Jump to content

గ్రేమ్ క్రెమర్

వికీపీడియా నుండి
గ్రేమ్ క్రెమర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అలెగ్జాండర్ గ్రేమ్ క్రెమర్
పుట్టిన తేదీ (1986-09-19) 1986 సెప్టెంబరు 19 (వయసు: 39)
హరారే, జింబాబ్వే
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 67)2005 జనవరి 6 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2017 డిసెంబరు 26 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 103)2009 జనవరి 27 - కెన్యా తో
చివరి వన్‌డే2018 మార్చి 22 - యుఏఇ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.30
తొలి T20I (క్యాప్ 20)2008 అక్టోబరు 13 - కెనడా తో
చివరి T20I2025 నవంబరు 20 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004/05మషోనాలాండ్ క్రికెట్ జట్టు
2006/07–2008/09నార్దర్స్న్ క్రికెట్ జట్టు
2009/10–2018/19మిడ్ వెస్ట్ రైనోస్
2017కొమిల్లా విక్టోరియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టు వన్‌డే టీ20ఐ
మ్యాచ్‌లు 19 96 31 89
చేసిన పరుగులు 540 744 71 2,887
బ్యాటింగు సగటు 16.36 14.58 5.46 23.47
100లు/50లు 1/0 0/1 0/0 3/10
అత్యుత్తమ స్కోరు 102* 58 17 171*
వేసిన బంతులు 4,214 4,680 612 19,426
వికెట్లు 57 119 37 374
బౌలింగు సగటు 45.68 30.22 19.02 27.86
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 3 0 20
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 4
అత్యుత్తమ బౌలింగు 5/125 6/46 3/11 9/114
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 37/– 8/– 63/–
మూలం: ESPNcricinfo, 2026 జనవరి 2

అలెగ్జాండర్ గ్రేమ్ క్రెమర్ (జననం 1986 సెప్టెంబరు 19) జింబాబ్వే క్రికెట్ ఆటగాడు,. అతను 2016 మే, 2018 మార్చి మధ్య జాతీయ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు.[1]అతను లెగ్-స్పిన్నరు. పాల్ స్ట్రాంగ్, ఆండీ విట్టల్, రే ప్రైస్ లు నిష్క్రమించిన తర్వాత పద్దెనిమిదేళ్ల వయసులో జింబాబ్వే జట్టులోకి అడుగుపెట్టాడు.

తొలినాళ్లలో కెరీర్

[మార్చు]

ప్రతిష్టాత్మక ప్రిన్స్ ఎడ్వర్డ్ స్కూల్‌లో చదువుకున్న క్రీమర్, పాఠశాల క్రికెట్‌లో చాలా ప్రతిభావంతుడు. అనేక వికెట్లు పడగొట్టాడు. అతను 2005 జనవరి 6 న ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రంగప్రవేశం చేశాడు. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడిపోయి బంగ్లాదేశ్ టైగర్స్‌కు తొలి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని అందించింది.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

ఆ తర్వాత క్రెమర్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో టెస్టులు ఆడాడు. దురదృష్టవశాత్తు చాలా మంది టెస్ట్ స్పెషలిస్ట్‌గా పరిగణించే క్రీమర్‌కు, టెస్ట్ క్రికెట్ నుండి జింబాబ్వే తనను తాను బహిష్కరించుకున్న కారణంగా, టెస్టు అవకాశాలు పరిమితమై పోయాయి. జాతీయ జట్టు అంచులలో చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత క్రెమర్ చివరకు 2007 చివరలో వెస్టిండీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల జట్టులోకి ప్రవేశించాడు. అయితే, జింబాబ్వే జట్టు రే ప్రైస్, ప్రోస్పర్ ఉత్సేయల బలమైన స్పిన్ దాడి కారణంగా అతనికి ఆడే అవకాశాలు లభించలేదు. కెనడాలో జరిగిన అల్ బరాకా కప్ ట్వంటీ20 టోర్నమెంట్ వరకు క్రీమర్‌కు పొట్టి ఫార్మాట్‌లో అవకాశం దొరకనే లేదు. అక్కడ తన 3 ఓవర్లలో 2/10 తీసుకుని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

తరువాత శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో జరిగిన సిరీస్‌లలో అతను జట్టులో కొనసాగాడు. ఎక్కువగా 12వ వ్యక్తిగా ఉండేవాడు. తొలి వన్డే 2009 జనవరిలో కెన్యాతో అడాడు. ఆ తొలి వన్డే సిరీస్ అతనికి అద్భుతంగా జరిగింది. 5 మ్యాచ్‌లలో 11.46 సగటుతో 15 వికెట్లు పడగొట్టి, టోర్నమెంటులో అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా నిలిచాడు.

