గ్రీన్ కంప్యూటింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రీన్ కంప్యూటింగ్ లేదా గ్రీన్ ఐటి అనేది కంప్యూటర్‌ల వాడకంలో లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంలో పర్యావరణ సుస్థిరతను సూచిస్తుంది. హార్నేస్సింగ్ గ్రీన్ ఐటి- ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్తీసెస్ అనే వ్యాసంలో సాన్ మురుగేసన్ గ్రీన్ కంప్యూటింగ్ రంగాన్ని "కంప్యూటర్లు, సర్వర్లు మరియు వాటికి అనుబంధంగా ఉండే మానిటర్లు, ప్రింటర్లు, స్టోరేజ్ పరికరాలు, అదేవిధంగా నెట్ వర్కింగ్ మరియు సమాచార వ్యవస్థలను పర్యావరణం పై ఎటువంటి ప్రభావము లేకుండా లేదా చాలా తక్కువ ప్రభావం చూపేలా ఏ విధంగా నమూనాలు రూపొందిస్తాము, తయారు చేస్తాము, వినియోగిస్తాము మరియు అవసరం తీరాక పారవేస్తాము అనే విషయాన్ని అధ్యయనం చేయడం మరియు సాధన చేయడం"గా నిర్వచించారు.[1] గ్రీన్ కంప్యూటింగ్ యొక్క ఉద్దేశాలు గ్రీన్ కెమిస్ట్రీ యొక్క ఉద్దేశ్యాలను పోలి ఉంటాయి; ప్రమాదకరమయిన పదార్ధాల వినియోగాన్ని తగ్గించడం, ఆ వస్తువు యొక్క జీవిత కాలంలో శక్తిని వీలైనంత సమర్ధవంతంగా వినియోగించుకోవడం, మరియు పనికిరాకుండా పోయిన ఉత్పత్తులు మరియు ఫ్యాక్టరీ వ్యర్ధాలను రీసైకిల్ చేసేలా లేదా భూమిలో కలిసిపోయేలా చేసేందుకు ప్రోత్సహించడం. సమర్థవంతమైన కంప్యూటర్ టెక్నాలజీని రూపొందించేందుకు అవసరమైన వ్యవస్థలను మరియు అల్గార్ధంలను రూపొందించడంతో పాటు కంప్యూటర్లను వీలైనంత తక్కువ శక్తిని వినియోగించుకునే విధంగా తయారు చేసేందుకు పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

మూలాలు[మార్చు]

1992లో యు.ఎస్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనే సంస్థ మొదటి సారిగా మానిటర్లు, వాతావరణ నియంత్రణ పరికరాలు మరియు ఇతర సాంకేతిక పరికరాల శక్తీ వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించే మరియు గుర్తించే ఉద్దేశంతో ఎనర్జీ స్టార్ అనే స్వచ్ఛంద లేబులింగ్ కార్యక్రమాన్ని రూపొందించింది.

దీని ఫలితంగానే అనేక వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాలలో స్లీప్ మోడ్ను ప్రవేశపెట్టడం జరిగింది. గ్రీన్ కంప్యూటింగ్ అనే పదం బహుశ ఈ ఎనర్జీ స్టార్ కార్యక్రమం ప్రారంభమయిన కొద్ది కాలానికే వాడుక లోనికి వచ్చినట్లు భావించవచ్చు; 1992 కు ముందు కూడా ఈ పదాన్ని ఈ అర్థంలో వినియోగిస్తూ అనేక USENET పోస్ట్లులు ఉన్నట్లు తెలుస్తుంది.[2] ఇదే సమయంలో టిసివో డెవలప్మెంట్ అనే స్వీడిష్ సంస్థ CRT ఆధారిత కంప్యూటర్ డిస్ప్లే నుండి తక్కువ విద్యుదయస్కాంత కిరణాలు వెలువడేలా ప్రోత్సహించేందుకు గాను TCO సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం తరువాతి కాలంలో శక్తి వినియోగానికి సంబంధించిన ప్రమాణాలకు, ఎర్గోనోమిక్స్ మరియు నిర్మాణ రంగంలో ప్రమాదకర పదార్ధాల వినియోగాన్ని నియంత్రించేందుకు విస్తరించడం జరిగింది.[3]

నియంత్రణలు మరియు పరిశ్రమ యొక్క ప్రయత్నాలు[మార్చు]

ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ సమాచార మరియు ప్రసార సాంకేతిక విధానాలు, పర్యావరణము మరియు వాతావరణ మార్పులు వంటి 90 కి పైగా ప్రభుత్వ మరియు పరిశ్రమ యొక్క గ్రీన్ ICT లపై చేసిన అధ్యయనాన్ని ప్రచురించడం జరిగింది. ICT ల రూపకల్పనలో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది కాని భూతాపము మరియు పర్యావరణ క్షీణత వంటి వాటిని ఎదుర్కునే విధంగా వీటిని అమలు చేయడంపై దృష్టి పెద్దగా ఉండడం లేదని ఈ నివేదిక అభిప్రాయ పడింది. సాధారణంగా కేవలం 20% ప్రయత్నాలు మాత్రమే అంచనా వేయగలిగిన లక్ష్యాలను కలిగి ఉన్నాయి. ఇందులో వ్యాపార సంస్థలలో కన్నా ప్రభుత్వ కార్యక్రమాలలో మరింత తరచుగా ఈ లక్ష్యాలను నిర్ణయించుకోవడం జరుగుతుంది.[4]

Energy Star logo.svg

ప్రభుత్వం[మార్చు]

అనేక ప్రభుత్వ సంస్థలు గ్రీన్ కంప్యూటింగ్ ను ప్రోత్సహించేందుకు తగిన ప్రమాణాలను మరియు నిబంధనలను అమలు చేస్తూనే ఉన్నాయి. అక్టోబరు 2006 లో ఎనర్జీ స్టార్ కార్యక్రమము సమీక్షించబడి కంప్యూటర్ పరికరాలకు మరింత కఠినమైన సామర్థ్య ప్రమాణాలు మరియు అనుమతించబడిన ఉత్పత్తులకు అంచెలలో శ్రేణీకరణ పద్ధతులు చేర్చబడ్డాయి.[5][6]

