ఘంట స్తంభం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గంట స్తంభం లేదా ఘంట స్తంభం ఒక విధమైన నిర్మాణం. దీనిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గంటలు ఎత్తుగా కట్టిన స్తంభం వంటి నిర్మాణం మీద బిగిస్తారు. ఇవి చర్చిలో సాధారణ భాగం. పూర్వ కాలంలో రాజులు తమ పాలనకు చిహ్నంగా గంట స్థంభాలు నిర్మించేవారు. లండన్ నగరంలోని బిగ్ బెన్, ఆంధ్రప్రదేశ్ లో విజయనగరంలో గంట స్థంభం ఉదాహరణలు. దీనిని ఆంగ్లంలో కాంపనైన్ అంటారు. ఇది ఇటాలియన్ పదం "campanile" నుండి ఉత్పత్తి అయినది. దీనిలో campana అనగా "గంట" అనీ, ఈ స్థంబాన్ని గంటస్థంబమనీ పిలుస్తారు. కొన్ని సంప్రదాయాలలో ఈ గంట స్థంబాన్ని "బెల్ఫ్రే" అని పిలుస్తారు.

ప్రపంచంలో 113.2 మీటర్లు (371 అడుగులు) ఎత్తు గల అతి పెద్ద గంటస్థంబం మోర్టెగ్లిఆయో బెల్ టవర్. ఇది ఇటలీ లోని ప్రియూలీ వెనెజ్లా జియూలియా ప్రాంతంలో ఉంది. [1][2]

అవసరం

[మార్చు]

దూరంగా ఉన్న ప్రజలు వినడానికి వీలుగా టవర్ లోని గంటలు మోగుతాయి. అదే విధంగా చర్చి గంటలు ఆరాధకులకు మతపరమైన సేవకోసం చర్చికి వెళ్ళేందుకు సమయాన్ని సూచిస్తాయి. చర్చిలలో ప్రార్థనా సమయాన్ని కూడా సూచిస్తాయి. వివాహం, లేదా అంత్యక్రియల సందర్భంలో కూడా వాటికి మోగిస్తారు. మతపరమైన సంప్రదాయాలలో, చర్చిల ప్రార్థనా విధానాలలో ప్రజలకు సమాచారాన్నందించే సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి[3].


మూలాలు

[మార్చు]
  1. "25 tallest clock towers/government structures/palaces" (PDF). Council on Tall Buildings and Urban Habitat. January 2008. Archived from the original (PDF) on 2008-10-30. Retrieved 2008-08-09.
  2. "Campus tour booklet" (PDF). University of Birmingham. Archived from the original (PDF) on 2009-09-02. Retrieved 2008-08-09.
  3. Church Words: Origins and Meanings. Forward Movement. 1 August 1996. ISBN 9780880281720. Retrieved 16 August 2012. There are two sorts of liturgical bells in the history of the Christian Church-church bells in spires or towers used to call the faithful to worship, and sanctuary bells used to call attention to the coming of Christ in the Holy Eucharist.

బాహ్య లంకెలు

[మార్చు]