దుచేయించ వలసినదనియు--హైదరాబాదులోని ప్రభుత్వ ధర్మగ్రంథాలయమునందు ఆంధ్ర మహారాష్ట్ర కర్నాటక సంస్కృతగ్రంథము

బరోడా గ్రంథాలయ పద్ధతిని ప్రవేశపెట్టుటకును గ్రంథాలయములకు విద్యాశాఖ నుండియు లోకలుఫండు నుండియు సహాయద్రవ్య మిప్పించుటకును, లోకల్ఫండు ఆదాయములో పండ్రెండవభాగమును గ్రంథాలయోద్యమమునకై ప్రత్యేకించుటకును, ఈ యుద్యమమున కాటంకముగా నున్న ప్రభుత్వమువారి సర్క్యులరులను వెంటనే రద్దు చేయించ వలసినదనియు - హైదరాబాదులోని ప్రభుత్వ ధర్మగ్రంథాలయమునందు ఆంధ్ర మహారాష్ట్ర కర్నాటక సంస్కృత గ్రంథములనుకూడ ఉంచవలయుననియు - దీనిని సెలవులలో మూయకుండ ఏర్పాటుల చేయవలయుననియు - గ్రంథాలయ సంబంధములగు సభలను ముందు ప్రభుత్వాధికారులు ఆపకుండ ఏర్పాటుల చేయవలసిన దనియు ప్రభుత్వమువారు ప్రార్థింప బడిరి.

  • ఆంధ్ర గ్రంథాలయ సంఘం

1914లో ఆంధ్రదేశంలోని గ్రంథాలయాల ఏర్పాటును, నిర్వహణను ప్రోత్సహించేందుకు ఆంధ్రదేశ గ్రంథభాండాగార సంఘం ఏర్పాటుచేశారు. సంఘానికి తొలి అధ్యక్షునిగా మోచర్ల రామచంద్రరావు పంతులు వ్యవహరించారు. కార్యదర్శులుగా అయ్యంకి వెంకటరమణయ్య,

ఉద్యమ నేతలు

[మార్చు]

ఎందరో గ్రంథాలయోద్యమ నేతలు ప్రజా ఉద్యమాలలో పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేశారు. కొందరు యువకులు గ్రంథాలయాల ద్వారా పుస్తక విజ్ఞానాన్ని తద్వారా జరుగుతున్న అన్యాయాలను అర్థం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉద్యమాలలో నాయకులుగానూ ఎదిగారు. గ్రంథాలయోద్యమానికి నాయకులైన కొందరు ప్రముఖులు వీరు:

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్-గ్రంథాలయోద్యమము:పి.నాగభూషణం:1957
  2. నైజామురాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ, గ్రంథాలయ సర్వస్వము, సంపుటి 7, సంచిక 1, జూలై 1928, పేజీలు: 9-10
  • అయ్యంకి వి. మురళీకృష్ణ (సం.) గ్రంథాలయ జ్యోతి: గ్రంథాలయ పితామహ శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి వ్యాస, ఉపన్యాస సంపుటి (1918-1966), 2014