కొన్ని ప్రయత్నాలలో తయారీదారులే పరికరాల యొక్క అవసరం తీరాక వాటిని పారవేసే బాధ్యత తీసుకోవలసి వుంటుంది. దీనినే విస్తరించబడిన ఉత్పత్తిదారుని బాధ్యత అని అంటారు. ప్రమాదకర పదార్ధాలపై ఆంక్షలు విధించే ప్రమాదకర పదార్ధాల ఆంక్షల ఆదేశము 2002/95/EC, వ్యర్ధ ఎలెక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ పరికరాలపై ఉన్న వ్యర్ధ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల ఆదేశము 2002/96/EC వంటి యూరొపియన్ యూనియన్ యొక్క ఆదేశాల ప్రకారం 2006 జూలై 1 నుండి ప్రారంభించి, మార్కెట్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలలో పాలిబ్రోమినేటేడ్ బైఫినైల్ మరియు పాలిబ్రోమినేటేడ్ డైఫినైల్ యీథర్స్ వంటి తేలికగా అంటుకునే పదార్ధాలను మరియు భారీ లోహాలను వేరే పదార్ధాలతో మార్పు చేయవలసి ఉంది. ఈ ఆదేశాల ప్రకారం ఉత్పత్తిదారులే పాత పదార్ధాలను సేకరించి, రిసైకిల్ చేసే బాధ్యతను కలిగి ఉంటారు.[7]

పాతపడిపోయిన కంప్యూటర్లు మరియు వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం 26 యుఎస్ రాష్ట్రాలు రాష్ట్ర స్థాయి రిసైకిలింగ్ కార్యక్రమాలను ప్రారంభించాయి.[8] నిబంధనల ప్రకారం రిటైల్ గా అమ్మిన ప్రతి వస్తువు పై "అడ్వాన్సు రికవరీ ఫీజు"ను విధించడం లేదా ఆ వస్తువు వినియోగం తీరాక ఉత్పత్తిదారుడే దానిని తిరిగి తీసుకునే ఏర్పాటు చేయడం చేయాలి.

పరిశ్రమ[మార్చు]

 • క్లైమేట్ సేవర్స్ కంప్యూటింగ్ ఇనిషిఏటివ్ (CSCI) అనేది పనిచేస్తూ లేక పనిచేయని దశలో ఉన్న వ్యక్తిగత కంప్యూటర్ల యొక్క విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఒక ప్రయత్నం.[9] CSCI తన సభ్య సంస్థల యొక్క గ్రీన్ ఉత్పత్తుల జాబితాలను మరియు వ్యక్తిగత కంప్యూటర్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది 2007-06-12 న ప్రారంభమయింది. 1999 లో ప్రారంభించబడిన వరల్డ్ వైడ్ ఫండ్ యొక్క క్లైమేట్ సేవర్స్ కార్యక్రమం నుండి దీనికి ఈ పేరు రావడం జరిగింది.[10] వరల్డ్ వైడ్ ఫండ్ కు కూడా కంప్యూటింగ్ ఇనిషిఏటివ్ లో సభ్యత్వం ఉంది.[9]
 • ది గ్రీన్ ఎలక్ట్రానిక్ కౌన్సిల్ అనే సంస్థ "గ్రీన్" కంప్యూటింగ్ సిస్టంల యొక్క కొనుగోలులో సహకరించే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పర్యావరణ అంచనా సాధనాన్ని (EPEAT)అందిస్తుంది. ఈ కౌన్సిల్ ఉత్పత్తుల యొక్క సామర్థ్యము మరియు సుస్థిరతకు సంబంధించిన 28 అంశాల ఆధారంగా కంప్యూటింగ్ పరికరాలను అంచనా వేస్తుంది. 2007-01-24 న అధ్యక్షులు జార్జి బుష్ అన్ని యునైటెడ్ స్టేట్స్ యొక్క ఫెడరల్ సంస్థలు కంప్యూటర్ సిస్టంల కొనుగోలులోను EPEAT ను ఉపయోగించవలసిందిగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13423 ను జారీ చేయడం జరిగింది.[11][12]
 • గ్రీన్ గ్రిడ్ అనేది డేటా కేంద్రాలలో మరియు బిజినెస్ కంప్యూటింగ్ ఎకో సిస్టంలలో శక్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఏర్పడిన ప్రపంచ స్థాయి సమాఖ్య. ఎఎమ్ది, ఎపిసి, డెల్, హెచ్ పి, ఐబిమ్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, రాకబుల్ సిస్టమ్స్, స్ప్రేకూల్, సన్ మైక్రో సిస్టమ్స్ మరియు వియెం వేర్ వంటి అనేక కీలక కంపెనీలు కలిసి 2007 ఫిబ్రవరిలో ఇది ఏర్పడింది. అప్పటి నుండి డేటా కేంద్రాల సామర్థ్యాలపై దృష్టి పెట్టే అనేక మంది అంతిమ వినియోగదారులను మరియు ప్రభుత్వ సంస్థలను కలుపుకుంటూ గ్రీన్ గ్రిడ్ వందలాది మంది సభ్యులతో విస్తరించింది.
 • గ్రీన్ 500 లిస్టు అనే సంస్థ శక్తిని సమర్ధంగా వినియోగించుకోగల మెగా ఫ్లాప్స్ వాట్ ఆధారంగా సూపర్ కంప్యూటర్ లకు రేటింగ్ ఇస్తుంది. ఇది కేవలం పనితీరు మీదనే కాక సమర్ధత మీద దృష్టి పెడుతుంది.
 • గ్రీన్ కాం చాలెంజెస్ అనే సంస్థ ఇన్ఫర్మేషన్ మరియు కమ్యునికేషన్ టెక్నాలజీ రంగంలో శక్తిని ఆదా చేసే సాంకేతిక పరికరాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అమెరికా కప్ యొక్క 33 వ సంచికలో 2007 వ సంవత్సరానికి గాను పోటీదారులలో ఒకరిగా నమోదు చేసుకోవడం ద్వారా గ్రీన్ కాం చాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొందింది. ఈ అమెరికా కప్ అనేది ఒక అత్యద్భుతమైన శక్తిని పునరుత్పతి చేయగలిగే మిషన్ ను తయారుచేయాలనే అమెరికా కప్ యొక్క బోటు పోటీ అనే ఔత్సాహిక విజన్ ద్వారా ప్రపంచం అంతటా ఉన్న పరిశోధకులు, సాంకేతిక నిపుణులు మరియు ఔత్సాహికులను ఒక దగ్గరకు తెచ్చేందుకు చేసే ప్రయత్నం.

