గ్రేట్ డేన్
![]() |
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
|
![]() A Harlequin Great Dane
|
|||||||||||||||||||||||
Other names | Grand Danois (Old German: "Great Dane" the modern French is Dogue Allemand ("German Mastiff"). Deutsche Dogge ("German Mastiff") Dänischer Hund ("Danish Hound")[1] |
||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Common nicknames | Dane Gentle Giant |
||||||||||||||||||||||
జన్మస్థానం | Germany | ||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||
Domestic dog (Canis lupus familiaris) |
గ్రేట్ డేన్, అపోలో, డానిష్ గాల్లంట్, డాయిష్ డాగీ, బోర్ హౌన్డ్, గ్రాండ్ డనోయిస్ లేదా జర్మన్ మస్తిఫ్ఫ్ దాని భారీ కాయానికి ప్రసిద్ధమైన పెంపుడు కుక్క (కానిస్ లూపస్ ఫెమిలియారిస్ ) జాతి.[2] ఈ జాతి సాధారణంగా "అన్ని జాతులలో అపోలో (అందమైనది)"గా ప్రస్తావించబడుతుంది.[3] గ్రేట్ డేన్ ప్రపంచంలోని అతి పొడవైన కుక్క జాతులలో ఒకటి కాగా, ఐరిష్ ఉల్ఫ్ హౌన్డ్ సరాసరి ఎత్తు మాత్రం దీని కన్నా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత ప్రపంచ రికార్డు జార్జ్ అనే కుక్కది, దాని కొలతలు పాదం నుండి భుజం వరకు 109 cm; తల నుండి తోక వరకు 220 cm .[4] దీనికి ముందు ప్రపంచంలో కెల్లా అతి ఎత్తైన కుక్కగా గిబ్సన్ అనే పేరుగల గ్రేట్ డేన్ జాతి కుక్క ఈ రికార్డుని సొంతం చేసుకొంది, అది3 1⁄2 ft (106.7 cm) భుజస్తుల నడుమ భాగం లోనూ మరియు 7 ft 1 in (215.9 cm) వెనుక కాళ్ళ దగ్గర ఎత్తుగా వుండేది.[5]
విషయ సూచిక
వివరణ[మార్చు]
ఆకృతి[మార్చు]
అమెరికన్ కెన్నెల్ క్లబ్ వర్ణించిన విధంగా, "గ్రేట్ డేన్, తన రాచరికపు ఆకృతి, దర్జా, శక్తి మరియు సొగసులతో గొప్ప పరిమాణం మరియు తీరైన శరీరాన్ని మిళితం చేస్తుంది. ఇది ఎక్కువగా శ్రమించే జాతులలో ఒకటి, అది ఎప్పుడూ వికారంగా అగుపించదు."[6]
గ్రేట్ డేన్ బలిష్టమైన ఆకృతితో పొట్టి జుట్టుతో ఉన్న జాతి.[7] పొడవు మరియు ఎత్తుల నిష్పత్తిలో, గ్రేట్ డేన్ చదరంగా ఉండాలి. మగ కుక్క భుజాల దగ్గర 30 in (76 cm) కన్నా తక్కువ ఉండకూడదు, ఒక ఆడ కుక్క 28 in (71 cm). కనిష్ఠ ఎత్తు కన్నా తక్కువ ఎత్తు ఉన్న డేన్ లు అనర్హమైనవి.[6]
ఏళ్ళ తరబడి, అతి పొడవైన కుక్కకు గ్రేట్ డేన్ చిహ్నంగా ఉంది. పూర్వం రికార్డు స్థాపించిన వాటిలో గిబ్సన్ మరియు టైటాన్ ఉన్నాయి, అయినప్పటికీ ప్రస్తుత రికార్డు భుజాల వద్ద 43 in (110 cm) పొడవున్న జయింట్ జార్జ్ అని పిలవబడే ఊదా రంగు గ్రేట్ డేన్ సొంతం.[8] ఇది రికార్డు ప్రకారం అతి ఎత్తైన కుక్క (గిన్నిస్ ప్రపంచ రికార్డుల ప్రకారం),[8] ఇది భుజాల వద్ద 42.5 in (108 cm) పొడవున్న, షంగ్రెట్ డాన్జాస్ అని పేరుగల బ్రిండిల్ గ్రేట్ డేన్ యొక్క పూర్వపు రికార్డును బద్దలు కొట్టింది.
