Jump to content

ఘటోత్కచుడు (సినిమా)

వికీపీడియా నుండి
ఘటోత్కచుడు
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనఎస్. వి. కృష్ణారెడ్డి (కథ)
దివాకర్ బాబు (మాటలు)
నిర్మాతకె. అచ్చిరెడ్డి
తారాగణంఆలీ,
రోజా
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1995 ఏప్రిల్ 27 (1995-04-27)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

ఘటోత్కచుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1995 లో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా.[2] ఆలీ, రోజా, బేబీ నికిత, సత్యనారాయణ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఘటోత్కచుడు భూలోకానికి వచ్చి ఆపదలో ఉన్న ఒక పాపను రక్షించుట ఈ చిత్ర ప్రధాన కథాంశం.

కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండగా దాహం వేస్తుంది. అప్పుడు ఒక చిన్న గిరిజన అమ్మాయి సహాయం చేస్తుంది. ఆమెకు అవసరమైనపుడు ఋణం తీర్చుకుంటానని ఘటోత్కచుడు వాగ్దానం చేస్తాడు.

వందల సంవత్సరాల తరువాత అదే చిన్నారి చిట్టిగా జన్మిస్తుంది. ఆమె తల్లిదండ్రులు కోటేశ్వరరావు, సుధ ధనవంతులైన ఎన్నారైలు. చిట్టి ఒక్కటే కూతురు కావడం వలన ఆస్థి అంతటికీ ఆమే వారసురాలు. అదే కుటుంబానికి చెందిన చలపతి రావు, శివాజీ రాజా వారందరినీ చంపి ఆస్తులను కొట్టేయాలని ప్రణాళిక వేస్తుంటారు. మూగవాడైన కాకా వారి ఇంట్లో సేవకుడు. దుష్టద్వయం చేసిన అనేక ప్రయత్నాలలో అతను అమ్మాయిని రక్షిస్తాడు. ఇంట్లో కాకా ఉండగా తమ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయలేరని తెలిసి, వారు ఒక ప్రణాళిక ప్రకారం అతన్ని ఇంటి నుండి బయటికి పంపేస్తారు. తమ కూతురు ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించిన వారు తమ ఆస్తులన్నీ అమ్మేసి మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోవాలనుకుంటారు. చలపతి, శివాజీ వారి కారులో బాంబు పెట్టి మొత్తం కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. పాప మాత్రం ప్రమాదం నుండి తప్పించుకుంటుంది. కానీ ఆమె తల్లిదండ్రులు మృత్యువాత బడతారు. గూండాలు ఆమెను కూడా చంపడానికి ప్రయత్నిస్తారు, కాని కాకా తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆమెను రక్షిస్తాడు. తరువాత ఆమెను కాకా కుమారుడు రంగా రక్షిస్తాడు.

రంగా ఆమెను తీసుకొని అతని ప్రాణాల కోసం పరిగెత్తుతాడు. చివరికి వారు ఒక అడవిలోకి ప్రవేశిస్తారు. హంతకులు పాపను చంపబోతున్నప్పుడు, ఆమె సహాయం కోసం పిలుస్తుంది. ఘటోత్కచుడు తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ఆమెను రక్షిస్తాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎస్.వి.కృష్ణారెడ్డి
  • కథ: ఎస్ . వి.కృష్ణారెడ్డి
  • సంగీతం: ఎస్ వి . కృష్ణారెడ్డి
  • మాటలు: దివాకర్ బాబు
  • పాటలు: భువనచంద్ర, సిరివెన్నెల( చెంబోలు) సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
  • నేపథ్య గాయకులు: కె.ఎస్.చిత్ర, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత, రెమో ఫెర్నాండెజ్
  • ఛాయ గ్రహణం: శరత్
  • ఎడిటింగ్: కె.రామ్ గోపాల్ రెడ్డి
  • నిర్మాత:కె. అచ్చిరెడ్డి
  • నిర్మాణ సంస్థ: మనీషా ఫిలింస్
  • విడుదల:27:04:1995.

పాటల జాబితా

[మార్చు]
  • జ జ జ్జ రోజా , రచన : భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , స్వర్ణలత
  • అందాల అపరంజి బొమ్మ, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • భామరో నన్నే ప్యార్ కరో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత
  • భం భం భం, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు,గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • డింగు డింగు , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ప్రియ మధురం, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు,గానం.రెమో ఫెర్నాండెజ్, స్వర్ణలత.

అతిథి పాత్రలు

[మార్చు]

ఈ సినిమా ప్రారంభానికి ముందు వచ్చే మహాభారత యుద్ధ దృశ్యంలో పలువురు ప్రముఖ నటులు నటించారు.[1]

  • అర్జునుడుగా శ్రీకాంత్
  • కర్ణుడుగా రాజశేఖర్
  • ధర్మరాజుగా గిరిబాబు
  • ప్రసాద్ బాబు

మూలాలు

[మార్చు]
  1. 1 2 "బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ఘటోత్కచుడు'కి 25 ఏళ్లు". www.eenadu.net. Retrieved 2020-04-27.
  2. "Ghatotkachudu songs". naasongs.com. Archived from the original on 16 అక్టోబరు 2016. Retrieved 24 October 2016.

బయటి లింకులు

[మార్చు]