గ్రీన్ కంప్యూటింగ్ విధానాలు[మార్చు]

హార్నేస్సింగ్ గ్రీన్ ఐటి- ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్తీసెస్ అనే వ్యాసంలో సాన్ మురుగేసన్ గ్రీన్ కంప్యూటింగ్ రంగాన్ని "కంప్యూటర్లు, సర్వర్లు మరియు వాటికి అనుబంధంగా ఉండే మానిటర్లు, ప్రింటర్లు, స్టోరేజ్ పరికరాలు, అదేవిధంగా నెట్ వర్కింగ్ మరియు సమాచార వ్యవస్థలను పర్యావరణం పై ఎటువంటి ప్రభావము లేకుండా లేదా చాలా తక్కువ ప్రభావం చూపేలా ఏ విధంగా నమూనా లు రూపొందిస్తాము, తయారు చేస్తాము, వినియోగిస్తాము మరియు అవసరం తీరాక పారవేస్తాము అనే విషయాన్ని అధ్యయనం చేయడం మరియు సాధన చేయడం"గా నిర్వచించారు.[1][1] గ్రీన్ యూజ్, గ్రీన్ డిస్పోసల్, గ్రీన్ డిజైన్ మరియు గ్రీన్ మాన్యుఫాక్చరింగ్ అనే నాలుగు మార్గాల ద్వారా కంప్యూటింగ్ లో ఉన్న పర్యావరణ ప్రభావాలను ఏవిధంగా ఎదుర్కోవచ్చు అని ఇందులో మురుగేసన్ తెలియ చేసారు.

ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థ మనుషులు, నెట్ వర్క్ లు మరియు హార్డ్ వేర్ ల సంక్లిష్టమైన సమ్మేళనం పై ఆధారపడి ఉంటుంది.కాబట్టి గ్రీన్ కంప్యూటింగ్ ప్రయత్నాలు కూడా ఈ అన్ని అంశాలను స్ప్రుశించాల్సి ఉంటుంది. చూపించే పరిష్కారాలు అంతిమ వినియోగదారుని సంతృప్తి పరచడం, మానేజ్మెంట్ పునర్ వ్యవస్తికరించడం, నిబంధనలకు లోబడి ఉండడం మరియు పెట్టుబడిపై లాభం (ROI ) వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. కంపెనీలు తమ శక్తి వినియోగాన్ని నియంత్రించేందుకు గాను చెప్పుకోదగిన స్థాయిలో ఆర్ధిక ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. "అన్ని శక్తి నిర్వహణా సాధనాలలో అత్యంత సులువైనది, సాధారణమైనది అయినప్పటికీ అత్యంత శక్తివంతమైనది కూడా ఇదే"[13]

ఉత్పత్తి యొక్క దీర్ఘకాలికత[మార్చు]

ఒక వ్యక్తిగత కంప్యూటర్ యొక్క జీవిత కాలంలో కేవలం తయారీ దశలోనే 70 % సహజ వనరులను వినియోగించుకుంటుందని గార్ట్నర్ తెలియ చేసారు.[14] . కాబట్టి పరికరం దీర్ఘ కాలం మన్నేలా చేయగలగడం అనేది గ్రీన్ కంప్యూటింగ్ లో ఏంటో కీలకం. "అప్ గ్రేడ్ చేసే సామర్థ్యాన్ని పెంచడం, మాడ్యులారిటి ద్వారా ఉత్పత్తిలను దీర్ఘ కాలం మన్నేలా చేసేందుకు చూడవలసినదిగా" మరొక నివేదికలో గార్ట్నర్ సూచించారు. [15] ఉదాహరణకు, ఒక కొత్త కంప్యూటర్ ను తయారు చేసేకన్నా ఒక కొత్త రామ్ మాడ్యుల్ ను రూపొందించి పాతదానిని అప్ గ్రేడ్ చేయడం వలన పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాక వినియోగదారుడు కొత్త కంప్యూటర్ కొనుక్కోనవసరం లేకుండా ఆదా చేసుకోగలుగుతాడు.[ఉల్లేఖన అవసరం]

ఆల్గొరిథ్మిక్ సామర్థ్యం[మార్చు]

ఎటువంటి కంప్యూటింగ్ పనికి అయినా ఎన్ని కంప్యూటర్లు అవసరమవుతాయి అనేది అల్గార్థం యొక్క సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది. ప్రోగ్రాం ల తయారీలో ఇటువంటి ఎన్నో సామర్థ్యానికి సంబంధించిన అంశాలు ఉంటుంటాయి. కంప్యూటర్ ల వినియోగం పెరిగే కొద్దీ మరియు శక్తికి ఆయే ఖర్చు కన్నా హార్డ్ వేర్ లకు అయే ఖర్చు తగ్గే కొద్దీ పర్యావరణం పై కంప్యూటింగ్ సిస్టాలు మరియు ప్రోగ్రాంల యొక్క ప్రభావము, శక్తి వినియోగ సమర్ధత ల పై అందరూ దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించారు. అలెక్స్ విస్నేర్-గ్రాస్ అనే భౌతిక శాస్త్రవేత్త హార్వార్డ్లో చేసిన అధ్యయనం ప్రకారం సగటున ఒక గూగుల్ లో చేసే సెర్చ్ 7 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తుందని అంచనా.[16] అయితే, ఒక సగటు సెర్చ్ కేవలం 0.2 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ ను మాత్రమే విడుదల చేస్తుందని వాదిస్తూ గూగుల్ దీనితో విభేదిస్తుంది.[17]

వనరుల కేటాయింపు[మార్చు]

విద్యుత్ ఎక్కడైతే చవకగా లభ్యమవుతుందో అక్కడి డేటా కేంద్రాలకు సమాచారాన్ని చేరవేసేందుకు కూడా అల్గార్థం లను ఉపయోగించుకోవచ్చు. ఎంఐటి, కార్నజీ మెల్లన్ యూనివర్సిటీ మరియు అకామాయికి చెందిన పరిశోధకులు శక్తి ఖర్చులు తక్కువగా ఉండే ప్రాంతాలకు ట్రాఫిక్ ను మళ్ళించే శక్తి కేటాయింపు అల్గార్థం లను రూపొందించి పరీక్షించి విజయం సాధించారు. వారు సూచిస్తున్న అల్గార్థం లను వినియోగించినట్లయితే శక్తి ఖర్చులు 40 % వరకు తగ్గుతాయని పరిశోధకులు అంటున్నారు. కచ్చితంగా చెప్పాలంటే, ఈ పద్ధతి వలన కంపెనీ లకు ఖర్చులు తగ్గుతాయి కాని నిజానికి శక్తి వినియోగం ఏ మాత్రము తగ్గదు. అయితే, ఎక్కడైతే పర్యావరణ అనుకూల రీతిలో సమర్ధవంతంగా శక్తి ఉత్పతి చేయబడుతుందో అక్కడికి ట్రాఫిక్ ను మళ్ళించేందుకు ఇదే విధమైన వ్యూహాలు అనుసరించవచ్చు. ఎక్కడైతే వేడి వాతావరణం ఉంటుందో ఆ డేటా కేంద్రాలనుండి కూడా ట్రాఫిక్ ను మళ్ళించేందుకు ఇవే పధతులు అనుసరించవచ్చు.దీనివలన కంప్యూటర్ల కోసం ఎయిర్ కండిషనింగ్ వినియోగించవలసిన అవసరం రాదు.[18]

