ఘటకేసర్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘటకేసర్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి
మండలం ఘటకేసర్‌
ప్రభుత్వము
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 17.50 km² (6.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 11,692
 - స్త్రీల సంఖ్య 10,965
 - గృహాల సంఖ్య 5,172
పిన్ కోడ్ - 501301
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

ఘటకేసర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఘటకేసర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం లోని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఘటకేసర్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం[మార్చు]

ఘటకేసర్ 17.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°27′00″N 78°41′06″E / 17.450°N 78.685°E / 17.450; 78.685 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 22657 మంది కాగా, అందులో 11692 మంది పురుషులు, 10965 మంది మహిళలు ఉన్నారు. 5172 గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 22 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 18 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

మూలాలు[మార్చు]

  1. "Ghatkesar Municipality". ghatkesarmunicipality.telangana.gov.in. Retrieved 1 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 1 April 2021. CS1 maint: discouraged parameter (link)
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 1 April 2021. CS1 maint: discouraged parameter (link)
  4. "Basic Information of Municipality, Ghatkesar Municipality". ghatkesarmunicipality.telangana.gov.in. Retrieved 1 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]