చంద్రమౌళి (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రమౌళి
జననం
మరణం2018 ఏప్రిల్ 5[1]
హైదరాబాదు
వృత్తినటుడు, డబ్బింగ్ కళాకారుడు
పిల్లలుఇద్దరు కుమారులు

చంద్రమౌళి ఒక సినీ నటుడు. సుమారు 45 సంవత్సరాల పాటు సహాయ నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా పనిచేశాడు.[2] 150 కి పైగా సినిమాల్లో నటించాడు.[3] కొన్ని టి.వి. ధారావాహికల్లో కూడా నటించాడు.[4]

జీవితం

[మార్చు]

చంద్రమౌళి చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం, మునగలపాలెంలో జన్మించాడు. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు ఈయనకు చదువు చెప్పిన గురువు.

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

మేనమామ ప్రేరణతో ఆయన 20 ఏళ్ళకు నాటక రంగం మీద మక్కువ ఏర్పడింది.[5] దాంతో మద్రాసు వెళ్ళి 1971లో భానుమతి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన అంతా మన మంచికే అనే చిత్రంతో ఈయన చిత్రసీమలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఘట్టమనేని కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, అక్కినేని నాగేశ్వరరావు వంటి అనేక అగ్ర నటుల అందరి సినిమాల్లోనూ సహాయ నటుడిగా పలు పాత్రలు పోషించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన పాత్ర పరిధి కొద్దిగా అయినా తన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు. ఈయన ఎక్కువగా పేద, మధ్య తరగతికి చెందిన పాత్రలు పోషించాడు.[5]

సినిమాలు

[మార్చు]
 1. అంతా మన మంచికే
 2. ఘరానా అల్లుడు
 3. స్వయంకృషి
 4. సూర్యుడు
 5. మండలాధీశుడు
 6. సర్దార్ ధర్మన్న
 7. ఉగ్రరూపం

మరణం

[మార్చు]

కొద్దికాలం అనారోగ్యంతో బాధపడి ఏప్రిల్ 5, 2018 న మరణించాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.[6]

మూలాలు

[మార్చు]
 1. "Telugu actor Chandramouli passes away". telanganatoday.com. Telangana Today. 5 March 2018. Retrieved 5 March 2018.
 2. "నటుడు చంద్రమౌళి కన్నుమూత". eenadu.net. ఈనాడు. 5 April 2018. Archived from the original on 5 March 2018. Retrieved 5 April 2018. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 5 ఏప్రిల్ 2018 suggested (help)
 3. "Telugu actor Chandramouli no more". thehansindia.com. The Hans India. 5 March 2018. Retrieved 5 March 2018.
 4. "సీనియర్‌ నటుడు చంద్రమౌళి కన్నుమూత". sakshi.com. సాక్షి. Retrieved 6 April 2018.
 5. 5.0 5.1 "నటుడు చంద్రమౌళి కన్నుమూత". sakshi.com. సాక్షి. 6 April 2018. Retrieved 6 April 2018.
 6. "చంద్రమౌళి కన్నుమూత". eenadu.net. ఈనాడు. 6 April 2018. Archived from the original on 6 April 2018. Retrieved 6 April 2018.