వాస్తవీకరణ[మార్చు]

కంప్యూటర్ ల వర్చువలైజేషన్ అంటే ఒకే భౌతిక హార్డ్ వేర్ పై రెండు లేక అంతకన్నా ఎక్కువ కంప్యూటర్ లను పనిచేయించడం ద్వారా కంప్యూటర్ వనరుల సామర్థ్యాన్ని పెంచడం. 1960 లలో ఐబిఎం మెయిన్ ఫ్రేం ఆపరేటింగ్ వ్యవస్థలతో పాటుగానే ఈ భావన వచ్చినప్పటికీ 1990 లలో x86-కంపాటబుల్ కంప్యూటర్ లతో పాటుగానే మార్కెట్లో ప్రవేశించింది. వర్చువలైజేషన్ వల్ల ఒక శక్తివంతమైన సిస్టానికి అనేక భౌతిక సిస్టం లను వర్చువల్ మిషన్ లుగా ఒక సిస్టం ఎడ్మినిస్త్రేటర్ తో కలపడం సాధ్యం అవుతుంది. దీనితో వొరిజినల్ హార్డ్ వేర్ ను ఆపుకోవడం సాధ్యం అవుతుంది కాబట్టి శక్తి మరియు శీతల వినియోగం తగ్గుతుంది. వర్చువల్ కంప్యూటింగ్ కు మారేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ ప్యాకేజ్ లను అనేక కంపెనీలు మరియు ఓపెన్ సోర్సు ప్రాజెక్ట్లు అందిస్తున్నాయి. ఇంటెల్ కార్పోరేషన్ మరియు AMD వంటి సంస్థలు వర్చువల్ కంప్యూటింగ్కు తోడ్పడే విధంగా వాటి సిపియు ప్రోడక్ట్ లైన్లలో x86 ఇన్స్ట్రక్షన్ సెట్ లలో వర్చువలైజేషన్ మెరుగుపరచడం చేస్తున్నాయి.

టెర్మినల్ సేవలు[మార్చు]

గ్రీన్ కంప్యూటింగ్ లో టెర్మినల్ సేవలను వినియోగించుకోవడం కూడా జరుగుతుంది. సిస్టాన్ని వినియోగించే సమయంలో ఒక టెర్మినల్ లోని వినియోగదారులను ఒక కేంద్ర సర్వర్ కు అనుసంధానం చేయడం జరుగుతుంది. కంప్యూటింగ్ అంతా సర్వర్ పైనే జరిగినప్పటికీ వినియోగదారులకు మాత్రం ఆపరేటింగ్ సిస్టం టెర్మినల్ మీదే ఉన్న అనుభూతి కలుగుతుంది. వీటిని థిన్ క్లైయింట్ లతో కలిపినట్లయితే సాధారణ వర్క్ స్టేషనుకు వినియోగించేదానిలో కేవలం 1/8 వ వంతు శక్తి మాత్రమే వినియోగించబడి శక్తి వినియోగము మరియు ఖర్చులు తగ్గుతాయి.[ఉల్లేఖన అవసరం] వర్చువల్ ల్యాబ్ లను తయారుచేసేందుకు గాను థిన్ క్లైయెంట్ తో కలిపి టెర్మినల్ సేవలను వినియోగించుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. విండోస్ టెర్మినల్ సేవలు మరియు లినుక్స్ ఆపరేటింగ్ సిస్టం కై రూపొందించబడిన లినక్సు టెర్మినల్ సర్వర్ ప్రాజెక్ట్ (LTSP)వంటివి టెర్మినల్ సర్వర్ సాఫ్ట్ వేర్ కు ఉన్న ఉదాహరణలు.

శక్తి నిర్వహణ[మార్చు]

అడ్వాన్సెడ్ కాన్ఫిగరేషన్ అండ్ పవర్ ఇంటర్ఫేస్ (ACPI) అనే ఓపెన్ ఇండస్ట్రి ప్రమాణము ఒక ఆపరేటింగ్ సిస్టం నేరుగా తన హార్డ్ వేర్ యొక్క శక్తి పొదుపు అంశాలను నియంత్రించుకునే వీలు కల్పిస్తుంది. దీని వలన నిర్దేశించిన సమయం తర్వాత మానిటర్ మరియు హార్డ్ డ్రైవ్ వంటి పరికరాలను సిస్టం తనంతట తానే ఆపివేసే వీలు కలుగుతుంది. దీనితో పాటు CPU మరియు సిస్టం రామ్ తో సహా అనేక పరికరాలు ఆపివేయబడడంతో సిస్టం కూడా నిద్రావస్థ లోనికి వెళుతుంది. ACPI అనేది గతంలో ఉన్న ఇంటెల్-మైక్రోసాఫ్ట్ ప్రమాణమైన అడ్వాన్స్డ్ పవర్ మేనేజ్మెంట్కు తర్వాత వచ్చిన ప్రమాణము. ఇది శక్తి నిర్వహణా ప్రక్రియలను కంప్యూటర్ యొక్క BIOS నియంత్రించేలా చేస్తుంది.[ఉల్లేఖన అవసరం]

కొన్ని ప్రోగ్రాంలలో వినియోగదారులు CPU కు పంపబడుతున్న వోల్టేజ్ లను చేతితో సరిచేసుకోవడం ద్వారా ఉష్ణం యొక్క ఉత్పత్తిని మరియు విద్యుత్ యొక్క వినియోగాన్ని తగ్గించే వీలు ఉంటుంది. ఈ ప్రక్రియనే అండర్ వోల్టింగ్ అంటారు. కొన్ని CPU లు వర్క్ లోడ్ ఆధారంగా తమంతట తామే ప్రాసేస్సేర్ కు వోల్టేజ్ ను నియంత్రిస్తాయి. ఈ టెక్నాలజీ నే ఇంటెల్ ప్రాసేస్సేర్ పై "స్పీడ్ స్టెప్" అనీ,AMD చిప్స్ పై "పవర్ నౌ!" /"కూల్ అండ్ క్వైట్" అనీ, VIA CPU ల పై లాంగ్ హాల్ అనీ, ట్రాన్స్ మెటా ప్రాసేస్సేర్ ల పై లాంగ్ రన్ అనీ అంటారు.

