Coordinates: 41°21′21″N 81°44′01″W / 41.355853°N 81.733529°W / 41.355853; -81.733529

గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ శివ విష్ణు హిందూ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ శివ విష్ణు హిందూ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:ఒహియో
ప్రదేశం:పర్మా
అక్షాంశ రేఖాంశాలు:41°21′21″N 81°44′01″W / 41.355853°N 81.733529°W / 41.355853; -81.733529

గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ శివ విష్ణు హిందూ దేవాలయం, అమెరికా, ఒహియోలోని పర్మాలో ఉన్న హిందూ దేవాలయం. గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలోని 12,000 మంది హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. సంవత్సరానికి 30,000 మంది సందర్శకులకు ఆతిథ్యం ఇస్తోంది.

చరిత్ర[మార్చు]

1983లో అక్కడి ప్రాంతంలోని హిందువులు క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో కలుసుకున్నారు. అప్పటివరకు వాళ్ళకు శాశ్వత సమావేశ ప్రదేశం లేదు. అందుకోసం ఒహియోలోని నార్త్ రాయల్టన్ ప్రాంతంలో అనేక భవనాలను, ప్రదేశాలను పరిశీలించారు. 1987లో $200,000కు 22 ఎకరాలతో కాలిపోయిన భవనాన్ని కొనుగోలు చేశారు. 1989, మార్చిలో $350,000 ఉపయోగించి ఆ భవనాన్ని ఆధునీకరించి, 1989 సెప్టెంబరు 10న 2,000 మంది హిందువుల సమక్షంలో దేవాలయాన్ని ప్రారంభించారు.[1] పెరుగుతున్న హిందూ జనాభాకు అనుగుణంగా 1997లో దేవాలయం మళ్లీ పునర్నిర్మించబడి, $20 మిలియన్ల వ్యయంతో 32 ఎకరాలకు విస్తరించబడింది.[2][3]

రూపకల్పన[మార్చు]

ఈ దేవాలయంలో రెండు ప్రధాన బలిపీఠాలు ఉన్నాయి. ఎడమవైపున శివుడు, కుడివైపున విష్ణువుఉన్నారు. వినాయకుడి విగ్రహ బలిపీఠం శివపీఠం వెలుపల ఉంది. దుర్గ, లక్ష్మిలు శివ, విష్ణు బలిపీఠం మధ్యలో ఉన్నారు. నంది కూడా శివపీఠం వెలుపల ఉండి, నేరుగా శివుని వైపు చూస్తుంది. గోడలమీద అనేక హిందూ దేవుళ్ళ చిత్రాలు చెక్కబడ్డాయి. దేవాలయం నలువైపులా చిత్తడి నేలలు ఉన్నాయి. ఈ దేవాలయం 11,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది.[4]

మూలాలు[మార్చు]

  1. "Greater Cleveland Shiva Vishnu Temple". pluarlism. 2004. Archived from the original on 2019-09-14. Retrieved 2022-03-23.
  2. Sean Brennan (1 May 2015). "The Presidents Corner". Parma Observer. Retrieved 2022-03-23.
  3. "Greater Cleveland Shiva Vishnu Temple". nriNewsToday. 26 February 2015. Retrieved 2022-03-23.
  4. Nikki Rhoades (23 October 2019). "Shiva Vishnu is a Gorgeous and Unique Temple In Greater Cleveland". onlyinyourstate. Retrieved 2022-03-23.