క్రీమర్, బౌలింగు ఆల్ రౌండరుగా ఎదిగాడు. అతని అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు 2006–07 లోగాన్ కప్‌లో అజేయంగా 171 పరుగులు. అయితే అతని ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఎ లలో పరుగుల సగటులు 20ల లోనే ఉన్నాయి.

2011లో జింబాబ్వే టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చినప్పుడు, క్రెమర్ గాయం కారణంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో జరిగిన ఏకైక టెస్ట్‌లకు దూరమయ్యాడు.[2] చివరి టెస్టు ఆడిన ఆరు సంవత్సరాలు పైబడీన తరువాత, 2012 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ కోసం అతన్ని జట్టు లోకి తీసుకున్నారు.[3] 2013 లో చెల్లింపులపై వివాదాలు వచ్చినపుడు క్రీమర్, జింబాబ్వే క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. బదులుగా ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా మారడంపై దృష్టి పెట్టాడు. అయితే ఆశ్చర్యకరంగా, 2015లో అతను జింబాబ్వే తరపున మళ్ళీ ఆడేందుకు నిర్ణయం తీసుకుని, పాకిస్తాన్ పర్యటనకు ఎంపికయ్యాడు.

కెప్టెన్సీ

[మార్చు]

క్రెమర్ జింబాబ్వే జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా నియమితులయ్యాడు. 2016 జూన్‌లో అతని నాయకత్వంలో జింబాబ్వే భారత్‌తో తొలి మ్యాచ్ ఆడింది. భారత్‌తో జరిగిన 3 వన్డేల్లోనూ ఓడిపోయినప్పటికీ, జింబాబ్వే మొదటి T20Iని 2 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఇది క్రెమర్ నాయకత్వంలో తొలి విజయం.[4]

తరువాత, జింబాబ్వే న్యూజిలాండ్‌తో మరో స్వదేశీ సిరీస్ ఆడింది, దీనిని కూడా న్యూజిలాండ్ 2–0తో వైట్‌వాష్ చేసింది.[5][6] అయితే, శ్రీలంక టెస్ట్ పర్యటనకు ముందు, జింబాబ్వే మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్‌ను కోచ్‌గా నియమించారు. క్రెమర్ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.

హరారేలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో, శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో క్రెమర్ నాలుగు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగులో తన తొలి టెస్ట్ సెంచరీని కూడా సాధించాడు. తన జట్టు ఫాలో-ఆన్‌ను తప్పించుకోవడానికి మార్గనిర్దేశం చేశాడు.[7] దీనితో, అతను టెస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, నాలుగు వికెట్లు తీసిన ఏడవ కెప్టెన్‌గా, జింబాబ్వేలో మొదటి ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో అతని ప్రయత్నాలు ఫలించలేదు, వారు మ్యాచ్‌ను 225 పరుగుల తేడాతో కోల్పోయారు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో, ఓ టెస్ట్ మ్యాచ్‌లో 8వ నంబర్ బ్యాట్స్‌మన్‌గా వచ్చి, అత్యధిక బంతులు ఎదుర్కొన్న రికార్డును క్రెమర్ సృష్టించాడు. 8వ నంబర్ బ్యాట్స్‌మన్‌గా 363 బంతులు ఎదుర్కొన్న వసీం అక్రమ్ తర్వాత క్రెమర్ 351 బంతులు ఎదుర్కొన్నాడు.[8] మ్యాచ్‌లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనకు క్రీమర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.[9] జింబాబ్వే ఈ సిరీస్‌ను 0–2తో కోల్పోయింది.