ఆపరేటింగ్ సిస్టం మద్దతు[మార్చు]

అన్నిటికన్నా ఎక్కువగా వినియోగించబడే ఆపరేటింగ్ సిస్టం అయిన మైక్రో సాఫ్ట్ విండోస్ లో విండోస్ 95 నాటినుండి అతి తక్కువ వ్యక్తిగత కంప్యూటర్ శక్తి నిర్వహణా అంశాలు చేర్చబడినాయి.[19] ఇవి మొదట్లో స్టాండ్ బై (రామ్ కు అనుసంధానించబడిన) మరియు మానిటర్ యొక్క తక్కువ శక్తి వినియోగ దశ అనే సదుపాయాలను మాత్రం కలిగివున్నాయి. విండోస్ తర్వాత చేయబడిన మార్పుల ద్వారా నిద్రావస్థ (డిస్క్ కు అనుసంధానించబడిన) మరియు ACPI ప్రమాణాలకు మద్దతు అనే అంశాలు చేర్చబడ్డాయి. విండోస్ 2000 అనేది శక్తి నిర్వహణ అంశాన్ని కలిగి ఉన్న మొదటి NT ఆధారిత ఆపరేటింగ్ సిస్టం. దీనికి లోపల ఉన్న ఆపరేటింగ్ సిస్టం యొక్క నిర్మాణంలో భారీ మార్పులు మరియు కొత్త హార్డ్ వేర్ డ్రైవ్ నమూనా అవసరమౌతాయి. విండోస్ 2000 చాలా వరకు విండోస్ అంశాలను అడ్మినిస్ట్రేటోర్స్ కేంద్ర స్థాయిలో నిర్వహించేందుకు వీలు కల్పించే గ్రూప్ పాలసీ అనే టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అయితే శక్తి నిర్వహణ అనేది ఈ అంశాలలో ఒకటి కాదు. శక్తి నిర్వహణా ఏర్పాట్ల రూపకల్పన అనేది పర్-యూసర్ మరియు పర్-మిషన్ బైనరీ రిజిస్ట్రీ విలువల ఆధారంగా ఉంటుంది[20], కాబట్టి వినియోగించుకునే వ్యక్తి తన శక్తి నిర్వహణా ఏర్పాట్లు తానే చేసుకోవడం సముచితంగా ఉంటుందనే ఆలోచన ఇందుకు కారణం కావచ్చు.

విండోస్ గ్రూప్ పాలసీకి సంబంధం లేకుండా ఉన్న ఈ విధానమే విండోస్ XP లో కూడా కొనసాగింది. మైక్రో సాఫ్ట్ యొక్క ఈ నిర్ణయానికి కారణాలు తెలియనప్పటికీ ఇది ఎన్నో విమర్శలకు[21] కారణమైనది. గ్రూప్ పాలసీ లోని కనీస కాన్ఫిగరేషన్ ను అనుమతించేలా శక్తి నిర్వహణా వ్యవస్థను తిరిగి రూపొందించిన విండోస్ విస్టా[22]లో మైక్రో సాఫ్ట్ దీనిని మెరుగుపరచింది. ఈ సహకారం ఏకైక పర్-కంప్యూటర్ పాలసీ లకే పరిమితమైనది. ఇటీవల విడుదలైన విండోస్ 7 లో ఈ పరిమితులన్నీ ఉన్నప్పటికీ ఇందులో మెరుగైన ప్రాసేస్సేర్ శక్తి నిర్వహణకు[23][24], ఆపరేటింగ్ సిస్టం టైమర్ల వినియోగానికి, డిస్ప్లే పానెల్ మెరుగుదలకు అవకాశాలున్నాయి. విండోస్ 7 లో వినియోగదారుని అనుభవానికి ఉండే ప్రాముఖ్యత ఒక ముఖ్యమైన మార్పుగా చెప్పుకోవచ్చు. వినియోగదారులు తమంతట తాము గానే శక్తిని ఆదా చేసేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అధిక పనితీరు ఉండే శక్తి ప్రణాళిక ల యొక్క ప్రాముఖ్యతను తగ్గించడం జరిగింది.

విండోస్ ఆపరేటింగ్ సిస్టం కన్నా మెరుగైన లక్షణాలను కలిగి ఉండే థర్డ్-పార్టీ పిసి పవర్ మేనేజ్మెంట్ సాఫ్ట్ వేర్ కు కూడా చెప్పుకోదగిన మార్కెట్ ఉంది. చాలా ఉత్పత్తులు యాక్టివ్ డైరక్టరీ ఇంటిగ్రేషన్ మరియు మరింత మెరుగైన వివిధ శక్తి ప్రణాళికలతో పర-యూసర్/ పర-మిషన్ ఏర్పాట్లు, నిర్దేశించిన శక్తి ప్రణాళికలు, యాంటి-ఇంసోమియా లక్షణాలు మరియు ఎంటర్ ప్రైజ్ పవర్ యూసేజ్ రిపోర్టింగ్ వంటి సదుపాయాలను ఎన్నిటినో అందిస్తున్నాయి.

