గ్రో హార్లెం బ్రండ్ట్‌లాండ్
గ్రో హార్లెం బ్రండ్ట్‌లాండ్ | |
---|---|
![]() 2011 లో బ్రండ్ట్‌లాండ్ | |
నార్వే ప్రధానమంత్రి | |
In office 1990 నవంబరు 3 – 1996 అక్టోబరు 25 | |
చక్రవర్తి | ఓలావ్ V హెరాల్డ్ V |
అంతకు ముందు వారు | Jan P. Syse |
తరువాత వారు | థోర్బ్జోర్న్ జగ్లాండ్ |
In office 1986 మే 9 – 1989 అక్టోబరు 16 | |
చక్రవర్తి | ఓలావ్ V |
అంతకు ముందు వారు | కేర్ విల్లోచ్ |
తరువాత వారు | జాన్ పి. సైస్ |
In office 1981 ఫిబ్రవరి 4 – 1981 అక్టోబరు 14 | |
చక్రవర్తి | ఓలావ్ V |
అంతకు ముందు వారు | ఓద్వార్ నోర్డ్లీ |
తరువాత వారు | కేర్ విల్లోచ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | గ్రో హార్లెమ్ 1939 ఏప్రిల్ 20 బేరుం, అకెర్హస్, నార్వే |
రాజకీయ పార్టీ | లేబర్ పార్టీ (నార్వే) |
జీవిత భాగస్వామి |
Arne Olav Brundtland
(m. 1960; died 2024) |
సంతానం | 4 |
కళాశాల | ఓస్లో విశ్వవిద్యాలయం (క్యాండిడేట్ ఆఫ్ మెడిసిన్) హార్వర్డ్ యూనివర్సిటీ (MPH) |
సంతకం | ![]() |
గ్రో హార్లెం బ్రండ్ట్‌లాండ్ (1939 ఏప్రిల్ 20) నార్వే లేబరు పార్టీ రాజకీయ నాయకురాలు.[1] ఆమె మూడు పర్యాయాలు నార్వే ప్రధాన మంత్రిగా (1981, 1986–1989, 1990–1996) పనిచేసింది. 1981 నుండి 1992 వరకు తన పార్టీకి నాయకురాలిగా, 1998 నుండి 2003 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసింది. సుస్థిర అభివృద్ధిపై బ్రండ్ట్‌ల్యాండ్ నివేదికను సమర్పించిన బ్రండ్ట్‌ల్యాండ్ కమిషన్‌కు అధ్యక్షత వహించినందుకు కూడా ఆమె ప్రసిద్ధి చెందింది.
వైద్యం చదువుకున్న బ్రండ్ట్‌ల్యాండ్ లేబరు పార్టీలో చేరి 1974లో పర్యావరణ మంత్రిగా ప్రభుత్వంలోకి ప్రవేశించింది. ఆమె 1981 ఫిబ్రవరి 4 న నార్వేకు మొదటి మహిళా ప్రధానమంత్రి ఐంది.[1] కానీ 1981 అక్టోబరు 14 న రాజీనామా చేసింది. మళ్ళీ 1986 మే 9 న తిరిగి ప్రధానమంత్రిగా వచ్చి 1989 అక్టోబరు 16 వరకు పనిచేసింది. 1990 నవంబరు 3న మూడ్వసారి ప్రధాని పదవి చేపట్టింది. 1996 లో ప్రధానమంత్రి పదవికి ఆకస్మికంగా రాజీనామా చేసాక, ఆమె స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యంలో అంతర్జాతీయ నాయకురాలిగా ఎదిగింది. 2007 నుండి 2010 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌గా, వాతావరణ మార్పులపై UN ప్రత్యేక రాయబారిగా పనిచేసింది.[2] ఆమె ది ఎల్డర్స్ కు డిప్యూటీ చైర్ పర్సన్, సోషలిస్ట్ ఇంటర్నేషనల్ కు మాజీ వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేసింది.
