ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయం
घृष्णेश्वर ज्योतिर्लिंग मंदिर
Grishneshwar temple in Aurangabad district.jpg
భౌగోళికం
భౌగోళికాంశాలు20°1′29.9″N 75°10′11.7″E / 20.024972°N 75.169917°E / 20.024972; 75.169917Coordinates: 20°1′29.9″N 75°10′11.7″E / 20.024972°N 75.169917°E / 20.024972; 75.169917
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాఔరంగాబాద్,
ప్రదేశంఔరంగాబాద్,
సంస్కృతి
దైవంశ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం (శివుడు)
ముఖ్యమైన పర్వాలుమహాశివరాత్రి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుహేమద్పంతి

ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం, శివ పురాణం ప్రకారం ఈశ్వరుడుకు అంకితం కలిగిన జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది ఒకటి. దీనిని కొన్నిసార్లు ఘర్నేశ్వర్ లేదా ఘుష్మేశ్వర్ ఆలయం అనికూడా సూచిస్తారు.[2] [3] ఘర్నేశ్వర అనే పదానికి "కరుణ ప్రభువు" అని అర్ధం.[2] హిందూధర్మ శైవ సంప్రదాయంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్రా ప్రదేశంగా పరిగణిస్తారు. ఇది చివరి లేదా పన్నెండవ జ్యోతిర్లింగం (కాంతి లింగ) గా పరిగణించబడుతుంది.[4] ఈ తీర్థయాత్ర ప్రదేశం ఎల్లోరా గుహల నుండి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎల్లోరాలో (వేరుల్ అని కూడా పిలుస్తారు) వద్ద ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.ఇది ఔరంగాబాద్ నగరం వాయువ్య దిశ నుండి 30 కి.మీ (19 మైళ్లు) దూరంలో ఉంది. ముంబై నగరానికి తూర్పు-ఈశాన్యంగా 300 కిలోమీటర్లు (190 మైళ్లు) దూరంలో ఉంది.

13, 14 వ శతాబ్దాలలో ఈ ఆలయ నిర్మాణాన్ని ఢిల్లీ సుల్తానేట్ చేత ధ్వంసం చేయబడింది.పునర్నిర్మాణం అనేకసార్లు తిరిగి నిర్మించిన ఈ ఆలయం మొఘల్- మరాఠా వివాదంలో నాశనం చేయబడింది. మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత, 18 వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహిల్యబాయి హోల్కర్ సౌజన్యంతో, ఇది ప్రస్తుతంఉన్న రూపంలో పునర్నిర్మించబడింది. [4] ఇది హిందువుల ముఖ్యమైన, నిరంతరం రోజువారీ భక్తులను, యాత్రికులను ఆకర్షించే పుణ్యక్షేత్రం. దేవాలయ ప్రాంగణంలోకి, దాని లోపలి గదుల్లోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. కాని ఆలయ గర్భగుడి లోపలికి ప్రవేశించడానికి, స్థానిక హిందూ సంప్రదాయం ప్రకారం పురుషులు చొక్కా ధరించకుండా మాత్రమే వెళ్లాలని నియమాన్ని సూచిస్తుంది. [2]

ఎల్లోరా గుహల పక్కన ఘృష్ణేశ్వర్ శివాలయం

ఘృష్ణేశ్వర్ ఆలయం నిర్మాణం, దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎర్ర రాళ్ళతో నిర్మించిన ఈ ఆలయం ఐదు అంచెల శిఖరాలతో కూడి ఉంది. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో వేరుల్‌కు చెందిన మలోజీ భోసలే (ఛత్రపతి శివాజీ తాత), తరువాత 18 వ శతాబ్దంలో రాణి అహిల్యబాయి హోల్కర్ చేత తిరిగి పునర్నిర్మించబడింది. వారణాసి లోని కాశీ విశ్వనాథ్ ఆలయం, గయ లోని ఒక విష్ణు ఆలయం, ఒక పెద్ద శివ జ్యోతిర్లింగ ఆలయంగా పరిగణించే సోమనాథ్ ఆలయాల వంటి ప్రధాన హిందూ దేవాలయాలు కొన్నిటిని తిరిగి పునర్నిర్మించిన ఘనత అహిల్యబాయి హోల్కర్ కు దక్కింది.[5]ఈ ఆలయం భారతదేశంలోని జ్యోతిర్లింగ ఆలయాలలో 240 అడుగులు పొడవు, 185 అడుగుల ఎత్తుగల అతి చిన్న ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సగం దూరంలో విష్ణువు దశవతారాలు 24 స్తంభాలపై పెద్దవరండాలో ఎర్ర రాతితో చెక్కబడిన దేవాలయం నిర్మించబడింది. ఈ స్తంభాలపై శివుని వివిధ ఇతిహాసాలు, పురాణాలను సంగ్రహించే శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇందులోని గర్బాలయం 17 అడుగులు పొడవు, 17 అడుగులు ఎత్తుకలిగిన లింగమూర్తి తూర్పు వైపుకు తిరిగిన ముఖంతో ప్రతిష్ఠంచబడింది.కోర్టు హాలులో నంది విగ్రహం ఉంది. ఘృష్ణేశ్వర్ ఆలయం మహారాష్ట్రలో ఉన్న ఆలయాలలో దీనిని ఒక గౌరవనీయమైన ఆలయంగా పరగణిస్తారు.ఈ ఆలయంలో అనేక హిందూ దేవతలు శిల్పాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. Grishneshwar Aurangabad GPS Archived 11 సెప్టెంబరు 2013 at the Wayback Machine Govt of Maharashtra
  2. 2.0 2.1 2.2 Lochtefeld 2002, p. 247.
  3. Swati Mitra (2011). Omkareshwar and Maheshwar. Goodearth Publications. p. 25. ISBN 978-93-80262-24-6.
  4. 4.0 4.1 Bruce Norman (1988). Footsteps: Nine Archaeological Journeys of Romance and Discovery. Salem. pp. 99–100. ISBN 978-0-88162-324-6.
  5. Swati Mitra (2011). Omkareshwar and Maheshwar. Goodearth Publications. pp. 23–25. ISBN 978-93-80262-24-6.

వెలుపలి లంకెలు[మార్చు]