చందన్ మిత్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చందన్ మిత్రా ఒక భారతీయ పత్రికా రచయిత. అతను ప్రస్తుతము భరత్ దేశంలోని ఢిల్లీలో ది పయనీర్ పత్రిక యొక్క సంపాదకుడు మరియు నిర్వహణా అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 2003 నుండి ఆగస్టు 2009 వరకు అయిన రాజ్య సభకు ప్రతిపాదించబడిన సభ్యుడు. అతను రాజ్యసభలో ఇంకొక పర్యాయం, మధ్య ప్రదేశ్ నుండి BJP తరపున MPగా జూన్ 2010లో ఎన్నికయ్యాడు. [1]

మిత్రా కోల్కతాలోని లా మార్టినియర్ కాలేజీలో చదివారు. అక్కడ 1971వ సంవత్సరములో ఫౌండర్స్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. అక్కడ మిత్రాతో పాటు స్వపన్ దాస్గుప్తా మరియు పరంజోయ్ గుహ తకుర్త చదివారు. ఈ ముగ్గురూ పాఠశాల చదువు అనంతరం, ఢిల్లీ యునివేర్సిటీకి చెందిన St. స్టీఫెన్స్ కాలేజీలో కలిసి చదివారు. ఢిల్లీ యునివెర్సిటీలో అయిన చరిత్రములో MA మరియు M.Phil కూడా పూర్తి చేసారు. స్వల్ప కాలం అతను హన్స్రాజ్ కాలేజీలో అద్యాపకుడుగా ఉన్నారు.

1984లో, అయిన ఆక్స్‌ఫొర్డ్ యూనివెర్సిటిలో DPhil పట్టా పొందారు. అక్కడ అయిన మేగ్డలేన్ కాలేజి సభ్యుడుగా ఉన్నారు. ఈ డిగ్రీ కోసం అయిన " భారత దేశములో రాజకీయ సమీకరణ మరియు దేశీయ ఉద్యమం - తూర్పు ఉత్తర ప్రదేశ్ మరియు బిహార్ 1936-1942 గురిచి అధ్యయనం" అనే థీసిస్ ను ప్రముఖ భారతీయ చరిత్రకారుడు డా.తపన్ రాయి చౌదరి పర్యవేక్షణలో వ్రాసారు.

కోల్కతాలో ది స్టేట్స్‌మాన్ పత్రికలో సహాయక సంపాదకుడుగా తన పాత్రికేయుడు వృత్తిని ప్రారంబించారు. తరువాత ఢిల్లీలో టైమ్స్ అఫ్ ఇండియా లోను, ఆ తరువాత ది సండే అబ్సర్వర్ లోను పనిచేసారు; ఆ తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక సహాయం చేస్తున్న ఆ పత్రికకు సంపాదకుడుగా పనిచేసారు. రిలయన్స్ నిధులు ఇవ్వడం ఆపిన తరువాత, మిత్రాా హిందుస్తాన్ టైమ్స్‌కు ఎక్సేక్యుటివ్ ఎడిటర్‌గా వెళ్ళారు. అక్కడ అతన్ని పక్కన పెట్టి, సంపాదకుడుగా చేయకపోవడంతో మిత్రాా ఆ పత్రికను వదిలేసి ది పయనీర్ పత్రికలో చేరారు. కొంత కాలం తరువాత పారిశ్రామికవేత్త గౌతం తపార్ నష్టాలను తగ్గించాలని ఆ పత్రికను అమ్మినప్పుడు, మిత్రా, తపార్ కుటుంబమునుండి పత్రికను కొని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

తాను చదివిన లా మార్టినియర్ పాఠశాల యొక్క 150వ వార్షికోత్సవం సందర్పంగా 1986లో మిత్రా ఆ పాఠశాల చరిత్రను చెప్పే "కాన్స్‌టన్ట్ గ్లోరి" అనే ఒక వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసం బాగా ప్రాబల్యమయింది.

మిత్రాా, షోబోరి గంగూలీను వివాహం చేసుకున్నారు. క్రితం వివాహం నుంచి ఇద్దరు కొడుకులు ఉన్నారు.

సూచనలు[మార్చు]

  1. "Rajya Sabha members". Retrieved 2009-12-31.