చందు ఛాంపియన్
| చందు ఛాంపియన్ | |
|---|---|
| దర్శకత్వం | కబీర్ ఖాన్ |
| రచన | కబీర్ ఖాన్ సుమిత్ అరోరా సుదీప్తో సర్కార్ |
| నిర్మాత | సాజిద్ నదియాద్వాలా కబీర్ ఖాన్ |
| తారాగణం | కార్తీక్ ఆర్యన్ |
| Narrated by | సోనాలి కులకర్ణి |
| ఛాయాగ్రహణం | సుదీప్ ఛటర్జీ |
| కూర్పు | నితిన్ బైద్ |
| సంగీతం | పాటలు: ప్రీతమ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : జూలియస్ పాకియం |
నిర్మాణ సంస్థలు | నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ కబీర్ ఖాన్ ఫిల్మ్స్ |
| పంపిణీదార్లు | పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 14 జూన్ 2024 |
సినిమా నిడివి | 142 నిమిషాలు[1] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
| బడ్జెట్ | అంచనా ₹70–140 కోట్లు}[2][3][4] |
| బాక్సాఫీసు | అంచనా ₹88.73 కోట్లు[5] |
చందు ఛాంపియన్ 2024లో విడుదలైన భారతీయ హిందీ-భాషా జీవిత చరిత్ర కలిగిన స్పోర్ట్స్ డ్రామా సినిమా. భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్స్ బంగారు పతక విజేత, మురళీకాంత్ పెట్కర్ జీవిత చరిత్ర ఆధారంగా నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై కబీర్ ఖాన్, సాజిద్ నదియాద్వాలా నిర్మించిన ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. కార్తీక్ ఆర్యన్, విజయ్ రాజ్, భువన్ అరోరా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రధాన ఫోటోగ్రఫీ జూలై 2023 నుండి జనవరి 2024 వరకు చిత్రీకరణ లండన్, జమ్మూ & కాశ్మీర్‌లలో జరిగింది
చందు ఛాంపియన్ 2024 జూన్ 14న విడుదలై మిశ్రమ-సానుకూల సమీక్షలను అందుకుంది, ఆర్యన్ నటన, కబీర్ ఖాన్ దర్శకత్వం, సినిమాటోగ్రఫీకి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ నిర్మాణ రూపకల్పన, ఉత్తమ గీత రచయితతో సహా 4 నామినేషన్లను అందుకొని ఉత్తమ నటుడు (ఆర్యన్) అవార్డును గెలుచుకుంది.
నటీనటులు
[మార్చు]- మురళీకాంత్ పేట్కర్ అలియాస్ చందు ఛాంపియన్‌గా కార్తీక్ ఆర్యన్
- యువ మురళీకాంత్ గా అయాన్ ఖాన్ స్రోహా
- మురళీ మెంటార్ టైగర్ అలీగా విజయ్ రాజ్
- మురళి స్నేహితుడు కర్నైల్ సింగ్‌గా భువన్ అరోరా
- మేజర్ ఉత్తమ్ సింగ్‌గా యశ్పాల్ శర్మ
- రాజ్‌పాల్ యాదవ్ టోపాజ్గా, హాస్పిటల్ వార్డ్బాయ్ తర్వాత మురళి స్నేహితుడు
- అనిరుద్ధ్ దవే జగన్నాథ్ రాజారామ్ పేట్కర్ పాత్రలో, మురళీకాంత్ అన్నయ్య
- యువ జగన్నాథునిగా సమ్యక్ శృంగిరిషి
- ఇన్స్పెక్టర్ సచిన్ కాంబ్లేగా శ్రేయాస్ తల్పాడే
- మురళీకాంత్ తండ్రిగా నితిన్ భజన్
- మురళీకాంత్ తల్లిగా హేమాంగి కవి
- గణేష్ యాదవ్ గణపత్ భావు గా
- పాత్రికేయురాలు నయనతార (ప్రత్యేక ప్రదర్శన)గా భాగ్యశ్రీ బోర్స్
- మురళీకాంత్ పెట్కర్ గురించి వ్యాసం రాసిన జర్నలిస్ట్ గా సోనాలి కులకర్ణి
- సికింద్రాబాద్‌లో బ్రిగేడియర్‌గా హేమంత్ చౌదరి
- పోలీస్ స్టేషన్లో ఖైదీగా బ్రిజేంద్ర కాలా
- డాక్టర్ గా జగత్ రావత్
- నర్సుగా దిల్నాజ్ ఇరానీ
- కార్లోస్ పెడ్రోజాగా అడోనిస్ కప్సాలిస్
- మంత్రి విశ్వాస్ పాటిల్ పాత్రలో శివరాజ్ వాల్వేకర్
పాటలు
[మార్చు]| క్రమసంఖ్య | పేరు | గాయకుడు(లు) | నిడివి | ||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| 1. | "సత్యనాస్" | అరిజిత్ సింగ్, నకాష్ అజీజ్, దేవ్ నేగి | 3:25 | ||||||
| 2. | "తు హై ఛాంపియన్" | అరిజిత్ సింగ్, అమిత్ మిశ్రా | 3:36 | ||||||
| 3. | "సర్ఫిరా" | శ్రీరామచంద్ర | 3:25 | ||||||
| 4. | "జామూర్" | మామే ఖాన్, కైలాష్ వాఘ్మారే | 3:53 | ||||||
| 5. | "నా దూర్ హై నా పాస్ హై" | దర్శన్ రావల్ | 4:07 | ||||||
| 6. | "జీత్ కా గీత్" | షాన్ | 4:20 | ||||||
| 7. | "సర్ఫిరా" (క్లైమాక్స్ వెర్షన్) | మహమ్మద్ ఇర్ఫాన్ | 7:58 | ||||||
| 30:45 | |||||||||
మూలాలు
[మార్చు]- ↑ "Chandu Champion (12A)". British Board of Film Classification. 14 June 2024. Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ Soni, Narendra (14 June 2024). "जानें कितना है चंदू चैंपियन का बजट, कितनी ली कार्तिक आर्यन ने फीस और ब्लॉकबस्टर बनने के लिए फिल्म को कमाने होंगे कितने करोड़". NDTV. Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ "'Chandu Champion' grosses 96 cr, triumphs at the box office". The Statesman. Retrieved 14 October 2025.
- ↑ "Kartik Aaryans Chandu Champion Surpasses Production Budget With Worldwide Gross Collection Of Rs 96 Cr". Zee News. Retrieved 20 July 2024.
- ↑ "Chandu Champion Box Office". Bollywood Hungama (in ఇంగ్లీష్). 23 June 2024. Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.