శక్తి పంపిణీ[మార్చు]

డెస్క్ టాప్ కంప్యూటర్ పవర్ సప్ప్లైలు (PSUs) సాధారణంగా 70-75 % సామర్థ్యాన్ని కలిగి ఉండి,[25] మిగిలిన శక్తిని ఉష్ణం రూపంలో విడుదల చేస్తాయి. 80 ప్లస్ అనబడే పరిశ్రమ యొక్క వినూత్న ప్రయత్నం కనీసం 80 ప్లస్ సామర్థ్యాన్ని కలిగి ఉండే PSU లకు సర్టిఫికేట్ ఇస్తుంది; సాధారణంగా ఈ నమూనాలన్నీ ఒకే ఫారం ఫాక్టర్ కలిగి ఉండి తక్కువ సామర్థ్యం కలిగి ఉండే పాత PSU ల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టే ఉద్దేశంతో ప్రారంభించ బడినాయి.[26] 2007 జూలై 20 నాటికి అన్ని కొత్త ఎనర్జీ స్టార్ 4.0 - సర్టిఫైడ్ డెస్క్ టాప్ PSU లన్నీ కనీసం 80% సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.[27]

నిల్వచెయ్యడం[మార్చు]

తక్కువ ఫారం ఫాక్టర్ (ఉదాహరణకు 2.5 అంగుళాలు) ఉన్న హార్డ్ డిస్క్ డ్రైవ్ లు భౌతికంగా పెద్ద డ్రైవ్ ల కన్నా కూడా ఒక గిగాబైట్ కు వినియోగించుకునే శక్తి తక్కువగా ఉంటుంది.[28][29] హార్డ్ డిస్క్ డ్రైవ్ లకు భిన్నంగా సాలిడ్ స్టేట్ డ్రైవ్లు ఫ్లాష్ మెమరీ లేదా DRAM లలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి. కదిలే భాగాలు ఏమి ఉండవు కాబట్టి తక్కువ సామర్థ్యం ఉండే ఫ్లాష్ ఆధారిత పరికరాలకు శక్తి వినియోగం పరిమితమవుతుంది.[30][31]

ఇటీవల ఒక కేస్ స్టడీ లో,ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సాలిడ్ స్టేట్ స్టోరేజ్ సాధనాలను తయారుచేసే ఫ్యూజన్-ఐఓ అనే సంస్థ రైడ్ 0 లో వివిధ హార్డ్ డిస్క్ డ్రైవ్ ల ద్వారా మాత్రమే సాధించగలిగిన పనితీరు వేగాన్ని సాధిస్తూనే కార్బన్ విడుదలలను, మై స్పేస్ డేటా సెంటర్ ల నిర్వహణ ఖర్చులను 80%కు తగ్గించగలిగింది.[32][33] దీనికి స్పందనగా, మై స్పేస్ హెవి లోడ్ సర్వర్ లతో సహా వారి సర్వర్ లలో ఎన్నింటినో శాశ్వతంగా పక్కనపెట్టి కార్బన్ విడుదలలను మరింత తగ్గించింది.

హార్డ్ డ్రైవ్ ధరలు తగ్గడంతో, మరింత సమాచారం ఆన్ లైన్ లో ఉంచేలా నిల్వ చేసే సామర్ద్యాలు పెరిగాయి. ఇందులో గతంలో టేప్ లలో, ఇతర ఆఫ్ లైన్ పరికరాలలో నిల్వ చేసే నేపథ్య సమాచారం మరియు పాత విషయాలకు సంబంధించిన సమాచారము ఉంటుంది. ఈ ఆన్ లైన్ స్టోరేజ్ పెరగడం వలన శక్తి వినియోగం పెరిగింది. ఆన్ లైన్ స్టోరేజ్ లో ఉన్న సదుపాయాలను కల్పిస్తూనే తక్కువ శక్తి వినియోగించుకునే భారీగా నిల్వ చేసుకోగలిగే పరికరాల విషయంలో పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.[34]

వీడియో కార్డ్[మార్చు]

వేగవంతమైన GPU కంప్యూటర్ లో అతి ఎక్కువ శక్తిని వినియోగించుకునే పరిజరం కావచ్చు.[35]

శక్తిని సమర్ధవంతంగా వినియోగించుకునే డిస్ ప్లే అవకాశాలు ఇలా ఉన్నాయి:

 • వీడియో కార్డ్ వద్దు-డిస్ ప్లే అవసరమైతే పంచుకునే టెర్మినల్ ను, థిన్ క్లైయింట్ను లేదా డెస్క్ టాప్ షేరింగ్ సాఫ్ట్ వేర్ ను వినియోగించండి.
 • మదర్ బోర్డు వీడియో అవుట్ పుట్ ను వినియోగించండి-సాధారణంగా తక్కువ 3D పనితీరు మరియు తక్కువ శక్తి.
 • సరాసరి వాటేజ్ లేక ఒక వాట్ కు పనితీరు ఆధారంగా GPU ను ఎన్నుకోండి.

ప్రదర్శన[మార్చు]

ఎల్సిడి మానిటర్లలో సాధారణంగా డిస్ ప్లేకు కావలిసిన కాంతిని ఇచ్చేందుకు గాను చల్లని-కాధోడ్ ఫ్లోరసేంట్ బల్బ్ ఉంటుంది. కొన్ని కొత్తగా వస్తున్నా డిస్ ప్లే లలో ఫ్లోరసేంట్ బల్బ్ స్థానంలో లైట్ ఎమిటింగ్ డయోడ్లు ఉంటాయి. వీటి వలన డిస్ ప్లేకి అవసరమైన విద్యుత్ వినియోగం తగ్గుతుంది.[36]

పరికరాల రీ సైకిలింగ్[మార్చు]

కంప్యూటింగ్ పరికరాలను రీ సైకిలింగ్ చేసే సమయంలో ల్యాండ్ ఫిల్స్ నుండి తగరం, పాదరసం మరియు హెక్జవలేంట్ క్రోమియం వంటి హానికరమైన పదార్ధాలను వేరు చెయ్యడంతో పాటు మళ్లీ తయారు చేసే అవసరం లేకుండా పనికి వచ్చే పరికరాలను వినియోగించుకున్నట్లయితే మరింత శక్తి ఆదా చేయబడుతుంది. వాటితో వినియోగ అవసరం తీరిన తర్వాత కూడా బాగా పనిచేస్తున్న కంప్యూటర్ లు ఉన్నట్లయితే వాటిని తిరిగి వేర్ అవసరాలకు వాడుకోవడం లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు దాతృత్వ సంస్థలకు దానంగా ఇవ్వడం చేయవచ్చు.[37] అయితే, ఇటీవల చాలా స్వచ్ఛంద సంస్థలు దానంగా ఇచ్చే పరికరాలకు కనీస సిస్టం ప్రమాణాలను నిర్దేశించాయి.[38] దీనికి అదనంగా, పడిపోయిన సిస్టం ల యొక్క భాగాలను కొన్ని రిటైల్ అవుట్ లెట్[39][40] ల ద్వారా మరియు ప్రభుత్వ, ప్రైవేటు రీ సైకిలింగ్ సెంటర్ ల ద్వారా రీసైకిల్ చేయించవచ్చు. ప్రింటర్ కాట్రిడ్జ్ లు, పేపర్లు, బాటరీలు వంటి కంప్యూటర్ అనుబంధ పరికరాలను కుడా రీసైకిల్ చేయించవచ్చు.[41]

