చందవరం బౌద్ధారామం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందవరం బౌద్ధారామం
ఇతర పేర్లుచందవరం తవ్వకాల ప్రాంతం
స్థలంచందవరం
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
అక్షాంశ రేఖాంశాలు15°55′58.5156″N 79°25′40.2240″E / 15.932921000°N 79.427840000°E / 15.932921000; 79.427840000Coordinates: 15°55′58.5156″N 79°25′40.2240″E / 15.932921000°N 79.427840000°E / 15.932921000; 79.427840000
రకంబౌద్ధం, పురావస్తు తవ్వకాల స్థలం
చరిత్ర
నిర్మించినవారుశాతవాహన వంశం[1]
పదార్థంసున్నపురాయి
నిర్మాణంక్రీ.పు 2 శతాబ్దం నుండి క్రీ. శ 2 శతాబ్దం
సంస్కృతులుబౌద్ధ సంస్కృతి
క్షేత్ర విశేషాలు
తవ్వకం తేదీలు1964
పురావస్తు శాస్త్రజ్ఞులువేలూరి వేంకట కృష్ణ శాస్త్రి
స్థితిపునర్నిర్మితము
స్వంతదారుప్రభుత్వ
ప్రజలకు అందుబాటుఅవును

చందవరం గ్రామంలో ఉన్న " చందవరం బౌద్ధారామం " అతి పురాతన బౌద్ధక్షేత్రాలలో ఒకటి. ఇది ప్రకాశం జిల్లాలో (ఆంధ్రప్రదేశ్;భారతదేశం) ఉంది. [2][3] ఇది దొనకొండరైల్వే స్టేషన్‌కు ఈశాన్యంలో 10కి.మీ దూరంలో గుండ్లకమ్మనదీతీరంలో ఉంది.[4] ఇది శాతవాహనుల పాలనలో క్రీ.పూ 2వ శతాబ్ధంలో నిర్మించబడింది. దీనిని 1964 లో డాక్టర్ వేలూరి క్రిష్ణశాస్త్రి కనుగొన్నాడు.[1][5][2]

చరిత్ర[మార్చు]

చందవరం బౌద్ధారామం క్రీ.పూ 2 వ శతాబ్ధంలో నిర్మించబడింది. ఇది అంద్రప్రదేశ్‌లో నిర్మించబడిన మొదటి బౌద్ధారామంగా విశ్వసించబడింది. ఇక్కడ ఆకాలంలో చాలామంది నివసించారు. ఇక్కడ బౌద్ధమత సంబంధిత కార్యక్రమాలు చురుకుగా సాగేవి.[3][5] ఇక్కడ త్రవ్వకాలలో లభించిన వస్తువులను పరిశోధించిన తరువాత " రేడియోకార్బన్ డేటింగ్ " విధానంలో బౌద్ధారమం వయసు నిర్ణయించబడింది.అమరావతి స్కూల్‌లోని శిలాకృతుల ఆధారంగా కూడా ఈ బౌద్ధారామం క్రీ.పూ 2వ (కామన్ ఎరా) శతాబ్ధంనాటిదని నిర్ణయించబడింది.[1] చందవరం బౌద్ధారామం వారణాశి నుండి కంచి వెళ్ళే బౌద్ధసన్యాసులకు విశ్రాంతి ప్రదేశంగా ఉపయోగించబడింది. [5] 1964 లో ఈ బౌద్ధారామం శాతవాహనుల వంశస్థులచే నిర్మించబడిందని కనుగొనబడింది.[2] " అయాకా పిల్లర్లు" ఈ బౌద్ధారామంలో లేకపోవడం ఈ ప్రాంతం హీనయాన బౌద్ధమతానికి చెందినడనడానికి ప్రబలనిదర్శనంగా నిలిచింది.[6] ఇక్కడ కొండశిఖరం మీద రెండస్థుల స్థూపం ఉంది. సాంచి స్థూపం తరువాత స్థానంలో చందవరం బౌద్ధస్థూపం ప్రాధాన్యత కలిగి ఉంది. బౌద్ధస్థూపం ఉన్న కొండను సింగరకొండ అంటారు. [1][6]

నిర్మాణం[మార్చు]

