ఘరానా మొగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘరానా మొగుడు
(1992 తెలుగు సినిమా)
Gharanamogudu.jpg
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం కె. దేవీవరప్రసాదు
కథ పి. వాసు
తారాగణం చిరంజీవి,
నగ్మా,
వాణీ విశ్వనాధ్,
రావుగోపాలరావు ,
కైకాల సత్యనారాయణ,
బ్రహ్మానందం,
రమాప్రభ,
శుభ,
ఆహుతీ ప్రసాద్,
సాక్షి రంగారావు,
చలపతిరావు,
పి.ఎల్. నారాయణ,
ఈశ్వరరావు,
డిస్కో శాంతి (బంగారు కోడిపెట్ట)
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నేపథ్య గానం ఎస్.పి., నాగూర్ బాబు, చిత్ర
నృత్యాలు తార, ప్రభు, సుచిత్ర
గీతరచన భువనచంద్ర, కీరవాణి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం విన్సెంట్, అజయ్ విన్సెంట్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ దేవి ఫిలిం ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఘరానా మొగుడు, 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి, నగ్మా[1] ముఖ్యపాత్రలు పోషించారు. 10 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా ఈ సినిమాకు గుర్తింపు ఉంది. ఇందులో డిస్కోశాంతి, చిరంజీవిలపై చిత్రించిన "బంగారు కోడిపెట్ట" పాట బాగా హిట్టయిన చిరంజీవి డాన్స్ పాటలలో ఒకటి. కన్నడంలో విజయవంతమైన "అనురాగ అరళితు" అనే సినిమాకు ఈ సినిమా తెలుగు పునర్నిర్మాణం.

కథ[మార్చు]

విశాఖపట్టణం పోర్టులో పని చేస్తున్న రాజు (చిరంజీవి) తోటి ఉద్యోగులకి సహాయపడుతూ అందరి మెప్పు పొందుతుంటాడు. తన తల్లి (శుభ) కి పక్షవాతం రావటంతో హైదరాబాదుకి తిరిగివచ్చి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన పారిశ్రామికవేత్త అయిన బాపినీడు (రావు గోపాలరావు) ని రాజు రక్షిస్తాడు. అతని మంచితనాన్ని మెచ్చిన బాపినీడు తన సంస్థలోని ఒక ఉద్యోగానికి సిఫారసు పత్రాన్ని రాజుకి ఇస్తాడు. పొగరుబోతు అయిన బాపినీడు కుమార్తె ఉమాదేవి (నగ్మా) వ్యక్తిత్వం రాజుకి మొదటి నుండి నచ్చదు. సంస్థలో ఉద్యోగుల వద్ద మంచి పేరును సంపాదించిన రాజు వారికి నాయకత్వం వహిస్తూ ఉండటం ఉమాదేవికి నచ్చదు. అతనిని పెళ్ళి చేస్కొని అతని నోరు మూయించాలి అని ఎత్తు వేస్తుంది. కాని పెళ్ళి తర్వాత రాజు ఉమాదేవికి మరింత పెద్ద సమస్యగా మారతాడు. తన సెక్రటరీ అయిన భవాని (వాణీ విశ్వనాథ్) తో రాజు చనువుని ఉమాదేవి అపార్థం చేస్కొంటుంది. తన కొడుకుతో సంబంధాన్ని నిరాకరించిన ఉమాదేవిని అంతం చేయాలన్న రంగనాయకులు (కైకాల సత్యనారాయణ) ఎత్తుని చిత్తు చేస్తూ రాజు తన భార్యని రక్షించుకోవటంతో ఉమాదేవి రాజులోని మంచితనాన్ని గుర్తిస్తుంది.

సంభాషణలు[మార్చు]

  • మేడం గారు కాసేపు డం డం లాడించారు.

విశేషాలు[మార్చు]

పాటలు[మార్చు]

  • బంగారు కోడిపెట్ట
  • కిటుకులు తెలిసిన
  • హే పిల్లా హలో పిల్లా
  • కప్పుకో దుప్పటి (కీరవాణి రచన)
  • ఏందిబే ఎట్టాగ ఉంది
  • పండు పండు పండు

ఇవి కూడా చూడండి[మార్చు]

చిరంజీవి నటించిన సినిమాల జాబితా

  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (19 February 2019). "మరోసారి మెగా కాంపౌండ్ లోకి నగ్మా..?". www.andhrajyothy.com. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020. CS1 maint: discouraged parameter (link)