ఘృష్టీశ్వర లింగం - ఘృష్ణేశ్వరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మహారాష్ట్రలో ఔరంగాబాద్ సమీపంలో ఘృష్ణేశ్వరం మహదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయం దేవి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు.ఈ యాత్రా స్థలం దౌలతబాద్ నుండి 15 కి. మి. మరియు ఔరంగాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘృష్ణేశ్వరం మహదేవ్ ఆలయం భూమిపై చివరి లేదా 12 వ (పన్నెండవ) జ్యోతిర్లింగ నమ్ముతారు. బౌద్ధ సన్యాసుల ఎల్లోరా ఆలయం ప్రసిద్ధ గుహలు సమీపంలో ఉన్నాయి.

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ గురించి పురాణాల్లో ఈ కథ ఉంది -

దక్షిణ భారత దేశంలో, సుధమ అనే బ్రాహ్మణడు నివసించేవాడు అతని భార్య పేరు సుదేహ కానీ వారికి పిల్లలు లేరు. ఆస్ట్రాలజీ ప్రకారం సుదేహకు పిల్లలు పుట్టరు అని తేలింది.కానీ సుదేహకు పిల్లల అంటే చాలా ఆసక్తి. అందుకని తన చెల్లలు ధుశ్శను వివాహం చేసుకొమ్మని కోరినది కానీ సుధామకు ఇష్టం లేదు సుదేహ బలవంతం మీద ఒప్పుకొంటాడు . . కొంతకాలానికి ధుశ్శ గర్భాన్ని ధరించి ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ కొడుకు పెద్దవాడై సంతోష భాగ్యాలతో ఉండడంతో ద్వేషాన్నిపెంచుకున్న సుదేహ, తన చెల్లెలు ధుశ్శ కొడుకును చంపించి, చెరువులో పడవేయించిందట. శివభక్తురాలైన ధుశ్శ తన కొడుకు మరణించినా చెక్కుచెదరకుండా శివార్చన చేసిందట. శివుడు అనుగ్రహించి ధుశ్శ కొడుకుకి పునర్జీవితం ప్రసాదించాడు. దీనికి కారణమైన సుదేహను భస్మంచేయడానికి ఉద్యుక్తుడవుతుండగా తన అక్క చేసిన పాపాన్ని క్షమించమని, లోకకళ్యాణం కోసం స్వామిని అక్కడ వెలవమని ప్రార్థించిందట. ధుశ్శ అభీష్టంమేరకు శివుడు అక్కడ ధుశమేశ కామధేయుడై జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు.

అలాగే స్వామి ఇక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ కూడా ఉంది. ఒకరోజు శివుడు, పార్వతి కామ్యక వనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట. అపుడు శివుడు పాతాళంనుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది. పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయ్యిందట. ఆ లింగంనుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణంకోసం అక్కడ ప్రతిష్ఠించిందట. ఆనాటినుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది. సాక్షాత్తు పార్వతిమాత ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంతటి మహత్తు ఏర్పడిందంటారు

prasanna kumar