చందవరం బౌద్ధారామాన్ని శాతవాహన రాజవంశీకులు నిర్మించారు. కొండశిఖరం మీద ఉన్న ఎత్తైన వేదికమీద రెండస్థులుగా స్థూపం నిర్మించబడింది.[1][3][6]మహాస్థూపనిర్మాణం హీనయాన బౌద్ధలచేత నిర్మించబడిందని భావించబడుతుంది. మహాస్థూపం ప్రధాన గోపురం చుట్టుకొలత 120 అడుగులు ఎత్తు 30 అడుగులు. స్థూపంలో ధర్మచక్రం, హిందూయిజం, జైనిజం మరియు బుద్ధిజం మతసంబంధిత చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రదేశంలో స్థూపం కాక పలు విహారాలు, బ్రాహ్మి వ్రాతలు ఇతర స్థూపాలు ఉన్నాయి. మహాస్థూపంలో మాహాచైత్య 1.6 మీ ఎత్తు మరియు 60 సెమీ వెడల్పు ఉంటుంది.[3][5]మహాస్థూపం తక్షిలా (పాకిస్థాన్) లోని ధర్మరాజికా స్థూపాన్ని పోలి ఉంటుంది. మహాస్థూపం పానెల్స్ లైం స్టోన్‌తో చేయబడింది. పానెల్స్ మరియు డ్రం విభాగంలో " బుద్ధుని పద ముద్రలు " ఉంటాయి. స్థూపాలు, బోధి చెట్టు మరియు ఇతర కథలతో పాటు జాతక కథలు చెక్కబడి ఉన్నాయి. 1964 నుండి చందవరం ఆరామ ప్రదేశం 4 మార్లు త్రవ్వకాలు జరపబడ్డాయి. 15 సాధారణ స్థూపాలు 100 చిన్న స్థూపాలు కనుగొనబడ్డాయి. [1]

స్థూపంలో ;

 • ప్రధాన స్థూపం.(మహాస్థూపం)
 • మాహాచైత్య.
 • మ్యూజియం.
 • శిలామండపం.
 • విహార
 • వోటివ్ స్థూపాలు.పురాతత్వ పరిశోధనలు[మార్చు]

చందవరం బౌద్ధారామ ప్రదేశంలో ఒక మహాస్థూపం, 15 సాధారణ స్థూపాలు మరియు 100 చిన్న స్థూపాలు. ఈ ప్రాంతంలో మహాస్థూపంతో శిలామండపం, విహార మరియు వోటివ్ స్థూపాలు, 2 డజెన్ల బుద్ధ మడపాలు (డిజైన్లు మరియు వ్రాతలతో అలంకరించబడిన) కనుగొనబడ్డాయి.[5]

తస్కరణ[మార్చు]

2000 చందవరం దౌద్ధారామ ప్రదేశంలో ఖళాఖండాల తస్కరణ వంటి సంఘటన జరిగింది. 2002 అక్టోబర్‌లో బోధిచెట్టు మరియు చైత్ర చెక్కబడిన 9 అడుగుల ఫలకాలు సిమెంటు వేదిక నుండి త్రవ్వి తీయబడి మ్యూజియం నుండి తస్కరించబడ్డాయి.[2] 2001లో మూడు స్థంభాలు 9 అడుగుల పొడవైన బుద్ధుని శిల్పం అపహరణకు గురైంది. [2] 2001 మార్చి అలంకరణ స్థంభాలు మరియు తామర పతకం అపహరణకు గురైంది. [2]

భౌగోళిక పటము[మార్చు]

చందవరం బౌద్ధారామం

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

కురిచేడు నుండి త్రిపురాంతకం పోవు ప్రైవేట్ బస్సులో ఈ ప్రదేశం చేరుకోవచ్చు. ఒంగోలు నుండి దొనకొండ మీదుగా చందవరం చేరుకొని అక్కడినుండి ఆటోల ద్వారా కూడా ఈ ప్రదేశం చేరవచ్చు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాల జాబితా[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Chandavaram – Foothold of Buddhist Mahastupa". kostalife.com. Retrieved December 2015. Cite news requires |newspaper= (help); Check date values in: |accessdate= (help)
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Easy pickings". India Today. Retrieved December 2015. Check date values in: |accessdate= (help)
 3. 3.0 3.1 3.2 3.3 "About Chandavaram Excavation Site". Holidayiq.com. Retrieved December 2015. Cite news requires |newspaper= (help); Check date values in: |accessdate= (help)
 4. "Chandavaram monastic cluster". Monastic Asia. Retrieved December 2015. Cite news requires |newspaper= (help); Check date values in: |accessdate= (help)
 5. 5.0 5.1 5.2 5.3 5.4 "Chandavaram Buddhist site". Discovered India. Retrieved December 2015. Cite news requires |newspaper= (help); Check date values in: |accessdate= (help)
 6. 6.0 6.1 6.2 "Chandavaram, Andhra Pradesh". Buddhist tourism. మూలం నుండి 2015-09-23 న ఆర్కైవు చేసారు. Retrieved December 2015. Cite news requires |newspaper= (help); Check date values in: |accessdate= (help)