బ్రండ్ట్‌ల్యాండ్ తన పార్టీలోని మితవాద వర్గానికి చెందినది. 1994 ప్రజాభిప్రాయ సేకరణలో యూరోపియన్ యూనియన్‌లో నార్వే సభ్యత్వానికి మద్దతు ఇచ్చింది. ప్రధానమంత్రిగా, బ్రండ్ట్‌ల్యాండ్ "జాతి మాత"గా ప్రసిద్ది చెందింది. బ్రండ్ట్‌ల్యాండ్ 1994 చార్లెమాగ్నే బహుమతిని అందుకుంది. అనేక ఇతర అవార్డులూ, గుర్తింపులనూ అందుకుంది.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]బ్రండ్ట్‌ల్యాండ్ 1939లో ఓస్లోలో వైద్యుడూ రాజకీయ నాయకుడూ అయిన గుడ్మండ్ హర్లెం, ఇంగా మార్గరెటా ఎలిసబెట్ బ్రైనాల్ఫ్ (1918-2005) దంపతులకు జన్మించింది. ఆమెకు లార్స్ అనే తమ్ముడు, హన్నే అనే చెల్లెలు ఉన్నారు.
1963 లో బ్రండ్ట్‌ల్యాండ్ ఓస్లో విశ్వవిద్యాలయం నుండి క్యాండిడేట్ అనే వైద్య పట్టా పొందింది. ఆమె 1965లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది.
1966 నుండి 1969 వరకు, ఆమె డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ ( హెల్సెడిరెక్టోరాటెట్ )లో వైద్యురాలిగా. 1969 నుండి ఓస్లో ప్రభుత్వ పాఠశాల ఆరోగ్య సేవలో వైద్యురాలిగా పనిచేసింది.
రాజకీయ జీవితం
[మార్చు]ఆమె 1974 నుండి 1979 వరకు పర్యావరణ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.
నార్వే ప్రధాన మంత్రి
[మార్చు]బ్రండ్ట్‌లాండ్ 1981లో నార్వే యొక్క మొదటి మహిళా ప్రధానమంత్రి అయింది.[3] ఫిబ్రవరి నుండి అక్టోబరు వరకు ప్రధానమంత్రిగా పనిచేసింది.[4]
బ్రండ్ట్‌ల్యాండ్ మరో రెండు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసింది. రెండవ సారి 1986 మే 9 నుండి 1989 అక్టోబరు 16 వరకు కొనసాగింది. ఆమె మంత్రివర్గం అధిక సంఖ్యలో మహిళా మంత్రులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది: మొత్తం పద్దెనిమిది మంత్రులలో ఎనిమిది మంది మహిళలుండేవారు. మూడవ సారి 1990 నవంబరు 3 నుండి 1996 అక్టోబరు 25 వరకు ఆమె ప్రధానిగా పనిచేసింది.
బ్రండ్ట్‌ల్యాండ్ 1981లో లేబరు పార్టీ నాయకురాలిగా ఎన్నికై, 1992లో మూడవసారి ప్రధానమంత్రిగా పదవీ విరమణ చేసే వరకు ఆ పదవిలో కొనసాగింది. 1996 లో పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి పూర్తిగా విరమించుకుంది. 1992 లో లేబరు పార్టీకి, 1996 లో ప్రధానమంత్రి పదవికీ ఆమె వారసుడు థోర్బ్జోర్న్ జాగ్లాండ్.