అయితే ఈ అన్ని పధకాలలో ఉన్న సమస్య ఏమిటంటే రీ సైకిల్ చేయబడిన డ్రైవ్ లు కలిగిన కంప్యూటర్ లు చాలా వరకు ఉత్తర అమెరికా మరియు ఐరోపా లతో పోలిస్తే పర్యావరణ నిబంధనలు తక్కువగా ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాలకు రవాణా చేయబడతాయి.[42] ది సిలికాన్ వాలీ టాక్సిక్స్ కోయిలేషన్ అంచనా ప్రకారము వినియోగం జరిగిన తర్వాత సేకరించే ఈ-వేస్ట్ ను రీ సైకిల్ చేసిన పదార్ధాలలో 80% చైనా మరియు పాకిస్తాన్ వంటి దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి.[43]

పాత కంప్యూటర్ లను రీ సైకిల్ చేయడం అనేది ఎంతో ముఖ్యమైన ఆంతరంగికత అనే అంశాన్ని తెర మీదకు తెస్తుంది. పాత స్టోరేజ్ సాధనాలలో ఆయా వ్యక్తులకు సంబంధించిన ఈ-మెయిల్ లు, పాస్ వర్డ్ లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు వంటి ఆంతరంగిక సమాచారం ఉండినట్లయితే ఇంటర్ నెట్ లో ఉచితంగా లభించే సాఫ్ట్ వేర్ ల ద్వారా వీటిని తేలికగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఒక ఫైల్ ను తొలగించినంత మాత్రాన అది హార్డ్ డ్రైవ్ నుండి పూర్తిగా తొలగించబడదు. ఒక కంప్యూటర్ ను రీ సైకిల్ చేసే ముందు వినియోగదారులు హార్డ్ డ్రైవ్ ను, ఒక వేళ ఒకటి కన్నా ఎక్కువ డ్రైవ్ లు ఉన్నట్లయితే డ్రైవ్ లను తొలగించి వాటిని భౌతికంగా నాశనం చేయడమో లేదా ఎక్కడైనా భద్రంగా దాచిపెట్టుకోవడమో చెయ్యాలి. కొన్ని అనుమతించబడిన హార్డ్ వేర్ రీ సైకిలింగ్ కంపెనీలకు కంప్యూటర్ లను రీ సైకిలింగ్ కు ఇచ్చినట్లయితే వారు సమాచారాన్ని బయటకు వెల్లడించబోము అనే అంగీకార పత్రం సంతకం చేసి ఇస్తారు.[44]

టెలికమ్యుటింగ్[మార్చు]

టెలి కాన్ఫరెన్సింగ్ మరియు టెలి ప్రెజెన్స్ అనే సాంకేతికతలు తరచుగా గ్రీన్ కంప్యూటింగ్ కార్యక్రమాలలో అమలు చేయబడతాయి. దీనిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి; పని పట్ల సంతృప్తి పెరుగుతుంది, ప్రయాణాలు తగ్గుతాయి కాబట్టి గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గుతుంది, ఆఫీస్ స్థలము, ఉష్ణము మరియు కాంతికి సంబంధించి ఖర్చులు తగ్గుతాయి కాబట్టి లాభాలు పెరుగుతాయి. పొదుపులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటాయి; యు.ఎస్ లో ఒక ఆఫీసు బిల్డింగ్ లో సగటున ఏడాదికి ప్రతి చదరపు అడుగుకి 23 కిలోవాట్ గంటల శక్తి వినియోగించబడుతుంది.ఈ మొత్తం శక్తి వినియోగంలో 70 % ఉష్ణము, ఏసి మరియు కాంతి లకే ఖర్చు అవుతుంది.[45] హోటలింగ్ వంటి ఇతర సంబంధిత ప్రయత్నాలలో కూడా వారికి అవసరమైనప్పుడే పనిచేసేవారు తమ స్థలాన్ని రిజర్వు చేసుకుంటారు కాబట్టి చరపు అడుగుల విస్తీర్ణం తగ్గుతుంది.[46] ఉద్యోగాలు, సేల్స్,కన్సల్టింగ్ మరియు క్షేత్ర స్థాయి సేవలు అన్నింటిలోను ఈ పద్ధతిని వినియోగించవచ్చు.

వాయిస్ ఓవర్ ఐపి (VoIP) ప్రస్తుతం ఉన్న ఈథర్ నెట్ కాపర్ ను వినియోగించుకోవడం ద్వారా టెలిఫోన్ వైరింగ్ కు అవసరమైన మౌలిక సదుపాయాల అవసరాన్ని తగ్గిస్తుంది. VoIP మరియు ఎక్స్టెన్షన్ మొబిలిటీ వలన హాట్ డెస్కింగ్ వినియోగానికి మరింత సులువుగా మారింది.

ఇది కూడా చూడండి[మార్చు]