పద్దెనిమిది నెలల కన్నా పెద్దదైన గ్రేట్ డేన్ కనిష్ఠ బరువు మగ వాటిలో 120 lb (54 kg) ఆడవాటిలో 100 lb (45 kg).[7][9] అసాధారణంగా, అమెరికన్ కెన్నెల్ క్లబ్ దాని ప్రమాణాల నుండి కనిష్ఠ బరువును తగ్గించింది.[10] మగ కుక్క, పెద్ద శరీరం మరియు బరువైన ఎముకలతో ఆడ కుక్క కన్నా ఎక్కువ భారీగా కనిపిస్తుంది.[6]
గ్రేట్ డేన్ సాధారణంగా వేలాడుతున్న, త్రిభుజాకారపు చెవులను కలిగి ఉంటుంది. గతంలో, పందుల వేటకు గ్రేట్ డేన్ లను వాడుకగా ఉపయోగించేటప్పుడు, వేట సమయాలలో ఆ కుక్క చెవులకు అయ్యే గాయాలను తగ్గించటానికి చెవులను కత్తిరించటం జరిగేది. ఇప్పుడు డేన్స్ ప్రధానంగా సహవాస జంతువులు కావున, కొన్నిసార్లు సాంప్రదాయ మరియు అలంకరణ కారణాల దృష్ట్యా కత్తిరించటం ఇంకా జరుగుతుంది. ఇప్పుడు, ఈ అభ్యాసం కొంతవరకు యునైటెడ్ స్టేట్స్లో వాడుకలో ఉంది మరియు యూరోప్‌లో తక్కువ వాడుకలో ఉంది. యునైటెడ్ కింగ్డం, ఐర్లాండ్, డెన్మార్క్, జర్మనీ, ఆస్ట్రేలియాలోని కొన్ని భాగాలు, న్యూజీలాండ్ వంటి యూరోపియన్ దేశాలలో, ఈ ఆచారం నిషేధించబడింది, లేదా కేవలం పశు వైద్యుల చేత మాత్రమే జరుపబడేటట్లు నియంత్రించబడింది.
చర్మపు రంగులు[మార్చు]
గ్రేట్ డేన్స్ లో ఆరు ఆమోదయోగ్యమైన చర్మ వర్ణాలు ఉన్నాయి:[6]
- ఫాన్ (గోధుమ రంగు): ఈ రంగు నల్ల ముసుగుతో ఉన్న పసుపు బంగారు వర్ణం. నలుపు రంగు కంటి అంచులు మరియు కనుబొమ్మల మీద ఉంటుంది, ఇది చెవుల పైన కూడా ఉండవచ్చు.
- బ్రిండిల్ : ఇది ఒక చెవ్రాన్ చారల నమూనాలో ఫాన్ (గోధుమ) మరియు నలుపు వర్ణము. తరచుగా అవి పులి-చారల నమూనాను కలిగి ఉంటాయని కూడా ప్రస్తావించబడతాయి.
- నీలం : ఈ రంగు స్వచ్ఛమైన ఉక్కు నీలం. ఛాతీ పైన మరియు కాలి వేళ్ళ పైన తెల్ల మచ్చలు హర్షించదగ్గవి కావు మరియు లోపాలుగా పరిగణించబడతాయి.
- నలుపు : ఈ రంగు నిగనిగలాడే నలుపు. ఛాతీ పైన మరియు కాలి వేళ్ళ పైన తెల్ల మచ్చలు హర్షించదగ్గవి కావు మరియు లోపాలుగా పరిగణించబడతాయి.
