Jump to content

చంచల్‌గూడ

వికీపీడియా నుండి
చంచల్‌గూడ
సర్వార్ జంగ్ పాంచ్
పాతబస్తీ
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 024
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

చంచల్‌గూడ (సర్వార్ జంగ్ పాంచ్), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఉన్న ప్రాంతం. ఇది సైదాబాద్, డబీర్‌పూర్ సమీపంలో ఉంది. ఇక్కడ చంచల్‌గూడ సెంట్రల్ జైలు ఉంది.[1]

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చంచల్‌గూడ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడినుండి 98 నంబరు గల బస్సులు నాంపల్లి వరకు, 78 నంబరు గల బస్సులు చార్మినార్ వరకు నడుస్తున్నాయి. ఇక్కడికి సమీపంలోని దబీర్‌పురా, యాకుత్‌పురా, మలక్‌పేటలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

పాఠశాలలు

[మార్చు]

చంచల్‌గుడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడరన్ ఉన్నత పాఠశాల, ఫరా ఉన్నత పాఠశాల, రెహమాటియా ఉన్నత పాఠశాల, సెయింట్ లారెన్స్ ఉన్నత పాఠశాల, కారామెల్ ఉన్నత పాఠశాల, నియో స్కూల్ ఐజ్జా మొదలైన విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి.

ఇతర వివరాలు

[మార్చు]

చంచల్‌గూడ జంక్షన్ ప్రాంతంలో 2020, జూలై 23న రాష్ట్రమంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా నల్గొండ ఎక్స్-రోడ్ నుండి చంచల్‌గుడ జంక్షన్, సైదాబాద్ జంక్షన్, ధోబిఘాట్ జంక్షన్, ఐఎస్ సదన్ జంక్షన్ మీదుగా ఓవైసీ హాస్పిటల్ జంక్షన్‌ వరకు 3.382 కి.మీ.ల (అందులో ఫ్లైఓవర్ 2.580 కి.మీ.) పొడవు ఏర్పాటుచేస్తున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన జరిగింది. దీని వల్ల వెళ్ళే ప్రయాణ సమయం తగ్గుతుంది.[2][3]

ప్రముఖులు

[మార్చు]
  1. బండ వాసుదేవ్ రావు: వ్యవసాయవేత్త, పౌల్ట్రీ రైతు.

మూలాలు

[మార్చు]
  1. Jan 4, Srinath Vudali / TNN /; 2016; Ist, 06:13. "State govt firm on relocation of Chanchalguda jail | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 2021-01-12. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
  2. "KTR lays foundation for another elevated corridor". The New Indian Express. Retrieved 2021-01-12.
  3. TelanganaToday. "KTR lays foundation for Chanchalguda Elevated Corridor". Telangana Today. Retrieved 2021-01-12.{{cite web}}: CS1 maint: url-status (link)