2023 స్థానిక ఎన్నికలకు ఓస్లో నగర మండలికి అభ్యర్థిగా ఎన్నికైనప్పుడు బ్రండ్ట్‌ల్యాండ్ తిరిగి రాజకీయాల్లోకి వచ్చింది. చివరికి ఆమె కౌన్సిల్‌లో ఒక స్థానాన్ని గెలుచుకుంది.[5][6]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]1983లో, వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (WCED) ను స్థాపించి, అధ్యక్షత వహించడానికి అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ జేవియర్ పెరెజ్ డి క్యూల్లార్ బ్రండ్ట్‌ల్యాండ్‌ను ఆహ్వానించాడు. దానికి ఆమె పేరున బ్రండ్ట్‌ల్యాండ్ కమిషన్ అనే పేరు వచ్చింది. విస్తృతమైన ప్రజా విచారణల సమయంలో ఆమె స్థిరమైన అభివృద్ధి యొక్క విస్తృత రాజకీయ భావనను అభివృద్ధి చేసింది. 1987 ఏప్రిల్‌లో అవర్ కామన్ ఫ్యూచర్ అనే నివేదికను ప్రచురించిన ఈ కమిషన్, కమిషన్‌లో ప్రముఖ సభ్యుడిగా ఉన్న మారిస్ స్ట్రాంగ్ నేతృత్వంలోని 1992 ఎర్త్ సమ్మిట్ / UNCED కి ఊపునిచ్చింది. బ్రండ్ట్‌ల్యాండ్ కమిషన్ ఎజెండా 21 కు ఊపునిచ్చింది.
ఆమె మూడవ మంత్రివర్గంలో, 1993 లో నార్వేజియన్ ప్రభుత్వం యిట్జాక్ రబీన్ నేతృత్వంలోని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి - లేబరు పార్టీ నాయకుడు బ్రండ్ట్‌ల్యాండ్ లాగా - యాసర్ అరాఫత్ నేతృత్వంలోని PLO మధ్య రహస్య శాంతి చర్చలను స్పాన్సర్ చేయడానికి చొరవ తీసుకుంది. వాటి పర్యవసానంగా ఓస్లో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఆ తరువాత చాలా సంవత్సరాలు, ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతిని ప్రోత్సహించడంలో నార్వే ఉన్నత స్థాయి ప్రమేయాన్ని కొనసాగించింది. అయితే యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తి పాత్ర తీసుకోవడంతో నార్వే పాత్ర తగ్గిపోయింది.
ప్రధానమంత్రిగా ఆమె పదవీకాలం ముగిసిన తర్వాత, బ్రండ్ట్‌ల్యాండ్ 1998 మేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌గా ఎన్నికయింది. ఈ హోదాలో, బ్రండ్ట్‌ల్యాండ్ ప్రజారోగ్యానికి విశేష ప్రభావాన్ని చూపే విధానాన్ని అవలంబించింది. జెఫ్రీ సాచ్స్ అధ్యక్షతన స్థూల ఆర్థిక శాస్త్రం, ఆరోగ్యంపై కమిషన్‌ను ఏర్పాటు చేసింది. హింసను ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా భావించింది. విద్య, ఒప్పించడం, పన్నుల పెంపుదల ద్వారా ధూమపానాన్ని రద్దు చేయాలనే ఉద్యమానికి బ్రండ్ట్‌ల్యాండ్ నాయకత్వం వహించింది. ఈ విధానాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్నారు. [7] ఆమె నాయకత్వంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ధూమపానం మానేయడాన్ని ఉద్యోగ షరతుగా చేసిన మొదటి ప్రధాన యజమానులలో ఒకటి. బ్రుండ్ట్‌ల్యాండ్ నాయకత్వంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఔషధ-కంపెనీల ప్రభావం పెరిగిందనే విమర్శలను ఆమె ఎదుర్కొంది.[8]
SARS వ్యాప్తికి ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన ప్రతిస్పందనను సమన్వయం చేసినందుకు బ్రండ్ట్‌ల్యాండ్‌ను 2003లో సైంటిఫిక్ అమెరికన్ వారి 'పాలసీ లీడర్ ఆఫ్ ది ఇయర్'గా గుర్తించింది. బ్రండ్ట్‌ల్యాండ్ తర్వాత 2003 జూలై 21 న జోంగ్-వూక్ లీ అధికారంలోకి వచ్చాడు. 1994 లో బ్రండ్ట్‌ల్యాండ్‌కు ఆచెన్ నగరం చార్లెమాగ్నే బహుమతిని అందజేసింది.