- హార్లేక్విన్ : మూల వర్ణం స్వచ్ఛమైన తెలుపు మరియు నలుపు చారలు శరీరమంతటా యధేచ్చగా పరుచుకుని ఉంటాయి; స్వచ్ఛమైన తెల్లని గొంతుక ముఖ్యముగా ఎంచుకోబడుతుంది. ఈ నల్ల అతుకులు ఎప్పుడూ ఒక దుప్పటి ఆకారాన్ని ఇచ్చేంత పెద్దవిగా ఉండకూడదు, చుక్కల లేదా మసకగా కనిపించేంత చిన్నవిగా ఉండవు. కొన్ని చిన్న ఊదా రంగు అతుకులు (మెర్లే తయారీలో ఈ ఊదా రంగు స్థిరంగా ఉంటుంది) లేదా ఉప్పు మరియు మిరియాలపొడి లాగా లేదా మురికిగా కనిపించే, తెల్లని చర్మంపై నల్లని వెండ్రుకలు యోగ్యమైనవే కానీ కోరదగ్గవి కాదు. (మెర్లే మరియు తెల్ల డేన్స్ మాదిరిగానే చెవిటితనం మరియు అంధత్వంతో అదేవిధమైన సంబంధం కలిగి ఉంటాయి.)
- మాంటిల్ (బోస్టన్ టెర్రియర్ మాదిరిగానే అదేవిధమైన రంగు మరియు నమూనా కలిగి ఉండటంతో కొన్ని దేశాలలో బోస్టన్స్ గా పిలవబడతాయి): శరీరమంతా విస్తరించిన నల్లని దుప్పటితో ఇది నలుపు తెలుపు రంగులలో ఉంటుంది; తెల్లని ముట్టెతో నల్లని పుర్రె; తెల్లని మెరుపు ఐచ్చికం; పూర్తిగా తెల్లగా ఉన్న కాలరు ఎంచుకోబడుతుంది; తెల్లని ఛాతీ; ముందు మరియు వెనక కాళ్ళ పూర్తి లేదా కొంతభాగంపై తెలుపు; చివరలో తెల్లగా ఉన్న నల్లని తోక. నల్లని దుప్పటిలో ఒక చిన్న తెల్లని మచ్చ ఆమోదయోగ్యం, అదేవిధంగా తెల్లని కాలరులో ఒక గండి కూడా.
ఇతర వర్ణాలు అరుదుగా కనిపిస్తాయి కానీ గ్రేట్ డేన్ కుక్కలుగా ఇష్టపడరు, మరియు ప్రదర్శన కుక్కలను పెంచాలని ఆసక్తి ఉన్నవారు వీటిని అంగీకరించరు. ఈ వర్ణాలలో తెలుపు, ఫానెక్విన్, మెర్లే, మెర్లెక్విన్, ఫాన్ మాంటిల్, మరియు ఇతరములు ఉన్నాయి. కొంతమంది పెంపకందారులు "అరుదైన" రంగులతో ఉన్న ఈ కుక్కపిల్లలకు ఎక్కువ డబ్బు వసూలు చేయటానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ, ప్రత్యేకించి తెలుపు మరియు మెర్లే డేన్స్ యొక్క పెంపకం వివాదాస్పదం, ఎందుకనగా ఈ వర్ణాలు చెవిటితనం కలిగించే జన్యువులతో కలిసి ఉండవచ్చు. వాటిని గ్రేట్ డేన్ జాతి కుక్కలుగా అంగీకరించక పోయినప్పటికీ, తెల్లని లేదా మేర్లే డేన్ కుక్కలు సాధారణంగా ఆ వంశపు కుక్కలుగానే పరిగణిస్తారు.
