చందన్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందన్ కుమార్
జననం (1985-09-11) 1985 సెప్టెంబరు 11 (వయసు 38).[1]
ఇతర పేర్లుచందన్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
కవిత గౌడ
(m. 2021)

చందన్ కుమార్ (జననం 1985 సెప్టెంబరు 11) భారతీయ నటుడు. కన్నడ సినిమాలు, కన్నడ, తెలుగు టెలివిజన్లలో పనిచేసే నటుడు. 2012లో కలర్స్ కన్నడలో ప్రసారమైన టెలివిజన్ సోప్ ఒపెరా రాధా కళ్యాణ, ఆ తరువాత లక్ష్మీ బారమ్మలో చందు పాత్రను పోషించినందుకు అతను ప్రసిద్ధి చెందాడు.

అయితే సినిమాల కారణంగా ఆ సీరియళ్ళను ఆయన మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది.[2] ప్రధాన పాత్రలో ఆయన మొదటి చిత్రం పరిణయ 2014లో విడుదలైంది. మల్టీ-స్టారర్ చిత్రం లవ్ యు అలియా (2015)లో ప్రధాన పాత్రధారులలో ఆయన ఒకడు. ద్విభాషా చిత్రం ప్రేమ బరహాలో ఆయన కథానాయకుడు.

టీవీ సీరియల్స్, సినిమాలే కాకుండా చందన్ కుమార్ రియాలిటీ షోలైన ప్యాతే మండి కడిగే బండ్రు, డ్యాన్సింగ్ స్టార్స్ సీజన్ 1లలో ఆలరించాడు. అలాగే బిగ్ బాస్ కన్నడ 3లో రన్నరప్‌గా నిలిచాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చందన్ కుమార్ తన సహనటి కవితా గౌడను 2021 మే 14న బెంగళూరులో వివాహం చేసుకున్నాడు.[3]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
Year Film Role Notes
2011 లైఫ్యూ ఇస్తేనే చందన్ సపోర్టింగ్ రోల్
2014 పరిణయ ప్రేతమ్ ప్రధాన పాత్రలో అరంగేట్రం
2015 కట్టె చందు
2015 ఎరడొండ్ల మూరు ప్రేమ్
2015 లవ్ యు అలియా కిరణ్
2015 బెంగళూరు 560023 చందు
2018 ప్రేమ బరహా సంజయ్ తమిళంలో సల్లివిడవ పేరుతో ఏకకాలంలో తీశారు
2021 SriKrishna@gmail.com చందన్ కుమార్ అతిధి పాత్ర

టెలివిజన్

[మార్చు]
Year Title Role Channel Language Notes
2011 ప్యాతే మంది కడిగే బండ్రు పోటీదారు సువర్ణ కన్నడ
2011–2013 రాధా కల్యాణ విశాల్ భరద్వాజ్ జీ కన్నడ
2013–2014 లక్ష్మీ బారమ్మ చందు కలర్స్ కన్నడ
2013 టకా ధీమి తా డ్యాన్సింగ్ స్టార్ పోటీదారు
2015 బిగ్ బాస్ కన్నడ 3 పోటీదారు ద్వితియ విజేత
2018–2020 సర్వమంగళ మాంగల్యే మహా శంకర స్టార్ సువర్ణ కన్నడ
2019–2021 సావిత్రమ్మ గారి అబ్బాయి బాలరాజు స్టార్ మా తెలుగు తెలుగులో అరంగేట్రం
2021 కిరిక్కు విత్ కుక్కు పోటీదారు స్టార్ సువర్ణ కన్నడ విజేత
2021–present మరలి మన్సగిదే ఎస్పీ విక్రాంత్ నాయక్
2021–2022 శ్రీమతి శ్రీనివాస్ శ్రీనివాస్ స్టార్ మా తెలుగు అశ్విన్ స్థానంలోకి వచ్చాడు

మూలాలు

[మార్చు]
  1. "Chandan Kumar: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes".
  2. "Who will replace Chandan in Lakshmi Baramma?". The Times of India. 16 December 2014.
  3. "Chandan Kumar and Kavitha Gowda get married in an intimate ceremony - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-29.