2006లో బ్రండ్ట్‌ల్యాండ్ ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి సమావేశం (UNCTAD) పనిని సమీక్షించిన ప్రముఖ వ్యక్తుల ప్యానెల్‌లో సభ్యురాలు. 2007 మేలో, UN సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్ బ్రండ్ట్‌ల్యాండ్‌తో పాటు రికార్డో లాగోస్ (చిలీ మాజీ అధ్యక్షుడు), హాన్ సీయుంగ్-సూ (దక్షిణ కొరియా మాజీ విదేశాంగ మంత్రి)లను వాతావరణ మార్పుల కోసం UN ప్రత్యేక రాయబారులుగా నియమించారు.[9]
బ్రండ్ట్‌ల్యాండ్ ముఖ్య రాజకీయ కార్యకలాపాలను ఆమె భర్త ఆర్నే ఓలావ్ రాసిన రెండు పుస్తకాలు - మ్యారీడ్ టు గ్రో (ISBN 82-516-1647-6 ), అండ్ స్టిల్ మ్యారీడ్ టు గ్రో (ISBN 82-05-30726-1 ) లలో వివరించాడు
2007 లో బ్రండ్ట్‌ల్యాండ్ పెప్సీకి కన్సల్టెంట్‌గా పనిచేసింది.[10]
బ్రండ్ట్‌ల్యాండ్ మహిళా ప్రపంచ నాయకుల మండలిలో సభ్యురాలు. ఇది ప్రస్తుత, మాజీ మహిళా అధ్యక్షులు, ప్రధాన మంత్రుల అంతర్జాతీయ నెట్‌వర్కు. దీని లక్ష్యం మహిళలు పురుషులతో సమానంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన కీలకమైన అంశాలపై సమిష్టి చర్యను సమీకరించడం.[11]
బ్రండ్ట్‌ల్యాండ్ క్లబ్ ఆఫ్ మాడ్రిడ్‌లో కూడా సభ్యురాలు. ఇది ప్రజాస్వామ్య దేశాల మాజీ నాయకుల స్వతంత్ర సంస్థ, ఇది ప్రజాస్వామ్య పాలననూ నాయకత్వాన్నీ బలోపేతం చేయడానికి పనిచేస్తుంది.[12]
ప్రపంచంలోని అత్యంత క్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి నెల్సన్ మండేలా, గ్రాకా మాచెల్, డెస్మండ్ టుటు మొదట సమావేశపరిచిన ప్రపంచ నాయకుల బృందం ది ఎల్డర్స్ కు బ్రండ్ట్‌ల్యాండ్ వ్యవస్థాపక సభ్యురాలు. మండేలా 2007 జూలై 18 న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఈ బృందాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. బ్రండ్ట్‌ల్యాండ్ ది ఎల్డర్స్ పనిలో చురుకుగా పనిచేసింది. సమూహం యొక్క విస్తృత శ్రేణి కార్యక్రమాలలో పాల్గొంది. ఆమె ఎల్డర్స్ ప్రతినిధులతో కలిసి సైప్రస్, కొరియన్ ద్వీపకల్పం, ఇథియోపియా, భారతదేశం, మధ్యప్రాచ్య దేశాలకు ప్రయాణించింది. బాల్య వివాహాలపై ది ఎల్డర్స్ చొరవలో కూడా బ్రండ్ట్‌ల్యాండ్ పాల్గొంది -గర్ల్స్ నాట్ బ్రైడ్స్: ది గ్లోబల్ పార్టనర్‌షిప్ టు ఎండ్ చైల్డ్ మ్యారేజ్ స్థాపనతో సహా.[13] ఆమె 2013 లో ఆ బృందానికి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. 2018 లో బాన్ కీ-మూన్, గ్రాకా మాచెల్ ఈ పాత్రలో విజయం సాధించారు.[14][15]
బ్రండ్ట్‌లాండ్ 1982మ్ 1983లో బిల్డర్‌బర్గ్ సమావేశాలకు హాజరయ్యారు. ఆమె భర్త 1991లో హాజరయ్యాడు.