స్వభావం[మార్చు]
గ్రేట్ డేన్ యొక్క భారీ మరియు గంభీరమైన ఆకృతి దాని విశ్వాసమైన స్వభావాన్ని మరుగుపరుస్తుంది; ఈ జాతి తరచుగా సాధువైన భారీకాయంగా ప్రస్తావించబడుతుంది.[6] గ్రేట్ డేన్స్ సాధారణంగా ఇతర కుక్కలు, ఇతర పెంపుడు జంతువులు మరియు మనుష్యులతో చక్కగా సర్దుకుపోతాయి. కొన్ని కుక్కలు చిన్న జంతువులను వెంటాడటం లేదా వాటిపై దాడి చేయటం చేయవచ్చు, కానీ అది ఈ జాతి లక్షణం కాదు.[11]
వ్యాయామం[మార్చు]
మూస:Imagestack చాలా కుక్కల మాదిరిగానే, ఆరోగ్యంగా ఉండటానికి గ్రేట్ డేన్స్ కు రోజువారీ నడక అవసరము. కానీ ఈ జాతి చేత ప్రత్యేకించి చిన్న వయసులో ఉన్న వాటి చేత ఎక్కువ వ్యాయామం చేయించకుండా ఉండటం చాలా ముఖ్యం. గ్రేట్ డేన్ కుక్కపిల్లలు చాలా వేగంగా చాలా పెద్దగా పెరుగుతాయి, దీని మూలంగా అవి కీళ్ళు మరియు ఎముకల సమస్యలను ఎదుర్కొంటాయి. కుక్కపిల్ల యొక్క సహజమైన శక్తి కారణంగా, డేన్ యజమానులు ఆ కుక్క ఇంకా పెరుగుతూ ఉన్న సమయంలో దాని చురుకుదనాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తారు.[12][13]
ఆరోగ్యం[మార్చు]
ఇతర పెద్ద కుక్కల లాగానే, గ్రేట్ డేన్స్, చాలా నిదానమైన జీవన ప్రక్రియను కలిగి ఉంటాయి. దీని ఫలితంగా చిన్న జాతుల కన్నా వీటిలో కుక్క యొక్క ప్రతి పౌండుకు తక్కువ శక్తి మరియు తక్కువ ఆహార వినియోగం జరుగుతుంది. గ్రేట్ డేన్స్ పెద్ద జాతులకు సాధారణమైన గాస్ట్రిక్ డైలేషన్-వాల్వులస్ (GDV) (పొట్ట ఉబ్బరము మరియు పొట్టలో మెలితిప్పినట్లు ఉండటం మూలంగా నొప్పి) వంటి కొన్ని ఆరోగ్య ఇబ్బందులను కలిగి ఉంటాయి. ఇది గ్రేట్ డేన్స్ మరియు లోతైన-ఛాతీ కలిగిన ఇతర జాతులకు ఇబ్బంది కలిగించే ఒక క్లిష్టమైన స్థితి, వెంటనే పట్టించుకోకపొతే ఇది మరణానికి కూడా కారణం కావచ్చు. తక్కువ వ్యవధిలో ఎక్కువ పరిమాణంలో ద్రవాలను త్రాగటం, గ్రేట్ డేన్స్ అదేవిధంగా ఇతర పెద్ద కుక్క జాతులలో GDV ని ప్రకోపింప చేయవచ్చు. ఆ కుక్కకు కానీ లేదా దాని సంబంధీకులకు కానీ GDV ఉన్నట్లయితే, వాటి జీర్ణాశయాన్ని కుడి ఉదర గోడకు తగిలించి కుట్లు వేయటం (గాస్ట్రోపెక్సి) సాధారణ అభ్యాసం, కానీ కొందరు పశు వైద్యులు నిజమైన వ్యాధి తటస్థించకపోతే ఆ శస్త్రచికిత్స చేయరు. ఎత్తులో ఉంచిన ఆహార పదార్ధాలు తినేటప్పుడు పీల్చుకోబడిన గాలి పరిమాణాన్ని క్రమపరచటం ద్వారా GDV ని నివారిస్తాయని ఎక్కువగా నమ్మబడుతుంది, అయినప్పటికీ ఒక అధ్యయనం అవి ప్రమాదాన్ని పెంచవచ్చని సూచిస్తోంది.[14] ఆహారానికి ముందు మరియు ఆహారం తీసుకున్న వెంటనే వ్యాయామం లేదా పని చేయకుండా ఉండటం కూడా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు, అయినప్పటికీ దీనిని నిర్ధారించటానికి పరిశోధనలు జరగలేదు. GDV సంభవించింది అనటానికి గుర్తులలో, కనపడే ఉబ్బరం (ఉదరం యొక్క వ్యాకోచం) మరియు వాంతి చేసుకోవటానికి మరల మరల చేసే నిష్ఫల ప్రయత్నాలను పోలిన పునరుక్త వోకర ఉంటాయి, కానీ ఈ లక్షణాలు ఈ వ్యాధికి పరిమితం కావు. GDV అనే స్థితి బ్లోట్ (ఊదుకు రావటం) అనే మరొక స్థితి నుండి వేరుగా ఉంటుంది; కానీ, బ్లోట్ GDV కి దారితీయవచ్చు. GDV కి శస్త్రచికిత్స అత్యవసరం; ఒక కుక్కలో ఈ పరిస్థితికి సంబంధించిన లక్షణాలు కనపడిన వెంటనే పశువైద్య పరీక్షలు చేయించాలి.
