చందనా దీప్తి (ఐపీఎస్‌)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందన దీప్తి
Chandana Deepti at a meeting.jpg
హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ డీసీపీ
Assumed office
2021 డిసెంబర్‌ 24 - ప్రస్తుతం
వ్యక్తిగత వివరాలు
జననం1983
వరంగల్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం.
జీవిత భాగస్వామిబలరామ్‌ రెడ్డి [1]
తల్లిదండ్రులువిజయలక్ష్మి, జకర్యా
బంధువులుధీరజ్‌ (తమ్ముడు)
చదువుకంప్యూటర్‌ సైన్స్‌
వృత్తిఐపీఎస్ అధికారిణి

చందనా దీప్తి తెలంగాణకు చెందిన ఐపీఎస్‌ అధికారిణి. ఆమె 2012 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా ఎస్పీగా భాద్యతలు నిర్వహిస్తుంది.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

చందన దీప్తి 1983లో వరంగల్ లోని చందా కాంతయ్య మెమోరియల్‌ (సీకేఎం) ఆసుపత్రిలో విజయలక్ష్మి, జకర్యా దంపతులకు జన్మించింది. చందన దీప్తి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె విద్యాభాస్యం వివిధ నగరాల్లో పూర్తి చేసింది. ఆమె రాజమండ్రిలో ఎల్‌కేజీ నుంచి రెండో తరగతి వరకు, నెల్లూరులో మూడు, నాలుగో తరగతి, తర్వాత చిత్తూరులోని గుడ్‌ షెపర్డ్‌ హైస్కూల్‌లో ఐదు నుంచి 12వ తరగతి (సీబీఎస్‌ఈ) వరకు చదివింది. నెల్లూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసింది. ఆమె తండ్రి సూచనలతో సివిల్స్‌ వైపు మళ్ళి హైదరాబాద్‌లోని ఆర్‌సీరెడ్డి ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరి రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌ ర్యాంక్‌ సాధించింది.[3]

వృత్తి జీవితం[మార్చు]

చందన దీప్తి ఐపీఎస్‌ సెలెక్ట్ అయ్యాక మొదటగా నల్లగొండలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేసింది. ఆమె తర్వాత తాండూరు ఏఎస్పీగా, నిజామాబాద్‌ ఓఎస్డీగా పని చేసింది. ఆమె 2013 నుండి 2021 డిసెంబర్ వరకు మెదక్‌ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించింది.[4]ఆమె 2021 డిసెంబర్‌ 24న హైదరాబాద్ నార్త్‌జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(డీసీపీ)గా నియమితురాలైంది.[5][6]

వైవాహిక జీవితం[మార్చు]

చందన దీప్తి వివాహం 2019, అక్టోబరు 18న హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్ లో పారిశ్రామికవేత్త బలరాం రెడ్డితో జరిగింది.[7]

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (6 October 2019). "IPS Chandana Deepti Marriageసీఎం జగన్ బంధువు కానున్న తెలంగాణ మహిళా ఎస్పీ..ఎలానో తెలుసా? - Telangana IPS officer Chandana Deepthi to marry Jagan's Relative". Retrieved 19 May 2021.
  2. Telangana Today (4 May 2019). "Meet Chandana Deepti, a people's officer". Telangana Today. Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
  3. Sakshi Education (21 October 2020). "నా జీవితంలో మరిచిపోలేని సంఘటన ఇదే..: చందనా దీప్తి, ఐపీఎస్‌". www.sakshieducation.com. Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
  4. Disha daily (దిశ), Web (2 May 2020). "సమాజం కోసం పోలీసుల నిరంతర శ్రమ: ఎస్పీ చందన దీప్తి". Disha daily (దిశ): Latest Telugu News | Breaking news. Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
  5. The Hindu (27 December 2021). "Post-reshuffle of IPS officials" (in ఇంగ్లీష్). Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  6. Namasthe Telangana (25 December 2021). "నార్త్‌జోన్‌ డీసీపీగా చందన దీప్తి". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  7. Sakshi (18 October 2019). "బలరాం-చందనాదీప్తిని ఆశీర్వదించిన సీఎం జగన్‌". Sakshi. Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.