2019లో, బ్రండ్ట్‌ల్యాండ్ WHO గ్లోబల్ ప్రిపేర్డ్‌నెస్ మానిటరింగ్ బోర్డ్‌కు సహ-చైర్‌పర్సన్‌గా పనిచేసింది.
హత్యాయత్నం
[మార్చు]2011 జూలై 22 న ఆండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ చేతిలో హత్యకు గురికాకుండా బ్రండ్ట్‌ల్యాండ్ తృటిలో తప్పించుకుంది. ఉటోయా ద్వీపంలో ఊచకోతకు కొన్ని గంటల ముందు AUF శిబిరంలో ప్రసంగించింది. బ్రండ్ట్‌ల్యాండ్‌ను దాడికి ప్రధాన లక్ష్యంగా (ఎస్కిల్ పెడెర్సెన్, జోనాస్ గహర్ స్టోర్‌తో పాటు) ఉద్దేశించానని బ్రీవిక్ పేర్కొన్నాడు. కానీ అతను ఓస్లో నుండి రావడానికి ఆలస్యం అయింది.[16][17] బ్రుండ్ట్‌ల్యాండ్ వెళ్లిన రెండు గంటల తర్వాత బ్రీవిక్ ఉటోయా చేరుకున్నాడు.
2012లో తన విచారణ సమయంలో, బ్రూండ్ట్‌ల్యాండ్ హత్య కోసం బ్రీవిక్ చేసిన వివరణాత్మక హత్య ప్రణాళికలను వెల్లడించాడు.[18] ఆమె చేతికి సంకెళ్లు వేసి, ఆమె "నేరాలను" వివరించే సిద్ధం చేసిన పాఠాన్ని తాను చదువుతూ రికార్డ్ చేసి, బయోనెట్‌తో ఆమె తల నరికి కెమెరాలో ఆ దృశ్యాన్ని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్లాన్ చేశానని అతను కోర్టుకు తెలిపాడు. బ్రుండ్ట్‌ల్యాండ్ తన ప్రధాన లక్ష్యంగా ఉన్నప్పటికీ, ద్వీపంలోని మిగతా వారందరినీ ఊచకోత కోయాలని తాను ఇంకా ప్లాన్ చేశానని బ్రీవిక్ చెప్పాడు.[19]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె 1960 డిసెంబరు 9 న ఆర్నే ఒలావ్ బ్రండ్ట్‌ల్యాండ్‌ను వివాహం చేసుకుంది. వారికి నలుగురు పిల్లలు; ఒకరు చనిపోయారు. వారికి దక్షిణ ఫ్రాన్స్‌లో ఒక ఇల్లు ఉంది.[20]
ఆరోగ్య సమస్యలు
[మార్చు]2002లో ఉల్లేవాల్‌లోని ఓస్లో యూనివర్శిటీ హాస్పిటల్‌లో బ్రండ్ట్‌ల్యాండ్‌కు గర్భాశయ క్యాన్సర్ కోసం ఆపరేషన్ జరిగింది.[21] 2007లో ఆమె ఉల్లెవాల్‌లో రెండు చికిత్సలు పొందారని, వీటికి అయ్యే ఖర్చు నార్వేజియన్ ప్రభుత్వం చెల్లించిందని 2008 లో తెలిసింది. ఆమె ఫ్రాన్స్‌కు నివాసం మారిందని నార్వేజియన్ అధికారులకు గతంలో తెలియజేసినందున, ఆమె ఇకపై నార్వేజియన్ సామాజిక భద్రతా ప్రయోజనాలకు అర్హులు కాదు. ఈ విషయం చుట్టూ మీడియా దృష్టి సారించిన తర్వాత, బ్రండ్ట్‌ల్యాండ్ మరోసారి నివాసం మార్చుకోవాలని నిర్ణయించుకుని, నార్వేకు తిరిగి వెళ్లింది. చికిత్సలకు తానే ఖర్చు చెల్లిస్తానని కూడా ప్రకటించింది. [22] బ్రండ్ట్‌ల్యాండ్ విద్యుత్ సున్నితత్వంతో బాధపడుతున్నట్లు పేర్కొంది, దీని వలన ఎవరైనా ఆమె దగ్గర మొబైల్ ఫోన్ వాడినప్పుడు తలనొప్పి వస్తుంది. [23]
గౌరవాలు