ఈ జాతికి సర్వసాధారణమైన ఇంకొక సమస్య హిప్ డిస్ప్లాసియా (తుంటి ఎముకలో సమస్య). తల్లితండ్రుల x-ray విలక్షణంగా వారి తుంటి ఆరోగ్యంగా ఉందో లేదో చెపుతుంది మరియు ఆ జంతువులు సంపర్కం చెంది ఆరోగ్యవంతమైన కుక్కపిల్లలను పొందగాలవా అనే దానికి సూచనగా పనిచేస్తుంది. వాబ్లర్ జబ్బు కూడా ఈ జాతిలో ఒక సమస్య కావచ్చు, ఇది సాధారణంగా క్రమేపీ పెరుగుతుంది మరియు సామాన్యంగా 2 సంవత్సరాల లోపు కుక్కలలో మొదట కనిపిస్తుంది. ఇది పారంపర్యంగా వచ్చిందని భావించబడుతోంది, చికిత్స ఉన్నప్పటికీ వ్యాధి లక్షణాలను గమనిస్తూ ఉండాలి.[15]
గ్రేట్ డేన్స్ సాధారణంగా 8–10 సంవత్సరాలు జీవిస్తాయి, కానీ బాధ్యతాయుతమైన ప్రజననం మరియు మెరుగైన పోషణతో అవి 12-14 సంవత్సరాలు జీవించవచ్చు.
డైలేటెడ్ కార్డియోమయోపతి (DCM) మరియు అనేక పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులు కూడా గ్రేట్ డేన్స్ లో సాధారణంగా కనిపిస్తాయి, దీని మూలంగా దానికి తక్కువ ఆయుర్దాయం వుంటుంది దీనితో దీనికి హార్ట్ బ్రేక్ జాతిగా ముద్దుపేరు వచ్చింది. గ్రేట్ డేన్స్ ఆ జాతికి ప్రత్యేకమైన అనేక జన్యు సంబంధ వ్యాధులతో బాధపడతాయి. ఉదాహరణకు, ఒక గ్రేట్ డేన్ కు కాళ్ళ వద్ద కానీ లేదా చెవుల వద్ద కానీ రంగు లేకపోతే (తెలుపు) అప్పుడు ఆ అవయవం పెరగదు మరియు సామాన్యంగా ఆ కుక్క గుడ్డిది కానీ, చెవిటిది కానీ లేదా రెండూ కానీ అవుతుంది.[16]
మూలాలు[మార్చు]
అలాన్స్ ద్వారా జర్మనీకి తీకుసు వెళ్ళబడిన మస్తిఫ్ఫ్-వంటి కుక్కల నుండి గ్రేట్ డేన్ వృద్ధి చేయబడింది.[17]
బార్బరా స్టీన్ ప్రకారం, "ఈ జాతి జర్మనీలో ఉద్భవించింది, బహుశా ఇంగ్లీష్ మస్తిఫ్ఫ్ మరియు ఐరిష్ ఉల్ఫ్ హౌన్డ్ మధ్య సంకరంతో ఉద్భవించి ఉండవచ్చు."[18] అయినప్పటికీ, ఇతర మూలాలు ఆ జాతి డెన్మార్క్‌లో ఉద్భవించిందని చెపుతున్నప్పటికీ[unreliable source?][19] ఇంకా కొన్ని ఆ ప్రశ్న వివాదాస్పదంగా మరియు అపరిష్కృతంగా ఉందని చెపుతున్నాయి.[20] 1749 లో జార్జెస్-లూయిస్ లేక్లెర్క్, కాంటే డే బఫ్ఫన్ [21] "లే గ్రాండ్ డనోయిస్," (విలియం స్మెల్లీ చేత "గ్రేట్ డేన్"గా అనువదించబడింది) అనే నామాన్ని ఉపయోగించాడు. ఆ సమయం వరకు హౌన్డ్ ఇంగ్లాండ్ లో "డానిష్ డాగ్"గా ప్రస్తావించబడేది.[22] జాకబ్ నికోలే విల్స్ ప్రకారం డేన్స్ ఆ కుక్కను "పెద్ద హౌన్డ్," అని పిలిచారు, ఈ పరిభాష 20వ శతాబ్దం వరకు చక్కగా కొనసాగింది.