చంద్రకాంత్ సోమ్‌పుర
స్వరూపం
| చంద్రకాంత్ సోమ్‌పుర | |
|---|---|
| జననం | అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం |
| జాతీయత | భారతదేశం |
| వృత్తి | ఆర్కిటెక్ట్ |
| ప్రసిద్ధి | ఆలయ నిర్మాణం అయోధ్య శ్రీరామ మందిరం రూపకల్పన |
| Notable work(s) |
|
| బంధువులు | ప్రభాశంకర్ సోమ్‌పుర (తాత) |
| పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (2025) |
చంద్రకాంత్ సోమ్‌పుర, అహ్మదాబాద్ కు చెందిన ఒక భారతీయ వాస్తుశిల్పి, ఆలయ నిర్మాణంలో తన పనికి ప్రసిద్ధి చెందాడు. ఆయన అయోధ్యలోని రామమందిరానికి ప్రధాన వాస్తుశిల్పి.[1][2][3]

2025లో, నిర్మాణ రంగంలో ఆయన చేసిన కృషికి గాను భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేశారు.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]చంద్రకాంత్ సోమ్‌పుర, 1949లో గుజరాత్ లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయాన్ని రూపొందించిన ప్రఖ్యాత వాస్తుశిల్పి పద్మశ్రీ గ్రహీత ప్రభాశంకర్ ఓఘద్భాయ్ సోమ్‌పుర మనవడు. ఆయన తన తాతగారి వద్ద శిక్షణ పొందాడు.[5]
కుటుంబ వారసత్వం
[మార్చు]చంద్రకాంత్ సోమ్‌పుర సాంప్రదాయకంగా ఆలయ నిర్మాణంలో నిమగ్నమైన 15వ తరం వాడు. భారతదేశం అంతటా ఆలయ నిర్మాణాలను రూపొందించడంలో అతని కుటుంబం ప్రముఖ పాత్ర పోషించింది.[6][7][8][9]
వారు భారతదేశం అంతటా, విదేశాలలోనూ 130కి పైగా దేవాలయాలను రూపొందించారు. వాటిలో ప్రధానమైనవి.. [10]
- రామమందిరం, అయోధ్య
- అంబాజీ ఆలయం, పాలన్పూర్
- అక్షరధామ్ ఆలయం, గాంధీనగర్
- స్వామినారాయణ ఆలయం, ముంబై
- బిర్లా మందిర్, కోల్‌కాతా
గుర్తింపు
[మార్చు]- 2025 - ఆలయ నిర్మాణ రంగంలో విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వంచే పద్మశ్రీ [11][12][13][14][15]
- 1997లో, చంద్రకాంత్ సోమ్‌పుర రూపొందించిన లండన్ లోని అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ ఆలయం, దాని వివరణాత్మక నిర్మాణ రూపకల్పన కోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చేర్చబడింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "'Recognition of my work and family's dedication': Ram Temple architect Chandrakant Sompura on Padma Shri award". The Times of India. 2025-01-26. ISSN 0971-8257. Retrieved 2025-01-26.
- ↑ 2.0 2.1 "Meet the Sompuras, master architects who are building the Ram Temple in Ayodhya". The Indian Express (in ఇంగ్లీష్). 2020-08-06. Retrieved 2025-01-26.
- ↑ "राम मंदिर के आर्किटेक्ट चंद्रकांत सोमपुरा को पद्मश्री सम्मान, इजाजत नहीं मिली तो अयोध्या में पैरों से ही माप ली थी जमीन". भारत एक्सप्रेस. भारत एक्सप्रेस. 2025-01-26. Retrieved 2025-05-28.
- ↑ "Ram Mandir architect among 8 from Gujarat honoured with Padma awards". The Indian Express (in ఇంగ్లీష్). 2025-01-26. Retrieved 2025-01-26.
- ↑ "Who Is Chandrakant Sompura, Ayodhya Temple Architect Among Padma Awardees". NDTV (in ఇంగ్లీష్). Retrieved 2025-01-26.
- ↑ "వారు ఆలయాల సృష్టికర్తలు". EENADU. Retrieved 2025-06-30.
- ↑ "Who is Chandrakant Sompura, the visionary architect behind the Ram Temple in Ayodhya?". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-01-20. Retrieved 2025-01-26.
- ↑ "Padma Shri recognition of my work, my family's legacy: Ayodhya Ram Temple architect Sompura". The Economic Times. The Times Group. 2025-01-26. Retrieved 2025-05-28.
- ↑ "15 पीढ़ियां, 200 से अधिक डिजाइन, जानें कौन हैं राम मंदिर के चीफ आर्किटेक्ट". TV9 हिंदी. Associated Broadcasting Company. 2023-12-23. Retrieved 2025-05-28.
- ↑ "आर्किटेक्ट चंद्रकांत सोमपुरा को मिला पद्मश्री सम्मान, राम मंदिर समेत 131 मंदिरों के बनाए नक्शे". TV9 हिंदी. Associated Broadcasting Company. 2025-01-26. Retrieved 2025-05-28.
- ↑ Govt. of India (2025-01-26). "Padma Awards 2025 announced". Press Information Bureau, Govt. of India.
- ↑ "कौन हैं अयोध्या राम मंदिर के आर्किटेक्ट चंद्रकांत सोमपूरा? जिन्हें मिला पद्मश्री सम्मान, ऑस्ट्रेलिया और मुंबई के प्रोजेक्ट पर कर रहे हैं काम". आज तक. India Today Group. 2025-01-26. Retrieved 2025-05-28.
- ↑ "Who is Chandrakant Sompura, Ayodhya Ram Mandir Architect Conferred Padma Shri Award". News18. Network18. 2025-01-26. Retrieved 2025-05-28.
- ↑ "Extremely special: Architect Chandrakant Sompura on being awarded Padma Shri". ANI News. Asian News International. 2025-01-26. Retrieved 2025-05-28.[permanent dead link]
- ↑ "अयोध्या राम मंदिर के आर्किटेक्ट चंद्रकांत सोमपुरा को मिला पद्मश्री सम्मान, जानें किसने सौंपा था काम?". नवभारत टाइम्स. बेननेट, कोलमैन एंड कंपनी लिमिटेड. 2025-01-25. Retrieved 2025-05-28.