[మార్చు]
బ్రండ్ట్‌ల్యాండ్ అనేక అవార్డులు, గౌరవాలూ లభించాయి. వాటిలో -
- ఇందిరా గాంధీ బహుమతి (1988)
- చార్లెమాగ్నే బహుమతి (1994)
- అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీ సభ్యురాలు(2002) [24]
- థామస్ జెఫెర్సన్ ఫౌండేషన్ మెడల్ ఇన్ ఆర్కిటెక్చర్ (2008) [25]
- ప్రైజ్ ఇంటర్నేషనల్ కాటలోనియా (2013) మలాలా యూసఫ్జాయ్ తో [26]
- సుస్థిర అభివృద్ధిలో టాంగ్ బహుమతి (2014) [27] [28]
- నార్వేజియన్ అసోసియేషన్ ఫర్ ఉమెన్స్ రైట్స్ (2016) గౌరవ సభ్యురాలు [29]
- నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ సభ్యురాలు[30]
- నేషనల్ జర్మన్ సస్టైనబిలిటీ అవార్డు [31]
- మాస్కో సొసైటీ ఆఫ్ నేచురలిస్ట్స్ గౌరవ సభ్యురాలు
- క్లబ్‌హౌస్ ఇంటర్నేషనల్ నుండి రుడ్‌యార్డ్ ఎన్. ప్రాప్స్ట్ అవార్డు
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఓడ్వర్ నోర్డ్లి
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Brundtland, Gro Harlem (Norway)", The Statesman’s Yearbook Companion: The Leaders, Events and Cities of the World (in ఇంగ్లీష్), London: Palgrave Macmillan UK, p. 61, 2019, doi:10.1057/978-1-349-95839-9_122, ISBN 978-1-349-95839-9
- ↑ "UN Secretary-General Ban Ki-moon Appoints Special Envoys on Climate Change". United Nations. 2007. Retrieved 2007-08-03.
- ↑ Worth, William E., ed. (4 February 1981). "Norway picks prime minister". The Journal Herald. Vol. 174, no. 40. Dayton, Ohio. p. 8 – via Newspapers.com.
- ↑ Kelly, Thomas A., ed. (14 October 1981). "Socialist Government Resigns in Norway". The Post. Vol. 73, no. 175. West Palm Beach, Florida: Daniel J. Mahoney. p. A13 – via Newspapers.com.
- ↑ "Gro Harlem Brundtland i bystyret?" (in నార్వేజియన్). NRK Oslo og Viken. 16 November 2022. Retrieved 1 October 2023.
- ↑ "Gro Harlem Brundtland seilte inn i Oslo bystyre" (in నార్వేజియన్). NRK Oslo og Viken. 14 September 2023. Retrieved 1 October 2023.
- ↑ Claire Doole (21 October 1998). "WHO declares war on tobacco firms". BBC news. Retrieved 22 February 2013.
- ↑ Wilson, Duff (26 June 2005). "New blood-pressure guidelines pay off – for drug companies". The Seattle Times. No. 26 June 2005. Retrieved 21 February 2017.