[23] 1780 లో జర్మనీలో హౌన్డ్ "గ్రాసర్ డానిషర్ జాగ్డ్హండ్"గా ప్రస్తావించబడేది (ఆంగ్లము: Large Danish Hunting Hound).[24] హాంబర్గ్‌లో 1863 జూలై 14-20 మధ్య జరిగిన, మొదటి కుక్కల ప్రదర్శనలో, ఎనిమిది కుక్కలు "డానిషే డాగీ" లుగా మరియు ఏడు "ఉల్మర్ డాగెన్" లుగా పిలవబడ్డాయి.[25]
జనరంజక సంస్కృతిలో గ్రేట్ డేన్స్[మార్చు]
![]() |
This article contains a list of miscellaneous information. (October 2009)
|
- గ్రేట్ డేన్ 1965 లో పెనిసిల్వేనియా యొక్క రాష్ట్రీయ కుక్క అని పేర్కొనబడింది.[26]
- స్కూబి-డూ, ఒక హన్నా-బార్బర పాత్ర. రూపకర్త ఇవావో టకమోటో, ఈ కుక్కను పెంచుకుంటున్న ఒక హన్నా-బార్బర ఉద్యోగి వేసిన గ్రేట్ డేన్ యొక్క రేఖా చిత్రాల ఆధారంగా ఈ ప్రముఖ జంతు పాత్రను సృష్టించాడు, అయినప్పటికీ స్కూబీ తోక నిజమైన గ్రేట్ డేన్ ల తోక కన్నా పెద్దదిగా ఉండి పిల్లి తోకను పోలి ఉంటుంది.[27][28]
- ది అగ్లీ డాచ్షన్డ్ లోని బ్రూటస్, డాచ్షన్డ్ తల్లి పెంచుకున్న ఒక గ్రేట్ డేన్
- మార్మడ్యూక్ 1954 నుండి ఇప్పటివరకు బ్రాడ్ ఆండర్సన్ చే గీయబడిన ఒక కామిక్ స్ట్రిప్ (చిన్న హాస్య భాగం). ఈ చిన్న కథ విన్స్లో కుటుంబము మరియు వారి గ్రేట్ డేన్, మార్మడ్యూక్ చుట్టూ తిరుగుతుంది.
ఇవి కూడా చూడండి[మార్చు]
సూచనలు[మార్చు]
- ↑ "Es war ein reizender Abend," short story by Erich Kästner.
- ↑ Becker,The Great Dane - Embodying a Full Exposition of the History, Breeding Principles, Education, and Present State of the Breed (a Vintage Dog Books Breed Classic): Embodying a Full Exposition the History, Breeding Principles, Education, and Present State of the Breed , Published by READ BOOKS, 2005, ISBN 1905124430.
- ↑ గ్రేట్ డేన్, ది ఆన్లైన్ డాగ్ ఎన్సైక్లోపీడియా, www.dogsindepth.com
- ↑ జోన్స్, శామ్ (22 ఫిబ్రవరి 2010) ప్రపంచంలో పొడవైన కుక్కగా జయింట్ జార్జ్ కిరీటం గెలుచుకుంది, ది గార్డియన్
- ↑ "Tallest Dog Living". Guinness World Records. 2004-08-31. Retrieved 2008-05-21.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 "Great Dane Breed Standard". American Kennel Club. 1999.