ఉప ప్రమాణాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 సాన్ మురుగేసన్, "హార్నేసింగ్ గ్రీన్ ఐటి: ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టిసేస్", IEEE ఐటి ప్రొఫెషనల్ , జనవరి-ఫిబ్రవరి 2008 , pp 24-33
 2. "leaving it on?". Newsgroupcomp.misc. 1992-11-20. Retrieved 2007-11-11.
 3. "TCO takes the initiative in comparative product testing". 2008-05-03. Retrieved 2008-05-03. Cite news requires |newspaper= (help)
 4. పూర్తి OECD Working Party on the Information Economy. "Towards Green ICT strategies: Assessing Policies and Programmes on ICTs and the Environment" (PDF). మూలం (PDF) నుండి 2012-03-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-16. Cite web requires |website= (help)నివేదిక: సారాంశము:OECD Working Party on the Information Economy. "Executive summary of OECD report" (PDF). మూలం (PDF) నుండి 2012-03-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-16. Cite web requires |website= (help)
 5. Jones, Ernesta (2006-10-23). "EPA Announces New Computer Efficiency Requirements". U.S. EPA. Retrieved 2007-09-18. Cite web requires |website= (help)
 6. Gardiner, Bryan (2007-02-22). "How Important Will New Energy Star Be for PC Makers?". PC Magazine. Retrieved 2007-09-18. Cite web requires |website= (help)
 7. "DIRECTIVE 2002/96/EC OF THE EUROPEAN PARLIAMENT AND OF THE COUNCIL". Official Journal of the European Union. 2003-01-27. Retrieved 2009-10-21. Cite web requires |website= (help)
 8. "State Legislation on E-Waste". Electronics Take Back Coalition. 2008-03-20. మూలం నుండి 2009-03-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-03-08. Cite web requires |website= (help)
 9. 9.0 9.1 "Intel and Google Join with Dell, EDS, EPA, HP, IBM, Lenovo, Microsoft, PG&E, World Wildlife Fund and Others to Launch Climate Savers Computing Initiative" (Press release). Business Wire. 2007-06-12. Retrieved 2007-12-11.
 10. "What exactly is the Climate Savers Computing Initiative?". Climate Savers Computing Initiative. 2007. Retrieved 2007-12-11. Cite web requires |website= (help)
 11. "President Bush Requires Federal Agencies to Buy EPEAT Registered Green Electronic Products" (PDF) (Press release). Green Electronics Council. 2007-01-24. మూలం (PDF) నుండి 2007-10-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-09-20.
 12. "Executive Order: Strengthening Federal Environmental, Energy, and Transportation Management" (Press release). The White House: Office of the Press Secretary. 2007-01-24. Retrieved 2007-09-20.
 13. "The common sense of lean and green IT". Deloitte Technology Predictions. మూలం నుండి 2010-07-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-16.
 14. ఇన్ఫోవరల్డ్ జూలై 06, 2009; http://www.infoworld.com/d/green-it/used-pc-strategy-passes-toxic-buck-300?_kip_ipx=1053322433-1267784052&_pxn=0 Archived 2012-01-21 at the Wayback Machine.
 15. సిమోన్ మింగే, గార్ట్నర్: 10 కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ 'గ్రీన్ ఐటి' స్ట్రాటజీ; www.onsitelasermedic.com/pdf/10_key_elements_greenIT.pdf.
 16. "Research reveals environmental impact of Google searches". Retrieved 2009-01-15. Cite web requires |website= (help)
 17. "Powering a Google search". Official Google Blog. Google. Retrieved 2009-10-01.
 18. Reardon, Marguerite (August 18, 2009). "Energy-aware Internet routing coming soon". Retrieved August 19, 2009. Cite web requires |website= (help)
 19. "Windows 95 Power Management". మూలం నుండి 2010-03-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-16. Cite web requires |website= (help)
 20. "Windows power-saving options are, bizarrely, stored in HKEY_CURRENT_USER". Cite web requires |website= (help)
 21. "How Windows XP Wasted $25 Billion of Energy". 2006-11-21. Retrieved 2005-11-21. Cite web requires |website= (help)
 22. "Windows Vista Power Management Changes". Cite web requires |website= (help)
 23. "Windows 7 Processor Power Management". Cite web requires |website= (help)
 24. "Windows 7 Timer Coalescing". Cite web requires |website= (help)
 25. Schuhmann, Daniel (2005-02-28). "Strong Showing: High-Performance Power Supply Units". Tom's Hardware. Retrieved 2007-09-18. Cite web requires |website= (help)
 26. 80 PLUS
 27. "Computer Key Product Criteria". Energy Star. 2007-07-20. మూలం నుండి 2007-09-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-09-17. Cite web requires |website= (help)
 28. Mike Chin (8 March 2004). "IS the Silent PC Future 2.5-inches wide?". Retrieved 2008-08-02. Cite web requires |website= (help)
 29. Mike Chin (2002-09-18). "Recommended Hard Drives". Retrieved 2008-08-02. Cite web requires |website= (help)
 30. సూపర్ టాలెంట్ 2.5 " ఐడియి ఫ్లాష్ హార్డ్ డ్రైవ్- ది టెక్ రిపోర్ట్ - పేజి 13
 31. పవర్ కన్సంప్షన్- టామ్స్ హార్డ్ వేర్: కన్వెంషనల్ హార్డ్ డ్రైవ్ ఓబ్సోలేటిజం సామ్సంగ్స్ 32 జిబి ఫ్లాష్ డ్రైవ్ ప్రివ్యుడ్
 32. http://www.fusionio.com/PDFs/myspace-case-study.pdf
 33. [1][dead link]
 34. ఐబిఎమ్ చీఫ్ ఇంజనీర్ గ్రీన్ స్టోరేజ్ గురించి చేసిన చర్చ, సెర్చ్ స్టోరేజ్- టెక్ టార్గెట్
 35. http://www.xbitlabs.com/articles/video/display/power-noise.html Archived 2011-09-04 at the Wayback Machine. X-bit labs: Faster, Quieter, Lower: Power Consumption and Noise Level of Contemporary Graphics Cards
 36. "Cree LED Backlight Solution Lowers Power Consumption of LCD Displays". 2005-05-23. Retrieved 2007-09-17. Cite web requires |website= (help)
 37. "దానం చేయడం ద్వారా మీ ఎలక్ట్రానిక్ పరికరాలను మళ్లీ వాడండి. ఎర్త్ 911". మూలం నుండి 2008-05-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-16. Cite web requires |website= (help)
 38. Delaney, John (2007-09-04). "15 Ways to Reinvent Your PC". PC Magazine. 26 (17).
 39. "Staples Launches Nationwide Computer and Office Technology Recycling Program". Staples, Inc. 2007-05-21. మూలం నుండి 2016-01-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-09-17. Cite web requires |website= (help)
 40. "Goodwill Teams with Electronic Recyclers to Recycle eWaste". Earth 911. 2007-08-15. మూలం నుండి 2008-07-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-09-17. Cite web requires |website= (help)
 41. రిఫిల్ చేసిన ఇంకు కాట్రిడ్జ్ లు, పేపర్ రిసైకిలింగ్, బాటరీ రిసైకిలింగ్
 42. Segan, Sascha (2007-10-02). "Green Tech: Reduce, Reuse, That's It". PC Magazine. 26 (19): 56. Retrieved 2007-11-07.
 43. Royte, Elizabeth (2006). Garbage Land: On the Secret Trail of Trash. Back Bay Books. pp. 169–170. ISBN 0-316-73826-3.
 44. "మైసెక్యూర్ సైబర్ స్పేస్ >> గ్రీన్ కంప్యూటింగ్ మరియు ప్రైవసీ ఇష్యూస్". మూలం నుండి 2012-10-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-16. Cite web requires |website= (help)
 45. "EPA Office Building Energy Use Profile" (PDF). EPA. 2007-08-15. మూలం (PDF) నుండి 2008-09-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-03-17. Cite web requires |website= (help)
 46. "What Is Green IT?". మూలం నుండి 2008-04-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-16. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]

మూస:Environmental technology