- ↑ Edith M. Lederer, Associated Press (10 May 2007). "U.N. Envoys Seek Input on Climate Change". Time. Archived from the original on 1 July 2007. Retrieved 23 February 2013.
- ↑ Morten Ulekleiv; Gunn Kari Hegvik; Lars Kristian Tranøy (12 December 2007). "Pepsi-Gro slår tilbake: – Latterlig". Verdens Gang. Retrieved 23 February 2013.
- ↑ "Members". Council of Women World Leaders (in ఇంగ్లీష్). Archived from the original on 2020-05-12. Retrieved 2020-06-19.
- ↑ "Brundtland, Gro Harlem". Club de Madrid. Archived from the original on 6 August 2017. Retrieved 23 February 2013.
- ↑ "Gro Harlem Brundtland". The Elders. Archived from the original on 6 March 2013. Retrieved 23 February 2013.
- ↑ "Kofi Annan appointed Chair of The Elders". theelders.org (in ఇంగ్లీష్). 10 May 2013. Retrieved 2021-12-09.
- ↑ "Mary Robinson appointed new Chair of The Elders". theelders.org (in ఇంగ్లీష్). November 2018. Retrieved 2021-12-09.
- ↑ "Norway shooting: killer 'confirms Gro Harlem Brundtland was main target'". The Daily Telegraph. 25 July 2011. Retrieved 23 February 2013.
- ↑ Line Brustad (18 November 2011). "Breiviks hovedmål: Gro, Jonas og Eskil". Dagbladet (in నార్వేజియన్). Retrieved 23 February 2013.
- ↑ Haroon Siddique; Helen Pidd (19 April 2012). "News blog: Anders Behring Breivik trial, day four – Thursday 19 April". The Guardian. Retrieved 23 February 2013.
- ↑ "Breivik trial: Phone delay 'caused more deaths'". BBC News. 23 April 2012. Retrieved 23 February 2013.
- ↑ regjeringen.no (2011-05-31). "Gro Harlem Brundtland". Government.no. Retrieved 2021-01-18.
- ↑ Alf Bjarne Johnsen (10 January 2008). "Betalte operasjon i 2002". Verdens Gang (in నార్వేజియన్).
- ↑ Alf Bjarne Johnsen (7 January 2008). "Gro flytter hjem". Verdens Gang (in నార్వేజియన్). Retrieved 23 February 2013.
- ↑ Aud Dalsegg (9 March 2002). "Får hodesmerter av mobilstråling". Dagbladet (in నార్వేజియన్). Retrieved 23 February 2013.
- ↑ "APS Member History". search.amphilsoc.org. Retrieved 2021-07-08.
- ↑ "International Leader in Environmental Issues to Receive 2008 Thomas Jefferson Foundation Medal in Architecture, Law, Citizen Leadership, and Global Innovation". University of Virginia. 15 February 2008. Archived from the original on 15 December 2012.
- ↑ "La nena pakistanesa Malala Yousafzai i l'ex primera ministra noruega Gro Harlem Brundtland, XXV Premi Internacional Catalunya" (in కాటలాన్). Ara. 24 May 2013.
- ↑ 2014 Tang Prize in Sustainable Development Archived 6 అక్టోబరు 2014 at the Wayback Machine
- ↑ "Tang Prize laureate calls for more sustainable development efforts". Archived from the original on 6 October 2014. Retrieved 5 October 2014.
- ↑ "Gro Harlem Brundtland utnevnt til æresmedlem av Norsk Kvinnesaksforening". Norwegian Association for Women's Rights. 21 May 2016. Retrieved 21 May 2016.
- ↑ "Gruppe 7: Medisinske fag" (in నార్వేజియన్). Norwegian Academy of Science and Letters. Archived from the original on 15 September 2018. Retrieved 28 October 2009.
- ↑ The National German Sustainability Award Archived 20 అక్టోబరు 2016 at the Wayback Machine