చందేల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందేల్ జిల్లా
జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంచందేల్
విస్తీర్ణం
 • Total496 కి.మీ2 (192 చ. మై)
జనాభా
 (2011)
 • Total1,44,028
 • జనసాంద్రత21.83/కి.మీ2 (56.5/చ. మై.)
భాషలు
 • అధికారికమీటిలాన్ (మణిపురి)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

చందేల్ జిల్లా, మణిపూర్ రాష్ట్ర జిల్లా. రాష్ట్ర జిల్లాలలో చందేల్ జిల్లా జనసాంధ్రతలో 2 వ స్థానం కలిగిన జిల్లాగా గురించబడింది. మొదటి స్థానంలో తమెంగ్‌లాంగ్ జిల్లా ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

చందేల్ జిల్లా 1974 మే 13 నుండి ఉనికిలోకి వచ్చింది. ఇది చందేల్ జిల్లాగా నామాంతరం చెందింది.

భౌగోళికం

[మార్చు]

చందేల్ జిల్లాకు చందేల్ పట్టణం కేంద్రంగా ఉంది. మణిపూర్ రాష్ట్రం, మయన్మార్ దేశం మద్య మొరెహ్ పట్టణం వాణిజ్యకేంద్రంగా ఉంది. ఇది మణిపూర్ రాష్ట్రానికి దక్షిణసరిహద్దులో ఉంది.

ఆర్ధికం

[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చందేల్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మణిపూర్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలు

[మార్చు]

చందేల్ జిల్లా చందేల్, తగ్నోపాల్, చక్పికరాంగ్ అనే 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది. నిర్వహణా సంస్కరణల తరువాత చందేల్, మోరే, చక్పికాంగ్, మచి అనే 4 భాగాలుగా విభజించబడింది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 144,028, [1]
ఇది దాదాపు సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 602వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత 43 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 21.72%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 932:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 70.85%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అల్పం

భాషలు

[మార్చు]

చందేల్ జిల్లాలో కుకి గిరిజన తెగలు, ఐమోల్ ప్రజలలో అత్యధికంగా తడౌ భాష వాడుకలో ఉంది. అంతేకాల " టినో- టిబెటన్ " భాష లాటిన్ లిపిని ఉపయోగించి 3000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[4] మరొక ఇండో-టిబెటన్ భాష అయిన " అనల్ " భాషను 14,000 మంది భారతీయులలో వాడుకలో ఉంది. మయన్మార్ దేశంలో కూడా అనల్ భాష వాడుకలో ఉంది.[5]

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

1989లో చందేల్ జిల్లాలో 185చ.కి.మీ వైశాల్యంలో " యంగౌపొకి-లోక్చావో " వన్యమృగసంరక్షణాలయం స్థాపించబడింది.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Saint Lucia 161,557 July 2011 est.
  4. M. Paul Lewis, ed. (2009). "Aimol: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  5. M. Paul Lewis, ed. (2009). "Anal: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  6. Indian Ministry of Forests and Environment. "Protected areas: Manipur". Archived from the original on 2011-10-09. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు

[మార్చు]