ఘన్పూర్ మండలం (వనపర్తి జిల్లా)
స్వరూపం
ఘన్పూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఘన్పూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°34′09″N 78°02′23″E / 16.569074°N 78.03978°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి జిల్లా |
మండల కేంద్రం | ఘన్పూర్ (వనపర్తి జిల్లా) |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 48,771 |
- పురుషులు | 24,991 |
- స్త్రీలు | 23,780 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 40.07% |
- పురుషులు | 52.28% |
- స్త్రీలు | 27.56% |
పిన్కోడ్ | 509380 |
ఘన్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] ఘన్పూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 48,771 - పురుషులు 24,991 - స్త్రీలు 23,780.అక్షరాస్యుల సంఖ్య 21923.[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 153 చ.కి.మీ. కాగా, జనాభా 42,505. జనాభాలో పురుషులు 21,840 కాగా, స్త్రీల సంఖ్య 20,665. మండలంలో 8,503 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఘన్పూర్
- అల్మైపల్లి
- మల్కిమియాపల్లి
- వెంకటంపల్లి
- అగరం
- పర్వతాపూర్
- షాపూర్
- కమాలుద్దీన్పూర్
- తిరుమలైపల్లి
- అప్పారెడ్డిపల్లి
- అంతయపల్లి
- మనాజీపేట్
- సోలీపూర్
- సల్కలాపూర్
- ఉప్పరపల్లి
- మామిడిమడ
- మల్కాపూర్
- సురాయిపల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.