గ్రంధి సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రంధి సుబ్బారావు
మరణం2017 మార్చి 24
వృత్తివ్యాపారవేత్త

గ్రంధి సుబ్బారావు ఒక ప్రముఖ వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి ఉత్పత్తి చేసే క్రేన్ సంస్థల అధిపతిగా సుప్రసిద్ధుడు. అనేక చోట్ల దేవాలయాలు, అన్నదాన సత్రాలు కట్టించాడు.[1]

ఈయన 1952లో స్థాపించిన క్రేన్ కంపెనీ యాభై ఏళ్ళలో వందల కోట్ల కంపెనీగా ఎదిగింది. [2] ఈయన మార్చి 24, శుక్రవారం, 2017 న గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశాడు.

వ్యక్తిగతం[మార్చు]

ఆయన ఆరో తరగతి దాకా చదివాడు. గుమాస్తాగా తన జీవితాన్ని ప్రారంభించాడు. మొదటగా వాణి వక్క పలుకులు అనే పేరుతో 100 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. తరువాత వ్యాపారంలో పోటీ పెరిగింది. దాంతో పేరును నంబర్ 1 వాణి వక్కపొడి అని పేరు మార్చాడు. ఈ వ్యాపారం మొట్టమొదటగా ప్రాచుర్యం పొందింది మంగళగిరిలో. సుబ్బారావుకు ఒక కుమారుడు, నలుగుగు కుమార్తెలు ఉన్నారు.

నీడ అనే చిత్రానికి నిర్మాణ సహకారం అందించాడు. హరికృష్ణ కథానాయకుడిగా వచ్చిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అనే సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు.

సేవలు[మార్చు]

ఈయన పలు దేవాలయాలు, అన్నదాన సత్రాలు కట్టించాడు. వేదాలు, ఉపనిషత్తులు సేకరించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. గుంటూరులో సంపత్ నగర్ లో అయ్యప్ప దేవాలయం నిర్మించాడు. ఈ ఆలయం కేంద్రంగా ప్రతియేటా అయ్యప్ప దీక్ష తీసుకున్న 2500 మందికి ఉచితంగా 40 రోజులపాటు భిక్షను ఏర్పాటు చేశాడు.

ఆయన మాటలు[మార్చు]

  • వృధా అని తెలిసి కూడా శ్రమని వృధా చేస్తే నీవు వృధా అయిపోతావు.
  • నీలో ఉన్న శక్తి ఎంటో అర్హత ఏమిటో తెలుసుకొని అది పెంచుకోవటానికి ప్రయత్నించు లేనిదాని కోసం ఆరాటపడితే ఉన్నది పోతుంది.
  • ఎవరికి వారు తమని ఎక్కువ అంచనా వేసుకోకూడదు. సాటి వారిని అంచనాల్లో ఇరికించకూడదు. యదార్థాలను యదార్థాలతోనే పలకరించాలి.
  • నా స్నేహితంలో ఇచ్చి పుచ్చుకోవడాలుండవు. అప్పు ఇవ్వను, ఇస్తే అడగాలనిపిస్తుంది. ఇవ్వాల్సి వస్తే ఆశించకుండా సహాయం చేస్తాను.
  • జీవితంలో ఉపయోగపడని అనుభవం అంటూ ఏది ఉండదు

మూలాలు[మార్చు]

  1. "ప్రజాశక్తిలో మరణ వార్త". prajasakti.com. ప్రజాశక్తి. Archived from the original on 24 March 2017. Retrieved 24 March 2017.
  2. "క్రేన్ వక్కపొడి సృష్టికర్త కన్నుమూత". telugu.v6news.tv. v6news. Archived from the original on 25 మార్చి 2017. Retrieved 24 March 2017.