టెస్ట్ సిరీస్ తర్వాత వెస్టిండీస్‌తో ట్రై-సిరీస్ జరిగింది. క్రెమర్ నాయకత్వంలో, జింబాబ్వే ఆరు సంవత్సరాలలో మొదటిసారిగా నాలుగు విభిన్న ఫలితాలతో ట్రై-సిరీస్ ఫైనల్స్‌కు చేరుకుంది - ఒక ఓటమి, ఒక టై, ఒక ఫలితం లేని మ్యాచ్, ఒక విజయం. అయితే, జింబాబ్వే శ్రీలంక చేతిలో ఫైనల్స్‌ను కోల్పోయింది.

క్రెమర్ కెప్టెన్సీలో, జింబాబ్వే శ్రీలంకపై తొలి వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఇది వారి చరిత్రలో సాధించిన సిరీస్ విజయాల్లో ఇది నాల్గవది. ఈ సిరీస్‌లో, శ్రీలంకలో జరిగిన 296 వన్డేలలో జింబాబ్వే తొలిసారిగా శ్రీలంక గడ్డపై 300+ పరుగుల విజయవంతమైన ఛేజింగ్‌ను నమోదు చేసింది.[10][11]

అన్ని ఫార్మాట్లలో ప్రతి మ్యాచ్‌తోనూ అతని కెప్టెన్సీ మరింతగా మెరుగుపడుతూ వచ్చింది. 2017 జూలై 16 న శ్రీలంకతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో, క్రెమర్ తన తొలి ఐదు వికెట్ల పంటను సాధించాడు. దానితో, క్రెమర్ ఐదు వికెట్లు తీసిన తొలి జింబాబ్వే కెప్టెన్‌గా కూడా నిలిచాడు.[12] అయితే, జింబాబ్వే 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. శ్రీలంక 388 పరుగులను విజయవంతంగా ఛేదించి ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. క్రెమర్ ఈ మ్యాచ్‌లో 275 పరుగులకు 9 వికెట్లు తీసాడు. ఇది టెస్ట్‌లలో జింబాబ్వే కెప్టెన్‌కు అత్యుత్తమ రికార్డు.[13][14]

2018 మార్చిలో జింబాబ్వేలో జరిగిన 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటును దాటి జింబాబ్వే జట్టు ముందుకు పోకపోవడంతో, జింబాబ్వే క్రికెట్ క్రెమర్‌ను తొలగించింది.[1]

క్రెమర్ భార్య మెర్నా మూర్ ఎమిరేట్స్‌లో పైలట్‌గా ఉద్యోగంలోఫ్ చేరడంతో, 2019 జనవరిలో క్రెమర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో దుబాయ్‌కు మకాం మార్చాడు.[15] 2019 ఏప్రిల్‌లో అతను జింబాబ్వే పర్యటన కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టుకు కోచింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించాడు.[16] అతను రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ అకాడమీకి అకాడమీ డైరెక్టర్‌గా కూడా ఉన్నాడు.

క్రెమర్ 2025లో జింబాబ్వేకు తిరిగి వచ్చి తన క్రీడా జీవితాన్ని తిరిగి ప్రారంభించాడు. 2025 అక్టోబరులో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం అతను జింబాబ్వే జట్టులో చేరాడు కానీ ఏ మ్యాచ్‌లోనూ ఆడలేదు.[17][18] 2025 నవంబరులో లోగన్ కప్‌లో, 2017 డిసెంబరు తర్వాత ఆడిన తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో, మిడ్ వెస్ట్ రైనోస్ తరపున ఆడి 144 పరుగులకు 9 వికెట్లు పడగొట్టి తన అత్యుత్తమ ఇన్నింగ్స్ గణాంకాలను సాధించాడు.[19]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Zimbabwe Cricket sack captain Cremer and all coaching staff". ESPNcricinfo. Retrieved 30 March 2018.
  2. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  3. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  4. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  5. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  6. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  7. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  8. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  9. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  10. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  11. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  12. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  13. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  14. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  15. "Graeme Cremer temporarily puts his career on hold". International Cricket Council. Retrieved 10 January 2019.
  16. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  17. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  18. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo
  19. Zimbabwe sack Masakadza, Whatmore. ESPNcricinfo