- ↑ 7.0 7.1 "UK కెన్నెల్ క్లబ్ బ్రీడ్ స్టాండర్డ్"
- ↑ 8.0 8.1 "Guinness: Arizona Great Dane is tallest dog ever". Washington Post. 22 February 2010. Retrieved 23 February 2010.
- ↑ "న్యూ జీలాండ్ కెన్నెల్ క్లబ్ స్టాండర్డ్"
- ↑ Cunliffe, Juliette (2005). The Complete Encyclopedia of Dog Breeds. UK: Parragon Publishing. ISBN 1-40544-389-8.
- ↑ గ్రేట్ డేన్: ఎ కాంప్రహెన్సివ్ గైడ్ టు ఓనింగ్ అండ్ కేరింగ్ ఫర్ యువర్ డాగ్ , కెన్నెల్ క్లబ్ బుక్, 2003, ISBN 159378273X
- ↑ "ది గ్రేట్ డేన్ అడాప్చన్ సొసైటీ, కేర్ ఎడ్వైజ్"
- ↑ "ఆల్ అబౌట్ Great Danes.com ఎక్సర్సైజ్ ఎడ్వైజ్"
- ↑ Journal of the American Veterinary Medical Association, Non-dietary risk factors for gastric dilatation-volvulus in large and giant breed dogs
- ↑ http://en.wikipedia.org/wiki/Wobbler_disease
- ↑ "గ్రేట్ డేన్ రెస్క్యూ ఎ లేబర్ ఆఫ్ లవ్", బై తమర ఫిలిప్స్ మార్చ్ 23, 2008, డేటోన బీచ్ న్యూస్-జర్నల్ . లింగం
- ↑ గ్రేట్ డేన్ - URL retrieved ఆగష్టు 29, 2006
- ↑ కాల్లియర్స్ ఎన్సైక్లోపీడియా, 1993, sv గ్రేట్ డేన్
- ↑ "ది గ్రేట్ డేన్ – ఎ డానిష్ కల్చరల్ హెరిటేజ్." గ్రేట్ డేన్స్: హౌస్ ఆఫ్ అపోలాన్.
- ↑ animal-world.com/
- ↑ "Histoire Naturelle, générale et particulière"
- ↑ "కుక్కల పిచ్చి", 1762).
- ↑ "Fuldstændig beskrivelse af stapelstaden Fridericia – efter pålidelige underretninger og egne undersøgninger." 1767, p176
- ↑ ఎడ్వర్డ్ C. ఆష్ : ప్రాక్టికల్ డాగ్ బుక్, 1931, "ది గ్రేట్ డేన్"
- ↑ Bulletin Officiel de la Société Canine de Monaco, ఆగష్టు 1938
- ↑ USA జాతీయ చిహ్నాలు, www.statesymbolsusa.org
- ↑ "ఇవావో టకమోటో, 81, స్కూబీ-డూ ను సృష్టించిన యానిమేషన్ కళాకారుడు, చనిపోయాడు", సుసాన్ స్టీవర్ట్, జనవరి 10, 2007, ది న్యూ యార్క్ టైమ్స్
- ↑ "స్కూబీ-డూ ను సృష్టించిన కార్టూనిస్ట్ ఇవావో టకమోటో, 81 సంవత్సరాల వయసులో కన్నుమూసారు", ది అసోసియేటెడ్ ప్రెస్, జనవరి 9, 2007, కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్
బాహ్య వలయాలు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Great Dane. |
- Pages using ISBN magic links
- గూగుల్ అనువాద వ్యాసాలు
- Articles with 'species' microformats
- All articles lacking reliable references
- Articles lacking reliable references from December 2008
- Articles with invalid date parameter in template
- Articles containing explicitly cited English-language text
- Articles with trivia sections from October 2009
- All articles with trivia sections
- జర్మనీలో ఉద్భవిస్తున్న కుక్క జాతులు
- హౌండ్లు
- మోలోసర్స్